pappu
-
రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు: శామ్ పిట్రోడా
వాషింగ్టన్ డీసీ : కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా టెక్సాస్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో పిట్రోడా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదని, ఉన్నత విద్యావంతుడు, వ్యూహకర్త అన్నారు. పప్పు అని బీజేపీ కోట్లు ఖర్చు చేస్తున్న ప్రచారానికి రాహుల్ వ్యక్తిత్వం పూర్తి విరుద్ధం. ఆయనకు (రాహుల్ గాంధీ) విజన్ ఉంది. నేను మీకో విషయం చెప్పాలి. అతను పప్పు కాదు. అతను బాగా చదువుకున్నారు. ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించే వ్యూహకర్త . అతనిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి : సుప్రీం కోర్టులో జూనియర్ వైద్యురాలి ఘటన కేసు విచారణవివాదాలకు కేరాఫ్ అడ్రస్ శామ్ పిట్రోడాకాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల వేళ..ఆయన చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. లోక్ సభ ఎన్నికల వేళ భారత్‌లోని భిన్నత్వం గురించి.. పిట్రోడా మాట్లాడుతూ..తూర్పు భారతాన ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బులుగా..ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా,దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కన్పిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.దీంతో కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పిట్రోడా వివరణ ఇవ్వడంతో తిరిగి పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్‌గా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ తిరిగి నియమించింది. అమెరికా పర్యటనలో రాహుల్ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీన డల్లాస్‌లో, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్ ట్యాంక్ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. #WATCH | Texas, USA: Chairman of Indian Overseas Congress, Sam Pitroda says, "...Rahul Gandhi's agenda is to address some of the larger issues, he has a vision contrary to what BJP promotes by spending crore and crore of rupees. I must tell you he is not 'Pappu', he is highly… pic.twitter.com/28zgNI6BQj— ANI (@ANI) September 9, 2024 -
పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..
మదనపల్లె సిటీ: ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్ వచ్చేసింది. మార్కెట్‌ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్ నుంచి జనవరి చివరి వరకు సీజన్ ఉంటుంది. రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల్లో అనపకాయలు పండిస్తున్న రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా తింటారు. సంక్రాంతి వరకు ఘుమఘుమలే అనపకాయలు సంక్రాంతి దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షా«ధారంగా చేళ్లల్లో పండిన నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా ఉండి, వాటి వాసన గంటసేపు ఉంటుంది. అబ్బా దాని రుచే వేరు అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు. పొరుగు రాష్ట్రాలకు.. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో అనపకాయలకు మార్కెట్ ఉంది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం ప్రాంతాల నుంచి మార్కెట్‌కు రైతులు ప్రతి రోజు సాయంత్రం అనపకాయలు సంచుల్లో తెస్తారు. ఇక్కడి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతి రోజు 5 వేల కేజీల అనపకాయలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అనపకాయలకు మంచి డిమాండ్ ఉంది. రుచిగా ఉండటంతో వీటిని బాగా ఇష్టపడతారు. వర్షాలకు పంట దెబ్బతినింది అనపచెట్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పురుగు పట్టడం వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాలో అనపపంట సాగు చేశాను. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. – మణి, రైతు, ఒంటిమిట్ట వారానికి రెండు, మూడు సార్లు వండుతా ఇది సీజన్. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కాయలు. అందుకే మదనపల్లె మార్కెట్‌కు వెళ్లి అనపకాయలు తెచ్చుకుంటా. వారంలో మూడురోజులైనా పితికిపప్పు కూర వండుతాం. పిల్లలు ఇష్టంగా తింటారు. – మంజుల, గృహిణి, సిటిఎం పోషకాలు మెండు ఈ సీజన్లో మాత్రమే లభించే అనపకాయలు, పితికిపప్పు మంచి పోషకాలు ఉంటాయి. క్రిమిసంహారక మందులు లేకుండా వర్షాధారంగా చేలల్లో పంట పండుతుంది. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. – డాక్టర్ సరస్వతమ్మ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్‌సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్‌లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
ఇలా వచ్చి..అలా వెళ్లాడు..
మల్కాజిగిరి: ఏకంగా 48 కేసులు, రెండు సార్లు పీడీయాక్టుపై జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మార్చుకోకపోగా పదే పదే నేరాలకు పాల్పడుతున్న మౌలాలికి ముస్లింజంగ్కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ ముక్రం అలియాస్ పప్పును ఆదివారం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. డీఐ జగదీశ్వర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముస్లీంగంజ్కు చెందిన రౌడీషీటర్ పప్పుపై మల్కాజిగిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయి. రెండుసార్లు పీడీయాక్టుపై జైలుకు వెళ్లి వచ్చాడు. చివరగా గత నవంబర్ నెలలో హోటల్ యజమానిని కత్తితో బెదిరించి డబ్బులు లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల జైలునుంచి బయటికి వచ్చిన ముక్రం ఈ నెల 9న మౌలాలిలోని ఓ రెడీమేడ్ బట్టల దుకాణానికి వెళ్లి సేల్స్ బాయ్‌ని బెదిరించి రూ.2 వేల విలువైన దుస్తులు తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి ఏ1 హోటల్లో ఓ వ్యక్తిని బెదిరించి రూ.2500 నగదు లాక్కెళ్లాడు. బట్టల దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి ముక్రంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మీ పేర్ల ముందు ‘పప్పూ’ యాడ్ చేసుకోండి..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో తమ పేర్లకు చౌకీదార్ ట్యాగ్‌ను యాడ్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ విమర్శలను బీజేపీ దీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు తమ పేర్లకు ‘పప్పు’ అని యాడ్ చేసుకుంటే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. తాము తమ పేర్లలో చౌకీదార్ (కాపలాదారు) అనే పదాన్ని జోడించామని, మీరు కూడా మీ పేర్లకు ముందు పప్పూ అని పెట్టుకోవాలని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయనను బీజేపీ పప్పూ అని పిలవడం తెలిసిందే. కాగా రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రఫేల్ ఒప్పందంలో అవినీతిని ప్రస్తావిస్తూ కాపలాదారే దొంగ అని విమర్శిస్తున్నారు. ఇక చౌకీదార్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, పీయూష్ గోయల్, దర్మేంధ్ర ప్రధాన్, జేపీ నడ్డా సహా పలువురు నేతలు తమ ట్విటర్ ఖాతాల్లో పేరుకు ముందు చౌకీదార్‌ను యాడ్ చేసుకున్నారు. -
లోకేష్ అప్పుడు అలా..ఇప్పుడు ఇలా
-
రాహుల్ ఇప్పుడు ‘పప్పు’ కాదు.. పప్పా!
ఠాణే: ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి విజయం చేకూర్చారు. ఇప్పుడు ఆయన ఇంకెంత మాత్రం ‘పప్పు’ (అమాయకుడు, తెలివి తక్కువ వాడు) కాదు.. రాహుల్ ఇప్పుడు పప్పా (తండ్రి) అయ్యారు’ అంటూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అఠవాలే ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారం చేపడుతుండటం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైందనీ, ప్రధాని నరేంద్ర మోదీ కాదని అఠవాలే అన్నారు. కేవలం రఫేల్ ఒప్పందంపై ఆరోపణలతోనే కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే శివసేనకే లాభమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయొద్దని శివసేనకు సూచించారు. -
‘పప్పు’ పరమ పూజ్యుడయ్యాడు
ముంబై : లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల విజయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో.. ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిన ఎన్నికలు కూడా ఇవే. ఈ ఎన్నికల విజయానంతరం రాజకీయ విశ్లేషకులు, ప్రతి పక్షాలు సైతం రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. తొలినాళ్లలో రాహుల్‌ని ‘పప్పు’ అన్న వాళ్లే నేడు రాహుల్ గాంధీ ‘పరిణతి’ సాధించాడని ప్రశంసిస్తున్నారు. ఇలా మెచ్చుకునే వారి కోవలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా చేరారు. రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో స్వంతంగా, మధ్యప్రదేశ్‌లో ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘గుజరాత్, కర్ణాటక, ఇప్పుడీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒంటరిగా పొరాడారు. అప్పుడు శత్రువులు రాహుల్‌ని పప్పు అన్నారు. కానీ నేటి ఫలితాలు రాహుల్ పప్పు కాదు పరమ పూజ్యుడు అని నిరూపిస్తున్నాయి. అతి త్వరలోనే దేశ రాజకీయాల్లో రాహుల్ నాయకత్వాన్ని మనం చూడబోతున్నాం’ అంటూ రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు చేశారు. ‘నాలుగున్నరేళ్లలో మోదీ, అమిత్ షా ప్రవర్తనకు నిదర్శనం ఈ ఫలితాలు. వీరు మాటల్లో ఘనం.. చేతల్లో శూన్యం అనే విషయం భారత ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యింది. నేడు బీజేపీ ఓటమికి అమిత్ షా, మోదీలే ప్రధాన కారణమంటూ రాజ్ ఠాక్రే ఆరోపించారు. -
ఆకలే... ఆటలో దించింది!
బుక్కెడు బువ్వ పెడతామంటే బంతులేసేందుకు సిద్ధపడ్డాడు. వికెట్ తీస్తే రూ. 10 ఇస్తామంటే సంబరపడ్డాడు. ఈ ఆట క్రికెట్ అని, తను చేసే పని బౌలింగ్ అని తెలియని వయసది. అయితే కాలంతో పాటు అతని దశ తిరిగింది. నా అనే వాళ్లెవరూ లేని రోజుల నుంచి... భారత ‘సి’ జట్టులోని 11 మందిలో ఒకడయ్యే దాకా ఎదిగాడు. ఇది స్పిన్నర్ పప్పు రాయ్ విజయ గాథ. గువాహటి: ఒడిశా లెఫ్టార్మ్ స్పిన్నర్ పప్పు రాయ్ పేదవాడే కాదు... ఎవరూ లేనివాడు కూడా! అతనిది దీనగాథ కాదు... కన్నీటిగాథ! బీహార్‌కు చెందిన ఇతని తల్లిదండ్రులు అతని పసిప్రాయంలోనే కన్నుమూశారు. ఎంతటి పసితనమంటే... ‘అమ్మ నాన్న’ అని మాటలు నేర్వకముందే వాళ్లను కోల్పోయాడు. అయితే తన తండ్రి జందార్ రాయ్, తల్లి పార్వతి దేవి అని... బతుకుదెరువుకు కోల్‌కతా వచ్చారని ఎవరో చెబితే తెలుసుకున్నాడు. డ్రైవరైన జందార్ గుండెపోటుతో, తల్లి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని పప్పు ఇలా చెబుతాడు. ‘వాళ్లను (తల్లిదండ్రులు) నేనెప్పుడూ చూడలేదు. ఊరేదో తెలియదు. కేవలం వాళ్ల గురించి విన్నానంతే! ఇప్పుడు వాళ్లే ఉంటే భారత్ ‘సి’లో నా ఆట చూసేవారు. ఇది తలచుకుని రాత్రంతా ఏడ్చాను. కంటిపై కునుకులేకుండా గడిపాను’ అని 23 ఏళ్ల పప్పు రాయ్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఏళ్లకేళ్లు పడిన కష్టం ఇప్పుడు భారత జట్టుకు ఎంపిక చేసిందన్నాడు. మామ మరణంతో మళ్లీ ఆకలి కేకలు... పసిబాలుడైన పప్పుని మామ అక్కున చేర్చుకున్నారు. కానీ దినసరి కూలి అయిన అతనూ కొన్నేళ్ల తర్వాత మరణించడంతో పప్పు ఆకలి కేకలు మళ్లీ మొదలయ్యాయి. అప్పుడే ‘క్రికెట్’ ఆదుకుంది. ముందు అన్నం పెట్టింది. తర్వాత జేబు (రూ.10) నింపింది. కోల్‌కతాలో క్రికెట్ ఆడే కుర్రాళ్లు అతన్ని బౌలింగ్ చేసేందుకు పిలిచారు. వికెట్ పడగొడితే 10 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. అలా ‘ఆకలి’ అతన్ని ఆటలోకి దింపింది. అలా హౌరా యూనియన్ క్రికెట్ అకాడమీ కోచ్ సుజిత్ సాహా కంటపడ్డాడు. ఆయన సలహాతో పేస్ బౌలింగ్ నుంచి స్పిన్న రయ్యాడు. 2011లో కోల్‌కతా సెకండ్ డివిజన్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే జట్టులో సుస్థిరంగా ఉన్న ఐరేశ్ సక్సేనా... తదనంతరం ప్రజ్ఞాన్ ఓజాలతో పోటీపడలేక బెంగాల్ నుంచి ఒడిశాకు మారాడు. ఎట్టకే లకు నాలుగేళ్ల తర్వాత 2015 బ్రేక్ ఇచ్చింది. కటక్‌లో జరుగుతున్న ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. అండర్–23 జట్టులోకి వచ్చాడు. మూడేళ్లు తిరిగే సరికి లిస్ట్ ‘ఎ’లో మేటి బౌలర్‌గా ఎదిగాడు. ఎనిమిది లీగ్ మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి రాణించాడు. ఆంధ్రతో జరిగిన తన తొలి లిస్ట్ ‘ఎ’ పోరులో హనుమ విహారి, రికీ భుయ్‌లను అద్భుతమైన డెలివరీలతో పెవిలియన్ చేర్చాడు. తాజాగా దేవధర్ ట్రోఫీ కోసం రహానే సార థ్యంలోని భారత్ ‘సి’ జట్టులోకి ఎంపికయ్యాడు. -
ఇకపై రాహుల్ ‘పప్పూ’ కాదు!
సాక్షి, ముంబై : కాంగ్రెస్ పార్టీకి కాబోయో అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన మరోసారి ప్రశంసలు కురిపించింది. గుజరాత్ ఎన్నికలు తరువాత దేశమంతా రాహుల్ గాంధీని నాయకుడిగా గుర్తిస్తుందని శివసేన స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ గుజరాత్లో ఆలయాను దర్శించడం అనేది హిందుత్వ విజయంగా శివసేన పేర్కింది. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించడాన్ని భారతీయ జనతాపార్టీ కూడా స్వాగతించాలని శివసేన తెలిపింది. నాలుగేళ్లుగా రాహుల్ గాంధీని పప్పూగా సంభోధిస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు నేతగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో స్పష్టం చేసింది. గుజరాత్లో ఫలితం ఎలా వచ్చినా.. రాహుల్ గాంధీ మాత్రం నాయకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారని శివసేన స్పష్టం చేసింది. నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న రాహుల్ గాంధీ ఇంకెంత మాత్రం పప్పూ కాదని సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన స్పష్టం చేసింది. -
అందుకే ఆయన్ని ‘పప్పు’ అంటున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : అపరిపక్వతతో కూడిన వ్యాఖ్యలు చేయటం వల్లనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని అందరూ పప్పు అంటున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థలో మహిళలపై వివక్ష చూపుతున్నారని, ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎక్కడా స్కర్ట్స్ (నిక్కర్లు) ధరించిన మహిళలే కానరారంటూ ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి స్పందిస్తూ... రాహుల్ నోటి వెంట వచ్చే అలాంటి మాటలే ఆయన పరిపూర్ణత సాధించలేదనటానికి నిదర్శనమని ప్రజలు భావించి పప్పు అని అంటున్నారన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్‌లోని వల్సాడ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. రాహుల్ గాంధీ వెళ్లిన ప్రతిచోటా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తథ్యమన్నారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ మాటలు అసభ్యకరంగా ఉన్నాయన్నారు. -
‘పప్పు(రాహుల్) విముక్త భారతే నా లక్ష్యం’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అని పిలిచి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినయ్ ప్రధాన్ అనే కాంగ్రెస్ పార్టీ నేత తాజాగా కాంగ్రెస్‌ను పూర్తిగా వదిలేశారు. తాను పార్టీలో నుంచి వైదొలుగుతున్నానని, తాను త్వరలో పప్పు విముక్త(రాహుల్‌గాంధీ విముక్త) భారతం అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కాంగ్రెస్ విముక్త భారతం అని బీజేపీ ఇచ్చిన నినాదం మాదిరిగానే అతడు పప్పు ముక్త్ భారత్ అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తానని తెలిపారు. వినయ్ ప్రధాన్ కాంగ్రెస్ పార్టీలో 22 ఏళ్లుగా పనిచేశాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరుతారా లేక మరింకేదైనా పార్టీలోనా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అంతేకాదు.. పప్పు విముక్త భారతం అనే నినాదంతో ఆయన ఏ విధంగా ముందుకు వెళతారో అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు తన లక్ష్యం కోసం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాహుల్‌గాంధీ చుట్టూ సైకోలో ఉన్నారని తీవ్రంగా విమర్శించిన ఆయన వారి ద్వారానే త్వరలో కాంగ్రెస్ విముక్తి భారత్ కూడా సాధ్యమవుతుందని తెలిపారు. వినయ్ ప్రధాన్ మీరట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. -
అధినేతను ‘పప్పు’ అని..వాట్సప్‌లో వైరల్!
మీరట్ (ఉత్తరప్రదేశ్) : ‘దేశంలో చాలామంది ప్రజలు రాహుల్‌గాంధీని ‘పప్పు’ అని అంటున్నారు. కానీ పప్పు ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపలేదన్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలి’ ఇది వాట్సాప్‌లో సాక్షాత్తు ఓ కాంగ్రెస్ నాయకుడు పెట్టిన కామెంట్. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను ఉద్దేశించి ‘పప్పు’ అనడంతో ఆయనపై వేటుపడింది. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా అధ్యక్షుడైన వినయ్ ప్రధాన్ రాహుల్‌ను ఉద్దేశించి ఇటీవల వాట్సప్ గ్రూప్‌లో చేసిన వ్యాఖ్యలు స్థానికంగా వైరల్ అయ్యాయి. రాహుల్‌ను ‘పప్పు’ అని పేర్కొంటూ ఆయన మెసేజ్‌లు పెట్టడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ ప్రకటించారు. అయితే, తాను ఆ మెసేజ్‌లు పెట్టలేదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రత్యర్థులు ఈ కుట్ర పన్నారని వినయ్ ప్రధాన్ అంటున్నారు. ఈ విషయంలో తన వివరణ కూడా తీసుకోకుండా వేటు వేయడం సరికాదని ఆయన వాపోతున్నారు. -
నేను పప్పా.. అవినీతిపరుడినా!
ఏదో ఒకటి తేల్చండన్న మంత్రి లోకేశ్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు తనను పప్పు, అవినీతిపరుడని విమర్శిస్తున్నాయని, ఇందులో తాను ఏదో తేల్చి చెప్పాలని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం వద్ద ఆయన మీడియాతో ముచ్చటించారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా తాను మాత్రం పని చేసి చూపిస్తున్నానన్నారు. మంత్రి పదవి చేపట్టిన నెల రోజుల్లో 1650 ఐటీ ఉద్యోగాలు సృష్టించానన్నారు. అమెరికా పర్యటనకు తాను వెళ్లడంలేదని జీఓ ఎందుకిచ్చారో తెలియదన్నారు. చదవండి: అమెరికా పర్యటనకు లోకేశ్ దూరం..