ఠాణే: ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి విజయం చేకూర్చారు. ఇప్పుడు ఆయన ఇంకెంత మాత్రం ‘పప్పు’ (అమాయకుడు, తెలివి తక్కువ వాడు) కాదు.. రాహుల్ ఇప్పుడు పప్పా (తండ్రి) అయ్యారు’ అంటూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అఠవాలే ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారం చేపడుతుండటం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైందనీ, ప్రధాని నరేంద్ర మోదీ కాదని అఠవాలే అన్నారు. కేవలం రఫేల్ ఒప్పందంపై ఆరోపణలతోనే కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే శివసేనకే లాభమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయొద్దని శివసేనకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment