రాహుల్‌ గాంధీ ‘పప్పు’ కాదు: శామ్ పిట్రోడా | Rahul Gandhi is not Pappu says Sam Pitroda | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ ‘పప్పు’ కాదు: శామ్ పిట్రోడా

Published Mon, Sep 9 2024 9:05 AM | Last Updated on Mon, Sep 9 2024 10:05 AM

Rahul Gandhi is not Pappu says Sam Pitroda

వాషింగ్టన్ డీసీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా టెక్సాస్‌లో ప్రవాస భారతీయులతో  జరిగిన సమావేశంలో పిట్రోడా.. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ‘పప్పు’ కాదని, ఉన్నత విద్యావంతుడు, వ్యూహకర్త అన్నారు.  
పప్పు అని బీజేపీ కోట్లు ఖర్చు చేస్తున్న ప్రచారానికి రాహుల్‌ వ్యక్తిత్వం పూర్తి విరుద్ధం. ఆయనకు (రాహుల్ గాంధీ) విజన్ ఉంది. నేను మీకో విషయం చెప్పాలి. అతను పప్పు కాదు. అతను బాగా చదువుకున్నారు. ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించే వ్యూహకర్త . అతనిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి :  సుప్రీం కోర్టులో జూనియర్‌ వైద్యురాలి ఘటన కేసు విచారణ

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ శామ్‌ పిట్రోడా
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్ పిట్రోడా తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ  ఎన్నికల వేళ..ఆయన చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. లోక్ సభ ఎన్నికల వేళ భారత్‌లోని భిన్నత్వం గురించి.. పిట్రోడా మాట్లాడుతూ..తూర్పు భారతాన ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బులుగా..ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా,దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కన్పిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఓవర్సీస్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పిట్రోడా వివరణ ఇవ్వడంతో తిరిగి పార్టీ ఓవర్సీస్  ఛైర్మన్‌గా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ తిరిగి నియమించింది.  

అమెరికా పర్యటనలో రాహుల్‌ 
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్‌ 8వ తేదీన డల్లాస్‌లో, 9-10 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్‌ ట్యాంక్‌ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement