Ramdas Athawale
-
బీజేపీ ప్లాన్ అదే.. షిండే ముందున్న మార్గమిదే: అథవాలే
ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్ చేశారు.మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. ఏక్నాథ్ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు. #WATCH | Delhi: On the question of Maharashtra CM, Union Minister Ramdas Athawale says, "I believe in the meeting that is going to take place tomorrow, BJP observers will listen to all the MLAs and the name of Devendra Fadnavis can be announced tomorrow...Eknath Shinde does not… pic.twitter.com/52QJ0bMn07— ANI (@ANI) December 3, 2024 -
మళ్లీ మేము అధికారంలోకి వస్తామో రామో కానీ..: నితిన్ గడ్కరీ
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తోటి కేబినెట్ మంత్రి, రామ్‌దాస్ అథవాలేను ఉద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగోసారి కేంద్రంలో తమ ప్రభుత్వం(బీజేపీ) వస్తుందో రాదో తెలియదు కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే మాత్రం కచ్చితంగా కేంద్రమంతి అవుతారనే హామీ ఇవ్వగలనని చమత్కరించారు.ఈ మేరకు నాగ్పూర్లోజరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. వివిధ ప్రభుత్వాలలో అథవాలే కేబినెట్ పదవులు చేపట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో స్టేజ్‌పై అథవాలే కూడా ఉండటం గమనార్హం. అనంతరం అథవాలేతో సరదాగా నవ్వుతూ తాను జోక్ చేశానని చెప్పుకొచ్చారు.అథవాలే కూడా నవ్వులు చిందించారు.ప్రస్తుతం గడ్కరీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా, రామ్‌దాస్ అథవాలే వరుసగా మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే తన పరంపరను కొనసాగిస్తానని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో ఆర్పీఐ కూడా భాగం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అథవాలే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడనుంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆర్పీఐ(ఏ) కనీసం 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు అథవాలే పేర్కొన్నారు.. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర నాగ్‌పూర్, ఉమ్రేడ్ (నాగ్‌పూర్), యావత్మాల్లోని ఉమర్‌ఖేడ్, వాషిమ్‌తో సహా విదర్భలో మూడు నుంచి నాలుగు స్థానాలను అడుగుతామని చెప్పారు.కూటమిలో భాగమైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు తమ కోటా నుంచి తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని అన్నారు.చదవండి: ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు -
అక్టోబర్‌లో కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు అక్టోబర్‌లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె చెప్పారు. శ్రీనగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి’అని మంత్రి అథవాలె వివరించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్!
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్! -
నితీష్ కుమార్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధినేత రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతలో కీలక పాత్ర పోషించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమవాడేనని, ఏ క్షణమైనా ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా గతేడాది వరకు ఎన్డీయే కూటమిలోనే కొనసాగిన నితీష్ కుమార్.. 2022 ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకొని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో (మహాఘట్బంధన్) చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రావడంతో బిహార్ సీఎం కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో 26 విపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. తాజాగా రామ్‌దాస్ అథవాలే ముంబైలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ సీఎంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఎన్డీయే లక్ష్యమైతే.. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి తొలగించడమే ఏకైక ఎజెండాగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ‘ఇండియా’ కూటమిపై విరుచుకుపడ్డారు. కూటమికి కన్వీనర్, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో కూడా విపక్షాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ‘నేను నిన్న(శనివారం) పాట్నాలో ఉన్నాను. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్షాలు భేటీపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇండియా పేరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను సంతోషంగా లేకపోతే త్వరలో ముంబయిలో నిర్వహించబోయే సమావేశానికి కూడా హాజరు కావొద్దని కోరాను. నితీష్ అంతకుముందు ఎన్డీయేలో సభ్యుడు, ఆయన ఎప్పుడైనా సొంతగూటికి తిరిగి రావొచ్చు’ అని అథవాలే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు మమతా వల్ల ఉపయోగం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలపై జేడీయూగానీ, నీతీష్గానీ స్పందించలేదు. కానీ ‘ఇండియా’ పేరుపై నీతీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్‌కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్‌ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్‌ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్‌ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్‌ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
ఎంపీ భరత్‌కు ఇండో అరబ్ ఎక్సలెన్స్ అవార్డ్
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సా ర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజ మహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కు ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సోమవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ–20 ఇండియా ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్‌లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా ఎంపీ భరత్‌కు ఈ అవార్డ్‌ను అందజేశారు. యువతా హరితా, గోగ్రీన్ చాలెంజ్ పేరుతో ఎంపీ భరత్‌రామ్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డ్‌ను ప్రదానం చేసినట్లు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడంపై ఎంపీ భరత్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ అవార్డును రాజమహేంద్రవరం విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలకు అంకితమిస్తున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం -
Tunisha Sharma Case: షీజాన్ ఖాన్‌ను ఉరితీయాలి.. కేంద్ర మంత్రి డిమాండ్
థానే: బుల్లి తెర నటి తునీషా శర్మ ఆత్మహత్యకు కారణమైన షీజాన్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆమె తల్లికి రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. థానే జిల్లాలోని భయందర్‌లోని తునీషా శర్మ నివాసంలో ఆమె తల్లి వనితను గురువారం అథవాలే పరామర్శించారు. కూతురు అకాల మరణానికి న్యాయం చేయడంలో పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తునీషా శర్మను సహనటుడు షీజాన్ ఖాన్ నమ్మించి మోసం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. షీజాన్ ఖాన్‌కు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తునీషా శర్మను కోల్పోవడం ఆమె తల్లికి తీరని లోటని, రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారంగా రూ.25లక్షలు చెల్లించాలని కోరారు. తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తరఫున ఆమెకు రూ.3లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. తునీషా శర్మకు న్యాయం జరిగేందుకు ఉజ్జ్వల్ నికమ్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని అథవాలే డిమాండ్ చేశారు. కాగా 24 ఏళ్ల తునీషా శర్మ సహ నటుడు షీజాన్ ఖాన్ మేకప్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షీజాన్నుపోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అయితే.. ఓసారి నా జాతకం చూసి నాకు ప్రధాని యోగం ఉందేమో చెప్పండి సార్!
అయితే.. ఓసారి నా జాతకం చూసి నాకు ప్రధాని యోగం ఉందేమో చెప్పండి సార్! -
రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు కేంద్ర సామాజిక న్యాయ సహాయమంత్రి రామ్‌దాస్ అథవాలే. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీ ఆయనను ప్రధాని చేయాల్సిందని పేర్కొన్నారు. సమయం దాటిపోయిందని, ఇక రాహుల్ ఎప్పటికీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని అథవాలే అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని అథవాలే చెప్పారు. ఆయన స్థానాన్నీ భర్తీ చేసే నాయకుడే లేరన్నారు. రాహుల్ గాంధీకి అది సాధ్యం కాదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ 400 స్థానాలకుపైగా కైవవం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. అలాంటప్పుడు రాహుల్ ఎలా ప్రధాని అవుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావని అథవాలే అన్నారు. కేరళ ప్రజలు ఆదరించకపోయి ఉంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని 15 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. చదవండి: భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు -
‘వ్యాపార రంగాల్లో మహిళల జైత్రయాత్ర’
సాక్షి, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీను టెక్నాలజీ కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్స్‌లెన్స్ అవార్డ్ దక్కింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేతుల మీదుగా శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ అందుకున్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ఉన్న వనరులను వినియోగించుకొని వ్యాపార రంగాల్లో మహిళలు జైత్రయాత్ర సాగించడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా యువ దళిత మహిళ కావ్యశ్రీని అభినందించారు. భవిష్యత్‌లో మరింత ఎదగాలని ఆకాక్షించారు. సదస్సులో కేంద్ర మాజీ మంత్రి కె.జె ఆల్ఫాన్స్, సిక్కిం మాజీ గవర్నర్ బి.సి.సింగ్, మాజీ ఎంపి జె.కె.జెయిన్, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది జి.వి.రావు తదితరులు హాజరయ్యారు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి
సాక్షి, విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం శుభపరిణామమని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఏపీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని, అంబేద్కర్ అందరివాడని, ఆయన్ను గౌరవించాలని కోరుతున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించొద్దని సూచించారు. అలాగే ఏపీలో 3,35,358 మందికి పోస్ట్ మెట్రిక్, 2,13,694 మంది విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ఇస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వాన్ని రామ్‌దాస్ అథవాలే కోరారు. చదవండి: పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: మంత్రి అంబటి -
Maharashtra Political Crisis శివ సైనికులకు కేంద్ర మంత్రి అథవాలే వార్నింగ్!
సాక్షి, ముంబై: మహా రాజకీయ సంక్షోభం ముదురుతున్న వేళ బీజేపీ ‘వేచి చూసే ధోరణి’ని అవలంభిస్తోంది. అవకాశం వస్తే వదులుకోం అన్న సంకేతాలను పార్టీ నేతలు కొందరు ఇస్తుండగా మరికొందరు శివసేన ఇంటి పంచాయితీలో వేలు పెట్టబోమని అంటున్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తాజాగా అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య పంచాయితీలో జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది వారేనని అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో శుక్రవారం జరిగిన భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని పేర్కొన్నారు. శివసేన అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదని ఫడ్నవీస్ కూడా అభిప్రాయపడినట్టు అథవాలే తెలిపారు. అది ఎలా సాధ్యం? చాలామంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అయినప్పటికీ సభలో మెజారిటీ నిరూపించుకుంటామని మహావికాస్ అఘాడి సీనియర్లు శరద్ పవార్, అజిత్ పవార్, ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ చెప్పడం విడ్డూరంగా ఉందని అథవాలే అన్నారు. సొంత పార్టీ నుంచి 37 మంది, 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మేల్యేలు తన వెంట ఉన్నారని ఏక్నాథ్ చెప్పడం కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వారి కార్యాలయాలపై దాడుల ఘటనలపై అథవాలే స్పందించారు. శివసేన ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తే సహించబోమని అన్నారు. తాము కూడా అంతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారు. కాగా, పుణెలోని శివసేన రెబెల్ఎమ్మెల్యే తానాజి సావంత్ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. శివసైనికులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. వెన్నుపోటుదారులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. -
ఏపీ సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసలు
సాక్షి, వరంగల్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి గొప్ప వ్యక్తి అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే కొనియాడారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన ‘దళిత బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ’లో ఆయన మాట్లాడారు. కొందరు దళిత, బహుజన వ్యతిరేకులు అంబేడ్కర్ పేరు వద్దని ఆందోళనలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ మన మధ్యలో ఉంటే భారత ప్రధాని అయ్యేవారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని, దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతుందని అథవాలే తెలిపారు. సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. -
ఏపీలో సంక్షేమం అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతంగా అమలు చేస్తున్నారని కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే కితాబునిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శనివారం విజయవాడలో అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎంపీలుగా పని చేసినప్పటి నుంచి తనకు సాన్నిహిత్యం ఉందని, ఇద్దరూ స్నేహభావంతో మెలిగే వ్యక్తులని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలు బ్రహ్మండమైన మద్దతు పలికారన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న తీరు చాలా బాగుందన్నారు. ప్రధానంగా దళితుల ఉద్ధరణకు సీఎం జగన్ చేస్తున్న కృషి బాగుందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ కేంద్రంలోని బీజేపీతో చేతులు కలపలేదని, కానీ ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాష్ట్రానికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని సానుకూలంగా ఉన్నారని, అందుకు అనుగుణంగానే కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు సీఎం జగన్ అనేకసార్లు ప్రధానిని కలిశారని, వారి ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. ఈ నెల 17న జరిగే సమావేశంలో రాష్ట్రానికి విభజన హామీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందన్నారు. ఒక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందడంలేదని, ఈ పరిస్థితిలో మూడు రాజధానులు సరికాదన్నది తన అభిప్రాయమన్నారు. దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. ఏపీలో మూడు రాజదానులు నిర్మించడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడ్డారు. బీజేపీ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు. విద్యాలయాల్లో విద్యార్థుల వస్త్రధారణ మతాలకు అతీతంగా ఉండాలని, మతపరమైన వస్త్రధరణను తాను సమర్థించబోనని చెప్పారు. మీడియా సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బి.నాగేశ్వరరావు, ఏపీ అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
శశి థరూర్ ట్వీట్లో తప్పులు.. రీ కౌంటర్ వేసిన అథవాలే
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్లు వేసే కాంగ్రెస్ శశి థరూర్ తన ట్వీట్ అక్షర దోషాలవల్ల దొరికిపోయారు. కేంద్ర బడ్జెట్ 2022పై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతల మద్య ట్విటర్లో వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఓ ట్వీట్ చేశారు. అయితే, అందులో Budget కి బదులుగా Bydget అని, reply కి బదులుగా rely అని రాశారు. ఈ ట్వీట్ కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కౌంటర్ ఇస్తూ ఆరోపణలు చేసే ముందు తప్పులను సరిచేసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయంలో దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే 1991 ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దేశంలో గోల్డెన్ పీరియడ్ నడుస్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ పాలనాకాలంలో దేశంలో వెలుగులోకి వచ్చిన స్కామ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టైమ్ లో ప్రతీ రోజు పత్రికల్లో ఏదో ఒక స్కామ్ గురించి వస్తుండేదని ఆమె ఎద్దేవా చేశారు. కోల్ స్కామ్, 2జీ స్కామ్, ఆంట్రిక్ దివాస్ స్కామ్, పలు కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆర్థికమంత్రి చెప్పేదంతా అంకెల గారడీ అని ఆమె ప్రసంగాన్ని వింటున్న కేంద్ర మంత్రి అథవాలె ముఖ కవళికలు చూస్తే తెలుస్తుందని థరూర్ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. Dear Shashi Tharoor ji, they say one is bound to make mistakes while making unnecessary claims and statements. It’s not “Bydget” but BUDGET. Also, not rely but “reply”! Well, we understand! https://t.co/sG9aNtbykT — Dr.Ramdas Athawale (@RamdasAthawale) February 10, 2022 -
భారత్-పాక్ మ్యాచ్ పై కేంద్రమంత్రి కీలక వాఖ్యలు..
Ramdas Athawale Comments on India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్-2021లో ఈ నెల 24న జరగనున్న దాయాదుల పోరు నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదని అథవాలే పేర్కొన్నారు. "పొరుగు దేశం పాకిస్తాన్ ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. భారత దేశంపై వారి ఉగ్రచర్యలు ఆగడంలేదు. కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్లో వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి. లోయలో అభివృద్ధిని అనుమతించకూడదనేది పాకిస్తాన్ ఎత్తుగడ. ఇటువంటి పరిస్థితుల్లో భారత్.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదు’’ అని విలేకరుల సమావేశంలో అథవాలే చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చిస్తానని అథవాలే తెలిపారు. కాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య అక్టోబర్ 24న జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు అధికమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే, ఐసీసీ టోర్నీలో ఓ జట్టుతో ఆడలేమని చెప్పడం సరికాదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి చదవండి: T20 WC IND Vs PAK: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా..? -
మూడు రాజధానులు.. రాష్ట్ర పరిధిలోని అంశం: కేంద్ర మంత్రి
సాక్షి,విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఏపీలో మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధంలేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైందన్నారు. ఒకవేళ నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా మోదీ నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. తమ రిపబ్లికన్ పార్టీ కూడా వైఎస్సార్‌సీపీలాగే ప్రాంతీయ పార్టీ అని, ఎన్డీఏలో భాగస్వామి అయ్యాక అభివృద్ధి వేగవంతమైందన్నారు. అదే తరహాలో వైఎస్సార్సీపీ ఎన్డీఏలో భాగస్వామి అయితే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఏపీలో జాతీయ రహదారులు, టూరిజం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రులకు పలుసార్లు వినతులిచ్చారని చెప్పారు. ఏపీలో బలమైన పార్టీ నేతగా ఎదిగిన వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్‌తో తనకెంతో అనుబంధముందన్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. స్వర్ణకారుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళతానని ఏపీ స్వర్ణకార సంఘం మహాసభలో అథవాలే చెప్పారు. -
రోజురోజుకి కాంగ్రెస్ పతనం: రాందాస్ అథవాలే
సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్ రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగిందన్నారు. ‘‘మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోని అంశం. కేంద్రం పరిధిలో లేదని’’ కేంద్రమంత్రి స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
అది పోవాలంటే రాహుల్ పెళ్లి చేసుకోవాలి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కులతత్వం పోవాలంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సలహా ఇచ్చారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. రాహుల్ ఇచ్చిన నినాదం ‘హమ్ దో హమారే దో’ ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్లో వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అథవాలే తప్పుపట్టారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ‘హమ్ దో హమారే దో’ అనే నినాదం గురించి ఆయన మాట్లాడుతున్నారని, నిజానికి ఈ నినాదం గతంలో కుటుంబ నియంత్రణ గురించి వాడేవారని గుర్తుచేశారు. అందుకే ముందుగా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆయన మహాత్మా గాంధీ కలలను నిజం చేసినవాడవుతాడని పేర్కొన్నారు. ఆయన పెళ్లితో కులపిచ్చికి అంతం పలకవచ్చు అని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశ యువతకు రాహుల్ మార్గనిర్దేశకుడు అవుతారని ఎద్దేవా చేశారు. గతంలోనూ మంత్రి అథవాలే రాహుల్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే, ఆయనకు కులాంతర వివాహం పథకం కింద రూ.2.5 లక్షలు ఇస్తానని తెలిపారు. -
ఆజాద్ వీడ్కోలు: ఎన్డీయే ఆఫర్..!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌పై బీజేపీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈనెల 15న ముగియనుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు ఆజాద్ సేవలను కొనియాడారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన మార్కును చూపించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజా సేవకోసమే పరితమించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్‌దాస్ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనపై పట్టు కలిగిన ఆజాద్ లాంటి సభ్యులు చట్ట సభల్లో ఉండటం చాలా అవసరమన్నారు. మరో వారంరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తోందని, మరోసారి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆజాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. తాము (ఎన్డీయే) నామినేట్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. పార్లమెంట్లో తీవ్రమైన ఉద్వేగానికి గురై కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు. కాగా తొలిసారి 1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆజాద్ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. 2005లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై 2008 వరకు కొనసాగారు. ఆ తరువాత యూపీయే (2009-2014) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారు. అయితే 71 ఏళ్ల ఆజాద్‌ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఇప్పట్లో ఆయన ఎన్నికైయ్యే అవకాశం కూడా లేదు. దీంతో ఇదే ఆయనకు చివరి అవకాశంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము నామినేట్ చేస్తామంటూ అథవాలే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆజాద్ వీడ్కోలు.. మోదీ కన్నీరు -
కేంద్రమంత్రి అథవాలేకు కరోనా, ఆసుపత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మయూర్ బోర్కర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అటు అథవాలే కూడా తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా ప్రకారం తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్త తీసుకోండి, సురక్షితంగా ఉండండని పేర్కొన్నారు. (నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఇన్నింగ్స్) మరోవైపు పాయల్ ఘోష్ పార్టీలో చేరిన సందర్భంగా అథవాలే సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పాయల్ ఘోష్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమెను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో అథవాలే, పాయల్ ఘోష్ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పటికీ దాన్ని ముక్కుమీద నుంచి తొలగించి మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. వేదికపై ఉన్నవారు కూడా దాదాపు ఇలానే ఉండటం గమనార్హం. తాజాగా అథవాలే కరోనా బారిన పడటంతో సమావేశానికి హాజరైన వారిలో ఆందోళన మొదలైంది. కాగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఫిబ్రవరి 20న ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద చైనా కాన్సుల్ జనరల్ టాంగ్ గ్యుకోయి, కొద్దిమంది బౌద్ధ సన్యాసులతో కలిసి ‘గో కరోనా గో’ అంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. I have tested #COVID19 positive and as per advise of Doctors I have been hospitalised for few days. Those who have been come in contact with me are advised to get COVID-19 tests done. Take Care & Stay Safe — Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 27, 2020 अभिनेत्री पायल घोष का आरपीआय मे स्वागत है। @iampayalghosh आपके साथसे आरपीआय की महिला आघाडी और मजबूत करेंगे! महिलाओंको न्याय दिलाने की लढाई मजबुतीसे लढेंगे!डॉ बाबासाहेब आंबेडकरजीके संविधान का समतावादी भारत साकार करेंगे! pic.twitter.com/xvt1EksnIl — Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 26, 2020 -
నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఇన్నింగ్స్
ముంబై : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే)లో చేరారు. కేంద్ర మంత్రి, ఆ పార్టీ చీఫ్ రాందాస్ అథవలే సమక్షంలో ఆమె ఆర్పీఐ(ఏ)లో అడుగుపెట్టారు. పార్టీలో ఆమె చేరికను తాను స్వాగతిస్తున్నానని, పాయల్ ఘోష్‌కు శుభాకాంక్షలు తెలియచేశానని రాందాస్ అథవలే పేర్కొన్నారు. ఆర్పీఐ(ఏ) మహిళా విభాగానికి ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాయల్ ఘోష్ ఆర్పీఐలో చేరారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్‌పై పాయల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోఫణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదవండి : కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి -
ఇక మిగిలింది అథవాలే ఒక్కరే!
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎన్డీయే మంత్రివర్గంలో బీజేపీ మిత్రపక్షాల నుంచి రాంధాస్ అథవాలే ఒక్కరే మిగిలారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు అయిన అథవాలే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన అరవింద్ సావంత్(శివసేన), హర్సిమ్రత్ కౌర్ బాదల్(శిరోమణి అకాలీదళ్) గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా పాశ్వాన్(ఎల్జేపీ) అనారోగ్యంతో మృతిచెందారు. (చదవండి: పాశ్వాన్ కన్నుమూత ) ఇక శివసేన, శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. మరో మిత్రపక్షం జేడీ(యూ) కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్ సావంత్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా, పాశ్వాన్ మరణంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది. -
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంగనా!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతితో పాటు మాదకద్రవ్యాల అంశానికి సంబంధించి బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే కంగనాకు మద్దతుగా నిలిచారు. దీంతో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో వెలుగుచూసిన ఓ పోస్టర్ చర్చనీయాంశమైంది. త్వరలో జరగబోయే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆర్పీఐ కంగనా ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను వాడింది. (చదవండి: ఎన్ని నోళ్లు మూయించగలరు?) కాలాఘోడా ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్లో అథవాలే, కంగనా ఉన్నారు. కంగనాకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆర్పీఐ వడోదర చీఫ్ రాజేశ్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై వచ్చేందుకు కంగానా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ పార్టీ అధినేత అథవాలే ఆమెకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాగా, యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి బంధుప్రీతి కారణమని వార్తల్లో నిలిచిన కంగనా, బాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా శాసిస్తోందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది. దాంతోపాటు సుశాంత్ మృతి కేసు విచారణలో ముంబై పోలీసులపై నమ్మకం లేదని తేల్చి చెప్పింది. కంగనా వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో వివాదం ముదిరింది. ఈక్రమంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ముంబై కార్పొరేషన్ కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ ఆమె హైకోర్టుకు వెళ్లడంతో.. అధికారుల దుందుడుకు చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా)