సాక్షి, ముంబై : కాంగ్రెస్ పార్టీకి కాబోయో అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన మరోసారి ప్రశంసలు కురిపించింది. గుజరాత్ ఎన్నికలు తరువాత దేశమంతా రాహుల్ గాంధీని నాయకుడిగా గుర్తిస్తుందని శివసేన స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ గుజరాత్‌లో ఆలయాను దర్శించడం అనేది హిందుత్వ విజయంగా శివసేన పేర్కింది. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించడాన్ని భారతీయ జనతాపార్టీ కూడా స్వాగతించాలని శివసేన తెలిపింది.
నాలుగేళ్లుగా రాహుల్ గాంధీని పప్పూగా సంభోధిస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు నేతగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో స్పష్టం చేసింది. గుజరాత్‌లో ఫలితం ఎలా వచ్చినా.. రాహుల్ గాంధీ మాత్రం నాయకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారని శివసేన స్పష్టం చేసింది. నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న రాహుల్ గాంధీ ఇంకెంత మాత్రం పప్పూ కాదని సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment