అవి తప్పు కావచ్చు!? | Uddhav Thackeray Disagrees With Exit Polls | Sakshi
Sakshi News home page

అవి తప్పు కావచ్చు!?

Published Sun, Dec 17 2017 12:02 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

Uddhav Thackeray Disagrees With Exit Polls - Sakshi

సాక్షి, ముంబై : శివసేన అధినేత ఉద్దవ్‌ థాక్రే.. మరోసారి బీజేపీపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  గుజరాత్‌ ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు తప్పని ఉద్దవ్‌ థాక్రే అన్నారు. సబర్జన్‌ ముంబైలోని తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో నేను ఏకీభవించడం లేదని ఆయన ప్రకటించారు. గుజరాత్‌లో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందని.. ఇది ఎన్నికల ఫలితాలపై తప్పకుండా ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.

అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ బీజేపీ అనుకూలంగా ఫలితాలను ప్రకటించాయి.. అయితే అవి ఎందుకు తప్పు కాకూడదు అని ఆయన ప్రశ్నించారు. వాస్తవ ఫలితాలు మరికొన్ని గంటల్లో బయటకు వస్తాయి.. అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీకి ఉద్దవ్‌ ధాక్రే శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఆకాంక్షలను రాహుల్‌ గాంధీ నెరవేరుస్తారనే ఆశాభావాన్ని ఉద్దవ్‌ థాక్రే వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement