బ్రెసిలియా : భారత్-చైనాల మధ్య శాంతియుత వాతావరణం నెలకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్-చైనాల మధ్య శాంతి కుదిరేలా భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యిల భేటీ జరిగింది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలను పునరుద్ధరించడంతోపాటు కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభంపై ఇరు దేశాలు చర్చించినట్లు సమాచారం.
తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. ఈ సమావేశం శాంతి, ప్రశాంతత పరిరక్షణకు దోహదపడిందని మంత్రులు పేర్కొన్నారు.
కాగా,2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఈ పరిస్థితుల వల్ల ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. వాటిని నివారించేందుకు భారత్-చైనా మధ్య అనేక చర్యలు జరిగాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment