భారత్‌ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను కొనసాగిస్తోంది!కానీ ఆ ఒ‍క్క దేశం.. | Jaishankar Remark India Tries To Ensure Ties Across The World Except | Sakshi
Sakshi News home page

భారత్‌ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను కొనసాగిస్తోంది!కానీ ఆ ఒ‍క్క దేశం..

Published Mon, May 1 2023 10:59 AM | Last Updated on Mon, May 1 2023 10:59 AM

Jaishankar Remark India Tries To Ensure Ties Across The World Except  - Sakshi

భారత​ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను కొనసాగించేందకు యత్నిస్తోంది అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత​ తన సంబంధాలను తన వ్యక్తిగత దృక్ఫథంతోనే దృష్టి సారిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్‌, రష్యా, జపాన్‌తో సహా తదితర దేశాలతో ప్రత్యేకతను కోరుకోకుండా తన సంబంధాలను ముందుకు సాగేలే యత్నించిందన్నారు. కానీ చైనా మాత్రం వేరే కోవా కిందకి వస్తుందన్నారు. ఈ మేరకు జైశంకర్‌ డోమినికన్‌ రిపబ్లిక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రసంగంలో ఈ వ్యాఖ్యల చేశారు.

2015లో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ హిందూ మహాసముద్రం దాని దీవుల అంతట విస్తరించి ఉన్న సమగ్ర దృక్పథాన్ని వ్యక్తికరించారు. ఆ తర్వాత ఉద్భవించిన ఇండో పసిఫిక​ విజన్‌ నుంచి మధ్య ఆసియా వరకు భారత్‌ ప్రభావవంతంగా తన వ్యూహాన్ని అనుసరించింది. దీంతో బహుళ దేశాలతో సంబంధాలను నెరపగలిగే స్థాయికి చేరుకుంది. ​కానీ చైనా విషయం అలా కాదని, సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘన ఫలితం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు అసాధారణంగా ఉన్నట్లు చెప్పారు. భారత్‌ తన పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇస్తుందని, తన ఆర్థిక బలాన్ని దృష్టిలో ఉంచుకుని చి‍న్న, పెద్ద పోరుగుదేశాలకు తన సహాయ సహాకారాలను అందిస్తుందన్నారు. నైబర్‌ హుడ్‌  ఫస్ట్‌ పాలసీకే ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.

అందులో భాగంగానే శ్రీలంకకు నాలుగు బిలయన్ల ఆర్థిక సాయాన్ని అందించిందన్నారు. ఐతే సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే పాకిస్తాన్‌ దీనికి మినహాయింపు అని చెప్పారు. భారత్‌ తనకు అన్ని దిశలలో ఉన్న పొరుగు ప్రాంతాలకు సహాయ సహకారాలను అందిస్తూ తన సంబంధాలను ఏర్పరుచకున్నట్లు తెలిపారు. దీని ఫలితంగా క్వాడ్‌ సముహంగా ఏర్పడిందని, తద్వారా భారత్‌ మరింతగా తన సంబంధాలను విస్తరించుకుందన్నారు.

అలాగే గల్ఫ్‌, మధ్య ప్రాచ్య దేశాలతో భారత్‌ సంబంధాలు గుర్తించ తగిన విధంగా ఉన్నాయన్నారు. భారత్‌ ఇజ్రాయెల్‌, యూఏఈ, యూఎస్‌ఏతో కలిసి ఐ2యూ2 అనే కొత్త సముహం ఏర్పడింన్నారు. దీంతో ఇరువైపులా ఉన్న ఈ రెండు ప్రాంతాలు భారత్‌కి ప్రధాన వాణిజ్య పెట్టుబడి కేంద్రాలుగా ఉద్భవించాయని జెశంకర్‌ అన్నారు. కాగా, ఆయన ఏప్రిల్‌ 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు డోమికన్‌ రిపబ్లిక్‌ పర్యటనలో ఉన్నారు. 

(చదవండి: మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement