న్యూ జెర్సీ : న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్బంగా యోగాను భారతీయ సంస్కృతిలో ఒక భాగమైనా.. అది ప్రపంచానికి ఎంత మేలు చేస్తుందనేది ప్రముఖ యోగా శిక్షకురాలు డా.విజయ నిమ్మ వివరించారు. యోగాసనాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని విజయ నిమ్మ పేర్కొన్నారు. అంతేకాకుండా తను విధులు నిర్వహించే నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిగేలా చేశారు.
విజయ నిమ్మ విజ్ఞప్తితో నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ కెర్రీ పొవెల్ సంస్థలో యోగా దినోత్సవాన్ని జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. సీఓఓ మిస్టర్ జాన్ బోన్, సైట్ అడ్మినిస్ట్రేటర్ హాజీరబేజ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ సీఎంఓ డాక్టర్ పెన్నింగ్టన్ కూడా తన వంతు సహకారాన్ని అందించారు. కార్పొరేషన్ ఉద్యోగులకు డా.విజయ యోగాపై అవగాహన పెంచారు. యోగాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. వారిచే యోగాసనాలు వేయిస్తూ, ఆసనాలతో కలిగే లాభాలను స్పష్టంగా తెలిపారు.
సాయి దత్త పీఠం గురుకులంలో యోగా శిక్షకురాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సాయి దత్త పీఠంలో జరపడంతో పాటు నైబర్ హుడ్ హెల్త్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో కూడా యోగా దినోత్సవాన్ని చేయడం పట్ల సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి హర్షం వ్యక్తం చేశారు. యోగా దినోత్సవం రోజున అందరికి యోగాపై అవగాహన కల్పించినందుకు డా.విజయ నిమ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు ఆ సాయి నాధ, శ్రీ మాతా కృప సదా ఉండాలని ఆశీర్వదించారు.
చదవండి: ఫ్లోరిడాలో నాట్స్ ఆధ్వర్యంలో భారత కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్
Comments
Please login to add a commentAdd a comment