deportation controversy
-
అవును.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్‌కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.చెత్త కుప్పలో పడేశారు!‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్‌నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్‌కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం. నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్‌లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. -
సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం
ఢిల్లీ : అమెరికాలో నివసిస్తున్న భారత వలసదారుల చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించడంపై కేంద్రం స్పందించింది. భారత వలసదారుల పట్ల అమెరికా దురుసుగా ప్రవర్తించలేదు. వలస దారుల విషయంలో కేంద్రం ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. అక్రమ వలసదారుల్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వారి దేశాలకు విమానాల ద్వారా తరలిస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, తొలివిడతలో 104 మంది భారతీయులను సీ-17 విమానంలో అమృత్‌సర్‌కు తరలించింది. తరలించే సమయంలో భారత వలసదారుల చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసలతో బంధించింది. ఇలా బంధించి తరలించడంపై రాజకీయ వివాదం తలతెత్తింది.అయితే, భారత వలసదారుల తరలింపు వివాదంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో స్పందించారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం.కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం. తరలించే సమయంలో అవసరాల్ని చేతులకు సంకెళ్లు,కాళ్లకు గొలుసుల్ని తొలగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. Speaking in Rajya Sabha on Indian citizens deported from the US, EAM S Jaishankar says, "...It is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad..." pic.twitter.com/6tnkvqbuQJ— ANI (@ANI) February 6, 2025జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వలసదారులకు అమెరికా ఉగ్రవాదులకు వేసినట్లు సంకెళ్లు వేయడం ఎంత వరకు కరెక్టో జయశంకర్ చెప్పాలి. భారతీయుల ఆత్మాభిమానం కాపాడటంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. అంతకుముందు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలస దారుల తరలింపుపై యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ విభాగం చీఫ్ మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్ 24 సెకన్ల వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అక్రమ వలస దారుల్ని విజయవంతంగా భారత్‌కు తిరిగి పంపించాం. ఈ మిషన్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. USBP and partners successfully returned illegal aliens to India, marking the farthest deportation flight yet using military transport. This mission underscores our commitment to enforcing immigration laws and ensuring swift removals.If you cross illegally, you will be removed. pic.twitter.com/WW4OWYzWOf— Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025 -
ట్రంప్ చర్యలపై నిరసనలు
వాషింగ్టన్: అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. అక్రమ వలసదారులను నిర్బంధించి మూకుమ్మడిగా సామూహిక బహిష్కరణలు చేపడతానన్న ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజెలెస్‌లోని డౌన్‌టౌన్‌తో సహా నిరసనకారులు ప్రధాన జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు’, ‘ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు’వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యాహ్నానికల్లా యూఎస్ 101లోని అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారుల బందోబస్తు నిలవగా నిరసనకారులు వీధుల్లో బైఠాయించారు. ఫ్రీవే పూర్తిగా తెరవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. తూర్పున రివర్సైడ్ నగరంలో వందలాది మంది నిరసన తెలిపారు. ఓ కూడలి వద్ద జెండాలు ఎగురవేస్తున్న నిరసనకారులకు మద్దతుగా వాహనదారులు ఆపకుండా అంతా ఒకేసారి హారన్ మోగించి తమ మద్దతు తెలిపారు. శాన్‌డియాగో నగరంలోని కన్వెన్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్టులకు నిరసనగా డల్లాస్‌లో నిరసనకారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఐసీఈ దాడులను నిరసిస్తూ ఆర్లింగ్టన్ నగరంలో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ హాల్ వెలుపల జెండాలతో నిరసన తెలిపారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా టారెంట్ కౌంటీలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. -
చాటింగ్ చేసినా బుక్కయినట్టే?
ఫేస్బుక్లో చేసే కాజువల్ పోస్టులు, స్నేహితులు, బంధువులతో చాటింగ్‌లో తెలిసోతెలియకో చేసే వ్యాఖ్యలు.. మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశముంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనం.. అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన మన హైదరాబాదీ విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ తిప్పిపంపిన ఉదంతమే! అమెరికాకు వరకు వెళ్లిన మన విద్యార్థులకు చివరినిమిషంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. తాము ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకముందే తమ ఉద్దేశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పసిగట్టడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. అమెరికాలో చదువు కోసం వస్తున్నప్పటికీ, అక్కడ ఉద్యోగం వెతుక్కోవాలని భావిస్తున్నామని ఏదో మాటమాటల్లో ఫేస్బుక్ చాటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను ఎలా బోల్తా కొట్టించాలనే విషయంలో అమెరికాలోని స్నేహితులు ఇచ్చిన తమకు సలహాలు వంటివి తమను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టించాయని, ఫేస్బుక్లో ఓరకంగా స్పందించి.. తమ ముందు మరోరకంగా సమాధానం చెప్పడాన్ని అధికారులు ఎత్తిచూపారని పలువురు విద్యార్థులు అంగీకరించారు. ఫేస్బుక్లో రసహ్యంగా జరిగిన చాటింగ్ సమాచారం కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు సేకరించడం.. ఎంతవరకు నైతికమన్న చర్చ కొనసాగుతున్నప్పటికీ.. విద్యార్థులు అసలు అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో అన్నదానిని, వారి ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి సోషల్ మీడియా అకౌంట్లు, పోస్టులు, చాటింగ్‌లపై నిఘా పెట్టారన్నదని స్పష్టమవుతున్నది. విద్యార్థులు చాలామందిలో స్పష్టత లేదని, వారు ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెడుతున్నారని భావించి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పిపంపడం వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లే విద్యార్థులకు తమ అభ్యసించే కోర్సు, అది అందించే యూనివర్సిటీ, దాని నేపథ్యం, చదువుతున్నకాలంలో అక్కడి ఖర్చులు ఎలా భరిస్తారు? భారత్‌లో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటి? అన్న విషయాల్లో స్పష్టత ఉండాల్సిన అవసరముంది. వీటి గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు కచ్చితంగా అడుగుతారు. విద్యార్థులను ఎందుకు తిరస్కరించారు? స్పష్టమైన, సమర్థమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఆత్మవిశ్వాసం చూపకపోవడం చెప్పిన చిన్నచిన్న విషయాల పట్ల కూడా నిబద్ధంగా ఉండకపోవడం సమర్పించిన పత్రాలు వైరుద్ధ్యాలు ఉండటం నిపుణులేం చెప్తున్నారు? విద్యార్థుల ప్రొఫైల్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి అధికారులు ఫేస్బుక్ వంటి బహిరంగ వేదికలపై విస్తృతంగా ఆధారపడుతున్నారు. ఫేస్బుక్ అనేది ఒక విద్యార్థి స్వభావానికి ముఖచిత్రమని, దీనిని వినియోగించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు సన్నద్ధమయ్యేందుకు ముందే ఫేస్‌బుక్‌లోని తమ ఖాతాలను సమూలంగా ప్రక్షాళన చేసి.. పనికిమాలిన విషయాలను తొలగించాలని, రాజకీయ అభిప్రాయాలు, ఇతరుల పోస్టులపై పెట్టిన కామెంట్లు, చాటింగ్‌లు వంటి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వారు అనుసరించే పేజీలు, గ్రూపులనూ పరిశీలించే అవకాశముంటుందని, కాబట్టి ఈ విషయంలో ఉద్యోగార్థులు, ఉద్యోగార్థులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ.. తమ విద్య, ఉద్యోగాలకు అవసరయ్యే గ్రూపులు, పేజీలతో మాత్రమే ఫేస్బుక్లో టచ్ ఉండాలని సూచిస్తున్నారు. స్పష్టతే విజయం! హైదరాబాదీ విద్యార్థులతోపాటు అమెరికా వెళ్లిన శశి దిగ్విజయంగా ఇమ్మిగ్రేషన్ అధికారుల పరీక్షలను అధిగమించి.. ఇప్పుడు నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ (ఎన్పీయూ)లో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్సీయూలోనే ఎందుకు చేరాలనుకుంటున్నావు, కుటుంబనేపథ్యం, ఆదాయమార్గాలు ఏమిటి వంటి అంశాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో స్పష్టమైన సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. అధికారులు ఇచ్చిన లెక్కలను చేసి.. అతను తన కలను సాకారం చేసుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ దొరికిన శశి ఇప్పుడు ఫోర్మెంట్లో ఉంటున్నాడు.