వామ్మో..నిమిషానికి అన్నికోళ్లను లాగించేస్తున్నామా? షాకింగ్‌ వీడియో | More Than 100 Billion Animals Are Eaten Every Year And Chicken On Top | Sakshi
Sakshi News home page

వామ్మో..నిమిషానికి అన్నికోళ్లను లాగించేస్తున్నామా? షాకింగ్‌ వీడియో

Published Mon, Jan 22 2024 3:09 PM | Last Updated on Mon, Jan 22 2024 3:32 PM

More Than 100 Billion Animals Are Eaten Every Year and chicken on top - Sakshi

ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంపై తాజాగా షాకింగ్‌విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది ఏకంగా 10 వేల కోట్ల జంతువులను మాంసంగా లాగించేస్తున్నారట. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దీని  ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మానవులు బిలియన్ల కొద్దీ జంతువులను ఆరగించేస్తున్నారు. ఇందులో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతిరోజూ 205 మిలియన్ల కోళ్లను తినేస్తున్నారంటే చికెన్‌కున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి నిమిషానికి లక్షా 40వేలకు పైగా కోళ్లు మానవులకు ఆహారంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పంది స్థానంలో పౌల్ట్రీ కోడి మాంసం  వినియోగం బాగా పెరిగింది.  గతంలో 12 శాతంగా ఉన్న  వీటి (కోడి, బాతు, గూస్, టర్కీ కోడి  మాసం)  మాంసం వినియోగం వాటా ప్రపంచవ్యాప్తంగా తినే మొత్తంలో మూడింట ఒక వంతు పెరిగింది.

ఏ దేశంలో మాంసాన్ని ఎక్కువగా  తింటున్నారు?
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) తన నివేదిక ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్ మీట్, గొడ్డు మాంసం, గత 50 ఏళ్లలో దాని ప్రపంచ వాటా దాదాపు సగానికి పడిపోయి 22 శాతానికి చేరింది. కానీ ఇది ఇప్పటికీ గొర్రె మాంసం కంటే దీని వినియోగం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఈ డిమాండ్‌లో ఎక్కువ భాగం చైనా వంటి మధ్య ఆదాయ దేశాల నుండి వచ్చిందని, ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడంతో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా  నిలిచింది  చైనా. మరోవైపు  ఐరోపా, ఉత్తర అమెరికాలో గతంతో పోలిస్తే  వినియోగం మాంసం  నియంత్రణలో ఉండగా, కొన్ని ప్రాంతాలలో  బాగా తగ్గింది కూడా.

భారత్‌ ఎక్కడ?
జనాభాపరంగా చైనాను వెనక్కినెట్టి గత ఏడాది  భారతదేశం ముందుకు దూసుకు వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంలో మాత్రం చాలా వెనుకబడి  ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement