సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం | Jaishankar Comments On Us Process Of Deportation | Sakshi
Sakshi News home page

సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం

Feb 6 2025 3:14 PM | Updated on Feb 6 2025 6:13 PM

Jaishankar Comments On Us Process Of Deportation

ఢిల్లీ : అమెరికాలో నివసిస్తున్న భారత వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించడంపై కేంద్రం స్పందించింది. భారత వలసదారుల పట్ల అమెరికా దురుసుగా ప్రవర్తించలేదు. వలస దారుల విషయంలో కేంద్రం ట్రంప్‌ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపింది.    

అక్రమ వలసదారుల్ని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వారి దేశాలకు విమానాల ద్వారా తరలిస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, తొలివిడతలో 104 మంది భారతీయులను సీ-17 విమానంలో అమృత్‌సర్‌కు తరలించింది. తరలించే సమయంలో భారత వలసదారుల చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసలతో బంధించింది. ఇలా బంధించి తరలించడంపై రాజకీయ వివాదం తలతెత్తింది.

అయితే, భారత వలసదారుల తరలింపు వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ రాజ్యసభలో స్పందించారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం.కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్‌ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్‌ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం. తరలించే సమయంలో అవసరాల్ని చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసుల్ని తొలగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
 


జైశంకర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వలసదారులకు అమెరికా ఉగ్రవాదులకు వేసినట్లు సంకెళ్లు వేయడం ఎంత వరకు కరెక్టో జయశంకర్‌ చెప్పాలి. భారతీయుల ఆత్మాభిమానం కాపాడటంలో మోదీ సర్కార్‌ విఫలమైందని ఆరోపించారు.  

అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం ప్రకటన

 

అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలస దారుల తరలింపుపై యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ విభాగం చీఫ్‌ మైఖేల్‌ డబ్ల్యూ బ్యాంక్‌ 24 సెకన్ల వీడియోని ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. అక్రమ వలస దారుల్ని విజయవంతంగా భారత్‌కు తిరిగి పంపించాం. ఈ మిషన్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement