International Yoga Day: Congress Says Pandit Nehru Popularised Yoga - Sakshi
Sakshi News home page

మొట్టమొదట యోగాకు ప్రాచుర్యం కల్పించిన ప్రధాని ఆయనే..

Published Wed, Jun 21 2023 1:32 PM

International Yoga Day Shashi Tharoor Tweet - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా మన ప్రస్తుత ప్రభుత్వం తోపాటు అందుకు మొదట పునాది వేసిన మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కూడా గుర్తు చేసుకోవాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్.   

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగాకు మొట్టమొదట ప్రాచుర్యం కల్పించిన వ్యక్తిగా భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని గుర్తు చేసి ఆయన యోగా చేస్తున్న ఫోటోను జతచేసి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. " యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న తాపత్రయంతో యోగాను జాతీయ విధానాల్లో చేర్చిన నెహ్రూ గారికి కృతఙ్ఞతలు. మన శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడే ఈ ప్రాచీన విద్యను అందరం ఆచరిద్దాం." అని ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 

దానికి కొనసాగింపుగా శశి థరూర్ రాస్తూ.. "భారత ప్రభుత్వం తోపాటు యోగాకు ఇంతటి ప్రాచుర్యం కల్పించిన ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు దక్కాలి. యోగా మనలోని అంతర్గత శక్తిని ఉత్తేజింప చేస్తుందని దశాబ్దాలుగా నేను వాదిస్తూనే ఉన్నాను. ఐక్యరాజ్యసమితి ద్వారా యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం గొప్ప విషయం." అని రాశారు. 

ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు.. వైరల్ వీడియో 

Advertisement
 
Advertisement
 
Advertisement