International Yoga Day
-
ఆఫ్రికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఆఫ్రికాలో భారతీయులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 30వ తేదీ ఆదివారం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా దారుసలెమ్ భారతీయ రాయబార కార్యాలయ ఉద్యోగి డాక్టర్ సౌమ్య చౌహన్ ఆధ్వర్యంలో టాంజానియా రాష్ట్రం ఎంబీఈఎఫ్వై టౌన్లో 9వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు సౌమ్య చౌహన్ మాట్లాడుతూ.. "యోగా అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఇది అంతర్గత శాంతికి, స్వీయ-ఆవిష్కరణకు, ప్రకృతితో సామరస్యానికి ఒక మార్గం. "అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకుడు ఆంధ్రప్రదేశ్ తిరువూరు వాసి రామిశెట్టి వెంకట నారాయణ (సత్య) మాట్లాడుతూ ..." ప్రధాని మంత్రి మోదీగారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయలు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు, సమగ్ర ఐక్యతకు యోగ ఒక మంచి సాధనమన్నారు. రోజువారీ ఒత్తుడులు, వ్యక్తిగత జీవితాల తోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది" అని అన్నారు. ఈ యోగా అభ్యాసకులలో మానసిక ప్రశాంతతా, ఐక్యత భావాన్ని పెంపొందించి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతుందని యోగ సాధకుడు రోహిత్ పేర్కొన్నారు. (చదవండి: డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు) -
భారతీయ వారసత్వ సంపద యోగా
సాక్షి, అమరావతి/లబ్బిపేట (విజయవాడ తూర్పు): యోగా భారతీయ ఘన వారసత్వ సంపద అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ లోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. శరీరంతో పాటు, మనసు శక్తివంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని అన్నారు. ఈ ఏడాది యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. 175 దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా ఔన్నత్యాన్ని వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణరాజు యోగాసనాలు చేయించారు. ఆయుష్ శాఖ రూపొందించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మసీస్ అండ్ డాక్టర్స్ వెబ్సైట్, ఆశా ఏఎన్ఎంల కోసం రూపొందించిన శిక్షణా పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొలికపూడి, ఎన్.ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యంగవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్నిత్యం యోగా చేయడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్‌తోపాటు అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య అధికారి సీహెచ్.రామానంద్, కేర్ యోగా నేచురోపతి కాలేజ్‌కు చెందిన ఎస్.సుచరిత యోగాసనాల గురించి వివరించారు. ప్రాచీన జీవన విధానాన్ని స్వీకరించాలికేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ భీమవరం: యోగా ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పడుతున్న ఇబ్బందులను అధిగవిుంచడానికి ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలి్సన అవసరముందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో ప్రతి రంగంలోనూ తీవ్ర పోటీ నెలకొన్నందున మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందన్నారు. ఎస్పీ వేజెండ్ల అజిత మాట్లాడుతూ టెక్నాలజీ, ఆధునిక సాధనాల వల్ల శారీరక శ్రమ తగ్గిపోయిందని, ప్రతి ఒక్కరూ నిత్యం కనీసం 20 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయాలని, తద్వారా మానసిక, శారీరక సమతౌల్యత కలుగుతుందని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తదితరులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.నడి సముద్రంలో నౌకాదళం యోగాసనాలుసాక్షి, విశాఖపట్నం: ‘స్వీయ ఆరోగ్యం, సమాజం కోసం యోగా’ అనే థీమ్‌తో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది. 11 రోజుల పాటు యోగా ప్రచారం నిర్వహించిన నౌకాదళం.. శుక్రవారం గ్రాండ్ ఫినాలేలో వివిధ ప్రాంతాల్లోని సాగర తీరంలోనూ, సముద్రంలోని యుద్ధ నౌకల్లో యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరచడానికి నేవీ సిబ్బంది యోగా విన్యాసాలు నిర్వహించారు. యోగా సెషన్స్‌తో పాటు మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం, అధునాతన ఆసనాలపై నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లలో నౌకాదళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పసిఫిక్, అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహా సముద్ర తీరాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకల్లో నిర్వహించిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో కోస్ట్‌గార్డ్ ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
యోగమస్తు..! భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం..!!
సంప్రదాయ భారతీయ ‘యోగ’ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. మన దేశస్తులతో పోటీ పడుతూ విదేశీయులు కూడా ఆరోగ్య‘యోగ’ం కోసం తపిస్తున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాల్లో మమేకమైన ఆసనం...ఇప్పుడు ఆరోగ్యార్థుల పాలిట శాసనంగా మారింది. ఈ నేపథ్యంలో మన వాళ్లే కాకుండా పాశ్చాత్యులు కూడా యోగ సాధన కోసం నగరానికి క్యూ కడుతున్నారు. మేము సైతం అంటూ యోగ మార్గానికి జై కొడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోసాంత్వన–ఉత్తేజమయం...దేహానికి ధ్యానంలాంటిది...యోగ. ఒక్కో ఆసనం శరీరంలోని ఒక్కో అవయవానికి సాంత్వనను, ఉత్తేజాన్ని అందిస్తుంది. యోగలోని విభిన్నమైన బ్రీథింగ్ టెక్నిక్స్ శారీరక, మానసిక ఉపశమనాన్ని నెలకొల్పుతాయి. దశాబ్దకాలంగా ఆస్వాదనతో, అంకితభావంతో యోగ చేస్తున్నాను. ఫిట్నెస్ కోసమో, మరువు తగ్గించుకోడానికి మాత్రమే కాకుండా నిత్య జీవనం పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. యోగాసనాలు యవ్వనత్వాన్ని కాపాడుతూ, చర్మాన్ని సున్నితంగా ఉంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. దృష్టి కేంద్రీకరణ, మానసిక నిలకడ–సమతుల్యతలో యోగ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. షూటింగ్లో ఉన్నా, ఇతర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నా నిత్యం యోగ చేస్తుంటాను. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఇష్టం. ఎక్కువ కాలం యోగతో ప్రయాణం..ఆనందమయ జీవితానికి వారధి.– శ్రద్దాదాస్, ప్రముఖ సినీనటి.యోగ, ప్రాణాయామం, ధ్యాన సమ్మేళనం... మానవ జీవితానికి అందిన అద్భుత వరం ..యోగ. యోగాసనాలు శారీరక, మానసిక స్థిగతులపైన ఉత్తేజకర ప్రభావాన్ని చూపించడమే కాకుండా అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది. వీటి సమ్మేళనం జీవితంలో ఒక నూతన మార్గాన్ని సూచిస్తుంది. యోగలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ నిత్య జీవనంలో ప్రత్యేకించిన 25–30 ఆసనాలు తప్పనిసరిగా చేయాలి. యోగ నిత్య ప్రయాణంలో క్రమ క్రమంగా శాశ్వత ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుత ఆధునిక, సాంకేతిక యుగంలో యోగను తప్పనిసరి దైనందిన చర్యగా మార్చుకోవాల్సిన అవసరముంది.– యోగాన్వేషి స్వప్న, యోగా శిక్షకురాలు. హైదరాబాద్. స్పృహ ‘వర్సెస్’ ఆందోళన...సామాజికంగా పెరిగిపోయిన ఆందోళన, అనిశ్చితి వంటి పరిస్థితులకు యోగ చక్కటి పరిష్కార మార్గం. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా గతేడాది మానసిక వైద్యులను సంప్రదించిన సందర్శకులు, యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. సాధారణ ఆందోళన స్థాయి నుంచి అస్పష్టమైన చంచలత్వం, తీవ్ర శారీరక లక్షణాలు.. మూర్ఛపోయేంతలా మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి.ఆందోళన అనేది కేంద్ర నాడీ వ్యవస్థపై నియంత్రించలేని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమస్యలకు యోగ పరిష్కారాలను సూచిస్తుంది. భావోద్వేగ నేపథ్యంతో పనిచేసే యోగ మెదడు సిగ్నలింగ్ వ్యవస్థను తిరిగి సున్నితం చేయడంలో సహాయపడుతుంది. భారతీయ సంస్కృతిలోని యోగ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న మానసిక ఆందోళనను సమాధానపరుస్తుంది.– ఇరినా తాషె్మట్, ఉజ్బెకిస్తాన్. (కన్హా శాంతి వనంలో యోగా ఆభ్యాసకురాలు)ఐక్య వేడుకగా...అంతర్జాతీయ యోగ దినోత్సవ నేపథ్యంలో ఏటా యోగాకు పెరుగుతున్న ఆదరణ, ఉత్సాహం, ఐక్యత చూసి ఆశ్చర్యపోతున్నాను. యోగ సెషన్లో భాగంగా యోగలోని ఎనిమిది భాగాల్లో దేనిని సాధన చేసినా ఆసనం, ప్రాణాయామం, ధారణ, ధ్యానం, యామ–నియామ ప్రయోజనాలను అందిస్తుంది. అనతికాలంలోనే యోగ విశ్వవ్యాప్తమైంది. హార్ట్ఫుల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలకు ముందుగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలను సమన్వయం చేస్తుంది.ఇందులో జైపూర్‌లోని ఓ గ్రామం నుంచి యునెస్కో–ప్యారిస్, యునైటెడ్ నేషన్స్–న్యూయార్క్ వరకూ అన్ని హార్ట్ఫుల్నెస్ బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగ దేశాన్ని దాటి వివిధ భాషలు, మతాలు, సంప్రదాయాలకు అతీతంగా ఐక్య వేడుకగా మారింది. యోగ కార్యక్రమాలను సిద్ధం చేయడం, నిర్వహించడం యోగ చేసిన అనుభూతిని అందిస్తుంది.– డాక్టర్ వెరోనిక్ నికోలాయ్ (ఫ్రాన్స్), హార్ట్ఫుల్నెస్ యోగ అకాడమీ డైరెక్టర్.ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా! -
Yoga Day 2024: యోగా డేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ప్రముఖులు
Live Updates..👉 నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.👉కశ్మీర్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.👉ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయి. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi leads Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar on J&K, on International Day of Yoga. pic.twitter.com/N34howYGzy— ANI (@ANI) June 21, 2024👉బషీర్‌బాగ్‌లో యోగా వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. #WATCH | Telangana: Union Minister and state BJP chief G Kishan Reddy, and others participate in a Yoga session at Nizam College Grounds, Basheer Bagh in Hyderabad. #InternationalYogaDay pic.twitter.com/bSI3g11tQz— ANI (@ANI) June 21, 2024 #WATCH | Defence Minister Rajnath Singh, Army chief Gen Manoj Pande and others perform Yoga in Mathura, Uttar Pradesh on the occasion of International Day of Yoga. pic.twitter.com/ke7DgB80ld— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Pangong Tso in Leh, on the 10th International Yoga Day.(Video source - ITBP) pic.twitter.com/6LCV406hla— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Karzok in Leh, on the 10th International Yoga Day. pic.twitter.com/ZaLsW9Fldd— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Muguthang Sub Sector in North Sikkim at an altitude of more than 15,000 feet, on the 10th International Yoga Day.#InternationalYogaDay2024(Source: ITBP) pic.twitter.com/oBY9Xuznb8— ANI (@ANI) June 21, 2024 👉ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై యోగా డే సెలబ్రేషన్స్.. #WATCH | Yoga onboard aircraft carrier INS Vikramaditya #InternationalYogaDay pic.twitter.com/ROBw82yvph— ANI (@ANI) June 21, 2024 👉యోగా డే పాల్గొన్న జైశంకర్..#WATCH | EAM Dr S Jaishankar and other diplomats perform Yoga in Delhi, on the International Day of Yoga. pic.twitter.com/MSbucUs40x— ANI (@ANI) June 21, 2024 👉 యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. #WATCH | Gujarat CM Bhupendra Patel performs Yoga, along with others, in Nadabet, Banaskantha on International Day of Yoga. pic.twitter.com/Ick5HCm6By— ANI (@ANI) June 21, 2024 -
TG: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అనేక నేరాలు, సామాజిక రుగ్మతలకు మానసిక ఒత్తిడి కారణం అనే విషయం మనకు తెలుసు. ఖైదీలకు యోగ శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలో సత్ప్రవర్తనను మెరుగుపరవచ్చని అనేక సందర్భాలలో రుజువైంది. అదే సమయంలో నేరాలను అరికట్టే క్రమంలో పోలీసు సిబ్బందికి సైతం మానసిక ఒత్తిడి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. వీటిని అధిగమించేందుకు కూడా యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి యోగా శిక్షణను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగతున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ళు, కార్యాలయాలో ఖైదీలకు, సిబ్బందికి విడివిడిగా యోగశిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు నాందిగా ప్రముఖ యోగా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో తెలంగాణ పోలీస్ అకాడమీలో 1200 మంది పోలీసు సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఒక గంట పాటు యోగసాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, మానవతావాది పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ స్వరంతో కూడిన ధ్యానంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణా పోలీసు అకాడెమీ డైరెక్టర్ జనరల్ అభిలాషా బిస్త్ మాట్లాడుతూ, కేవలం ఒక యోగా మ్యాట్ లేదా దుప్పటి, కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటే చాలు యోగ సాధన చేయవచ్చని, ఖరీదైన ఉపకరణాలేవీ లేకుండా ఆరోగ్యాన్ని పొందగలిగే ప్రక్రియ యోగ అని అన్నారు. “ఈ రోజుల్లో పని, హోదాలతో సంబంధం లేకుండా, పోలీసు సిబ్బంది సహా అందరికీ ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిడి ఉంటోంది. మన మనసులో కలిగే ఆలోచనలకు మనం బాధ్యత తీసుకున్నపుడు, రోజూ కొంచెం సేపు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసినపుడు మన మనసును, ఒత్తిడిని మనం అదుపు చేయగలుగుతాం. ఈ దిశలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం.” అని ఆమె పేర్కొన్నారు. శ్రీమతి అభిలాషా బిస్త్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన చేయటం ద్వారా సిబ్బందిలో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపారు.“మానవాళి అంతరంగ వికాసానికి తోడ్పడేందుకు భారతదేశం అందించిన ఈ ప్రాచీన కళను, ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది.” అని శ్రీశ్రీ రరవిశంకర్ అభిలషించారు. “గత కొద్ది సంవత్సరాలుగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. యోగాలో ఆసనాలు అనేవి ఆరంభ సూచిక మాత్రమే. యోగాలోని విజ్ఞానం చాలా లోతైనది. మనసును సమత్వంగా, భిన్న పరిస్థితులలో తొణకకుండా స్థిరంగా ఉంచటానికి, చేసే పనిపై ధ్యాసను, ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏమిటి? అనే ప్రశ్న విజ్ఞానశాస్త్రానికి మూలమైతే, నేను ఎవరు? అనే ప్రశ్న ఆధ్యాత్మికతకు మూలం.” అని గురుదేవ్ తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ప్రదేశాలలో 55వేల మందికి పైగా యోగ సాధకులు, ఔత్సాహికులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణాలోని 30 జిల్లాలలో 65కు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. తెలంగాణా పోలీస్ అకాడెమీ, వివిధ పోలీసు బెటాలియన్లు, శిక్షణా కేంద్రాలు, సి.ఆర్.పి.ఎఫ్ దళాలు, రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. -
నెక్లెస్ రోడ్లో 10వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల కర్టెన్ రైజర్ (ఫొటోలు)
-
మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొద్ది నెలల క్రితమే భూమా మౌనికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఏడాదిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన సుమలత కుమారుడి పెళ్లిలో ఈ జంట సందడి చేశారు. తాజాగా యోగా డే సందర్భంగా మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?) మనోజ్ వైఫ్ భూమా మౌనిక యోగా డే సందర్భంగా అరుదైన ఫీట్ సాధించింది. ఏకంగా 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మనోజ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. మై వైఫ్ భూమా మౌనిక అంటూ యోగాసనం వేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందే యోగా డే సందర్భంగా భూమా మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా మిత్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు 108 సూర్యనమస్కారాలు పూర్తి చేసి.. యోగాపై నా ప్రేమకు అంకితం చేస్తున్నా. నాకు యోగాను పరిచయం చేసినందుకు మా అమ్మ శోభానాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్.. ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా) View this post on Instagram A post shared by Mounika Bhuma (@bhumamounika) -
భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారీస్థాయిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు రూపమన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ భారత ప్రధానితో కొద్దిసేపు మాటామంతీ జరిపిన తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను ఓ మీడియా ప్రతినిధి కార్యక్రమం గురించి స్పందించమని కోరగా.. "ఇదొక ప్రేమ పూర్వకమైన సందేశమని.. ఆయన అసలైన సంస్కృతికి పుట్టినిల్లయిన భారత్ నుండి వచ్చారు. ఆయన భారతీయ సాంప్రదాయానికి ప్రతిబింబం. ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందని అన్నారు. #WATCH | It is a lovely message. He (PM Modi) is a product of Indian culture and comes from a vast place like Indian culture does. This message of universal brotherhood and sisterhood is the one we want to hear again and again, says Richard Gere after Yoga Day event in New York pic.twitter.com/9fKXLpCYyh — ANI (@ANI) June 21, 2023 భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ తో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ "వసుదైక కుటుంబం" పేరుకు తగ్గట్టుగానే ప్రపంచ ప్రతినిధులంతా ఒకేచోట చేరి కుటుంబ వేడుకను తలపించారు. ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం.. -
యోగాతో ప్రశాంతత
సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం/లేపాక్షి/సీతంపేట/సింథియా: యోగాసాధన ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రోత్సహించడం ప్రపంచ యోగాదినోత్సవ ముఖ్య లక్ష్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి మన దేశం ఆచరణాత్మక విధానమే కారణమన్నారు. యోగాను ప్రజలకు తెలిపి ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించింది ప్రధాని నరేంద్రమోదీయేనని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భారతీప్రవీణ్ పవార్, కలెక్టర్ పి.ప్రశాంతి విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా వ్యాప్తికి ప్రధాని కృషి అమోఘం ప్రపంచ దేశాల్లో యోగావ్యాప్తికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషి అమోఘమని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని నంది విగ్రహం వద్ద బుధవారం జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో సర్వరోగాలు దూరమవుతాయని చెప్పారు. ఒత్తిడి తగ్గించుకోవడం యోగాతోనే సా«ధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగాదినోత్సవంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పాల్గొన్నారు. వారసత్వ సంపద యోగా యోగా మన వారసత్వసంపద అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి ఆరోగ్యదిక్సూచిగా యోగాను అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణీమోహన్ చెప్పారు. విజయవాడలోని బాపు మ్యూజియంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆమె మాట్లాడారు.అనంతరం మ్యూజియం నుంచి మొగల్రాజపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా సాధన చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మీషా సూచించారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగదినోత్సవంలో ఆయన మాట్లాడారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో.. తూర్పు నావికాదళం పరిధిలోని అన్ని యూనిట్లలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 10 వేలమంది నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ కారŠప్స్, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సముద్ర ఉపరితలం మీద ఉన్న నౌకల్లో, తీరంలో వివిధ ఓడరేవుల్లో, విదేశీ పోర్టుల్లో ఉన్న ఈస్ట్రన్ ప్లీట్ షిప్‌లలో కూడా యోగా దినోత్సవం నిర్వహించారు. ఇండోనేషియాలోని జకార్తాలో ఐఎన్ఎస్ శివాలిక్, బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో ఐఎన్ఎస్ కిల్తాన్, «థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఐఎన్ఎస్ సుమిత్ర నౌకల్లో సిబ్బంది యోగాసనాలు వేశారు. మల్కాపురంలోని కేంద్రీయ విద్యాలయంలోని చిన్నారులతో ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు యోగాసనాలు వేయించారు. భారతీయ త్రివర్ణ థీమ్‌తో నేవీ సిబ్బంది చేసిన యోగా సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దివ్యాంగుల యోగా ఏయూక్యాంపస్: సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం సౌజన్యంతో బుధవారం 500 మంది దివ్యాంగ విద్యార్థులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏయూలో జరిగిన ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు పథక సంచాలకుడు డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సహిత విద్య కో ఆర్డినేటర్ ఎన్.కె.అన్నపూర్ణ, డీఈవో ఎల్.చంద్రకళ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు అభినందించారు. -
న్యూయార్క్‌లో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం
అమెరికాలోని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వేదికగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం న్యూయార్క్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. యూఎన్ జనరల్ సెక్రటరీ సహా 180 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వసుదైక కుంటుంబం థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. యోగా ఓ జీవన విధానం ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ.. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికీ ధన్యావాదాలు తెలియజేశారు. యోగా దినోత్సవం ప్రాముఖ్యాన్ని, కలిగే లాభాలను ప్రధాని వివరించారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికి, మతానికి లేదా జాతికి చెందినది కాదని తెలిపారు. యోగాకు కాపీరైట్, పేటెంట్, రాయల్టీల వంటివి లేవన్నారు. యోగా డేలో దాదాపు అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్న ఆయన.. యోగా అంటేనే అందరినీ కలిపేది అని కితాబిచ్చారు. ఇది కేవలం వ్యాయామం కాదని, ఒక జీవన విధానం అని అన్నారు. భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయం యోగా! యోగా భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని మోదీ తెలిపారు. యోగా పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వార్షిక వేడుకగా గుర్తించాలని మోదీ ప్రతిపాదించారు. యోగా డే జరపాలనే ప్రతిపాదనను కూడా దేశాలన్నీ ఆమోదం తెలిపాయని చెప్పారు. భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందని మోదీ చెప్పుకొచ్చారు. కాగా 2014లో యోగా దినోత్సవం నిర్వహించాలని మోదీ ప్రతిపాదించగా.. 2015 నుంచి జూన్ 21న ఐరాస యోగా దినోత్సవం నిర్వహిస్తోంది. గిన్నిస్ రికార్డు సాధించిన మోదీ యోగా కార్యక్రమం న్యూయార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా 140 దేశాలకు చెందిన జాతీయస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈమేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారి మైఖేల్ ఎంప్రిక్ బుధవారం ఐరాస ప్రధాన కార్యాలయం లాన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ క్సాబా కొరోసి, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌లకు ఈ అవార్డును అందించారు. Delighted to take part in the #YogaDay programme at @UN HQ. Let us make Yoga a part of our lives and further wellness. https://t.co/XvsB8AYfGs — Narendra Modi (@narendramodi) June 21, 2023 -
సెన్సెక్స్ ఆల్-టైం రికార్డ్: ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీ సెన్సెక్స్ బుదవారం ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 63,588 వద్ద సెన్సెక్స్ రికార్డ్ స్థాయికి చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్‌లో 9 బిలియన్ల డాలర్ల బలమైన వాలెట్‌ను ప్రారంభించడంతో, సెన్సెక్స్ రికార్డు స్థాయిని టచ్ చేసింది. దాదాపు 137 రోజుల తరువాత ఆల్‌టైం హైని తాకింది. గత ఏడాది డిసెంబర్ 1న గత ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 53,523వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 18,857 రికార్డు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. పటిష్టంగా ఉన్నజీడీపీ ఔట్లుక్, ద్రవ్యోల్బణం తగ్గు ముఖం, విదేశీ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్లతో సహా బలమైన ఫండమెంటల్స్ మార్కెట్లను ఆల్ టైంకి చేర్చాయని మార్కెట్ పండితుల మాట. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సెన్సెక్స్ కొత్త శిఖరానికి చేరడంతో ఇకపై మార్కెట్ నెమ్మదిగా, స్థిరంగా సాగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. యోగాలో, బాహ్య ప్రపంచం కంటే లోపలి ప్రపంచంపైనే దృష్టి ఉంటుంది. మార్కెట్లో కూడా పెట్టుబడిదారులు ఇండెక్స్ స్థాయి కంటే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. యోగాలో, సుదీర్ఘ కాల వ్యవధిలో ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన నీలేష్ షా వ్యాఖ్యానించడం విశేషం. అటు నిఫ్టీ కూడా అదే స్థాయిలో ట్రేడ్ అయింది. ఫ్టాట్‌గా ప్రారంభమైనప్పటికీ, వెంటనే లాభాల్లోకి మళ్లాయి. కానీ తరువాత లాభాల స్వీకరణ కారణంగా సూచీలు ఫ్లాట్ జోన్లోకి మారాయి. ఫైనాన్స్, మీడియా, రియల్టీ లాభాల్లో ఉండగా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు నష్ట పోతున్నాయి. పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లాభాల్లో ఉండగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, దివీస్, యాక్సిస్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టాలతో 82.10 వద్ద కొనసాగుతోంది. (మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
యోగాకు మొదట ప్రాచుర్యం కల్పించింది ఆయనే..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా మన ప్రస్తుత ప్రభుత్వం తోపాటు అందుకు మొదట పునాది వేసిన మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కూడా గుర్తు చేసుకోవాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగాకు మొట్టమొదట ప్రాచుర్యం కల్పించిన వ్యక్తిగా భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని గుర్తు చేసి ఆయన యోగా చేస్తున్న ఫోటోను జతచేసి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. " యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న తాపత్రయంతో యోగాను జాతీయ విధానాల్లో చేర్చిన నెహ్రూ గారికి కృతఙ్ఞతలు. మన శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడే ఈ ప్రాచీన విద్యను అందరం ఆచరిద్దాం." అని ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి కొనసాగింపుగా శశి థరూర్ రాస్తూ.. "భారత ప్రభుత్వం తోపాటు యోగాకు ఇంతటి ప్రాచుర్యం కల్పించిన ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు దక్కాలి. యోగా మనలోని అంతర్గత శక్తిని ఉత్తేజింప చేస్తుందని దశాబ్దాలుగా నేను వాదిస్తూనే ఉన్నాను. ఐక్యరాజ్యసమితి ద్వారా యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం గొప్ప విషయం." అని రాశారు. Indeed! We should also acknowledge all those who revived & popularised yoga, including our government, @PMOIndia & @MEAIndia, for internationalising #InternationalYogaDay through the @UN. As I have argued for decades, yoga is a vital part of our soft power across the world &… https://t.co/WYZvcecl0Q — Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2023 ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు.. వైరల్ వీడియో -
సిద్దిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్ నజీర్
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘల్ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇది కూడా చదవండి: మాతో పొత్తా?.. పద్ధతిగా ఉండదు! చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం (ఫొటోలు)
-
దేశ వ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం
-
దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. పాల్గొన్న ప్రముఖులు, సెలబ్రెటీలు
ఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురుగ్రామ్‌లోని టవ్దేవీలాల్ స్టేడియంలో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. Haryana | BJP chief JP Nadda performs Yoga at Tau Devi Lal Stadium in Gurugram on #9thInternationalYogaDay pic.twitter.com/zOtFwFgTJc — ANI (@ANI) June 21, 2023 ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్.. జబల్పూర్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. #WATCH | Madhya Pradesh: Vice-President, Jagdeep Dhankhar and CM Shivraj Singh Chouhan perform Yoga in Jabalpur to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/dUCixgUl5J — ANI (@ANI) June 21, 2023 భారత ఆర్మీ, వివిధ బెటాలియన్ల సైనికులు సిక్కిం, లఢక్‌లో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. #WATCH | Indian Army personnel perform Yoga in Sikkim to mark the #9thInternationalYogaDay. (Video Source: Indian Army) pic.twitter.com/kS7WWFx8Hl — ANI (@ANI) June 21, 2023 #WATCH | Indian Army personnel perform Yoga at Pangong Tso, Ladakh, to mark the #9thInternationalYogaDay. (Video Source: Indian Army) pic.twitter.com/HQRxo8mHdA — ANI (@ANI) June 21, 2023 #WATCH | Tamil Nadu: Yoga practitioners from Rameswaram perform water yoga to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/rugmjpiygA — ANI (@ANI) June 21, 2023 #WATCH | Maharashtra: CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis perform Yoga, in Mumbai to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/5zPE1fDGCv — ANI (@ANI) June 21, 2023 #WATCH | Union Minister Piyush Goyal performs Yoga in Mumbai on #9thInternationalYogaDay pic.twitter.com/z7ElFIyYGy — ANI (@ANI) June 21, 2023 #WATCH | UP: Union Minister Smriti Irani performs Yoga in Noida, to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/VaxWcs0TGA — ANI (@ANI) June 21, 2023 #WATCH | Kochi, Kerala: Defence Minister Rajnath Singh along with Chief of the Naval Staff, Admiral R Hari Kumar performs Yoga on board INS Vikrant on #9thInternationalYogaDay. pic.twitter.com/KsaYZyptiz — ANI (@ANI) June 21, 2023 -
International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందేశంలో భారతీయులు కొత్తదనాన్ని స్వాగతించడంలోనూ, సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని కనబరిచారని అన్నారు. ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఆహ్వానం మేరకు అమెరికా పయనమైన భారత ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని భారత ప్రజానీకానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. యోగా మనలోని అంతర్గత ద్దృష్టిని మెరుగుపరచి మనలోని ఐక్యత పెరిగే లా చేస్తుందని దీని ద్వారా వైరుధ్యాలను చెరిపేసి, అడ్డులన్నిటినీ అధిగమించి, ఆటంకాలను తొలగించుకోవచ్చని, మనమంతా కలిసి "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్" స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు కూడా యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని, "మహాసముద్రాల వలయంగా యోగా" నిర్వహిస్తున్నందున ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా వర్ణించారు. భారత దేశంలోని కోట్లాది ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని ఆయనన్నారు. #WATCH | At around 5:30 pm IST, I will participate in the Yoga program which is being organised at the headquarters of the United Nations. The coming together of more than 180 countries on India's call is historic. When the proposal for Yoga Day came to the United Nations General… pic.twitter.com/oHeehPkuZe — ANI (@ANI) June 21, 2023 అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని: ఎలన్ మస్క్ -
ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన షెడ్యూల్‌ను శుక్రవారం విదేశాంగ శాఖ విడుదల చేసింది. జూన్ 20 నుంచి 25 వరకు ప్రధాని అమెరికా, ఈజిప్టులలో పర్యటిస్తారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి పర్యటనలో యూఎన్‌లో జరిగే యోగా డేలో ప్రధాని పాల్గొనడం విశేషం. ప్రతీ రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రపంచంలో అవగాహన పెరగాలని మోదీ ప్రధాని పదవి చేపట్టాక చేసిన ప్రయత్నాలతో యూఎన్ 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పుడు తొమ్మిదేళ్లయ్యాక యూఎన్‌లో జరిగే కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉండడంపై ప్రధాని మోదీ ఉద్విగ్నంగా స్పందించారు. యోగా మరింతగా ప్రజాదరణ పొందాలని ఒక ట్వీట్లో ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటన ఇలా..! ► ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్ నుంచి మొదలవుతుంది. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 నుంచి 9 గంటలవరకు జరిగే యోగా సెషన్లో ప్రధాని పాల్గొంటారు. భారత్ యూఎన్‌కు బహుమతిగా ఇచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం ఎదుటే ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో యూఎన్ ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు యోగా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతారు. ► న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు వెళతారు. జూన్ 22న అధ్యక్షుడు బైడెన్‌తో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు. ► అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ స్పీకర్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు ► అదే రోజు రాత్రి ప్రధాని గౌరవార్థం బైడెన్ దంపతులు శ్వేత సౌధంలో అధికారిక విందు ఇస్తారు. ► జూన్ 23న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రధానికి ఆతిథ్యమిస్తారు. అదే రోజు ప్రధాని పారిశ్రామికవేత్తలతో, కార్పొరేట్ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ► జూన్ 24న ఈజిప్టుకి బయల్దేరి వెళతారు. అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు. మన గణతంత్ర ఉత్సవాలకు హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించనున్నారు. -
యోగాను పండుగలా జరుపుకోవాలి
రసూల్‌పురా (హైదరాబాద్): అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక, ఉపాధి, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాలూభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దీపావళి, ఉగాదిలాగా యోగా కూడా ఒక పండుగలా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగా చేయాలని సూచించారు. కౌంట్‌డౌన్‌కు హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విషయమని అన్నారు. యోగా మన జీవన విధానం: కిషన్‌రెడ్డి మన దేశంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగా మన జ్ఞాన సంపద, జీవన విధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. జూన్ 21న యోగా దినోత్సవం రోజున అనేక దేశాల్లో యోగా చేస్తారని, ఆరోజు మన దేశంలోనూ ప్రతిఒక్కరూ యోగా చే యాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 13 నుంచి దేశవ్యాప్తంగా వంద రోజులపాటు యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు హైదరాబాద్‌లో 25 రోజుల కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ, యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మనసు సుసంపన్నం అవుతుందని అన్నారు. జూన్ 21న మైసూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ 25 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సినీ ఆరి్టస్టులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన పదివేల మంది పైగా యోగా మహోత్సవ్‌లో పాల్గొన్నారు. -
యోగా C/o కరీంనగర్.. ఎదురులేని జిల్లాగా రికార్డ్
సాక్షి, కరీంనగర్: యావత్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం యోగా జపం చేస్తోంది. అందరికీ యోగా అవసరం అనే కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా క్రీడాకారులు 16 ఏళ్లుగా రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఆదిపత్యం చెలాయిస్తున్నారు. 2005 నుంచి 2021 వరకు 14 సార్లు చాంపియన్‌గా నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి 7 సార్లు రాష్ట్ర పోటీలు జరుగగా వరుసగా 6 (2020లో కోవిడ్ కారణంగా పోటీలు జరుగలేదు) సార్లు విజేతగా నిలిచారు. 1993లో శ్రీకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1993లో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి వివిధ కేటగిరీల్లో బాలబాలికలకు యోగా శిక్షణ, పోటీలు నిర్వహించి అంచెలంచలుగా ప్రపంచ స్థాయిలో నలిచింది కరీంనగర్ జిల్లా. 2016లో అర్జెంటీనాలో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో జిల్లా నుంచి సిధారెడ్డి, యమున, ప్రణీత పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. తర్వాత మలేషియా, బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో మనోజ్, దేవయ్య పాల్గొని పతకాలు సాధించగా ఇటీవల త్రివేండ్రంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ఉదయ్ కిరణ్ సత్తాచాటాడు. వీరితో పాటుగా జాతీయ యోగా పోటీల్లో ఆనంద్ కిషోర్, మహేందర్, మల్లేశ్వరి, సాయిప్రవీణ్, సజన, రాజుతో పాటు సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. యోగ శిక్షకులు సంపత్‌కుమార్, కిష్టయ్య, ప్రదీప్, సత్యనారాయణ, సుష్మా, సజన్, రామకృష్ణ, మల్లేశ్వరి తదితరులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తూ జిల్లాలో ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేస్తుండడం విశేషం. యోగా సంఘం ఆధ్వర్యంలో జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఏటా అట్టహాసంగా జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే సంఘం ఆధ్వర్యంలో తొలిసారి 2005లో, తర్వాత 2018, 2019, 2021 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రాష్ట్ర పోటీల్లో 6 సార్లు చాంపియన్‌గా నిలిచారు. యోగా చరిత్రలో ఇప్పటికీ జిల్లా క్రీడాకారులదే పైచేయి కావడం విశేషం. 2014లో మహబూబ్‌నగర్, 2015లో నిజామాబాద్, 2016లో ఆదిలాబాద్, 2017లో కరీంనగర్, 2018 పెద్దపల్లి, 2019లో సరూర్‌నగర్, 2021లో కరీంనగర్లో జరిగిన రాష్ట్ర పోటీల్లో కరీంనగర్ జిల్లా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సష్టించింది. -
ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప సంపద యోగా: గవర్నర్ బిశ్వభూషణ్
-
మైసూర్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
వ్యాధి నిరోధక సంజీవని... యోగా!
యోగా అంటే కలయిక. మన శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ. దీనిని నిరంతర సాధన చేస్తే మన గమ్యమైన ముక్తి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. అనగా మనస్సును ఐహిక బంధం నుండి వేరుచేయడం అన్న మాట. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించడం వల్ల బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అరబిందో నిర్వ చించారు. యోగాలో చాలా రకాలున్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, పతంజలి యోగం, కుండలినీ యోగం, హఠ యోగం, మంత్ర యోగం, లయ యోగం, రాజ యోగం, జైన యోగం, బౌద్ధ యోగం వంటివి వాటిలో కొన్ని. అయితే ప్రతి యోగా పద్ధతికి సంబంధించి... నియమావళి, సూత్రాలు, ఆచరణ వేరు వేరుగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మన శరీర ఆరోగ్యానికి సంబంధించినదైన పతంజలి యోగా. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే రక్తనాళాల్లో అవరోధాలు తొలగిపోయి ప్రతి అవ యవం కండిషన్లో ఉంటుంది. దీనికి తోడు యుక్తా హారం తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చుకొంటే ఆరోగ్య సమస్యలను రూపుమాపవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. యోగా చేసేవారు గురువు సూచనలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారూ, గర్భిణులూ డాక్టర్ సూచనలు పాటించాలి. వ్యాధి ఒక్కరోజులో సంక్రమించదు. వ్యాధి పెరుగుదల ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఏ లక్షణాలూ పైకి కనపడవు కానీ శరీరంలో వ్యాధి పెరుగుతుంది. ద్వితీయ దశలో పైకి స్వల్ప లక్షణాలు కనపడతాయి. మూడవ దశలో వ్యాధి లక్షణాలు బాగా కనపడి బాధను కల్గిస్తాయి. ఈ దశలో త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందివ్వాలి. లేకపోతే నాలుగవ దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో అవసరమైన శస్త్ర చికిత్స చేసి అంగవైకల్యానికి పరిమితం చేస్తారు. ఐదో దశ పునరావాసం లేక మరణం. వీటిలో మొదటి రెండు దశల్లోనూ యోగా వల్ల ఉత్పత్తి అయిన రోగ నిరోధక శక్తితో వ్యాధిని విజయ వంతంగా నిరోధించవచ్చు. నేడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియాలజీ, న్యూరాలజీ, డయబెటాలజీ వంటి క్లినిక్‌లలో అనేక వందల మంది రోగులను ప్రతిరోజూ చూస్తున్నాం. రోగుల సంఖ్య అధికమవ్వటం వల్ల డాక్టర్లు వైద్య ప్రమా ణాలు పాటించని లేని స్థితికి చేరి వైద్యం చేస్తున్నారు. ఈ రోగుల సంఖ్యను గణనీయంగా యోగా వల్ల తగ్గించవచ్చు. అంతేకాదు యోగా చేసిన వెంటనే సదరు వ్యక్తి శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న సాగే గుణం సురక్షిత మవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయి. యోగా రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి. - వి.వి. రత్నాకరుడు రిటైర్డ్ నాన్ మెడికల్ ఫేకల్టీ ఆఫీసర్ (జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
యోగాను సాధన చేస్తే ఎన్నో సమస్యలు దూరం
-
దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం వేడుకలు (ఫొటోలు)
-
యోగా దినోత్సవంలో పాల్గొన్న విడదల రజని
-
అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రధాని మోదీ
-
మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు
బెంగళూరు: ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం వేకువజామున మైసూర్ ప్యాలెస్(కర్ణాటక) గ్రౌండ్లో నిర్వహించిన యోగా డే వేడుకలకు నేతృత్వం వహించి.. ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉంది. యోగా ఫర్ హ్యూమానిటీ థీమ్‌తో ఈసారి వేడుకలను, గార్డియర్‌రింగ్ పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. మైసూర్ అధ్యాత్మికానికి కేంద్రం. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. ..ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. ఇలా.. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది సూర్యుడి కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది.. ఈ దఫా వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6 — ANI (@ANI) June 21, 2022 Prime Minister Narendra Modi leads the #InternationalDayOfYoga celebrations from Karnataka's Mysuru pic.twitter.com/DDumTiIYVf — ANI (@ANI) June 21, 2022 -
క్లిక్ ట్రెండ్: యోగా ఫొటో
జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్నెస్ పోజెస్ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు. యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్నెస్ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి. మొట్టమొదటి డాక్యుమెంటరీ యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు చూడచ్చు. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్ఫెక్ట్ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్ యోగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ‘మైఖేల్ ఓ నీల్’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్‌లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో క్లిక్స్... యోగా ఫొటోషూట్ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్‌తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్ ఫొటో సెషన్‌కు మంచి వేదికలు. అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాట్ నీట్... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్ అయినా, యోగా మ్యాట్ అయినా శుభ్రంగా ఉండాలి. యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది. యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది. యోగా మెటర్నిటీ మెటర్నిటీ ఫొటోస్ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్లొకేషన్స్ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్నెస్ ట్రెయినర్స్లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ. – మనోజ్ఞ, న్యూ బోర్న్ బేబీ ఫొటో గ్రాఫర్ – నిర్మలారెడ్డి -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి
ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్–సర్వికల్ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఆమె పరిచయం... యోగా అవసరం... ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్ అయ్యంగార్ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె. తానే ఒక పేషెంట్‌గా వెళ్లి అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్ఐలు లేవు. డాక్టర్ మజిల్ వీక్నెస్ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్ డిస్క్. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్ ్టగా కెరీర్ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. ‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు. కాని అయ్యంగార్ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది. నిద్ర – మెలుకువ ‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె. మానవత్వం కోసం యోగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం. -
ఇలా చేశారంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): ఉరుకులు, పరుగుల జీవన గమయనంలో సరైన వ్యాయామం లేక మనిషి ఆరోగ్యం దెబ్బతింటోంది. చదువులు, కొలువులు, ఇళ్లల్లో సపరిచర్యలతో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురువుతున్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయమైనా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న జనం వీటిపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా వైపు ప్రజలు దృష్టి సారించేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. చదవండి: బూమ్.. బూమ్ సాఫ్ట్వేర్.. కంప్యూటర్ కోర్సులదే హవా.. రేపు జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంతర్జాతీయ 8వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి వేడుక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, ఆయుష్, సమాచార, విద్యుత్, స్పోర్ట్స్ అథారిటీ, ఎలక్ట్రికల్, ముని సిపల్ శాఖల జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రీతిన గుడివాడ, ఉయ్యూరు, డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఆసనాలతో ఆరోగ్యం యోగాలో భాగంగా వివిధ రకాల ఆసనాలు వేయటం ద్వారా ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఒక్కో ఆసనం ద్వారా ఒక్కో రకమైన అనారోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది తాడాసనం: ఈ ఆసనం ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. పొత్తి కడుపు, వెన్నెముక నిటారుగా సాగడం ద్వారా జీర్ణ కోశం శుభ్రమవుతుంది. పేగుల్లో, పొట్టలో కొవ్వులను కరిగింది ఆరోగ్య వంతంగా చేస్తుంది. వృక్షాసనం: రోజూ ఈ ఆసనం చేస్తే కాళ్ల కీళ్లు, మోకాళ్లు చీలమండల సడలించబడతాయి. కాళ్ల కండరాలకు సుభావన కలుగ జేస్తుంది. కీళ్ల (రుమాటిక్) నొప్పులు తగ్గుతాయి. వజ్రాసనం: ఈ ఆసనం ద్వారా తొడ, పిక్క కండరాలకు సుభావన కలుగుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. వెన్నెముకకు ఆధారమై నిటారుగా ఉంటుంది. ఈ ఆసనం చేస్తే ఆయాసం తగ్గుతుంది. భుజంగాసనం: అధిక శ్రమ మల్ల కలిగే నడుం నొప్పులు తొలగిపోతాయి. స్థాన చలనం కల వెన్నెముక పూసలు యథాస్థానానికి వస్తాయి. మెడ నొప్పులు, ఉబ్బసం రోగులకు ఈ ఆసనం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భోజనాలు చేసిన తరువాత వాయువులు (గ్యాస్ ట్రబుల్) వెళ్లే వారికి ఇది మంచి ఆసనం, వాత రోగాలు తగ్గుతాయి. పవన ముక్తాసనం: పవన అంటే గాలి, ముక్త అంటే విడిచి పెట్టడం. కడుపులోని చెడుగాలిని బయటకు పంపడం ఈ ఆసనంలో ప్రత్యేకత. మలబద్ధకం, తరచు వచ్చే త్రేన్పులు తగ్గి జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది. వెన్నెముక వెనుక కండరాలు, నరాలు ఉత్తేజమవుతాయి. ప్రాణాయామం–నాడీ శోధనం: గాలి రాక పోకలను క్రమపరుస్తుంది. మనస్సుకు ఏకాగ్రత ఇస్తుంది. హెచ్చు రక్తపోటుగలవారు కూడా దీనిని చేయవచ్చు. పద్మాసనం: జ్ఞానానికి, మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రత సాధనకు ఇది ఎంతో ఉపయుక్తకరమైన ఆసనం. రుషులు, మహర్షులు ఇదే ఆసనాన్ని చేసేవారు. భ్రామరీ ప్రాణాయామం: ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అందరికీ ఆరోగ్యమే లక్ష్యం అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా ఆయుష్ విభాగం ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. యోగా ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. కలెక్టర్ సూచనల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలంతా దీనిలో పాల్గొనాలి. – డాక్టర్ కల్పన, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు, మచిలీపట్నం యోగా సర్వరోగ నివారిణి యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి రోజూ యోగా చేసే వారిలో శారీరకంగానే కాక, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ప్రజానీకంలో మార్పు కనిపిస్తోంది. యోగాకు ఆదరణ పెరుగుతోంది. ప్రత్యేక శిబిరాల ద్వారా మరింత చైతన్యం తీసుకొస్తున్నాం. – జి.గురునాథబాబు, యోగా గురువు, మచిలీపట్నం -
21న విజయవాడలో యోగాసనాల పోటీలు
సాక్షి, అమరావతి: జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిషనర్ రాములు తెలిపారు. 8 ఏళ్లు పైబడిన వారందరూ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని వెల్లడించారు. ఎంపిక చేసిన 16 ఆసనాలలో 8 ఆసనాలను వేయగలిగిన వారు సంబంధిత ఫోటోలను advyoga2022@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. ఫొటోతో పాటు పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, చిరునామా, కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వివరాలను జత చేయాలన్నారు. జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఫొటోలు పంపాల్సి ఉంటుందన్నారు. పంపిన ఫోటోలను ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం ఎంపికైన వారు జూన్ 10న న్యాయ నిర్ణేతల సమక్షంలో అవే ఆసనాలను ఆన్లైన్లో వేయాలన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్ 21న విజయవాడలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. వివరాల కోసం 9441014521 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
అంతర్జాతీయ యోగా ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
-
అంతర్జాతీయ చైతన్య గీతిక
భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. 2014లో ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మానవాళికి యోగా ఒక సాధనమైంది. మరో 50 రోజుల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఆ రోజు అందరం సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృ త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 మే నెలలో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. 2014 నవంబర్‌లో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడం ద్వారా ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. 2014 డిసెంబర్ నాటికి ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 2016 జూన్‌లో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... యోగా విషయంలో భారతదేశం మేధా సంపత్తి హక్కులను (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) తీసుకోలేదనీ, భారతీయ జ్ఞానసంపద సమస్త మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటుందనీ పేర్కొన్నారు. ‘యోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజ లందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక’ అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాన మంత్రి బహిరంగంగానే వెల్లడించారు. ఇది అందరి ఆస్తి యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. తూర్పున ఉన్న వ్లాదివస్తోక్ నుంచి పశ్చిమాన ఉన్న వాంకోవర్ వరకు, దక్షిణాన ఉన్న కేప్‌టౌన్ నుంచి ఉత్తరాన ఉన్న కోపెన్హాగన్ వరకు ప్రతి నగరం యోగాలోని శక్తినీ, రోగనిరోధక సామర్థ్యాన్నీ గుర్తించి వినియో గంలోకి తీసుకొచ్చింది. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ... ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది. ఎన్డీయే కృషి యోగా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంపద అయినప్పటికీ... ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆమోదించి తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పోషించిన పాత్ర చిరస్మరణీయం, అభినందనీయం. 2014కి ముందు అప్పటి ప్రభుత్వ హయాంలో లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు లేవనెత్తిన రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటే... యోగా, సంప్రదాయ భారతీయ విజ్ఞాన వ్యవస్థల పట్ల అప్పటి ప్రభుత్వం చూపించిన ఉదాసీనత, నిర్లక్ష్యం ఎలాంటివో చక్కగా అర్థమవుతాయి. 2007 ఆగస్టులో లోక్‌సభలో ‘అమెరికాకు చెందిన పేటెంట్స్, ట్రేడ్ మార్క్ ఆఫీసు వారు యోగాపై మేధా సంపత్తి హక్కులను అమెరికా ప్రభుత్వానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. యోగా భారతీయ సనాతన సంప్రదాయ విధానం అయినందున, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిం చిందా, లేదా?’ అన్న ప్రశ్న వచ్చింది. నాటి ప్రభుత్వం ‘ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలేమీ లేదు’ అని సుస్పష్టంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా 2014 ఫిబ్ర వరిలో, అంటే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యేం దుకు కొద్దిరోజుల ముందు, నాటి ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... మార్చి 2009లో యోగాపై ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ ఇంతవరకు తమ నివేదికను సభకు అందజేయలేదని తెలిపింది. గత ప్రభుత్వాలు యోగా, భారతీయ సనాతన వ్యవస్థ విష యంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తే... ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు దక్కేలా కృషి చేసింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే! ఎనిమిదో వేడుకకు సిద్ధం మరో 50 రోజుల్లో అంటే జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతున్న సందర్భమిది. ఏడాదికేడాది యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గతేడాది కరోనా నేపథ్యంలో మన దేశంలో 15 కోట్లకు పైగా మంది అంతర్జాతీయ యోగా ఉత్సవం నాడు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర సాధనకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం, మన స్వాతంత్య్ర సంగ్రామంలో సర్వస్వాన్నీ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఘనకీర్తిని స్మరించుకోవడం, అసువులు బాసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చేస్తున్నాం. మన సంస్కృతీ సంప్రదాయాలనూ, వైభవోపేతమైన చరిత్రనూ, ఘనమైన వారసత్వ సంపదనూ కాపాడుకునేందుకు నడుం బిగిస్తున్నాం. కలిసి చేద్దాం యోగా! మన చరిత్రనూ, మన సనాతన జీవన విధానాలనూ చెరిపేసేందుకు జరిగిన ఎన్నో కుట్రలను ఎదుర్కొని మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు మన పెద్దలు చేసిన త్యాగం నిరుపమానమైనది. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన జీవన జ్ఞాన సంపదను గుర్తుచేసుకుంటూ, వారు వారసత్వంగా ఇచ్చిన యోగాలో నిగూఢంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను ఘనమైన ఉత్సవంగా జరుపుకొనేందుకూ ఇంతకు మించిన మరో సందర్భం ఏముంటుంది! ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. అయితే దీన్ని మరపురాని ఘట్టంగా మార్చేందుకు ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వేతర సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యోగా ప్రేమికులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోట్లాది మంది జీవితాల్లో ఓ భాగంగా మారిన యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలతో పాటు జాతీయ చైతన్య భావన జాగృతమైంది. రండి, అందరూ కలసి రండి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజు మీ ఇంట్లో, మీ బస్తీలో, మీ వాడల్లో, గ్రామాలలో, విద్యా సంస్థలలో, మీ కార్యాలయాలలో యోగా చేయండి. సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. మన వారసత్వ సంపదను మన జీవితాలలో నిత్యకృత్యంగా మార్చుకుందాం. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి -
న్యూజెర్సీలో సాయి దత్త పీఠం ఆధ్వరంలో యోగా దినోత్సవం
న్యూ జెర్సీ : న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్బంగా యోగాను భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనా.. అది ప్రపంచానికి ఎంత మేలు చేస్తుందనేది ప్రముఖ యోగా శిక్షకురాలు డా.విజయ నిమ్మ వివరించారు. యోగాసనాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని విజయ నిమ్మ పేర్కొన్నారు. అంతేకాకుండా తను విధులు నిర్వహించే నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిగేలా చేశారు. విజయ నిమ్మ విజ్ఞప్తితో నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ కెర్రీ పొవెల్ సంస్థలో యోగా దినోత్సవాన్ని జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. సీఓఓ మిస్టర్ జాన్ బోన్, సైట్ అడ్మినిస్ట్రేటర్ హాజీరబేజ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ సీఎంఓ డాక్టర్ పెన్నింగ్టన్ కూడా తన వంతు సహకారాన్ని అందించారు. కార్పొరేషన్ ఉద్యోగులకు డా.విజయ యోగాపై అవగాహన పెంచారు. యోగాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. వారిచే యోగాసనాలు వేయిస్తూ, ఆసనాలతో కలిగే లాభాలను స్పష్టంగా తెలిపారు. సాయి దత్త పీఠం గురుకులంలో యోగా శిక్షకురాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సాయి దత్త పీఠంలో జరపడంతో పాటు నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్లో కూడా యోగా దినోత్సవాన్ని చేయడం పట్ల సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం రోజున అందరికి యోగాపై అవగాహన కల్పించినందుకు డా.విజయ నిమ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు ఆ సాయి నాధ, శ్రీ మాతా కృప సదా ఉండాలని ఆశీర్వదించారు. చదవండి: ఫ్లోరిడాలో నాట్స్ ఆధ్వర్యంలో భారత కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ -
కరోనా కాలంలో యోగా ఆశాకిరణం!
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు కావాల్సిన బలాన్నివ్వడంలో యోగా ఎంతో సాయం చేసిందని, ఈ కష్టకాలంలో యోగా ఒక ఆశాకిరణంలా కనిపించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. సోమవారం ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు యోగా ఆచరించడం ద్వారా అంతర్జాతీయ యోగాడేను నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ సహకారంతో రూపొందించిన ఎం– యోగా యాప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ యాప్‌లో పలు భాషల్లో యోగా ట్రైనింగ్ వీడియోలు అందుబాటులో ఉంటాయి. పాత సాంప్రదాయం, ఆధునిక టెక్నాలజీ మేళవింపునకు ఈ యాప్ నిదర్శనమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘వన్ వరల్డ్, వన్ హెల్త్’ సాకారమయ్యేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదిన్నరలో లక్షల మంది కొత్తగా యోగా నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమస్యలెన్ని ఉన్నా, పరిష్కారాలు మనలోనే ఉంటాయనేందుకు యోగా ఉదాహరణ అని కొనియాడారు. ఈ ఏడాది యోగా డే థీమ్‌గా ‘యోగా ఫర్ వెల్నెస్’ను ఎంచుకున్నారు. ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత్ అందించిన బహుమతి ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత బహుమతి యోగా అని రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. కరోనా సమయంలో యోగా మరింత సహాయకారని యోగా డే సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయ సంస్థలు యోగా ఈవెంట్లు నిర్వహించాయి. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద దాదాపు 3వేల మంది జతకూడి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా యోగాను మరింతమందికి చేరువచేయాలని భావించినట్లు ఇండియా కౌన్సిల్‌జనరల్ రణధీర్ చెప్పారు. ఖట్మండూలో ఇండియన్ ఎంబసీ ‘ఆజాదీకాఅమృత్ మహోత్సవ్’ పేరిట నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా యోగాపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించింది. కోయంబత్తూర్‌లో పీపీఈ సూట్లు ధరించిన కొందరు కోవిడ్ పేషంట్లు యోగాసనాలు వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. లడఖ్‌లో ఐటీబీపీ జవాను ఒకరు మంచులో సూర్యనమస్కారాలు నిర్వహించారు. 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ఐరాస ప్రకటించింది. -
mYoga: యోగా యాప్‌ను లాంచ్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూ ఢిల్లీ: ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ mYoga పేరుతో సరికొత్త యాప్‌ను లాంచ్ చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఎంయోగా యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ mYoga యాప్‌లో ఆడియో, వీడియో క్లిప్‌ల సహాయంతో యోగాపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తుందని ఆయూష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఐవోస్ యూజర్లకోసం అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ను ఉపయోగించి 12 నుంచి 65 సంవత్సరాల వయసు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ రకాల ఆసనాలను నేర్చుకోవడానికి, సాధన చేయడానికి 10 నుంచి 45 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో, వీడియో క్లిప్‌లను ఈ యాప్ అందిస్తోంది. ఇంటర్నేషనల్ యోగా డే ను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి . యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. చదవండి: PM Modi: కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణం -
18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
-
గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు
న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు యోగా ఆవశ్యకతను చాటే కార్యక్రమాలను ప్రారంభించాయి. ఇక మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు యోగాసానాలు సాధన చేస్తూ.. దాని గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీబీపీ అధికారి ఒకరు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాన్ని ప్రదర్శించారు. గడ్డకట్టే చలిలో 18 వేల అడుగుల ఎత్తున సూర్యనమస్కారాలు చేశారు. అది కూడా కేవలం షార్ట్ మీదనే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది’’ అంటూ యోగా గొప్పతనాన్ని తెలిపారు. చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి! -
నాలుగు పదుల వయసులోనూ పదహారేళ్లలా 'యోగా' భామలు
యోగా..శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా యోగా వైపే అడుగులేస్తున్నారు. యోగాతో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే చాలామంది హీరోయిన్లు యోగాతో తమ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. నాలుగు పదుల వయసులోనూ పడుచుపిళ్లలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా తయారువుతున్న హీరోయిన్లు యోగా గురించి ఏం అంటున్నారో తెలుసుకుందాం. బాలీవుడ్ హీరోయిన్లలో యోగా క్వీన్ అనగానే గుర్తొచ్చేది శిల్పాశెట్టి. 46ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యోగాపై ఏకంగా ఒక పుస్తకమే రాసేసింది. యోగాతోనే తన డే రొటీన్ మొదలవుతుందని పలుమార్లు చెప్పిన శిల్పా..ప్రతిరోజూ ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. అందుకే ఇప్పటికీ వన్నెతరగని అందంతో సూపర్ ఫిట్‌గా అలరిస్తుంది. యోగా నేర్చుకోవాలనుకునే చాలామంది శిల్పాశెట్టి వీడియోలు ఫాలో అవుతారంటే యోగాపై ఆమెకున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఫిట్నెస్తో యంగ్ హీరోయిన్లకు సైతం సవాలు విసురుతున్న మరో బాలీవుడ్ నటి మలైకా అరోరా. 50కి దగ్గర్లో ఉన్నా నేటికీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. నిత్యం గంటల తరబడి యోగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రియుడు అర్జున్‌కపూర్ చేత కూడా యోగాసానాలు వేయిస్తుంది. యోగాపై అవగాహన కల్పించేందుకు #StartTohKaro అనే ఒక కార్యక్రమం సైతం చేపట్టింది. ఫిట్నెస్ విషయంలో సమంత చాలా శ్రద్ధ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అబ్బాయిలకు సమానంగా బరువులు ఎత్తుతూ తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసిన సామ్..రోజులో కొంత సమయాన్ని యోగా కోసం తప్పకుండా కేటాయించాలని అభిమానులకు సూచిస్తున్నారు. భర్త నాగచైతన్యతో కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. హీరోయిన్ కరీనా కపూర్ ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. ప్రతిరోజూ యోగా తన దినచర్యలో భాగమైపోయిందని చెప్పుకొచ్చింది. అందుకే డెలీవరీ తర్వాత కూడా నిపుణుల సూచనలతో యోగాసనాలు వేస్తూ నేటికీ జీరో సైజ్ కాపాడుకుంటుంది. యోగాతో అందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అలవడుతుందని అంటోంది నటి మంచు లక్ష్మి. ఆమె పన్నెండేళ్లుగా యోగా చేస్తోంది. ప్రతిరోజూ యోగా కోసం కొంత సమయం కేటాయించాలని పేర్కొంటుంది. కూతురు నిర్వాణతో కలిసి ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. యోగాతో మరింత దృఢంగా మారొచ్చని అంటోంది మంచు లక్ష్మి. రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఫిట్నెస్ మీద ఎంతో ఫోకస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ తర్వాత యోగా చేయనిదే వేరే పని చేయదట. ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా యోగా వల్లే తాను కరోనా నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చింది. యోగా దినోత్సవం సందర్భంగా కంజుర్ క్రియతో తన దినచర్యను ప్రారంభిస్తున్నానని పేర్కొంటూ ఆ ఫోటోలను ఇన్స్టాగగ్రామ్లో షేర్ చేసింది. ప్రతిరోజు తన దినచర్యలో యోగా భాగమైపోయిందంటోంది నటి మాధురీ దీక్షిత్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలను షస్త్రర్ చేసిన ఆమె.. నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి అంటూ అభిమానులను ప్రోత్సహించింది. -
నేడు ప్రపంచ యోగ దినోత్సవం
-
PM Modi: కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణం
న్యూఢిల్లీ: ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. దీనిద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చని తెలిపారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి . యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. Addressing the #YogaDay programme. https://t.co/tHrldDlX5c — Narendra Modi (@narendramodi) June 21, 2021 చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది? -
ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా : రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వేలాది ఏళ్ల క్రితమే మన రుషులు ప్రపంచానికి యోగాను అందించారు. లక్షలాది మందికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం, శరీరం, మనస్సు ఐక్యత సాధనం యోగా. ఇది మానవాళికి భారతదేశం ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి. కరోనా వైరస్‌పై పోరులో కూడా యోగా ఎంతో సహాయపడుతుంది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. దైనందిన జీవితంలో యోగాభ్యాసం సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ ఏడాది ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని ఆయన కోరారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు -
International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం
ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఒకటుంది. దానిని తెలుసుకుని, ఆ శక్తిని చేరుకోవడానికి మార్గమే ధ్యానం. ఆ ధ్యానం యోగంలో భాగం. ధ్యానం అంటే మనసులోకి చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండగలరు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానయోగులే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనసు. ఆ మనసు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. అసలు మనం ఏ పని చేయాలన్నా మనస్సు సహకరించనిదే ముందుకు పోలేం. మనస్సును అదుపు చేయడానికి, జయించడానికి ముఖ్య సాధనం ధ్యానం. నీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఆకారాన్ని బట్టే మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు రూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో మనసు తేజోమయమవుతుంది. – డి.వి.ఆర్. మౌనంగా ధ్యానం చెయ్యి. ఈ బాహ్య ప్రపంచపు విషయాలేవీ నీకు అంతరాయం కలిగించకుండా చూసుకో. నీ మనస్సు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి నీకు చింత ఉండదు. మౌనంలో శక్తిని సమీకరించుకుని శక్తిజనక కేంద్రంగా మారు. – స్వామి వివేకానంద -
Yoga Day 2021: దివాణంలో దివ్యౌషధం
రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి, మానసిక దృఢత్వం... ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్–19కు గట్టి విరుగుడుగా చెబుతున్న నాలుగు మాటలు, సహజ పరిష్కారాలు ఇవే! ముందు నుంచీ ఇవి తమలో ఉన్నవారు కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు. వ్యాధి బారిన పడ్డాకయినా... వీటిని పెంచుకుంటే కోవిడ్ నుంచి తేలిగ్గా బయటపడగలరనీ చెబుతున్నారు. అత్యధిక సందర్భాల్లో ఇదే రుజువైంది. కానీ, ఈ నాలుగింటినీ ఇచ్చే ఔషధాన్ని ఇంతవరకు ప్రపంచ వైద్యారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కనుక్కోలేదు. ఔషధ పరిశ్రమలేవీ దీన్ని ఉత్పత్తి చేయలేదు. ఈ నాలుగింటినీ ధారాళంగా అందించే ఒక ప్రక్రియ మాత్రం అయిదువేల ఏళ్ల నుంచే భారతీయులకు అందుబాటులో ఉంది. అదే ‘యోగా’! సనాతన సంప్రదాయం నుంచి, మధ్యయుగాల ఆచరణ ద్వారా, ఆధునిక శాస్త్ర–సాంకేతిక తరం వరకు... అవిచ్ఛిన్నంగా భారతీయ జీవన విధానంలో అవిభాజ్య భాగమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్ల కిందటి ఓ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితిలోనూ గుర్తింపు దక్కింది. ఫలితంగా 177 సభ్య దేశాల మద్దతుతో, మనం ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొంది, 2015 నుంచి ఏటా జూన్ 21, ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’గా జరుగుతోంది. భవిష్యత్ కార్యక్రమాల్లో యోగానొక భాగంగా యూఎన్ నిర్ణయించింది. కోవిడ్ కష్టకాలంలో యోగ ప్రాధాన్యతను అందరూ గుర్తిస్తున్నారు. ‘అందరి అభ్యున్నతికి యోగ’ ఈయేడు ప్రాధాన్యతగా యూఎన్ ప్రకటించింది. ‘ఇంటి వద్దే యోగ, కుటుంబ సభ్యులందరితో కలిసి’ అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. అవగాహన లేమి వల్ల చాలా మంది ‘యోగ’ను పరిమితార్థంలో చూస్తారు. ఏవో రెండు ఆసనాలో, శ్వాస కసరత్తులనో యోగగా భావిస్తారు. కానీ, స్థూలార్థంలో ఇదొక పటిష్టమైన జీవన ప్రక్రియ. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ‘యోగ’ అంటే (విడిపోవడమనే ‘వియోగ’ శబ్దానికి వ్యతిరేకార్థం) కలిపి ఉంచడం. శరీరం, మేధ, మనసు... ఈ మూడింటినీ ఒకే మార్గంలోకి తెచ్చి, మనిషిలోని అంతఃశక్తుల్ని గరిష్టంగా ఉద్దీపించే ప్రక్రియే యోగ! మూలాలు పరిశోధించి, సాధన పద్ధతుల్ని క్రోడీకరించి పతంజలి మహర్షి ‘అష్టాంగయోగ’ను వేల ఏళ్ల కిందటే రూపొందించారు. ‘పతంజలి’ కూడా ఒకరు కాదని, వేర్వేరు కాలాల్లో తమ నైపుణ్యాల్ని సమాజహితంలో (క్రీ.పూ 500 నుంచి క్రీ.శ 400) ప్రదర్శించిన ఇద్దరు ముగ్గురు రుషితుల్యులని చరిత్రకారుల ఉవాచ. ‘యమ’ (నైతికాంశాలు), ‘నియమ’ (ప్రవర్తన కట్టుబాట్లు), ‘ఆసన’ (శరీర పటిష్టత), ‘ప్రాణాయామ’(శాస్వ నియంత్రణ), ‘ప్రత్యాహార’(ఇంద్రియ నిగ్రహం), ‘ధారణ’(ఏకాగ్రత), ‘ధ్యాన’(నిమగ్నత), ‘సమాధి’(అన్నీ అదుపులోకి తెచ్చిన ఉన్నతస్థితి)... వీటన్నింటినీ కలిపి అష్టాంగయోగగా చెబుతారు. మనిషి ఇవి సాధన చేసి, పరిపూర్ణ జీవితం గడపాలనేది లక్ష్యం. గౌతమ బుద్దుడి ‘అష్టాంగిక పథం’ కూడా ఇటువంటిదే! ఆ మహనీయుల పథనిర్దేశంలోనే మనిషి జీవిత ముఖ్యసారముందని జాతిపిత మహాత్ముడు, రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డా.అంబేడ్కర్లు గట్టిగా విశ్వసించారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న కాలంలోనూ.. ప్రాణాంతకమైన అనూహ్య సూక్ష్మ జీవుల నుంచీ సదరు జీవనశైలి రక్షణ కల్పిస్తోంది. శతృదుర్భేధ్యమైన ఓ కోటలా శరీరాన్ని తీర్చిదిద్దుతుందీ యోగ! ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కలవరపాటు, మానసిక ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది. మనిషిని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంచడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ పెంచి మానసిక దృఢత్వంతో వ్యవహరించేలా చేస్తుంది. ‘ప్రాణాయామం’ శ్వాసమీద ధ్యాస నిలిపేలా చేస్తుంది. పద్దతిగా ఉశ్ఛ్వాస–నిశ్ఛ్వాస క్రియల సాధన ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఈ అవసరాన్ని, ఓ గుణపాఠంగా చెప్పింది కరోనా! మెదడు, శరీరం, ఆత్మ ఒకే వరసలోకి వచ్చి ఏకీకృత శక్తిగా మారి, మనిషి తనను తాను సమగ్రంగా తెలుసుకుంటాడని విశ్లేషకులంటారు. ఫలితంగా స్వీయ అవగాహన పెరిగి, ప్రాపంచిక అంశాల పట్ల సమ్యక్ దృష్టి, తనకు తాను సమస్థితి మనిషి సాధిస్తాడనేది విశ్వాసం. ప్రకృతిని వికృతం చేస్తున్న మానవ తప్పిదాల వల్లే పర్యావరణం పాడవుతోంది. పలు విపరిణామాలొన్నాయి. వేగంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ ప్రభావంతో మున్ముందు ఇంక చాలా వైరస్లు దాడి చేస్తాయనే అధ్యయనాల నేపథ్యంలో... ఎన్నో సమస్యలకు ‘యోగ’ ఒక దీర్ఘకాలిక పరిష్కారం! జబ్బులనే కాక జీవితంలో దారితప్పిన క్రమతనూ సరిదిద్దే శక్తి యోగాకు ఉంది. ‘యోగా ఒక కాంతి ప్రజ్వలనం. ఒకసారి వెలిగితే ఆరిపోయేది కాదు. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత వెలుగు’ అన్న యోగాచార్యుడు బి.కె.ఎస్ అయ్యంగార్ మాటలు అక్షర సత్యాలు. సాధన చేస్తే, మనిషి దివాణంలో సర్వవేళలా అందుబాటులో ఉండే దివ్యౌషధం ఈ యోగా! దీనికోసం జాతి మరింత జాగృతం కావాలి. నవతరం యువత తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోగలిగితే... శారీరకంగా, మానసికంగా తలెత్తే భవిష్యత్ సవాళ్లను వారు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. తట్టుకొని నిలువగలుగుతారు. -
International Yoga Day: ప్రపంచ గురువుగా భారత్
నిరంతరం ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతున్నాయి. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఔషదమే యోగా. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మనదేశమే. క్రీస్తు పూర్వమే పతంజలి మహార్షి యోగాను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత భారత దేశం నుంచి ఉద్భవించిన హిందూ, జైన, బౌద్ధ , సిక్కు మతాలు యోగాకు ప్రత్యేక స్థానం కల్పించాయి. 20వ శతాబ్ధం తర్వాత ఆరోగ్య పరిరక్షణలో యోగా ఒక భాగంగా చేసుకుంటున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. యోగాకు సంబంధించి ప్రపంచానికే భారత్ గురువుగా ఉంది. 2,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్నా కొన్ని వర్గాలకే అది పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే యోగాకు పెద్దపీట వేశారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగానే సన్మార్గమంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగా ప్రాధాన్యం గురించి ఆయన ప్రసగించారు. ఆ తర్వాత భారత ప్రధాని చూపిన చొరవతో, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కు పైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రాక్టీస్ చేసే ఎందరో ఈ రోజు జరిగే వేడుకల్లో భాగం అవుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో క్రమంగా యోగాకు ప్రాచుర్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో యోగాను ఆచరిస్తున వారి సంఖ్య క్రమ క్రమంగా పెంజుకుంటోంది. వివిధ వ్యాయామాల సమాహారమే యోగ. ఈ ప్రక్రియను నిత్యం ఆచరించడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. యోగాలోనే ఒక భాగమైన హఠయోగాన్ని నేర్చుకుంటే వందల ఏళ్లు బతకొచ్చంటూ యోగాపై అపార అనుభవం ఉన్న వారు చెబుతుంటారు. పవాహారిబాబా నుంచి స్వామి వివేకనంద వరకు హఠయోగం నేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. -
Yoga: డిప్రెషన్‌కు ఔషధ యోగం!
యోగా ఎంత మంచిదో ఇప్పటికీ మనకందరికీ తెలుసు. అంతేకాదు... పరిశోధనలూ, అధ్యయనాలూ జరుగుతున్న కొద్దీ మన యోగా తాలూకు ప్రాముఖ్యం కొత్త కొత్త విషయాలతో మాటిమాటికీ ప్రపంచానికి తెలియవస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరోసారి కొత్తగా పాశ్చాత్యుల పరిశోధనల్లో సైతం యోగా గురించి మరో అంశం తాజాగా వెలుగుచూసింది. గర్భం ధరించిన యువతుల్లో అనేక హార్మోన్ల మార్పుల వల్ల భావోద్వేగాల మార్పులు (మూడ్ స్వింగ్స్) సాధారణం. అయితే ప్రతి ఐదుగురు గర్భవతులను పరిశీలిస్తే... వారిలో ఒకరికి ఈ మార్పులు చాలా తీవ్రంగా కనిపిస్తుంటాయి. ఇటీవల మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంతో ఈ మూడ్ స్వింగ్స్కు ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపిస్తోంది. గర్భవతుల్లో ఒత్తిడిని ఎంత ఎక్కువగా తగ్గించగలిగితే... మూడ్ స్వింగ్స్ తీవ్రత అంతగా తగ్గుతుందని పరిశోధక బృందం తెలుసుకున్నారు. మూడ్ స్వింగ్స్ కారణంగా కలిగే డిప్రెషన్ లక్షణాల (డిప్రెసివ్ సింప్టమ్స్) ను నివారించేందుకు ఒత్తిడిని తొలగించేలా స్ట్రెస్ బస్టర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న మారియా ముజిక్ మాట్లాడుతూ ‘‘భారతీయుల యోగా మంచి స్ట్రెస్ బస్టర్ అని మనం గతంలోనే విని ఉన్నాం. అయితే అప్పట్లో దీన్ని పూర్తి తార్కాణాలతో నిరూపించేలా పరిశోధన ఫలితాలేమీ లేవు. దాంతో వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాలను రికార్డు చేసే పనిలో పడ్డాం. ఈ పనిలో మాకోవిషయం తెలియవచ్చింది. గర్భవతులు అనుసరించదగిన ఆరోగ్యకరమైన, సురక్షితమైన యోగా ప్రక్రియలతో అటు తల్లికి, ఇటు బిడ్డకు మేలు జరుగుతుందని మా అధ్యయనంలో తేలింది’’ అన్నారు. కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం చాలా సాధారణం. అయితే వీటికి చికిత్స చేయకుండా అలాగే వదిలేయడం వల్ల తల్లికీ, బిడ్డకూ హాని చేకూరడానికి అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీ, బిడ్డా బరువు కోల్పోవడం, ప్రీ ఎక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్పు కావడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అయితే గర్భవతులు పాటించదగిన సురక్షితమైన యోగా ప్రక్రియలు ఇలాంటి దుష్పరిణామాలను నివారించడమే గాక... తల్లికీ, బిడ్డకూ మధ్య మంచి ప్రేమానురాగాలను కూడా మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో 1226 మంది గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ఆమెకు సముద్రమే అన్నం ముద్ద -
డ్యాన్స్ ఆఫ్ యోగా... ఇమ్యూనిటీ పెంచే ఐస్‌క్రీమ్
సాక్షి, సిటీబ్యూరో: సంప్రదాయ నృత్యశైలులను యోగాతో మేళవించడం అంటే అది ఆరోగ్యం ఆనందాల మేళవింపేనని ప్రముఖ నృత్యకారిణి యశోదా థాకూర్ అన్నారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో ‘ది డ్యాన్స్ ఆఫ్ యోగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో యశోదా థాకూర్ మాట్లాడుతూ యోగా స్వచ్ఛమైన ఆలోచనల్ని తద్వారా కైవల్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందని పతంజలి యోగా చెబుతోందని, అలాగే నాట్యం ట్రాన్స్‌లోకి తీసుకెళుతుందని దీని అర్థం ఇవి రెండింటి వల్ల కలిగేది దాదాపుగా ఒకే రకమైన స్థితిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని యోగా, నాట్య భంగిమలపై ప్రదర్శన సహితంగా వివరించారు. కార్యక్రమంలో ఫిక్కి ఎఫ్ఎల్ఓ చైర్ పర్సన్ ఉషారాణి మన్నె పాల్గొన్నారు. ఇమ్యూనిటీ పెంచేఐస్క్రీమ్ ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ డైరీ డే..సరికొత్త ఐస్‌క్రీమ్‌ను సిటీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. డైరీ డే ప్లస్ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఐస్‌క్రీమ్ ప్రస్తుత పరిస్థితిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ప్రత్యేకమైన ముడిదినుసులతో తయారైందని వివరించారు. హైదీ (టర్మరిక్) ఐస్‌క్రీమ్, చ్యవన్‌ప్రాశ్ ఐస్‌క్రీమ్ పేరుతో 2 ఫ్లేవర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు యోగాతో పాటు ఆల్మండ్స్... రోగనిరోధక శక్తి పెంచడంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ఆహారం అంతే ముఖ్యమని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాయామాల్లో యోగా ఉత్తమమైనదని, ఆహార పదార్థాల్లో బాదం ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరవాసులు ఆహారంలో ఆల్మండ్స్ని విరివిగా వినియోగించేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించామన్నారు. దీనిలో సూపర్ మోడల్, ఫిట్నెస్ నిపుణుడు మిళింద్ సోమన్, బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌లతో పాటుగా న్యూట్రిషన్, వెల్నెస్ కన్సెల్టెంట్ షీలా కృష్ణస్వామి తదితర ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
రోజూ సాధన చేస్తే యోగమే..
ఫ్యాషన్ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల పాటు వెలిగిన మాలిని రమణి ఫ్యాషన్ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురువుగా మారింది.ఇక యోగా గురువుగానే ఉండిపోతానంటోంది మాలిని. గోవాలోని ఈ డిజైనర్ ఫ్యాషన్హౌస్లు ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఇంకా తెరుచుకోవడం లేదు. డిజైనింగ్‌కు అవసరమైన మెటీరియల్‌కు తగిన షాపులు తెరవకపోవడం, టైలర్లు అందుబాటులో లేకపోవడంతో డిజైనింగ్ నుండి మాలిని దూరమైంది. ఇప్పుడు యోగా గురువుగా కొత్తగా ఏదో ఒకటి చేస్తూ తన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. ‘ప్రస్తుతం కరోనా యుగంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో బయటకు వెళ్లలేం. పార్టీకోసం అందమైన దుస్తులను రూపొందించడానికి ఇది సమయమూ కాదు. అందుకే యోగాను ఎంచుకున్నాను’ అంటోంది మాలిని. అంతర్జాతీయ గుర్తింపు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం, 2000 సంవత్స రంలో రమణి తన కెరీర్‌ను ఇండియన్ ప్రిన్సెస్ కలెక్షన్‌తో ప్రారంభించింది. ఇరవై ఏళ్ళలో ఆమె ఫ్యాషన్‌హౌస్ విదేశీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. ఈ ప్రసిద్ధ డిజైనర్ ప్రముఖ ఖాతాదారులలో బాలీవుడ్, టాలీవుడ్ తారలూ ఉన్నారు. సారా జేన్ డియాజ్, తమన్నా భాటియా, శిల్పా శెట్టి, తాప్సీ పన్నూ, ఇషా గుప్తా, నర్గిస్ ఫఖ్రీ.. వంటివారెందరో ఉన్నారు. పారిస్ నటి మీడియా పర్సనాలిటీ హిల్టన్ మాలిని రూపొందించిన చీరను ధరించడంతో అంతర్జాతీయ శైలి ఐకాన్‌గా గుర్తింపు పొందింది. ఆరేళ్ల వయసులోనే యోగాభ్యాసం.. ఆరేళ్ల వయసులో తన తల్లి యోగా పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన నాటి నుంచి మాలిని యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ పుస్తకంలో పేర్కొన్న యోగాసనాలను సరదా సరదా భంగిమలతో సాధన చేయడం ప్రారంభించింది. ‘ఒక విద్యార్థి నుంచి యోగాగురువుగా మారే ప్రయాణం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింద’ని మాలిని చెబుతుంది. భావోద్వేగాల అదుపు యోగాను రోజూ సాధన చేస్తే యోగమే అంటున్న మాలిని రమణి యోగా నిపుణులు గుర్ముఖ్ ఖల్సా నుండి శిక్షణ తీసుకుంది. తన గురువు గుర్ముఖ్ గురించి చెబుతూ‘ఆమె నుండి యోగా నేర్చుకున్న అనుభవం అద్భుతమైనది. యోగాతో నా భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నాను. యోగాలో ధ్యానానికి అత్యున్నత హోదా ఉంది. నా జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడంలో యోగా ప్రధాన పాత్ర పోషించింది. యోగ ప్రతిపనిని సరిగ్గా చేయటానికి నాకు బలాన్ని ఇస్తుంది. ఇక నుంచి యోగానే శ్వాసిస్తూ, యోగాలో శిక్షణ ఇస్తూ.. యోగా గురువుగా ఉండిపోతాను’ అని చెబుతోంది కరోనా ఎందరి జీవితాలనో మార్చబోతోంది. చేస్తున్న పనులను ఆపేసి కొత్తమార్గాన్ని సృష్టిస్తోంది. ఆ మార్గం అందరినీ ఆరోగ్యం వైపుగా మళ్లించడానికి సిద్ధమవడం సంతోషకరం. -
కరోనాపై యోగాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జనం ప్రాణాలను బలిగొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగా అవసరం గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా బాధితులు ఆరోగ్యవంతులుగా మారడానికి యోగా దివ్యౌషధంగా పని చేస్తుందని తెలిపారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలకు సందేశమిచ్చారు. దాదాపు 15 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనా ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ప్రాణాయామంతో శ్వాస వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఐక్యం చేసే చోదకశక్తిగా యోగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని వివరించారు. యోగాకు జాతి, కులం, వర్ణం, లింగభేదం, నమ్మకాలతో సంబంధం లేదన్నారు. ఎవరైనా యోగా సాధన చేయొచ్చన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం యోగాతో సాధ్యమని చెప్పారు. ప్రాణాయామం.. నిత్య జీవితంలో భాగం ‘‘శరీరంలో బలమైన రోగ నిరోధక శక్తి ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రాణాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రపంచంలో చాలామంది కరోనా బాధితులు యోగాతో ఉపశమనం పొందారు. కరోనాను ఓడించే శక్తి యోగాకు ఉంది’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘‘సరైన ఆహారం తీసుకోవడం, సరైన క్రీడల్లో పాలుపంచుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా యోగా చేయడమే’’ అని పేర్కొన్నారు. ఒక కుటుంబంగా, ఒక సమాజంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఔత్సాహికులు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల ఈసారి చాలా దేశాల్లో డిజిటల్ వేదికలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా, చైనా, యూకే, టర్కీ, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్ తదితర దేశాల్లో జనం యోగాసనాలు వేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ఉద్యోగులు, భారతీయులు పాలుపంచుకున్నారు. -
యోగా దినోత్సవంలో సీఎం పాల్గొనాల్సిన అవసరం లేదా?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్ర సీఎం కేసీఆర్ పాల్గొనాల్సిన అవసరం లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ యోగా భారత దేశ వారసత్వ సంపద అని, దీన్ని యా వత్ ప్రపంచం అనుసరించడం మోదీ ఘనత అని పేర్కొన్నారు. -
నిప్పుల గుండంలో యోగా చేసిన ఎంపీ
జైపూర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్ బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనాపురియా వినూత్నంగా ఆసనాలు వేసి అందరి దృష్టి ఆకర్షించారు. తన చుట్టూ అగ్ని వలయాన్ని నిర్మించుకొని అందులో యోగా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్యాంక్ - సవై మధోపూర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ సుఖ్బీర్ సింగ్ అగ్నివలయంలో అర్థనగ్నంగా కూర్చొని ‘ఓం నమః శివాయ’ అని స్మరిస్తూ యోగా చేశారు. అనంతరం ఒంటి నిండా బురద మట్టిని రుద్దుకొని శవాసనం వేశారు. మట్టి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఎంపీ పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా యోగా దినోత్సవాన్ని ఇంటివద్దే జరుపుకున్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి' పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ సైతం వర్చువల్‌గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా చేయడం వల్ల ఉల్లాసం, మనోధైర్యం, మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపసమనం పొందవచ్చని అన్నారు. ప్రపంచం మొత్తం యోగాను గుర్తించిందన్నారు. -
యోగా సీక్రెట్ చెప్పిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : యోగాను క్రమం తప్పకుండా అభ్యసించే వారికి కరోనా వైరస్ ముప్పు తక్కువని కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా కరోనాతో పోరాటం చేయటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగా దినోత్సవానికి విశేషమైన స్పందన వస్తోంది. ప్రజలందరూ ఇంట్లో ఉంటూనే యోగాను చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నట్లయితే 20 మంది కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేశాము. ( యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: మోదీ) యోగాతో మన శరీరంలో జరిగే వాటిని నియంత్రించవచ్చు, ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యకర అలవాట్లను అలవర్చుకుంటూనే ఇంట్లో యోగా అభ్యసించాలనే దానిపై దృష్టి సారించాము. ఈ యోగా దినోత్సవం సందర్బంగా అందరూ ప్రతి రోజూ ఓ గంట పాటు యోగా చేసేందుకు ప్రతినబూనాలి’’ అని అన్నారు. -
యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఒకే సమయంలో ప్రశాంతత, బలాన్ని ప్రసాదించే విశేషమైన శక్తి యోగాకు ఉందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రజలు ఈ పురాతన అభ్యాసాన్ని తమ జీవితంలో భాగం చేసుకునేలా ప్రతినబూనాలని కోరారు. ( తమిళనాట జగనన్నకు జై ) అంతకు క్రితం ఆయన భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నంపై విచారం వ్యక్తం చేశారు. ‘ఇది మనం ఐక్యతను, మన సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయం. అంతేగానీ.. ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు చాలా ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారు. ఈ విషయమై జాతి యావత్తు ఏకతాటిపై నిలబడాలి. ఐక్యత బలాన్ని ఇస్తుంది. విభజన బలహీనతను ప్రదర్శిస్తుంది’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ( యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: ప్రధాని మోదీ) Yoga has the distinctive power to manifest tranquility and strength at the same time. It heals not only the body, but also the spirit. On, #InternationalYogaDay, let us pledge to make this age-old practice an integral part of our lives. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2020 -
యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: మోదీ
న్యూఢిల్లీ : యోగా సాధన వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవచ్చని ప్రధానీ నరేంద్ర మోదీ తెలిపారు. యోగాతో శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ఆది వారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా చేయడం వల్ల ఉల్లాసం, మనోధైర్యం, మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపసమనం పొందవచ్చని అన్నారు. ప్రపంచం మొత్తం యోగాను గుర్తించిందన్నారు. కరోనా దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని తెలిపారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్ అవలంభించిన యోగాను ప్రపంచం మొత్తం అనుసరిస్తోందని అన్నారు. చదవండి : శాస్త్రవేత్తలకూ అంతుపట్టని యోగాసనాలు -
వీరు.. ఆసనం పేరేంటో చెప్పవా?
ఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వినూత్న ఆసనంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. వీరు చేసింది ఏంటో తెలియదు గాని అతన్ని పరిశీలిస్తే మాత్రం మొకాళ్ల కిందకు తన చేతులు పెట్టి కేవలం పాదాల సాయంతోనే హాల్ ఆవరణలో నడవడం ఆరంభించాడు. పాపం సెహ్వాగ్ ఇది చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఏమో కాని వెంటనే ఈ వీడియోనూ ట్విటర్లో షేర్ చేశాడు. ' కచ్చితంగా ఇది యోగా అని చెప్పలేను కానీ దానికి కొంత సమయం పడుతుంది' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం సెహ్వాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'వీరు నువ్వు చేసిన ఆసనం పేరేంటో తెలియదు కానీ నువ్వు చాలా కష్టపడ్డావు'.. ' నీ కష్టానికి ఇవే మా జోహార్లు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (మొర్తజాకు కోవిడ్ పాజిటివ్) -
శాస్త్రవేత్తలకూ అంతుపట్టని యోగాసనాలు
మన భారతీయ ప్రాచీన ఆరోగ్య విద్య యోగా ద్వారా కరోనాను అల్లంత దూరంలో ఉంచడం సాధ్యమే అంటున్నారు సాధకులు! అంతర్జాతీయ యోగా దినోత్సవమైన ఈ రోజు (జూన్ 21, ఆదివారం)న ఒక్కసారి.. ఆధునిక సైన్స్ కూడా నిర్ధారించిన యోగాసన ప్రయోజనాలు ఏమిటో?.. కరోనాను అడ్డుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో చూద్దామా? జూన్ 21.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతి ఇనుమడించే రోజిది. దేశదేశాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని కోట్లమంది యోగాసనాలు ఆచరించే రోజు. ప్రాచీన భారతీయ సంస్కృతిని కొనియాడే రోజు. ఆరేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించింది మొదలు ఏటికేడాది దీని ప్రాభవం, ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నాయి. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ యోగా దినోత్సవాలకు పిలుపునివ్వడం ఒక విశేషమైతే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని గుర్తించి అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని కోరడం ఇంకో విశేషం. అయితే ప్రస్తుత కరోనా కష్టకాలంలో మునుపటిలా బహిరంగంగా యోగాసనాలు వేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ.. వర్చువల్ యోగా దినోత్సవాలకు మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. (కోటి మంది యోగా చేస్తారు) ‘‘ఆరోగ్యం కోసం యోగా.. ఇంట్లోనే యోగా’’ అనే ఇతివృత్తంతో ఈ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్‌తో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ వీడియో బ్లాగింగ్ పోటీని కూడా ఏర్పాటుచేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో కలిసి యోగా’ పేరుతో ఇప్పటికే ప్రచారం చేపట్టింది. ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు దూరదర్శన్ చానల్లో ఓ యోగ సాధన కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అలాగే మైసూరు జిల్లా యంత్రాంగం, ఇంటర్నేషనల్ నేచురోపతి ఆర్గనైజేషన్లు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఉదయం ఏడు గంటలకు యోగాభ్యాసం మొదలుకానుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అమెరికాలోని టెక్సాస్‌తోపాటు అనేక ఇతర రాష్ట్రాల వారికి యోగా పాఠాలను బాబా రామ్‌దేవ్ ఆన్లైన్ ద్వారా అందించనున్నారు. హ్యూస్టన్‌లోని భారతీయ కౌన్సిల్ జనరల్ ఉదయం పది గంటలకు రెండు గంటల లైవ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టెక్సాస్‌లోని సాన్‌ఆంటోనియోలో రోజంతా యోగథాన్ జరగనుంది. నెదర్లాండ్స్ పోలీస్ విభాగం కూడా ఆన్లైన్ మాధ్యమంలో యోగాసనాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం. సైన్స్ చెప్పే యోగా లాభాలు... మానసిక ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిసోల్ మోతాదులను తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం వంటివాటిని కలిపి యోగా ఆచరిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడును శాంతపరిచేందుకు ఉపయోగపడే సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి మనో వ్యాకులతకూ యోగా మంచి మందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాగుడు వ్యసనాన్ని మాన్పించేందుకు జరిపిన ఒక కార్యక్రమంలో సుదర్శన క్రియ యోగాను అభ్యాసం చేయించినప్పుడు వారిలో మనో వ్యాకులతకు సంబంధించిన లక్షణాలు బాగా తగ్గిపోయాయి. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. వారానికి కనీసం రెండు రోజుల చొప్పున రెండు నెలలపాటు యోగా కొనసాగిస్తే మానసిక ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందో మాత్రం శాస్త్రవేత్తలకూ అంతుపట్టకపోవడం గమనార్హం. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా కూడా తోడైతే గుండె జబ్బులు సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగాభ్యాసం చేసే వారి రక్తపోటు, పల్స్ రేట్ ఇతరుల కంటే తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేయగా గుండెజబ్బులు ముదరకుండా కూడా యోగా రక్షణ కల్పిస్తుందని ఇంకో పరిశోధన ద్వారా తెలుస్తోంది. నిస్సత్తువ, భావోద్వేగాలను మెరుగుపరిచేందుకు యోగా మేలైన మార్గమని పరిశోధనలు చెబుతున్నాయి. 135 మంది వయోవృద్ధులపై జరిగిన ఒక పరిశోధనలో యోగాభ్యాసం చేసే వారి జీవన నాణ్యత ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకూ యోగా పనికొస్తుంది. కీమోథెరపీ చేయించుకున్న వారు యోగా సాధన చేస్తే వాంతులు, తలతిరుగుడు వంటి దుష్ఫలితాలు తగ్గుతాయని, నొప్పి తగ్గడమే కాకుండా చురుకుదనమూ పెరుగుతుందని తేలింది. అలాగే హాయిగా నిద్రపోవాలన్నా యోగా ప్రాక్టీస్ చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మనో వ్యాకులత వంటి లక్షణాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న వారు యోగాభ్యాసం మొదలుపెట్టిన తరువాత ఎంతో ఉపశమనం పొందారని 2005 నాటి అధ్యయనం ఒకటి చెబుతోంది. సుఖనిద్రకు కారణమైన మెలటొనిన్ హార్మోన్ అధికోత్పత్తికి యోగా కారణమవుతుందని అంచనా. రోగ నిరోధక శక్తికి ఆరు ‘యోగాలు’ ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధకశక్తిని కాపాడుకోవచ్చు. సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసన, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి ఆరు యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సలంబ భుజంగాసనం సలంబ భుజంగాసనం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బొక్కబోర్లా పడుకుని నడుము పైభాగాన్ని నిటారుగా ఉంచడం ఈ ఆసనంలోని ముఖ్యాంశం. ఈ క్రమంలో ముంజేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ముక్కు ద్వారా ఊపిరిపీల్చాలి. నోటి ద్వారా వదలాలి. పరివృత్త ఉత్కటాసనం పరివృత్త ఉత్కటాసనం సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, జీర్ణావయవాలను మెలితిప్పడం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. కాళ్లను కొద్దిగా వంచి చేతులు జోడించి నడుము భాగాన్ని ఒకవైపునకు తిప్పి పైకి చూడటం ఈ యోగాసనంలో కనిపిస్తుంది. మోచేతులను తొడలకు తాకుతూ ఉండాలి. సాధారణ స్థితికి వచ్చే సమయంలో ఊపిరి వదలాలి. అనువిత్తాసనం అనువిత్తాసనం.. ఇది శరీరంలోని కొన్ని గ్రంథులను శుద్ధి చేస్తుంది. శ్వాసవ్యవస్థను చైతన్యపరిచేందుకూ ఈ యోగాసనం పనికొస్తుంది. నడుము కింది భాగంలో రెండు చేతులు ఉంచుకుని వీలైనంత వరకూ వెనక్కి వంగడమే ఈ అనువిత్తాససనం. ఊపిరి తీసుకుంటూ వెనక్కి వంగడం.. అదే స్థితిలో కొంత సమయం ఉండటం ఆ తరువాత ఊపిరి వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం ఈ ఆసన క్రమం. -
కోటి మంది యోగా చేస్తారు
న్యూఢిల్లీ: ఆదివారం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దాదాపు కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తాను సూర్య నమస్కారం, పురాణఖిల ఆసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ‘ఇంటి వద్ద యోగా.. కుటుంబంతో కలసి యోగా’ అనే ఇతివృత్తంపై యోగా కార్యక్రమలు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రూపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భారీస్థాయిలో జనంతో యోగాసనాలతో జరిగే యోగా దినోత్సవం ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా డిజిటల్ రూపంలో జరగనుంది. -
ప్రపంచానికి సంజీవని యోగా
ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా చూపిన చొరవతో, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్ 11న ఆ సంస్థ తీర్మానించింది. ఈ తీర్మానం అద్భుతం అనిపించుకోవడానికి కారణం దానికిగల సార్వత్రిక స్వభావం. పైగా యోగాకు ఇప్పుడు యావత్ ప్రపంచ ఆమోదం కూడా లభించింది. ఈ తీర్మానంతో, భౌగోళికంగా విడిపోయి ఉన్న ప్రపం చం.. యోగాతో ఐక్యతవైపు మళ్లిందన్నది వాస్తవం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కుపైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించడమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన ఏ తీర్మానానికి కూడా ఇంత అత్యధిక సంఖ్యలో సమర్థన లభించకపోవడం విశేషంగా భావించాలి. పైగా ఐక్యరాజ్యసమితిలో ఒక దేశం ప్రతిపాదన ప్రవేశపెట్టి, దాన్ని 90 రోజుల్లోగా సాకారం చేసుకోగలగడం కూడా సర్వసభ్య సమావేశాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం మరీ విశేషం. ముఖ్యంగా ‘5,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగా’కు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కలిగించే దిశగా దేశంలో ఇన్ని దశాబ్దాలుగా ఎన్నడూ ప్రయత్నమే జరగలేదు. అలాంటి పరిస్థితిలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే ఈ అద్భుతం సాధించారు. ఆరోగ్యం–శ్రేయస్సు దిశగా మానవాళి ఆకాంక్షకు యోగా ఒక ప్రతీక అని ఆయన చక్కగా వివరించారు. పైగా పైసా ఖర్చులేని ఆరోగ్యధీ(బీ)మా లభిస్తుందని చాటారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగా మార్గం చూపించిందన్నారు. ‘‘యోగా ఒక మతం కాదు... శ్రేయస్సు. అది యవ్వనోత్సాహంతో కూడిన మనస్సు,శరీరం, ఆత్మల నిరంతర అనుసంధాన శాస్త్రం’’. మానవాళి శాంతిసామరస్యాలను ప్రతిబింబించే సందేశాన్ని ప్రపంచానికి యోగా అందిస్తుంది. ఇది ‘ఆత్మనుంచి ఆత్మవైపు, ఆత్మద్వారా పయనం.’ ‘‘పతంజలి యోగ సూత్రం’’ పేరిట పతంజలి మహర్షి రూపొందించిన గ్రంథం జగత్ప్రసిద్ధం. అలాగే భగవద్గీత, ఉపనిషత్తుల వంటి ప్రసిద్ధ హిందూ గ్రంథాల నుంచి యోగా–యోగాభ్యాసాల సారాంశాన్ని అనువదించిన ఘనత శ్రీ అరబిందోకు దక్కింది. ఇక బి.ఎస్.అయ్యంగార్, మహర్షి పరమహంస యోగానంద వంటివారు ఈ యోగా జ్ఞానా న్ని ప్రపంచవ్యాప్తం చేసి గౌరవాదరాలు పొందారు. ఆ మేరకు వారు ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారానే గాక తమ క్రమశిక్షణ, ప్రేరణాత్మకమైన జీవనశైలి ద్వారా ప్రపంచమంతటా యోగాను విస్తృతంగా వ్యాప్తి చేశారు. పాశ్చాత్య దేశాలలో యోగా ఘనతను, ప్రాముఖ్యాన్ని గొప్పగా చాటిన భారతీయులలో స్వామి వివేకానంద అగ్రగణ్యుడుగా ఘనత పొందారు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాం తం, యోగా వంటి భారతీయ తత్వశాస్త్రాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆయ నే. భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై ఆయన వాగ్ధాటి షికాగోలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచీకరణవల్ల విశేషంగా విజయవంతమైన అంశాల్లో యోగా కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది మానవాళి చైతన్యం, శ్రేయస్సుకు సంబంధించి అత్యంత విస్తృతంగా నిర్వహించుకునే వేడుకగా మారింది. ప్రాంతాలు, మతాలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నేడు ఆరోగ్యం–ఆనందం కీలకాంశాలుగా భిన్నధోరణులు గల ప్రపంచాన్ని ఒక్కతాటి పైకి చేరుస్తున్న అత్యంత విజయవంతమైన సంధానకర్త ఇదే. భిన్న ధ్రువాల ప్రపంచంలో కుటుంబం, సమాజం, దేశాలను ఐక్యం చేయగల బలమైన శక్తి యోగా. పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా వినియోగంలో ఉన్న అనుబంధ ఆరోగ్య విధానంగా యోగా వెలుగొందుతోంది. అంతేకాకుండా యోగాతో తమ జీవితాలకు సమకూరే లబ్ధి గురించి కూడా ప్రపం చం నేడు తెలుసుకుంటోంది. యోగాతోపాటు ధ్యానం చేయడంవల్ల వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయవచ్చని, అనేక వ్యాధుల బారినుంచి రక్షణ లభిస్తుందని అమెరికా జాతీయ వైద్య గ్రంథాలయం ప్రచురించిన నివేదిక పేర్కొనడం ఇందుకు నిదర్శనం. యోగాభ్యాసంతో వ్యక్తుల మానసిక వికాసంతోపాటు జీవితకాలం కూడా పెరుగుతుంది. యోగా భౌతికంగా ఆరోగ్యం బాగుపడటానికేగాక భావోద్వేగపరమైన, మానసిక శ్రేయస్సుకూ దోహ దం చేస్తుంది. ఇది మీ జీవిత కాలానికి మరిన్ని సంవత్సరాలను జోడించడమేగాక ఆ సంవత్సరాలకు జీవాన్ని కూడా జోడిస్తుంది. శరీరంలో రోగనిరోధక కణాల ప్రసరణను ప్రోత్సహించే పరమాణు మార్పులకు యోగా సాధన దోహదం చేస్తుందని పరిశోధనల ఫలితాలు పేర్కొంటున్నాయి. యోగా మనోభారాన్ని తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఆరోగ్యం, వ్యాయామ విద్యలో యోగా విడదీయలేని అంతర్భాగంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి నేటి ప్రపంచం సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యోగా కేవలం బోధనాత్మక విద్యలోనే కాకుండా ‘అనుభవపూర్వక అభ్యాసం’లో కూడా భాగమవుతోంది. యోగాను ఒక అధికారిక క్రీడగా అమెరికా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఒలింపిక్స్‌లో పోటీపడే ఒక క్రీడగా కూడా యోగా మారగలదనే చర్చ కూడా సాగుతోంది. కోవిడ్–19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో నేడు హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకూ.. సామాన్యుల నుంచి మాన్యులదాకా అందరూ యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలను శ్రద్ధగా గమనించారు. నేను స్వయంగా హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్ వాసిని. ఈ ప్రాంతం యోగా, ఆయుర్వేదాలకు పుట్టినిల్లు. వైరస్ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడే మార్గం కోసం సకల ప్రపంచం ఇప్పుడు మనవైపు చూస్తోంది. నాలుగు గోడల మధ్య బందీ అయిన ప్రపంచానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవన సమతౌల్యం నిలబెట్టుకోవడంలో యోగా అత్యంత సమర్థ ఆరోగ్య సాధనంగా ఆవిర్భవించింది. సాధారణంగా అయితే, మనం గతంలోలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకునేవారం. కానీ, ఇప్పుడు కోవిడ్–19 కారణంగా సామాజిక దూరం పాటిస్తూ మన కుటుంబంతో, పరిమితమైన ప్రదేశాల్లో ఈ వేడుక చేసుకోవాల్సి వస్తోంది. గత ఐదేళ్లుగా మనం సాధించిన యోగా దినోత్సవ స్ఫూర్తి కోవిడ్–19 వల్ల భగ్నం కారాదని అన్ని దేశాలకు, మొత్తంగా అంతర్జాతీయ సమాజానికి నా వినతి. కోవిడ్–19వల్ల పడిన మానసిక ప్రభావాన్ని ఉపశమింపజేయడానికి యోగా, ధ్యానమే ఉత్తమ చికిత్సగా పలు నివేదికలు, పరిశీలన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మన శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయగల వివిధ ‘ప్రాణాయామ’ పద్ధతులు యోగాలో ఉన్నాయి. ఆ మేరకు కరోనా వైరస్ ప్రభావాలను ‘ప్రాణాయామం’ ఎలా ఎదుర్కొనగలదన్న అంశంపై అధ్యయనాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సమాజం... సహజ నిరోధం... సమైక్యతలకు యోగా ఏకైక సాధనమన్నది నూటికి నూరుపాళ్లూ వాస్తవం. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికం యుగయుగాలుగా అంతర్జాతీయ సమాజానికి మనమిస్తున్న సందేశం. ఇది నాటికీ.. నేటికీ.. ఎన్నటికీ సాపేక్షమేనన్నది వాస్తవం. అంతేకాదు... నిస్సందేహంగా ప్రపంచ శాంతిసామరస్యాలకు యోగా ప్రవేశ ద్వారం. రమేష్ పోఖ్రియాల్ వ్యాసకర్త కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి -
యోగాతో ఆరోగ్యంగా ఉండండి: ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ: యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి)ను అనుసరించి ఈ నెల 21న (ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్ శనివారమిక్కడ మాట్లాడుతూ యోగా మన దేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమన్నారు. (రేపొక్క రోజే ఏడు రోజులు) యోగా కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సాయం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనతో ఐరాస జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిందన్నారు. కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21, 2015న మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. (ఇంట్లోనే యోగా చేయండి!) -
రేపొక్క రోజే ఏడు రోజులు
ఇండిపెండెన్స్ డే.. రిపబ్లిక్ డే...దేశం ఇంకా ఏదైనా సాధిస్తే ఆ డే..ఇవీ మనకు దినోత్సవాలు.తిథుల్ని బట్టి పండుగలూ ఉంటాయి.‘థీమ్’ పాటింపు ‘డే’లు.. కొత్తవి.మంచి ఎక్కడున్నా తీసుకోవలసిందే.రేపొక్క రోజే ఏడు ‘డే’ లున్నాయి.‘డూమ్స్‌డే’ అని కూడా అంటున్నారు.దాన్నొదిలేసిమిగతా ‘డే’లను స్వాగతిద్దాం యోగా డే (ఒక్క ఆసనమైనా నేర్చుకుందాం) భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను జరుపుకుంటున్నాం. ఈ రోజును సూచించినది కూడా మోదీనే. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే జూన్ 20–21–22.. ఈ మూడు రోజుల మధ్య రోజైన 21న యోగా డేకి మోదీ ఎంపిక చేశారు. మ్యూజిక్ డే (ఒక మంచి పాట విందాం) వరల్డ్ మ్యూజిక్ డే తొలిసారి పారిస్‌లో 1982 జూన్ 21న జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఔత్సాహిక, ఉద్ధండ సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్ కలిసి మ్యూజిక్ డే నెలకొల్పారు. వరల్డ్ హ్యూమనిస్డ్ డే (సాటి మనిషికి చేయూతనిద్దాం) హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ ‘వరల్డ్ హ్యూమనిస్డ్ డే’ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే తాత్విక భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచ దేశాలలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. 1980ల నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వచ్చిందే కానీ, కచ్చితంగా ఫలానా సంవత్సరం నుంచి ప్రారంభం అయిందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. అయితే జూన్ 21 అందుకు ఫిక్స్ అయింది. హ్యాండ్ షేక్ డే(విశ్వంతోకరచాలనంచేద్దాం) ఇది ఈ ఏడాది గానీ, మరికొన్నేళ పాటు గానీ ఈ ‘డే’ జరిగే అవకాశాలు లేవు. కరోనాతో భౌతిక దూరం తప్పని సరైంది కనుక ఈ ‘వరల్డ్ హ్యాండ్‌షేక్ డే’ కి తాత్కాలికంగా కాలం చెల్లినట్లే. నిజాకిది చేతులు చేతులు కలిపే హ్యాండ్‌షేక్ డే గా మొదలవలేదు. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడంతో ప్రారంభం అయింది. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరునికి కలిగిన ఆలోచన నుంచి సముద్రానికి హ్యాండ్‌షేక్ ఇవ్వడం అనే ఆధ్యాత్మిక భావన అంకురించిందని అంటారు. ఏటా జూన్ 21న ఈ డే ని జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే (నాన్న దీవెనలు కోరుకుందాం) తేదీ ఏదైనా గానీ మదర్స్ డే మే రెండో ఆదివారం వస్తే, ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారం వస్తుంది. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. కుటుంబం పాటు పడుతుండే తండ్రిని గౌరవించుకోవడం కోసం ప్రపంచం ఆయనకొక రోజును కేటాయించింది. జూన్ మూడో వారమే ఫాదర్స్ డే ఎందుకు? ఆ ‘డే’న గుర్తిస్తూ ప్రభుత్వ సంతకాలు అయిన రోజది. మదర్స్ డే కూడా అంతే. హైడ్రోగ్రఫీ డే (నీటికి నమస్కరిద్దాం) హైడ్రోగ్రఫీ అంటే జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ‘ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫిక్ ఆర్గనైజేషన్’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్ 21న ‘వరల్డ్ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది. టీ షర్ట్ డే (ట్రెండేమిటో తెలుసుకుందాం) సాధారణంగా ‘డే’లన్నీ యు.ఎస్. నుంచి ప్రపంచానికి విస్తరిస్తాయి. టీ షర్ట్ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్‌లో 2008లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే జరిగింది. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డేని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీలేదు. అయితే వ్యక్తి సౌలభ్యం ఉంది. ధరించడానికి సులువుగా ఉండటం, ఒక స్టెయిల్ స్టేట్మెంట్ అవడంతో యూత్ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవడమే సెలబ్రేషన్. జూన్ 21న దీనినొక ఉత్సవంలా కొన్నిదేశాలలో నిర్వహిస్తారు. -
ఇంట్లోనే యోగా చేయండి!
న్యూఢిల్లీ: యోగాతో బహుళ ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కారణంగా తలెత్తిన అనేక సవాళ్లకు యోగా పరిష్కారం చూపుతుందన్నారు. ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంట్లోనే, కుటుంబంతో కలిసి జరుపుకోవాలన్నారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ గురువారం ఒక వీడియో సందేశాన్ని వెలువరించారు.‘యోగాతో శరీరం, మనస్సు మధ్య దూరం తొలగుతుంది. ఆ దూరమే చాలా సమస్యలకు మూల కారణం. ఆకాంక్షలకు, వాస్తవాలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది’ అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ నినాదం ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా’ అని.. అందువల్ల అంతా భౌతిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్లల్లోనే యోగా సాధన చేయాలని కోరారు. గుంపులుగా సాధన చేయొద్దని సూచించారు. -
21న జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని లద్దాఖ్‌లోని లేహ్ నుంచి చేయాలని మొదట నిర్ణయించారు. కానీ, కోవిడ్ నేపథ్యంలో ఢిల్లీ నుంచే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యోగా విశిష్టత గురించి ఆయన వివరిస్తారని సమాచారం. అలాగే ప్రధాని చేసే కొన్ని యోగాసనాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇండియా ప్రతిస్పందనను కూడా మోదీ ప్రస్తావించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014 డిసెంబర్ 11న ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కంటైన్మెంట్ జోన్‌గా నటి బిల్డింగ్
ముంబై : కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. భారత్‌లో 2లక్షల 77వేల కేసులు నమోదవ్వగా 7, 745 మంది మృతిచెందారు. ఇక 90 వేలకుపైగా కేసులతో మహారాష్ట్ర భారత్‌లోనే ప్రథమ స్థానంలో ఉంది. ముంబైలో నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్‌ను కంటైన్మెంట్ జోన్‌గా మార్చారు. జూన్ 8న బిల్డింగ్ సీల్ చేసినట్టు సమాచారం. ఇక లాక్డౌన్లో సైతం ఎప్పటికప్పుడు సామాజికమాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉన్న మలైకా, ప్రస్తుతం యోగా ఫోటోలతో అభిమానులకు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లోనూ రోజుకు కనీసం ఒక గంటసేపు యోగా చేయడం మిస్సవనని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోజుకు ఒక ఆసనం వేస్తూ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. View this post on Instagram Yoga for me is that one hour to myself that I never miss. So as we count down to #InternationalYogaDay I want to share something fun with you’ll - #14Days14Asanas Each day, I’ll be putting up one asana that I absolutely love and practice regularly and I’d love for you’ll to do the same asana, click a picture, tag me, @sarvayogastudios, @thedivayoga and #14Days14Asanas Today’s asana is ’Sarvangasana’ - Lie down with your back on the floor, and palms close to your body - Lift your legs and bring them close to your heart - Lift your lower body slowly and place your hands on your lower back, keeping your elbows close to the torso - Slowly lift your legs up, forming a straight line with your forearm - Breathe normally without any pressure on your neck - To come out of the pose, fold your knees, bring your legs close to the chest and slowly release your hands I’m super excited to see how beautifully you all do this asana, do not forget to tag me and #14Days14Asanas #internationalyogaday #sarvayoga #divayoga #mylifemyyoga #fitindiamovement #malaikasmoveoftheweek A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Jun 10, 2020 at 12:14am PDT -
‘మనది భారతదేశం.. అతడిని అభినందించాలి’
లక్నో : కొందరు మంత్రులు చెలాయిస్తున్న అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. ప్రభుత్వాధికారి చేత షూలేస్ కట్టించుకోవడమే కాక రామయణాన్ని తెర మీదకు తెచ్చి మరి దాన్ని సమర్థించుకున్నాడో మినిస్టర్. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మినిస్టర్ లక్ష్మీ నారాయణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాజహాన్పూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు మినిస్టర్ షూ లేస్ ఊడిపోయింది. దాంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వెంటనే వెళ్లి అమాత్యుల వారి షూలేస్ కట్టి తన ప్రభు భక్తిని చాటుకున్నాడు. వారించాల్సిన మినిస్టర్ కాస్తా దర్జాగా నిల్చూని ప్రభుత్వ ఉద్యోగి చేత సేవ చేపించుకుని తరించారు. #WATCH: UP Minister Laxmi Narayan gets his shoelace tied by a government employee at a yoga event in Shahjahanpur, yesterday. pic.twitter.com/QbVxiQM7bI — ANI UP (@ANINewsUP) June 22, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో లక్ష్మీ నారాయణ్‌ని, ఉద్యోగిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంఘటన గురించి లక్ష్మీ నారాయణ్‌ని ప్రశ్నించగా.. ఆయన సిగ్గుపడకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి చెప్పులు ధరించే విషయంలో నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను’ అంటూ రామయణాన్ని తెరమీదకు తెచ్చి పొంతన లేని వాదనను వినిపించాడు. అయితే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడటం సదరు మినిస్టర్‌కు కొత్త కాదు. గతంలో హనుమంతుడు జాట్ల తెగకు చెందిన వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మి నారాయణన్. -
నగరంలో ఘనంగా యోగ దినోత్సవం
-
యోగా చేశారు.. మ్యాట్లు ఎత్తుకెళ్లారు
చండీగఢ్ : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హరియాణా రోహతక్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ఎల్ ఖట్టర్‌తో కలిసి యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేడుక కావడంతో.. చాలా ఖరీదైన యోగా మ్యాట్స్ తెప్పించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జనాలు.. యోగా మ్యాట్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఒకరినొకరు తోసుకుంటూ మ్యాట్స్ కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వాలంటీర్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే... వారితో గొడవకు దిగారు. -
అన్నిటికీ అతీతం యోగా
రాంచీ/ న్యూఢిల్లీ/ ఐరాస: భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా అన్నిటికీ అతీతమైందని, దీనిని జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంట్ హాల్లో, ఐక్యరాజ్యసమితిలో, ఇతర దేశాల్లోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి. రాంచీలోని ప్రభాత్ తారా గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో 40 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడిగా మారిన ప్రధాని మోదీ వివిధ ఆసనాల విశిష్టతను వివరిస్తూ ఆసనాలు వేయించారు. ఆరోగ్యం కోసం యోగా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా కుల, మత, వర్ణ, లింగ, ప్రాంతీయ వంటి విభేదాలకు అతీతమైంది. అందుకే దీనిని జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవాలి’ అని సూచించారు. ‘నగరాల నుంచి పల్లెలు, గిరిజన ప్రాంతాలకు యోగాను వ్యాపింపజేయాలి. గిరిజనుల జీవితాల్లో యోగాను విడదీయరాని భాగంగా మార్చాలి. ఆరోగ్యవంతమైన శరీరం, స్థిరమైన మనస్సు, ఏకాత్మతా భావం అనే మూడు యోగా విశిష్టతలు ఏమాత్రం మారలేదు. జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడింటి సమ్మేళనమే యోగ’ అని ప్రధాని వివరించారు. శాంతి, సామరస్యాలను సాధించే యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ‘ఈ రోజుల్లో యువత గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతున్నారు. గుండె జబ్బుల బెడద నుంచి కాపాడుకునేందుకు యోగా మంచి ఆయుధం. ఈ దిశగా వారిని అప్రమత్తం చేయాల్సి ఉంది. అందుకే ఈ ఏడాది యోగా డేకు ‘హృదయం కోసం యోగా’ నినాదాన్ని ఇతివృత్తంగా పెట్టుకున్నాం. అనారోగ్య సమస్యల నుంచి రక్షించే ముఖ్య సాధనంగా యోగాను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని చెప్పారు. తెల్లటి దుస్తులు, టీ షర్టు, స్కార్ఫుతో వచ్చిన ప్రధాని ప్రసంగం అనంతరం స్టేజీ దిగి అందరితో కలిసి కూర్చుని వివిధ ఆసనాలు, ప్రాణాయామం చేయించారు. రాష్ట్రపతి భవన్లో..: రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. పార్లమెంట్ పరిసరాల్లో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోహ్తక్లో హోం మంత్రి అమిత్ షా, నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కారీ పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయ కేంద్రంలో విదేశాంగ మంత్రి జై శంకర్ నేతృత్వంలో జరిగిన యోగాడే కార్యక్రమంలో 60 దేశాల రాయబారులు పాల్గొన్నారు. చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ యోగా డే పాటించారు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఐరాసలో మార్మోగిన ఓం శాంతి... అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్లో ఓం శాంతి మంత్రం మార్మోగింది. ప్రపంచ నేతలు ప్రసంగించే విశ్వ వేదిక జనరల్ అసెంబ్లీ హాల్లో యోగా డే సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు, శిక్షకులు, గురువులు వివిధ ఆసనాలు వేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్లో ఈ తరహాలో యోగా ఉత్సవం జరపడం ఇదే ప్రథమం. రాహుల్ ట్వీట్ కలకలం న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోలు వివాదానికి దారితీశాయి. ఆర్మీకి చెందిన జాగిలాలు, వాటి శిక్షకులు యోగా చేస్తున్న ఫొటోలు పోస్ట్ చేసిన రాహుల్ వాటికి ‘నవ భారతం’ అనే వ్యాఖ్యను జోడించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. యోగా డేను అపహాస్యం చేశారని, ఆర్మీ బలగాలను రాహుల్ అవమానపరిచారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేక ధోరణితోనే ఉంటుంది. ట్రిపుల్ తలాక్‌కు మద్దతిచ్చినప్పుడే ఈ విషయం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు యోగాడేను అపహాస్యం చేయడమే కాకుండా ఆర్మీ బలగాలను అవమానపరిచారు. వారిలో సానుకూల ధోరణి పెరగాలని ఆశిస్తున్నాను’అంటూ అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఓ సీనియర్ రాజకీయవేత్త యోగాడేను ఇలా అవమానపరచడం బాధాకరం. ఓటు బ్యాంకు రాజకీయాలే వారిని ఇలా భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలను అవమానించేలా చేస్తున్నట్లు ఉంది’అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధి ట్విట్టర్లో దుయ్యబట్టారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నవ భారత్ అవతరించింది. తన ఆధ్వర్యంలో కొత్త కాంగ్రెస్ ఎలా ఉందో రాహుల్ గాంధీ ట్వీట్లో అర్థమైంది’అంటూ బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి ఎద్దేవా చేశారు. ‘రాహుల్‌కు జీవితం అంటే ఓ జోక్‌గా మారింది. తన పెంపుడు కుక్కను గుర్తు చేసుకుంటూ పోస్టులు చేస్తున్నట్లు ఉన్నారు’ అంటూ చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆసనాలు వేస్తున్న ప్రజలు శిక్షకులతో కలిసి యోగా చేస్తున్న ఆర్మీ జాగిలాలు -
ప్రతి బడి, కళాశాలల్లో యోగాను పెట్టాలి: గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: యోగాభ్యాసం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా మానసికబలం పెరుగుతుందని, ప్రతీ పాఠశాల, కళాశాలల్లోను యోగాను ప్రవేశపెట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్కృతి రాజ్‌భవన్ కమ్యూనిటీ సెంటర్లో అధికారులు, సిబ్బందితో కలసి గవర్నర్ నరసింహన్ దంపతులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గవర్నర్ యోగా గురువైన రవికిశోర్‌కు, ఆయన యోగా బృందానికి ఈ సందర్భంగా నరసింహన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, మాజీ డీజీపీ ఏకే మహంతి పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యోగా మనదేశ సంపద: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: యోగా భారత దేశంలో పుట్టిన గొప్ప సంపద అని, నేడు ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు సాధన చేయడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 5వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా టూరిజం–తెలంగాణ టూరిజం సంయుక్తంగా హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనం యాంత్రికంగా మారడంతో మానసికంగా అంతా అలసిపోతున్నారని, శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా యోగా ద్వారా వ్యాయామం అవసరమని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగా, మెడిటేషన్‌లను ప్రపంచమంతా సాధన చేస్తుండటం గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
యోగా డే : మ్యాట్ల కోసం డిష్యుం డిష్యుం
-
యోగా డే నాడు గందరగోళం
చండీగఢ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానాలోని రోహ్తక్లో శుక్రవారం యోగా డే కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. యోగా శరీరంతోపాటు మనసును ఆరోగ్యంగా ఉంచుతుందని, ఇది ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన జీవితం వైపు నడిపిస్తోందని అన్నారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా మన బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హర్యానాలో యోగా మండలిని ఏర్పాటు చేసినందుకు మనోహర్ లాల్‌ను అమిత్ షా అభినందించారు. వీరితో పాటు హర్యానా మంత్రి అంజి విజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా తదితరులు యోగా డేలో పాల్గొన్నారు. కాగా ముఖ్య అతిథులు కార్యక్రమ ప్రాంగణాన్ని వీడిన తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది. స్థానిక ప్రజలు వేదికపై యోగా మ్యాట్ల కోసం గొడవ పడ్డారు. కొంతమంది మ్యాట్లతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రజలు యోగా మాట్స్ కోసం ఎలా గొడవ పడుతున్నారో చూడవచ్చు. -
యోగా డే : రాహుల్ సెల్ఫ్ గోల్
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం సమయంలో ఫోన్ చూసుకుంటూ గడిపి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద ట్వీట్‌తో ఇరకాటంలో పడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాహుల్ చేసిన ట్వీట్‌పై పలువురు మండిపడుతున్నారు. ఆర్మీ డాగ్ యూనిట్ వెల్లడించిన రెండు ఫోటోలను శుక్రవారం ట్విటర్లో షేర్ చేసిన రాహుల్ దానికి ఇచ్చిన క్యాప్షన్‌తో విమర్శలకు తావిచ్చారు. ‘సైనిక సిబ్బందితో కలిసి కుక్కలు యోగాసనాలు వేస్తున్నాయి..ఇదే న్యూ ఇండియా’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ వివాదాస్పదమైంది. రాహుల్ యోగా డేపై చేసిన వ్యాఖ్యలతో దేశాన్ని, సైనిక పాటవాన్ని అవమానించారని నెటిజన్లు మండిపడ్డారు. రాహుల్ యోగా దినోత్సవాన్ని, ఆర్మీ డాగ్ యూనిట్‌ను కించపరిచారని విమర్శించారు. భారత సంస్కృతిని, సైన్యాన్ని అపహాస్యం చేసేలా రాహుల్ వ్యాఖ్యానించారు. ‘ఇవి కేవలం కుక్కలే కాదు సార్..మన భారత్ కోసం ఇవి పోరాడుతున్నాయి..వాటికి సెల్యూట్ చేయండి’ అని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ట్వీట్ చేశారు. రాహుల్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని, మన సైన్యం, వీర జవాన్లు, డాగ్ యూనిట్, యోగ సంప్రదాయాలను ఆయన అవమానించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్వీట్ చేశారు. రాహుల్ వంటి నేతతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా నెట్టుకొస్తారని ఆయన విచారం వ్యక్తం చేశారు. -
‘యోగాతో రాహుల్ పిల్ల చేష్టలకు చెక్’
తిరువనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలకూ వేదికైంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ ఫోన్ చూస్తూ గడపడాన్ని రాం మాధవ్ పరోక్షంగా ప్రస్తావించారు. పార్లమెంట్లో కొంతమంది పిల్లలు ఉన్నారని, యోగా అభ్యసించడం ద్వారా వారు తమ పిల్ల చేష్టలను అధిగమించవచ్చని రాహుల్‌ను ఆయన ఎద్దేవా చేశారు. క్లాస్ రూంలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాలపై దృష్టి కేంద్రీకరించడం కొందరికి కష్టం కావచ్చు..పరీక్షల సమయంలో పాఠ్యపుస్తకాలపై మనం దృష్టి సారించలేకపోవచ్చు.. అంటూ అయితే వీటికోసం చింతించాల్సిన అవసరం లేదని, స్కూళ్లలో చిన్నారులు ఉన్నట్టే మన పార్లమెంట్‌లోనూ పిల్లలు ఉన్నారని రాహుల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో పిల్లలు మన రాష్ట్రపతి ప్రసంగాన్నే ఆలకించరని, వారు తమ మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు చెక్ చేసుకంటూ వీడియో గేమ్‌లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారని చురకలు అంటించారు. వారి చిన్నపిల్లల మనస్తత్వాన్ని యోగాతో నియంత్రించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. -
ఆ సీఎంకు మాజీ సీఎం క్లాస్
భోపాల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ హాజరు కాకపోవడాన్ని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుపట్టారు. యోగ చేయడంద్వారా రాష్ట్ర ప్రజలు, యువత ఫిట్‌గా ఉండేలా ముఖ్యమంత్రి కమల్ నాథ్జీ ప్రోత్సహించి ఉండాల్సిందని చౌహాన్ వ్యాఖ్యానించారు. కేవలం అధికార యంత్రాంగాన్ని నడిపించడం ఒక్కటే సీఎం పని కాదని, రాష్ట్రానికి ఓ దశా-దిశను నిర్ధేశం చేయాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. యోగ కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన తన సంకుచిత మనస్తత్వాన్ని వెల్లడించారని చౌహాన్ ఆక్షేపించారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ ఆయన ప్రధాని అని విపక్షం అర్దం చేసుకోవాలని చురకలు వేశారు. ప్రధాని మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినం ప్రకటించిందని గుర్తుచేశారు. -
ఆ 'శిక్ష'ణ తో.. ఉప'యోగా'లెన్నో..
పెద్దాపురం: క్షణికావేశంలో చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవించాడు. సత్పప్రవర్తతో అందరికీ ఆదర్శంగా నిలవాలంటే ఏ మార్గమైతే మంచిదంటూ కుటుంబాన్ని తీసుకుని వేరే గ్రామంలో కాపురం పెట్టాడు. ఉన్న కుట్టు మెషీన్‌తో కుటుంబ పోషణ సాగిద్దామంటే చాలీచాలని సొమ్ములతో ఎన్నాళ్లీ బతుకంటూ ఓ పెట్రోల్ బంకులో పని కుదుర్చుకుని, టైలరింగ్ వృత్తి చేస్తూ కాలం గడుపుతున్నారు. అంతా బాగానే సాగిపోతోంది కానీ ఏదో వెలితి... తాను జైలు శిక్షలో ఉన్నప్పుడు మదిలో కలిగిన ఆలోచన ఆయనను వెంటాడుతోంది. జైలులో పొందిన యోగా శిక్షణను పల్లె ప్రజలకూ ఇస్తే బాగుంటుందని భావించాడు. యోగా గురువుగా మారాడు. పల్లె ప్రజలకు యోగా శిక్షణ ఇస్తూ పల్లె ప్రాంతంలో యోగా కేంద్రం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి సుమారు వంద మందికి శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలిచిన యోగా గురువు జీవిత గాథ ఇది.కోరుకొండ మండలం ఇల్లెందుపాలేనికి చెందిన మసిముక్కల రామకృష్ణ సుమారు 13 ఏళ్ల క్రితం ఆ గ్రామ రాజకీయ ఘర్షణల నేపథ్యంలో వ్యక్తి హత్య కేసులో ముద్దాయిగా మారాడు. వాదోపవాదాల అనంతరం కోర్టు ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. భార్య, కుమారుడు, కుమార్తె ఒంటరి కావడంతో భార్య సుబ్బలక్ష్మి ఇరువురిని తీసుకుని పెద్దాపురం మండలం దివిలి అమ్మగారి ఇంటి వద్దకు వచ్చేసింది. ఆమెకు ఉన్న కుట్టు మెషీన్ సాయంతో కుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల 2016 జనవరి 26న సత్ప్రవర్తతోనే ఉండే ఖైదీలను విడుదల చేసే సమయంలో జైలు నుంచి రామకృష్ణ విడుదలయ్యాడు. శిక్ష పూర్తి చేసుకుని అటు స్వగ్రామం వెళ్లలేక అత్తారింటికి కాపురం వచ్చేశాడు రామకృష్ణ. మంచి సత్పప్రర్తనతో మెలగాలనే.. అత్తారింటికి కాపురం వచ్చేసిన రామకృష్ణ జైలు జీవితం నుంచి సమాజంలో మంచి సత్పప్రవర్తనతో మెలగాలని భార్య, కుమారుడితో సంసార జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు. పులిమేరు పెట్రోల్ బంకులో పనికి చేరాడు. తనతో పాటు కుమారుడు ప్రేమ్‌కు కూడా అక్కడే ఉద్యోగం సంపాదించి ఇద్దరూ బంకులోనే పనిచేస్తుండడంతో కాపురాన్ని పులిమేరు మకాం మార్చాడు. అంతేకాదు తనకు తెలిసిన యోగాసనాలు మరికొందరికి నేర్పాలనే ఉద్దేశంతో అదే గ్రామంలో ఓ మైదానంలో యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ సుమారు 100 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు రామకృష్ణ.యోగాతో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం లభిస్తుందంటూ పులిమేరు పరిసర గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు రామకృష్ణ. ప్రతి పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలు వేస్తూ అవగాహన కల్పిస్తుంటారు. ఆయా గ్రామాల నుంచి 12 ఏళ్ల వయస్సు నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు సుమారు 100 మంది ఇక్కడ శిక్షణ నేర్పిస్తున్నారు. జైలులో నేర్పిన యోగానే నా జీవితానికి మలుపు జైలు శిక్ష సమయంలో రాజమహేంద్రవర్మ కర్మాగారంలో నేర్పిన యోగాయే తన జీవితంలో మంచి మార్పు తెచ్చిపెట్టింది. చాలా అనారోగ్య పరిస్థితిల్లో క్షణికావేశంలో జైలుకు వెళ్లిన నాకు అక్కడ యెగా నేర్పడంతో అనారోగ్యాలు దూరమై మానసిక ప్రశాంతత లభించింది. అదే మార్పును సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా నేర్పించాలన్నదే నా ప్రధాన ధ్యేయం.– మసిముక్కల రామకృష్ణ, యోగా గురువు, పులిమేరు, పెద్దాపురం మండలం -
ఒమన్‌లో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
గల్ఫ్ డెస్క్: ఒమన్‌లో అంతర్జాతీయ ఐదవ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి మన రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితమే. ఒమన్‌లో ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగాకు ఉన్న ప్రత్యేకత వల్ల కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు