రాజమండ్రి: గోదావరి పుష్కర యాత్రికుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఉచిత సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా పాలు, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. రాజమండ్రి నగరంలో పలు చోట్ల ఫౌండేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయ శిబిరాల్లో ప్రత్యేకంగా యాత్రికుల కోసం లాకర్లను అందుబాటులో ఉంచారు. సహాయ శిబిరాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సందర్శించారు.