న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. 300 మందికి పైగా వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.
డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ , ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు.. దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని డాక్టర్ రాఘవ రెడ్డి గోసల పేర్కొన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే.. రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని రాజేశ్వర్ రెడ్డి గంగసాని తెలిపారు. నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీకాంత్ కోరారు.
భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలసి ఇలా ఒకేచోట చేరి.. వనభోజనాలతో వైఎస్సార్ జయంతి నిర్వహించటం.. ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి , రామమోహన్ రెడ్డి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ .. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment