YSR Foundation
-
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. 300 మందికి పైగా వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ , ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు.. దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని డాక్టర్ రాఘవ రెడ్డి గోసల పేర్కొన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే.. రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని రాజేశ్వర్ రెడ్డి గంగసాని తెలిపారు. నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీకాంత్ కోరారు.భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలసి ఇలా ఒకేచోట చేరి.. వనభోజనాలతో వైఎస్సార్ జయంతి నిర్వహించటం.. ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి , రామమోహన్ రెడ్డి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ .. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. -
హైస్పీడ్‌లో వైఎస్సార్ మెడికల్ కాలేజ్ నిర్మాణం.. టార్గెట్ డిసెంబర్..!
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులో చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించి 25 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సుమారు రూ.70 కోట్లు వెచ్చించారు. ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. చలిగాలులను తట్టుకుంటూనే సుమారు 500 మంది వరకు కూలీలు శ్రమిస్తున్నారు. స్థానిక తలారిసింగి ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. ఈ నిధుల్లో సగం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. మూడు బ్లాక్‌ల్లో పనుల జోరు మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇక్కడ పనులపై సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సమీక్షిస్తుంటారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.ఈ బ్లాక్‌లోని పలు భవన నిర్మాణాలు మూడవ అంతస్తుకు చేరుకున్నాయి. కొన్ని భవనాల నిర్మాణ పనులు మొదటి అంతస్తు దాటాయి. నర్సింగ్ కళాశాల విభాగానికి సంబంధించి ఒక బ్లాక్‌లో భవన నిర్మాణం రెండవ అంతస్తు శ్లాబ్‌కు సిద్ధమైంది. ఇదే బ్లాక్‌లోని పలు భవనాల పనులు పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. ప్రధాన వైద్య కళాశాల బ్లాక్‌కు సంబంధించి ఎన్సీసీ ఇంజనీరింగ్ అధికారులు మరింత దృష్టి పెట్టారు. భూమిని చదును చేసి పిల్లర్లకు బాగా లోతుగా తవ్వే పనులకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆయా పనులన్ని సజావుగా జరగడంతో పిల్లర్ల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. గడువులోగా పూర్తి చేస్తాం చలితీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంలోను నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా ఎన్సీసీ సంస్థ పనిచేస్తోంది. నాణ్యతలో రాజీ లేకుండా నిరంతరం తమ ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.నిర్మాణ సామగ్రి శాంపిళ్లను కూడా ల్యాబ్‌ల్లో నాణ్యత నిర్థారణ పరీక్షలు జరిపిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఏడాది డిసెంబర్ నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాం. శీతాకాలం ముగియగానే పనులు మరింత వేగవంతం చేస్తాం. – డీఏ నాయుడు, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్, ఏపీఎస్ఎంఐడీసీ. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు!
అమెరికాలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించారు నార్త్ వెస్ట్ అమెరికా సియాటెల్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన వంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి,సువీన్ రెడ్డి, చెన్నా రెడ్డి, మహీధర్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు,జేసి రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, దామోదర్, రామ్, లోకనాథ్, శేఖర్ గుప్త విన్నకోట, భాస్కర్ రావికంటి, ఆళ్ళ రామిరెడ్డిలు పాల్గొన్నారు. -
ఫౌండేషన్‌కు విరాళమివ్వడమూ నేరమేనా?
సాక్షి, హైదరాబాద్: నిరుపేదల వైద్య చికిత్సలకు ఆర్థికసాయం అందించే వైఎస్సార్ ఫౌండేషన్‌కు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ రూ.7 కోట్లు విరాళం ఇచ్చారని, దీన్ని కూడా సీబీఐ నేరంగా చూస్తోందని ఆయన తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వైఎస్ జగన్ కంపె నీల్లో పెట్టుబడులకు సంబంధించి తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ ప్రసాద్ వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం మరోసారి విచారించారు. నిమ్మగడ్డ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దాదాపు రూ.130 కోట్లు సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారని నిరంజన్‌రెడ్డి నివేదించారు. సండూర్ పవర్, భారతీ సిమెంట్స్‌లో నిమ్మగడ్డ పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చాయని, అయితే పెట్టుబడులు పెట్టినట్లుగా మాత్రమే చార్జిషీట్లో సీబీఐ పేర్కొందని, వచ్చిన లాభాలను ప్రస్తావించడం లేదని తెలిపారు. రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ పేర్కొనడం నిరాధారమని, పెట్టుబడులకు వచ్చిన లాభాలను కూడా కలిపి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా చూపిస్తోందని అన్నారు. సీబీఐ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
AP: చిన్నారుల బంగారు భవితకు బాటలు
సాక్షి, అమరావతి: చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసేలా.. వారికి సంపూర్ణ పోషణ, సమగ్ర విద్య అందించేలా ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. రాష్ట్రంలో కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు బడిబాట పట్టనున్నాయి. ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించనున్నారు. వీటిని ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహించనున్నారు. తొలి దశలో 5,664 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నారు. ఇందుకోసం 3,824 ప్రాథమిక పాఠశాలల ఆవరణలో 6,692 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న 1,20,165 మంది చిన్నారుల విద్యకు బలమైన పునాది పడనుంది. తొలిదశలో చేపట్టే తరగతి గదుల నిర్మాణాన్ని 2021–2022 మధ్యలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.669.20 కోట్లు ఖర్చు చేయనుంది. భవితకు బలమైన పునాది బాలల భవితకు బలమైన పునాది వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ఫౌండేషన్ స్కూళ్లుగా వాటిని మార్పు చేస్తున్నారు. తొలి దశలో 5,664 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నాం. అంగన్వాడీ కేంద్రాల తరహాలోనే ఫౌండేషన్ పాఠశాలలు బాలలకు అన్ని సౌకర్యాలు, మంచి విద్య అందిస్తాయి. అంగన్వాడీల్లో అందించే సంపూర్ణ పోషణ పథకాన్ని ఫౌండేషన్ పాఠశాలల్లోనూ అమలు చేస్తాం. ఆటపాటలతోపాటు బలమైన ఆహారం, ఆరోగ్యం, విద్యకు కేంద్రంగా ఇవి ఉంటాయి. – కృతికా శుక్లా, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ సంచాలకులు -
వైఎస్సార్ జయంతి.. ఆహార పదార్థాల వితరణ
న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు 800 డాలర్ల విలువైన ఆహార పదార్థాలను డెలావేర్ ఫుడ్ బ్యాంక్‌కి డోనేట్ చేశారు. నాటా బోర్డ్ డైరెక్టర్, వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు సంగంరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు చంద్ర దొంతరాజు, అమరవాది శ్రీనివాస్, జనార్దన్, శ్రీనివాసరెడ్డి కేసవరపు, రమణ కొట్ట, నిరంజన్, హరి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
మన్రో,న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే రాజశేఖరరెడ్డికి ముందు , రాజశేఖరరెడ్డికి తర్వాత అనే విధంగా ఆయన పరిపాలన చేశారని ప్రవాస భారతీయులు అన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత మంది గుర్తు పెట్టుకుంటున్నారంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని మన్రోలో వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి హాజరైన వారు వైఎస్సార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని , తమ జీవితంలో వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యుడు ఆళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీలో 2010లో వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను అమెరికాలో 16 స్టేట్స్లో 19 నగరాల్లో ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, భక్తితోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీని ప్రజలెవరు మర్చిపోలేరని వైఎస్ఆర్ స్నేహితుడు డాక్టర్ కే రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని తనతో వైఎస్ఆర్ తనతో ఎప్పుడూ అంటుండే వారని అనుకోకుండా 60 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయారంటూ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. డాక్టర్ వైఎస్సార్ లాంటి నాయకులు మళ్లీ మళ్లీ భారత దేశంలో పుట్టాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ రాఘవరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ బతికుంటే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన మహానేత రాజశేఖరరెడ్డి అని పి శ్రీకాంత్‌రెడ్డి . జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. -
మిన్నసోటాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రం మిన్నియాపాలిస్ నగరంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు వైఎస్సార్ తెలుగు ప్రజలకు చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేలా కృషి చేసిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్లా రామి రెడ్డి, బేలీఫ్ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ రెడ్డికి ప్రవాస భారతీయులు కృజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట రామిరెడ్డి చింతం, శంకర్ బండి, సాయినాథ్ రెడ్డి ఎర్రి, నారాయణ్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి వాకా, మైసూరా రెడ్డి, ఎం రామాంజి , గంగి రెడ్డి, మోహన్ మార్చేట్టి, శ్రీనివాస రెడ్డి (రోబో), వీర కిశోర్ రెడ్డి, రామాంజన రెడ్డి మోటాటి, తానేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ 72వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని నార్త్ వెస్ట్ వైఎస్ఆర్సీపీ సీటెల్ (వాషింగ్టన్) - పోర్ట్ ల్యాండ్ విభాగం, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) అధ్వర్యంలో సీటెల్ హిల్లైర్ పార్క్ లో ఘనంగా నిర్వాహించారు. ఈ వేడుకల్లో సీటెల్ లో ఉన్న వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వైఎస్సార్ కు నివాళులర్పించారు. అనంతరం అశేష అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్సార్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల జ్యోతి ప్రజల్వన అందర్ని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీ రీజినల్ కో ఆర్డినేట్ దుశ్యంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తన హయాంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన ఆరోగ్యశ్రీ,108,104, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో చరిత్రలో చిరస్మరనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ " తండ్రి ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగు వేస్తా అని" వైఎస్సార్ ఆదర్శాలను పునికి పుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. -
కొత్తూర్‌లో డా.వైఎస్సార్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్
లక్సెట్టిపేట్: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్, ఎన్ఆర్ఐ గుండ అమర్నాథ్, 'నాటా' అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి దాతృత్వంతో కొత్తూర్ గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి సహకారం అందించారు. ఆర్వో ప్లాంట్‌ను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. డా.వైఎస్సార్ ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా వాటర్ ప్లాంట్స్ నిర్మించి లక్షలాది మందికి ప్రతి రోజూ మంచి నీరు అందిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో హెల్త్ క్యాంప్‌లు, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలకు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో మందికి చేయూత అందిస్తోంది. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన డాక్టర్ గోసల రాఘవరెడ్డి, దాత గుండ అమర్నాథ్, డాక్టర్ ప్రేమ్ సాగర్‌రెడ్డికి ఆళ్ల రామిరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చదవండి: హైదరాబాద్ రేసర్.. రికార్డులు తిరగరాశాడు! చదవండి: ఉద్యోగ సామర్థ్యాలున్న పట్టణాల్లో హైదరాబాద్ టాప్ -
అమెరికాలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
-
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరం
ఫిలడెల్పియా : రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదో వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిలడెల్పియాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కి ఘన నివాళి అర్పించారు. 150 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెళ్కూర్,అంజి రెడ్డి సాగంరెడ్డి, హరి కురుకుండ, ద్వారక వారణాసి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, శ్రీనివాస్ ఈమని, మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, లక్ష్మి నారాయణ రెడ్డి, లక్ష్మీనరసింహ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నాగరాజా రెడ్డి , జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, రవి మరక, అజయ్ యారాట, నరసింహ రెడ్డి, వెంకట్ సుంకిరెడ్డితో పాటు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఫిలడెల్ఫియా : రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తొమ్మిదవ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డా. రాఘవరెడ్డి గోశాల, రాజేశ్వరరెడ్డి, ఆళ్ల రామిరెడ్డి, పలువురు వాలంటీర్ల సహకారంతో జరిగిన రక్తదాన శిబిరానికి ఈశాన్య అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు వచ్చారు. వైఎస్సార్ వర్థంతి, 9/11 బాధితుల జ్ఞాపకార్థం దాదాపు 150మందికి పైగా వైఎస్సార్ అభిమానులు రెడ్ క్రాస్‌కు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సెక్రెటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెల్కూరు, జ్యోతి రెడ్డి, సహదేవ్ రెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్ ఎమాని, మధు గోనిపాటి, విజయ్ పొలంరెడ్డి, టాటా రావు, శ్రీధర్ తిక్కవరపు, రామ్ కల్లం, గీతా దోర్నాదుల, రామ్మోహన్ రెడ్డి యెల్లంపల్లి, నాగరాజ రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, అంజి రెడ్డి సగంరెడ్డి, రవి మరక, హరి కురుకుండ, అజయ్ యరాట, నరసింహారెడ్డి, మునీష్ రెడ్డి, ప్రసన్న కకుమను, సుదర్శన్ దేవిరెడ్డిలకి వైఎస్సార్ ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డా. రాఘవరెడ్డి గోశాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్‌లు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయిన గుర్తు చేశారు. అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు రాజేశ్వరరెడ్డిలు రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఆహ్లాద్ రెడ్డి, అభిషేక్ మీనన్, అభిలాష్ మార్ది, అభిషేక్ ఆలుగడ్డాల, అజయ్ దేవభక్తుని, అజయ్ కుమార్ యరాతా, అకాశ్ పటేల్, ఆనంద్ పటేల్, ఆనంద్ తొండపు, అనిల్ ఉల్లాసమ్, అనిల్ కుమార్ పద్మ, అనిరుద్ రెడ్డి, అనితా బద్వేలు, అంజిరెడ్డి సాగం రెడ్డి, అర్వింద్ కుమార్ బతిన, అరుణ్ కవాటి, అశోక్ కరకంపల్లే, బాలాజీ సమల్, బస్వాలింగప్ప, చదివే రెడ్డి, చంద్రా రెడ్డి, చెన్నా కేశవరెడ్డి, దేవిరెడ్డి, గిరియేటూరు, గిరిధర్ మాసిరెడ్డి, హరినాథ్ కురుకుండ, హర్ష వర్ధన్ రెడ్డి, జగన్ దుద్దుకుంట్ల, జయసింహారెడ్డి, జ్యోతిశ్వర్, కరుణాకర్ రెడ్డి, కిషోర్ ఇంటిపల్లి, లక్ష్మీ బృందా, లక్ష్మీ గోపిరెడ్డి, లక్ష్మీ విశ్వనాథుని, మధు గొనిపతి, మధుపాపసాని, మధుసూదన్ అరికట్ల, మల్లారెడ్డి, మల్లికార్జున కాసిరెడ్డి, మనోజ్ పులిచర్ల, మోహన్ బాబు భాస్కర్, మనిష్ రెడ్డి, నాగరాజ ఏటూరి, నాగేశ్వర మొదల్ల, నరసింహా రెడ్డి దాసరి, నరసింహులు దామెర, నరేశ్ అన్నం, నటరాజ పిల్ల, నియోల్ కట్ట, పద్మనాభరెడ్డి, పవన్ కుమార్ కుర్ర, ప్రభాకర్ యుదుముల, ప్రదీప్ ఇప్ప, ప్రతాప్ జక్క, ప్రవీణ్ కుమార్ పట్టెం(గురు), ప్రేమ్ వర్ధన్, రాధికా దొంతిరెడ్డి, రాఘవరెడ్డి గోశాల, రాజశేఖర్ గాదె, రాజశేఖర్ గుడురు, రామ్ కల్లం, రామగోపాల్ దేవపట్ల, రామక్రిష్ణముస్సాని, రామమోహన్ రెడ్డి యెల్లంపల్లి, రమణ కోత, రమేష్ జమ్ములదిన్నె, రమేష్ కొత, రమేష్ మీనన్, రవి మరక, రెడ్డయ్య వుండెల, రేవంత్ రెడ్డి, సహదేవ రాయవరం, శైలేష్, సంధ్య, సంగీత దత్త, సత్యనారాయణ ఆడెం, శైలజా శివ, శిరీష్ రెడ్డి గొంగల రెడ్డి, శివ జ్యోతి పదల, శివ కుమార్ బురం, శివ కుమార్ గోర్ల, సోమా రెడ్డి, శ్రీనివాస కూనాడి, శ్రీకాంత్ శివ, శ్రీనివాస పదల, శ్రీనివాసులు బొల్ల, సుబ్బారెడ్డి వాక, సుబ్బారెడ్డి వంగ, సదర్శన్ దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డి దొండేటి, సునిల్ కొతపాటి, సుప్రియ దామెర, సురేష్ వెంకన్నగిరి, సుష్మా సుంకిరెడ్డి, ఉమాశంకర్ పల్ల, వాసుదేవ్ రెడ్డి తాళ్ల, వెంకా సుంకర, వెంకట నొస్సమ్, వెంకట్ సుంకిరెడ్డి, వెంకట గడిబావి, వెంకట రెడ్డిమల్లా, వెంకట రెడ్డి యెర్రం, వెంకటరామి శనివారపు, వెంకటేశ్వర్లు, విజయ్ ఆలేరు, విజయ్ రెడ్డి గోండి, విజయ్ పొలంరెడ్డి, వినయ్ మందపాటి, వినయ్ వాసిలి, విశ్వనాథరెడ్డిలు రక్తదానం చేసినందుకు గానూ వైఎస్సార్ ఫౌండేషన్ మీడియా కమిటీ అధ్యక్షులు తిక్కవరపు, శ్రీకాంత్ పెనుమాడ, హరి కురుకుండ, సహదేవ్ రెడ్డి, అంజి రెడ్డి, మునిష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి శనివారపు, క్రిష్ణ, నరసింహరెడ్డి, రామ్మోహన్ రెడ్డిలకు వైఎస్సార్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది. -
ఖతార్‌లో ‘వాక్ విత్ జగనన్న’
సాక్షి, దోహా: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత వైఎస్ జగన్ పాదయాత్ర 1000కిలోమీటర్లు పూర్తి కానున్న సందర్భంగా ఖతార్‌లో ఉమ్ సలాల్ఆలీ అనే ప్రాంతంలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శశికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం మనకు కలుగుతుందని ఆయన అన్నారు. పేదవారికి సంక్షేమ పధకాలు అందడం లేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వానికి చమరగీతం పాడి 2019లో వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని శశికిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సాంబశివరావు, సామాజిక సేవకులు బి విల్సన్ బాబు, ఎన్. నాగేశ్వరరావు, మనిష్, జాఫర్, ప్రశాంత్, కిశోర్, గిరిధర్, రత్నం, భార్గవ్, రాజశేఖర్, అరుణ్, సాగర్ కోలా, సునీల్, ఇంజేటి శ్రీను, సునీల్, సుభాని, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. -
వైఎస్ మాటపై నిలబడతారని నమ్ముతున్న ప్రజలు
-
రాజన్న ఉండి ఉంటే.. ప్రతి పేదకు పక్క ఇల్లు
-
ఆరోగ్యశ్రీతో ప్రాణబిక్ష పెట్టిన వైఎస్
-
ఏపీలో సేవా కార్యక్రమాలు
సాక్షి నెట్వర్క్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబి రాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిం చారు. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని పండుగలా నిర్వహించారు. స్థానిక నేతలు పేదలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి 1000 కొబ్బరి కాయలు కొట్టారు. విశాఖ సిటీతో సహా జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రజలు వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. భీమవరంలో స్థానికనేతలు చీరలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గుంటూరు జిల్లా రెంటచింతలలో వైఎస్ఆర్ మైత్రీ యూత్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతపురంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తిలో అన్నదానం, రక్తదానాలు చేశారు. కర్నూలులో అనాథలకు, వృద్ధులకు, విద్యార్థులకు బ్రెడ్డు, పండ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. తిరుపతిలో విద్యార్థి విభాగం.. తంబళ్లపల్లిలో రెడ్‌క్రాస్‌సొసైటీ.. వైఎస్సార్ అభిమానుల నేతృత్వంలో రక్తదాన శిబిరాలు జరిగాయి. కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. మైదుకూరులోని వికలాంగుల పాఠశాల విద్యార్థులకు పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజంపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
వైఎస్‌పై పాటను రూపొదించిన అభిమానులు
-
వైఎస్ఆర్ ఫౌండేషన్ ఉచిత శిబిరాలు
రాజమండ్రి: గోదావరి పుష్కర యాత్రికుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఉచిత సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా పాలు, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. రాజమండ్రి నగరంలో పలు చోట్ల ఫౌండేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయ శిబిరాల్లో ప్రత్యేకంగా యాత్రికుల కోసం లాకర్లను అందుబాటులో ఉంచారు. సహాయ శిబిరాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సందర్శించారు. -
అమెరికాలో వైఎస్సార్ ఫౌండేషన్ ఫుడ్‌డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ (యూఎస్ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో వారం రోజులపాటు ఫుడ్‌డ్రైవ్ నిర్వహించారు. దాదాపు10 వేల మంది నిరుపేదలకు గతనెల 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. దీని కోసం ఫుడ్ బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీస్ ఆహారాన్ని సమకూర్చాయని ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి తెలిపారు. డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి పర్యవేక్షణలో వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
హుద్‌హుద్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
నెల్లిమర్ల: ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులను వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా అన్నివిధాలా ఆదుకున్నామని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. తుఫాన్‌వల్ల చనిపోయిన 14మంది కుటుంబాలకు రూ.50వేలు చొప్పున వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. మండలంలోని దన్నానపేట గ్రామానికి చెందిన పంతగడ ప్రతాప్ అనేవ్యక్తి హుద్‌హుద్ తుఫాన్ సమయంలో స్థానిక చెరువు దాటుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతాప్ భార్య వెంకటదుర్గకు వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున పెనుమత్స సాబంశివ రాజు శుక్రవారం రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాలకు చెందిన కుటుంబాలకు వైఎస్సార్ ఫౌండేషన్‌ద్వారా బియ్యం, వస్త్రాలు అందజేశామని చెప్పారు. అయితే ప్రభుత్వం తరఫున బాధితులకు అందాల్సిన సాయం ఇప్పటిదాకా పూరిస్థాయిలో అందలేదని ఆరోపించారు. జిల్లాలో లక్షలాదిమంది రైతులు పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే ఇప్పటిదాకా రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. రైతుసాధికార సదస్సుల ద్వారా కేవలం ఒక్కోగ్రామానికి ఒకరిద్దరే రైతులను మాత్రమే ఎంపికచేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. టేకు, మామిడి, కూరగాయలు తదితర పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిం చారు. నష్టపరిహారం అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుద్‌హుద్‌వల్ల నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యు డు గదల సన్యాసినాయుడు, రైతువిభాగం కన్వీనర్ సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంటకరమణ, మాజీ ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, పార్టీనేతలు జానా ప్రసా ద్, రేగాన శ్రీనివాసరావు, తర్లాడ దుర్గారావు, మహంతి రామారావు, మీసాల నారాయణరావు, తులసి పాల్గొన్నారు. -
కువైట్ వైఎస్సార్సీపీ సాయం రూ.4.7 లక్షలు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ బాధితుల సహాయార్థం కువైట్‌లోని వైఎస్సార్ సీపీ గల్ఫ్ విభాగం తరపున రూ.4.7 లక్షల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందచేశారు. పార్టీ గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఈ మేరకు చెక్కును అందించారు. కష్టాల్లో ఉన్న సాటి తెలుగువారిని ఆదుకునేందుకు కువైట్ తెలుగువారు స్పందించి విరాళాలు ఇచ్చినట్లు ఇలియాస్ తెలిపారు. వారి వితరణను జగన్ అభినందించారు. జగన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్బాష, మేయర్ సురేష్‌బాబు, కువైట్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్‌బాష, ఎస్.నజీర్, బాబు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందిన విరాళాలు
13-11-14 వరకు వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందిన విరాళాలు -
పూర్తి వివరాలు అందజేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి అవినీతి, అక్రమాలపై తేరా చిన్నపరెడ్డి ఇచ్చి న ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. జానారెడ్డి అక్రమాలపై తానిచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందిం చడం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు. జనారెడ్డి అధికార దుర్వినియోగం, అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం సమర్పించామని చిన్నారెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఏ విధంగా తుంగలో తొక్కిందీ సీబీఐకి, కేంద్ర హోంశాఖకు ఆధారాలతో వివరించామన్నారు. అయితే సీబీఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేంద్ర హోంశాఖ మాత్రం జానారెడ్డిపై తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు వారు ఏ విధంగానూ స్పందించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సీబీఐ తరఫు న్యాయవాదిని పిలిపించి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేశారు. -
తుపాను నిధికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల విరాళం
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుఫాన్ బాధితులను అదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను సహాయ నిధికి ఇద్దరు ఎమ్మెల్యేలు లక్ష చొప్పన విరాళం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, కొక్కిలగడ్డ రక్షణనిధిలు తమ ఎమ్మెల్యేల వేతనం నుంచి చెరో లక్ష రూపాయల సహాయ నిధికి అందజేశారు. ఇరువురు నాయకులు శుక్రవారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి చెక్కులను అందజేశారు. -
తుపాను బాధితులకు సాయం
ఎచ్చెర్ల/ఎచ్చెర్ల రూరల్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు నడుంబిగించాయి. సహాయక చర్యల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగుట్ల పాలేంలో బియ్యం, దుస్తులు (చీర,జాకెట్)అందజేశాయి. రేషన్ కార్డులు ఆధారంగా 500 మందికి ఈ కిట్లను అందజేశారు. పంపిణీ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట నష్టాలు అంచనా వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పాస్‌పుస్తకాలు, ఆధార్, బ్యాంకు పుస్తకాల కార్డులతో రైతులను ప్రదక్షిణలు చేయిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మాడుగుల మురళీధర్ బాబా, మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్ జీరు రామారావు, మాజీ సర్పంచి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాన్ వల్ల నష్టపో్యిన బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముందుకొచ్చారు. తుపాన్ బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు ఉమ్మారెడ్డి లక్ష రూపాయలు విరాళం అందజేశారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాన్ బాధితులకు సహాయం చేసేందుకు విరాళాలు అందజేస్తున్నారు. -
తుపాను బాధితులకు సహృదయంతో స్పందించండి
తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు విరాళాలకు సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ఈ-మెయిల్ ద్వారా రసీదు, డొనేషన్ సర్టిఫికెట్ విరాళాలు పంపాల్సిన ఖాతా వివరాలు.. ఖాతా పేరు : వైఎస్సార్ ఫౌండేషన్ ఖాతా సంఖ్య : 31868397566 బ్యాంకు పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0008022 బ్రాంచి : బంజారాహిల్స్, ైెహ దరాబాద్ బ్రాంచి కోడ్ : 08022 చెక్కులు/ డీడీలు పంపాల్సిన చిరునామా వైఎస్సార్ ఫౌండేషన్, C/oసాక్షి తెలుగు డైలీ, 6-3-249/1,సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్-500034. సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను రాకాసిలా విరుచుకుపడడంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి అండగా నిలవాలి. సహృదయంతో స్పందించాలి. లోగడ కూడా ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని సంకల్పించాయి. హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (డటటజౌఠఛ్చ్టీజీౌ2005ఃజఝ్చజీ.ఛిౌఝ)ద్వారా తమ పేరు, చిరునామా తెలియజేయాలి. వారికి రసీదు, దానితోపాటు 80జీ కింద పన్ను మినహాయించుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికెట్ పంపిస్తారు. రూ. 5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం. బుధవారం వరకు వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందిన విరాళాలు (రూపాయల్లో) 20వ తేదీ వరకు అందిన విరాళాలు 70,26,227 వంగవీటి రాధాకృష్ణ 1,00,000 లంకాడ గౌతమి(హైదరాబాద్) 16,000 డి.సాయినాథ్ రెడ్డి(చెన్నై) 11,500 గాదె వీరారెడ్డి(గుంటూరు) 5,555 చిలుకు రవికుమార్ 5,033 ఎం. ఉమామహేశ్వర రెడ్డి 5,000 గొంది ఉదయ్ కుమార్ 5,000 బి.సుబ్బారెడ్డి 5,000 ఎన్.ఎస్. మద్దిలేటి రెడ్డి 5,000 శీలం శ్రీనివాసరెడ్డి 5,000 చల్లా సుశీలమ్మ(తిరుపతి) 5,000 కట్టిరెడ్డి శేఖర్‌రెడ్డి 5,000 ఇతరులు 5,441 మొత్తం 72,04,756 -
హూదూద్ బాదితులకు అండగా నిలిచిన వైస్సార్ ఫౌండేషన్,సాక్షి
-
సహృదయంతో స్పందించండి
తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు విరాళాలకు సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ఈ-మెయిల్ ద్వారా రసీదు, డొనేషన్ సర్టిఫికెట్ విరాళాలు పంపాల్సిన ఖాతా వివరాలు.. ఖాతా పేరు : వైఎస్సార్ ఫౌండేషన్ ఖాతా సంఖ్య : 31868397566 బ్యాంకు పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0008022 బ్రాంచి : బంజారాహిల్స్, ైెహ దరాబాద్ బ్రాంచి కోడ్ : 08022 సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను రాకాసిలా విరుచుకుపడడంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి అండగా నిలవాలి. సహృదయంతో స్పందించాలి. లోగడ కూడా ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని సంకల్పించాయి. హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (ysrfoundation2005@gmail.com)ద్వారా తమ పేరు, చిరునామా తెలియ జేయాలి. వారికి రసీదు, దానితోపాటు 80జీ కింద పన్ను మినహాయిం చుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికేట్ పంపిస్తారు. రూ.5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం. -
వైఎస్సార్ ఫౌండేషన్ ‘తుపాను నిధి’కి రూ.15 లక్షల విరాళం
హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తుపాను బాధితుల సహాయ నిధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ రూ.15 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు శనివారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు చెక్కు అందజేశారు. - సాక్షి, హైదరాబాద్ -
వైఎస్ఆర్ సీపీ నేత తోట చంద్రశేఖర్ విరాళం
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట చంద్రశేఖర్ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. తుపాను బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునివ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతలు స్పందించారు. ఆ మేరకు తోట చంద్రశేఖర్ శనివారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి పదిహేను లక్షల చెక్కును అందించారు. కాగా హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తమ రెండు నెలల వేతనాన్ని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలరోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన నిధికి తొలి విరాళంగా జగన్ రూ.50 లక్షలు ప్రకటించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల విరాళం
* ఎంపీలు 2 నెలలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నెల వేతనం విరాళం * విజయసాయిరెడ్డి విరాళం లక్ష రూపాయలు సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తమ రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. తుపాను బాధితుల సహాయార్థం వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన నిధికి తొలి విరాళంగా జగన్ రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు తుపాను బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని ఆయన పిలుపునివ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతలు స్పందించారు. పార్టీ ఎంపీలు తమ రెండు నెలల వేతనాన్ని వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు సంస్థలు ఏర్పాటు చేసిన నిధికి విరాళంగా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నెల రోజుల వేతనాన్ని ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. సాక్షి ఉద్యోగుల విరాళం తుపాను బాధితుల సహాయార్థం ‘సాక్షి’ మీడియా గ్రూపు సంస్థల ఉద్యోగులు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి నిధికి వారు ఆ విరాళాన్ని అందజేస్తారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చారు. ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వారీ నిర్ణయం తీసుకున్నారు. హుదూద్ తుపాను బాధితులకు సహాయం అందించేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, ‘సాక్షి’ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తొలి విరాళాన్ని ప్రకటించారు. తన వంతుగా ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని బుధవారం ప్రకటించారు. -
వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం
-
బాధితులను ఆదుకోండి
* దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా పిలుపు * తుపాను బాధితుల కోసం విరాళాల సేకరణ.. సహృదయంతో స్పందించాలని వినతి * విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు * రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సానికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుపాను రూపంలో ప్రకృతి చూపిన ఆగ్రహానికి గంటల్లో అల్లకల్లోలం జరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు చిద్రమయ్యాయి. సర్వహంగులతో శరవేగంగా ఎదుగుతున్న విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. అన్ని వ్యవస్థలు అవస్థలపాలయ్యాయి. 35 మంది నిండు ప్రాణాలతో పాటు వృత్తులు, వ్యాపారాలు, ఇళ్లు, రోడ్లు, చెట్లు, పంటలు.. ఇలా సర్వం కకావికలమైన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సాటి మనిషి ఆక్రందన చూసి ప్రతి తెలుగు హృదయం ద్రవిస్తోంది. ఈ విలయం చూసి ‘అయ్యో పాపం’ అనని వారు లేరు. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి సాంత్వన చేకూర్చాలి. ఆపన్న హస్తంతో ఆదుకోవాలి. సహృదయంతో స్పందించాలి. అలా స్పందించే గుణం ప్రతి తెలుగువాడి సొంతం. గతంలోనూ ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు, బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి ‘వైఎస్సార్ ఫౌండేషన్’ తన సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. బాధితులకు అవసరమైన సేవలందించింది. ఎప్పటిలాగే వైఎస్సార్ ఫౌండేషన్ ఈ విపత్తులోనూ బాధితుల సహాయం కోసం చొరవతో ముందుకు వచ్చింది. కష్టాల్లో ఉన్న పౌరుల్ని ఆదుకునే కృషిలో ఎప్పుడూ ముందుండే ‘సాక్షి మీడియా గ్రూప్’తో కలసి ఈ సేవా కార్యక్రమానికి పూనుకుంది. లోగడ కూడా ఇటువంటి ప్రాకృతిక విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇప్పుడు హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. ఈ పిలుపునకు స్పందనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారిని ఆదుకోవాల్సిందిగా వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు ఈ బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ అందించవచ్చు. జగన్ తొలి విరాళం రూ.50 లక్షలు సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులకు సహాయం అందించేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, ‘సాక్షి’ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తొలి విరాళాన్ని ప్రకటించారు. తన వంతుగా ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించినట్టు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించిన నేపథ్యంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి ఏర్పాటు చేసిన తుపాను సహాయ నిధికి తమ వంతుగా శక్తి మేరకు సాయం అందించాల్సిందిగా పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. -
వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి. సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు. అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022 బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంచి కోడ్: 08022 -
వైఎస్‌పై ప్రవాసాంధ్రుల అభిమానం ఎనలేనిది
మంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రవాసాంధ్రులు చూపిస్తున్న అభిమానం మరువలేనిదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. అమెరికాలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ఇటీవల అమెరికా వె ళ్లారు. ఈనెల ఏడో తేదీన ఫిలడెల్ఫియాలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ఆర్కే ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ అమెరికాలో సైతం ప్రవాసాంధ్రులు వైఎస్సార్ వర్ధంతి భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. సుమారు రెండు వేల మందికి పైగా వైఎస్సార్ అభిమానులు రక్తాన్ని దానం చేశారని తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కోరారు. దీనికి తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని ఫౌండేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఆర్కే, ముస్తాఫాలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
అమెరికాలో రక్తదాన శిబిరం
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథులుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి హాజరు కానున్నారు. రక్తదాన శిబిరం ఫిలడెల్ఫియా సమీపంలోని కింగ్ అఫ్ పర్షియాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాలీ ఫోర్జ్ రాడిస్సన్ హోటల్ లో ఉంటుందని, ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. అందరూ కుటుంబ సమేతంగా మహానేత వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు ysr_usa@yahoo.comకు ఇ-మెయిల్ పంపాలని లేదా డాక్టర్ రాఘవరెడ్డి (267-261-9436), ఆళ్ల రామిరెడ్డి (973-386-8980) లను సంప్రదించాలని తెలిపారు. -
రాజన్నకు ఘననివాళి
సాక్షి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు, వైఎస్సార్ అభిమానులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. పేదలకు అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు వాడవాడలా జరిగాయి. తమ కోసం వైఎస్సార్ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పిలుపుమేరకు గాంధీబొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్‌తో పాటు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లోనూ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు, అన్నదానం జరిగాయి. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి సమర్పించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. బుచ్చిరెడ్డిపాళెంలో పార్టీ మండల కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దామరమడుగు, పెనుబల్లి, రెడ్డిపాళెంలో అన్నదానం నిర్వహించారు. ఇందుకూరుపేటలో మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కోవూరులోనూ పార్టీ నేతలు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. విడవలూరు, కొడవలూరులో ఆయా మండలాల కన్వీనర్లు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య ఆధ్వర్యంలో ైవె ఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఉదయగిరిలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎల్.ప్రవీణకుమారి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. వింజమూరులో ఎంపీపీ గణపం బాలకృష్ణారెడ్డి, దుత్తలూరులో ఎంపీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. జలదంకిలో దివంగత నేత విగ్రహానికి ఘననివాళులర్పించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బోయలచిరువెళ్ల, మర్రిపాడు మండలం చినమాచనూరు, చేజర్ల మండలం మావులూరులో విగ్రహాలకు నివాళులర్పించడంతో పాటు అన్నదానం నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విగ్రహాలకు క్షీరాభిషేకం చేయడంతో పాటు వైద్యశిబిరాలు, అన్నదానం తదితర కార్యక్రమాలు చేపట్టారు. సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేయడంతో పాటు ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కావలిలో వాడవాడలా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గోసల గోపాలరెడ్డి, రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోగోలులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ తూపిలి పెంచలయ్య, ఎంపీపీ పర్రి సులోచనమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు బాపట్ల కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అల్లూరులో జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ గంగపట్నం మంజుల, సర్పంచ్ చంద్రలీలమ్మ, కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ షరీఫ్ తదితరులు హాజరయ్యారు. దగదర్తిలో పార్టీ మండల కన్వీనర్ గోగుల వెంకయ్య తదితరుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు ఘననివాళులర్పించారు. -
వైఎస్ జగన్ జనంలోకి రావడంపై లండన్ ఎన్ఆర్ఐల్లో ఆనందం
-
రాష్ట్ర సమస్యలను పరిష్కరించగల ఏకైక నాయకుడు జగన్ అంటున్న ఎన్ఆర్ఐలు
-
జనంలోకి జగన్: డల్లాస్ లో సంబరాలు
-
జగన్ విడుదలతో హలీవుడ్లో సంబరాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌పై విడుదల అవ్వడం పట్ల యూఎస్‌లోని వైఎస్ ఫ్యాన్ క్లబ్ హార్షం ప్రకటించింది. ఈ సందర్బంగా లాస్ ఏంజెల్స్‌లోని హాలివుడ్లోని ఐసోటోప్‌లో శుక్రవారం సాయంత్రం వైఎస్ ఫ్యాన్స్ క్లబ్ యూఎస్ఏ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ ఫ్యాన్స్ క్లబ్ యూఎస్ఏ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల మాట్లాడుతూ... వైఎస్ జగన్ సారథ్యంలో సమైక్య ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతోందని ఆకాంక్షించారు. అలాగే జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులన్ని సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున్న ఎగసి పడుతోన్న ఉద్యమానికి సారథ్యం వహిస్తారని వైఎస్ ఫ్యాన్స్ ధర్మారెడ్డి గుమ్మడి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారం కోసం కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన కలలు కల్లలు అయ్యాయని ధర్మారెడ్డి గుమ్మడి గుర్తు చేశారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి పరాభవం కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలు క్విడ్ ప్రో కో చేస్తున్నాయని మల్లిక్, వేణు కాటురీలు ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు అన్ని తొలిగిపోయి మచ్చలేని నాయకుడిగా సాధ్యమైనంత త్వరలో బయటకు వస్తారని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాల్య స్నేహితుడు డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఆకాంక్షించారు. జగన్ జైలు నుంచి విడుదల కావడం చాలా ఆనందం కలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నగేష్, మల్లికారెడ్డి, ప్రసాద్ రాణీ,బయ్యప రెడ్డి, వేణు రెడ్డి, సాయి, రాజా రెడ్డి, సందీప్, ప్రవీణ్, రామకృష్ణలతోపాటు పలువురు వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
వైఎస్ జగన్ రాకతో న్యూజెర్సీలో పండుగ
న్యూజెర్సీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలునుంచి బయటకు రావడంతో అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. ఆళ్ళ రామిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి, సురేష్ రెడ్డి, హరి వేల్కుర్, శ్రీకాంత్ గుడిపాటి, అన్నారెడ్డి, రమణ దేవులపల్లి, శ్రీకాంత్ పెనుమాడ, ప్రతాప్ భీమిరెడ్డి, సంతోష్ పాతూరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఈశాన్య అమెరికాలో ఉంటున్న 300 పైగా వైఎస్సార్ అభిమానులు హాజరైనారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైనా పలువురు వక్తలు ప్రసంగించారు. ఓదార్పు యాత్రకు వెళతానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఆస్తులు పోయినా, జైలుకు వెళ్లినా పర్వాలేదు అని ధైర్యంగా మాట మీద నిలబడిన ధీరుడు వైఎస్ జగన్. మన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పట్టడం చూస్తుంటే ఎంత గొప్ప నాయకుడైనాడో తెలిసిపోతున్నది. ఇంతటితో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కష్టాలు తీరిపోవాలని కోరుకుంటూ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించకుండా అన్ని విధాలా వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటామని కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం పనిరోజు అయినప్పటికీ ఇంతమంది అభిమానులు తమ సంతోషాన్ని పంచుకోవడానికి కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తీసుకు రాగలిగిన ఏకైక నాయకుడు జగనే అని, అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పీడ విరగడ కావాలని ఆకాంక్షించారు. రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి సమయంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పట్టడం చూస్తేంటే జనంలో ఎంత అభిమానం ఉన్నదో అర్ధం అవుతున్నదని తెలియ చేశారు. రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి నాయకుణ్ణి భారత దేశం మొత్తం మీద వెతికినా కూడా ఒక్క నాయకుడు కూడా దొరకడని, కేసులకు భయపడి ఎంతో మంది నాయకులు తలవంచారని ఒక్క జగనే ధైర్యంగా నిలబడి పోరాడాడని చెప్పారు. ఈ సభలో సురేష్ రెడ్డి, రమణ దేవులపల్లి, శ్రీకాంత్ పెనుమాడ, ప్రతాప్ భీమిరెడ్డితో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు. కాగా, ఈ సమావేశం ఆళ్ళ రామిరెడ్డి వందన సమర్పణతో ముగిసింది. -
న్యూజెర్సీలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి, నివాళులు!
న్యూజెర్సీ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాలుగవ వర్ధంతిని న్యూజెర్సీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ అభిమానులు సెప్టెంబర్ 7 తేది రాత్రి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన ఈ శిబిరానికి అమెరికన్ రెడ్ క్రాస్ పూర్తి సహకారాన్ని అందించింది. అదే రోజు సాయంత్రం న్యూ జెర్సీలో జరిగిన వర్ధంతి సభకి పదిహేను వందల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఫౌండేషన్ అడ్వైజరీ కమిటీ చైర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడు డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి కార్యక్రమాలకు హాజరయ్యారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రేంసాగర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ లేని లోటు పూడ్చలేనిది. మహానేత ప్రభుత్వ హయంలోఅన్ని రంగాలలో, వర్గాలలో తన ముద్ర ప్రగాడంగా ఉండేటట్టు వివిధ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి డాక్టర్ వైఎస్సార్ అమరుడయ్యరని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంకా ప్రజల మధ్య జీవించి ఉంటే పేద ప్రజలకి ఇంకా మంచి జరిగేది అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అనేకానేక సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలోనే అత్యంత ప్రతిభావంత నేతగా నిలిపి, దేశ రాజకీయాలనే ప్రభావితం చేసిన నేతగా రాజశేఖర్ రెడ్డి గారిని అభివర్ణించారు. రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటు ప్రస్పుటంగా కనిపిస్తున్నదని, మనమంతా ఆ మహానేత అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆశయ సాధనలో నిర్విరామ కృషి చెయ్యడమే ఆయనకి మనమిచ్చే అత్యంత ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి, డాక్టర్ పైల్ల మల్లా రెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ రాఘవ రెడ్డి, రాజేశ్వర రెడ్డి గంగసాని, రమేష్ అప్పారెడ్డీ, సురేష్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ అద్యక్షుడు ఆళ్ళ రామి రెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, విజయ బత్తుల, శివా మేక, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వివిధ రాష్ట్ర స్తాయి కోఆర్డినేటర్లు, అమెరికా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్ర ప్రముఖులు హాజరయ్యారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద అభిమానుల నివాళి
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు శనివారం పెద్దఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున వ చ్చిన అభిమానులు వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి వైఎస్ కుటుంబీకులకు మంచి జరగాలని ప్రార్థించారు.