సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్లు వేసే కాంగ్రెస్ శశి థరూర్ తన ట్వీట్ అక్షర దోషాలవల్ల దొరికిపోయారు. కేంద్ర బడ్జెట్ 2022పై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతల మద్య ట్విటర్‌లో వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఓ ట్వీట్ చేశారు. అయితే, అందులో Budget కి బదులుగా Bydget అని, reply కి బదులుగా rely అని రాశారు.
ఈ ట్వీట్ కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కౌంటర్ ఇస్తూ ఆరోపణలు చేసే ముందు తప్పులను సరిచేసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయంలో దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే 1991 ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దేశంలో గోల్డెన్ పీరియడ్ నడుస్తోందని ప్రశంసించారు.
కాంగ్రెస్ పాలనాకాలంలో దేశంలో వెలుగులోకి వచ్చిన స్కామ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. కాంగ్రెస్ టైమ్ లో ప్రతీ రోజు పత్రికల్లో ఏదో ఒక స్కామ్ గురించి వస్తుండేదని ఆమె ఎద్దేవా చేశారు. కోల్ స్కామ్, 2జీ స్కామ్, ఆంట్రిక్ దివాస్ స్కామ్, పలు కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆర్థికమంత్రి చెప్పేదంతా అంకెల గారడీ అని ఆమె ప్రసంగాన్ని వింటున్న కేంద్ర మంత్రి అథవాలె ముఖ కవళికలు చూస్తే తెలుస్తుందని థరూర్ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.
Dear Shashi Tharoor ji, they say one is bound to make mistakes while making unnecessary claims and statements.
— Dr.Ramdas Athawale (@RamdasAthawale) February 10, 2022
It’s not “Bydget” but BUDGET.
Also, not rely but “reply”!
Well, we understand! https://t.co/sG9aNtbykT
Comments
Please login to add a commentAdd a comment