jyothula nehru
-
బాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. స్పష్టమైన ప్రభుత్వ వైఫల్యం..
-
ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!
సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక పాలసీ అంత మంచిగా లేదని ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల.. ఇసుక విధానాన్ని వ్యతిరేకించారు. సామాన్యులకు అందే పరిస్థితి లేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుందని మాట్లాడుతుండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మైక్ కట్ చేసేశారు.తాను అందరికంటే సీనియర్‌నని.. మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ స్పీకర్‌ని జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ లేకపోయినా తన ప్రసంగాన్ని జ్యోతుల కొనసాగించారు. రెండు నిమిషాల సమయం ఇవ్వాలంటూ మిగిలిన సభ్యులు చెప్పగా, జ్యోతుల నెహ్రూ ప్రసంగ సమయంలో రఘురామకృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్కాగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.ఒక యూనిట్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కంటే ఆఫ్‌లైన్‌లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
ఉచిత సిలిండర్.. బాబుకు షాకిచ్చిన సొంత ఎమ్మెల్యే
సాక్షి, కాకినాడ: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అంటూ డబ్బులు కట్టించుకోవడం ఏంటి? అని టీడీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ముఖ్మమంత్రి చంద్రబాబును దీనిపై ప్రశ్నిస్తానని కామెంట్స్ చేశారు.టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలును వ్యతిరేకిస్తున్నాను. లబ్ధిదారుల నుండి డబ్బులు కట్టించుకోవడం సరికాదు. ఉచితం అంటే ఉచితంగానే కనిపించాలి. ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు రూ.2,800 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అలాంటప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి.. లేదంటే ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలో వేయాలి.అంతేకానీ ఇలా చేయడం సరికాదు. సిలిండర్ కోసం డబ్బులు లేకపోతే సామాన్య ప్రజలు రూ.5,10 వడ్డీకి దళారుల వద్ద అప్పు చేయాల్సిన పరిస్ధితి ఉంటుంది. దళారులు బాగుపడటానికి అధికారులే ఈ వ్యవస్ధను పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ విషయంపై నిర్మోహమాటంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబును అడుగుతాను. చంద్రబాబు నిల్చోబెట్టి ఈ విధానాన్ని మారుస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
వాలంటీర్లు వేస్ట్.. తేల్చి చెప్పిన టీడీపీ నేత
-
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.పవన్‌కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్‌లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది. -
జ్యోతుల నెహ్రుపై జనసేన ఫైర్..ఓపెన్ ఛాలెంజ్
-
సీనియర్లకు నచ్చని నవీన్! ఆల్రెడీ బాస్‌కు కంప్లైంట్.. కాకరేపుతున్న కాకినాడ
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చ పార్టీ తెలంగాణ కాంగ్రెస్‌లా తయారవుతోంది. ఓ జిల్లాలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటూ వార్ జరుగుతోంది. ఓ సీనియర్ నేత తనయుడు ఒకానొక పార్లమెంటరీ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్లకు నచ్చడంలేదని టాక్. జూనియర్లను ప్రోత్సహించడం అసలు సహించలేకపోతున్నారట. అందుకే ఆ నాయకుడు తమకొద్దని పార్టీ చీఫ్‌కు తేల్చి చెప్పేశారట. కాకినాడ టీడీపీలో రగులుకున్న మంటలు పక్క జిల్లాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తనయుడుగా.. మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా నవీన్ సుపరిచితం. ఇటీవల కాలంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నవీన్ అనుసరిస్తున్న విధానాలు కొందరు సీనీయర్ నేతలకు మింగుడు పడడం లేదని టాక్. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణీ నేతలను నవీన్ ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. అలా ప్రోత్సహించిన నేతలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారట. దీంతో నవీన్ నాయకత్వం తమకు వద్దని మరో నేతను నియమించాలంటూ కొందరు తమ బాస్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సైకిల్ ఎక్కేది నేనే.! గతంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో నవీన్ రెండు నెలల పాటు పాదయాత్ర చేశారు. తొలుత ఈ పాదయాత్రకు యనమలతో పాటుగా పలువురు సీనియర్లు.. మాజీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆ తరువాత నవీన్ ముఖం చూడడమే మానేశారట. అంతేకాదు గత నెలలో పాదయాత్ర ముగింపు సందర్భంగా నవీన్‌ను కలవడానికి ఒక్క నేత కూడా రాలేదని సమాచారం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవీన్ నిర్వహించిన యాత్ర తుస్సు మన్నట్లు అయిందని పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్ధినని నవీన్ తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం యనమల రామకృష్ణుడు.. నిమ్మకాయల చినరాజప్ప వంటి సీనియర్లుకు రుచించడం లేదని టాక్. తండ్రి జగ్గంపేట నుండి ఎమ్మెల్యేగా.. కొడుకు కాకినాడ పార్లమెంట్ సీటుకు ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నించుకుంటున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికి సీట్లు ఎలా ఇస్తారని చర్చించుకుంటున్నారట. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ జిల్లా పార్టీలో మంటలు రేపారు. ఒక వైపు జూనియర్లను ప్రోత్సహిస్తూ సీనియర్లకు కంటగింపుగా మారారు. మరోవైపు తండ్రీ, కొడుకులిద్దరూ పోటీ చేస్తున్నారనే సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అసమ్మతిని పెంచి పోషిస్తున్నారు. చూడాలి చివరకు ఏమవుతుందో..? -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విడదీయాలని చూస్తున్న జ్యోతుల నెహ్రు: ప్రేమజంట
-
'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది'
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట ఆరోపిస్తోంది. తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అపర్ణ తల్లిదండ్రులకు తెలపగా వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారు కూకట్పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అపర్ణ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను సంప్రదించగా, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపింది. అయితే విచారణలో భాగంగా గండేపల్లి రావాలని పోలీసులు కోరారు. చదవండి: (అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?) తల్లిదండ్రులనుంచి ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రేమజంట విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని చేతన కన్వినర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహిళా చేతన కన్వినర్ కత్తి పద్మ మాట్లాడుతూ.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని జగ్గంపేట రావాలని జ్యోతుల నెహ్రూ ఒత్తిడి చేయడం సరికాదు. నిజంగా ఆయనకు చట్టంఐ గౌరవం ఉంటే విశాఖపట్నం రావచ్చు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడితే అంగీకరించే పరిస్థితి లేదు' అని కన్వినర్ కత్తి పద్మ అన్నారు. ఈ విషయంపై అపర్ణను సంప్రదించగా.. 'వివాహం విషయంలో మా బంధువులు బ్లాక్ మెయిల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా కుటుంబానికి బంధువులు. ఆయన మాపై ఒత్తిడి తెస్తున్నారు. జగ్గంపేట గండేపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే మాకు ప్రమాదం ఉంది' అని అపర్ణ తెలిపింది. -
టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు గుండెపోటు
జగ్గంపేట: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. పొలంలో ఉండగా సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. జగ్గంపేట నుంచి వైద్యులు హుటాహుటిన చేరుకుని, ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జగ్గంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెహ్రూకు డాక్టర్ రమేష్ ఆక్సిజన్ అందించి ఉపశమనం కల్పించారు. అనంతరం రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన అపాయం నుంచి బయటపడ్డారని టీడీపీ నేతలు తెలిపారు. -
టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
-
టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
జగ్గంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుపోటములు సహజమని, వాటికి సిద్ధపడి ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపం కలిగించిందని తెలిపారు. పార్టీకి సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా చోట్ల గెలిచే అవకాశాలున్న తరుణంలో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకోం రావికమతం : పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన తాము ఎన్నికల బరిలోంచి తప్పుకోమని విశాఖ జిల్లా రావికమతం మండల టీడీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మేడివాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉంటారని ధిక్కార స్వరం వినిపించారు. -
టీడీపీలో కల్లోలం: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొన్ని గంటలకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగా జ్యోతుల నెహ్రూ గళం విప్పారు. చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేడర్ అభిప్రాయాలు చంద్రబాబుకు పట్టవా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదని అన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ -
ఫైల్స్ మోసావ్.. ఎమ్మెల్యే సీటు ఇప్పించారు
సాక్షి, తూర్పుగోదావరి : ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయింది నువ్వు.. నేను కాదు. ఆనాడు తోట సుబ్బారావు వెనుక మావయ్య మావయ్య అంటూ ఫైల్స్ మోసావ్. ఆయనకు ఎంపీ సీటు రావడంతో తన వారిని కాదని నీకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. తోట సుబ్బారావు వల్లే నీకు అదృష్టం కలిగింది. సీఎం వైఎస్ జగన్ మిమ్మల్ని నమ్మి సీటు ఇస్తే.. టీడీపీకి అమ్ముడు పోయి పార్టీని మోసం చేశారు’ అంటూ మండిపడ్డారు. (‘ఈటలను ఓడించకుంటే నా పేరు కౌశిక్ కాదు’) శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలపై టీడీపీ దాడులు చేయించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తోంది. జరుగుతున్న అవాంఛనీయ సంఘటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చెయ్యాలని టీడీపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోంది. కుల,మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేద్దాం అంటే ఎప్పటికీ చెల్లు బాటు కాద’’ని అన్నారు. -
టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు మహానాడు వేదికగా మాటల యుద్దానికి దిగారు. చంద్రబాబు ముందే టీడీపీ నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఒకరినొకరు విమర్శించున్నారు. ఈ క్రమంలో చినరాజప్ప మాట్లాడుతూ.. కొంత మంది నేతలు అధికారం పోగానే పార్టీని వీడిపోయారని అన్నారు. తిరిగి వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. మాజీ మంత్రలు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో లేకుంటే పార్టీని పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎవరు ఏ విధంగా వ్వవహారిస్తున్నారో చంద్రబాబు గమనించాలని చినరాజప్ప అన్నారు. (‘రెండు కుటుంబాల గొడవను రాజకీయం చేస్తున్నారు’) చినరాజప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత జ్యోతులు నెహ్రూ తీవ్రంగా విబేధించారు. మైకులు పట్టుకొని మాట్లాడితే సరిపోదని విమర్శించారు. ముందు పార్టీ కేడర్‌కు నమ్మకం కలిగించాలన్నారు. నాయకుని చుట్టు ప్రదక్షణ చేస్తే నాయకత్వం రాదని ఎద్దేవా చేశారు. పార్టీ కేడర్ చూట్టు ప్రదక్షణలు చేయాలన్నారు. చినరాజప్ప మరింత బాద్యతగా వ్యవహరించాలన్నారు. పదవులు రావడమనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. జిల్లాలో తనకు తెలియకుండానే పలు కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు రాష్ట్ర కమిటీ నాయకులు వస్తే కనీసం సమాచారం ఇవ్వడం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..
వరుస పంక్చర్లతో కుదేలైపోతున్న ‘సైకిల్’ సచిత్రమాలిక కళ్లెదుటే కనిపిస్తోంది. వికృత చేష్టలతో, అహంకార పూరిత నిర్ణయాలతో, రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అవరోధం కల్పించేలా వ్యవహరిస్తున్న అధినాయకత్వం ప్రజలకు మరింత దూరమవుతోంది. ఐసుగడ్డను ఢీకొని, ముక్కచెక్కలవుతూ, నడిసంద్రంలో మునిగిపోతున్నట్టుగా మారిన ‘తెలుగుదేశం’ నావను భవిష్యత్తీరాలకు చేర్చడానికి.. చుక్కాని పట్టి నడిపించే భావి నేత కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే తమ పుట్టి కూడా మునుగుతుందన్న భయంతో ‘తమ్ముళ్లు’ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి, అత్యంత ప్రజాదరణతో వెలుగొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ నాయకులు ఒక్కొక్కరూ జారిపోతూండడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేజారెత్తిపోతోంది. అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో విసుగు చెందుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తూ కూడా ఇంకా టీడీపీలో కొనసాగడమంటే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భయం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి జారిపోతున్న నేతలను నిలబెట్టుకోలేక టీడీపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కనిపించాయి. కానీ అప్పటికంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచిన తరువాతే జిల్లాలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండి నరనరానా టీడీపీ రక్తమే ప్రవహిస్తోందని బహిరంగంగా చెప్పుకునే నేతలు కూడా బయటకు పోతున్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. వలసలను నిరోధించలేక ఆ పార్టీ ముఖ్యనేతలు దిక్కులు చూస్తున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం పార్టీ నేతలను నిలువరించలేకపోతున్నారు. ►పార్టీని నమ్ముకున్నా నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్ సీపీలో చేరి, తిరిగి ప్రలోభాలతో టీడీపీ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూదీ అదే పరిస్థితి. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమితమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు. ►సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్ ఇస్తున్నారు. నాడు హోం మంత్రిగా పార్టీలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట వర్గీయులను అమలాపురం పట్టణంలో వెతికి వెతికి మరీ కేసులలో ఇరికించి ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో.. వారందరూ ఇప్పుడు టీడీపీని వీడి రాజప్పకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. చదవండి: ఏబీవీ సస్పెన్షన్‌కు ఆధారాలున్నాయ్ ►తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ►ఇటు అమలాపురం పట్టణంలో కూడా తోట ప్రభావం, చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీఎన్టీయూసీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్ సీపీలో చేరారు. ►కాకినాడ రూరల్ కరప మండల టీడీపీ నేత పుల్లా ప్రభాకరరావు, పండూరుకు చెందిన ట్యాంకర్స్ యూనియన్ అధ్యక్షుడు బావిశెట్టి వెంకటేశ్వరరావు మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►తునిలో యనమల సోదర ద్వయం ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరారు. ► రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మాజీ జెడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్ టీడీపీని వీడి ఎమ్మెల్యే వేణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►రాజమహేంద్రవరంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, బీసీ సంఘ నాయకుడు కడలి వెంకటేశ్వరరావులు సీఎం జగన్ సమక్షంలో; పెద్దాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►కొత్తపేటలో మందపల్లి శనైశ్చర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సలాది బాబ్జీ, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం, దొంతంశెట్టి చినవీరభద్రయ్య, దళిత సంఘం నాయకుడు జంగా బాబురావు.. ఇలా టీడీపీ నేతలు అనేకమంది ఆ పార్టీ మనుగడ కష్టమనే భావనతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ►ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక టీడీపీ చేతులెత్తేసింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీకి 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. -
ఇదేంటి సార్.. ఎన్నికల కోడ్ పట్టదా..?
సాక్షి, కిర్లంపూడి: సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి వారం రోజులు దాటింది. ఎన్నికల నియమావళి ప్రకారం అధికార యంత్రాంగం పని చేయాలి. రాజకీయ నాయకులు సైతం ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలి. సార్వత్రిక ఎన్నికలు వస్తాయని ముందుగానే భావించిన అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో హడావుడి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో మండలంలో చాలా గ్రామాల్లో అధికారులు ఆయా పార్టీల నాయకులకు సమాచారం అందించి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. కొందరు స్పందించకపోవడంతో పలు చోట్ల ఫ్లెక్సీలు తొలగించారు. కృష్ణవరం గ్రామంలో మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామంలోని అధికార పార్టీ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, అందువల్లే ఫ్లెక్సీలు తొలగించలేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రాజుపాలెం గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. గురువారం రాజుపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే తమను అవమానించారని, తమ మనోభావాలను కించపరిచేలా దూషించారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జన్మభూమి సభలో భాగంగా తమ గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరినందుకు.. పోలీసులకు తమను సభ నుంచి గెంటేయాలని ఎమ్మెల్యే సూచించారని వారు మండిపడ్డారు. దళితులమనే చిన్న చూపుతోనే ఎమ్మెల్యే నెహ్రూ తన అగ్రకుల అహంకారం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రాజుపాలెం దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభల్లో టీడీపీ ప్రభుత్వ తీరుపట్ల నిరసన గళాలు వినిపిస్తునే ఉన్నాయి. సమస్యలపై ప్రశ్నించిన వారిని అడుగడుగునా టీడీపీ నాయకులు ఇబ్బందులకు, అవమానాలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. -
ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన జ్యోతుల నవీన్
-
ఐటీ దాడులపై జ్యోతుల తనయుడి వివరణ
సాక్షి, కాకినాడ : ఐటీ దాడులపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరణ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ... గతంలో తమ ఉమ్మడి ఆస్తి అయిన గోదాముల విక్రయానికి సంబంధించి తక్కువగా చూపించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్‌పై అధికారులు వివరణ అడిగారే తప్ప, ఎలాంటి దాడులు జరపలేదన్నారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడం వల్ల గత కొంతకాలంగా ఐటీ రిటన్స్ పట్టించుకోలేదన్నారు. వాటిని కూడా చెల్లిస్తామని ఐటీ అధికారులకు సమాధానం ఇచ్చినట్లు నవీన్ పేర్కొన్నారు. కాగా జ్యోతుల నెహ్రు ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. -
ఎమ్మెల్యే జ్యోతుల ఇంటిపై ఐటీ దాడులు
తూర్పుగోదావరి, జగ్గంపేట: జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన ఐటీ అధికారులు దాడి చేశారు. ఆయన స్వగ్రామం ఇర్రిపాక నివాసంలో ఐటీ శాఖాధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. అదే గ్రామంలో మరికొందరి ఇళ్లపై దాడులు జరిగినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. -
జ్యోతుల X తోట
సాక్షి ప్రతినిధి, తూర్పు గోదావరి, కాకినాడ : ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామమది. ఆ పార్టీకి చెందిన సర్పంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకపోతే, ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉంటున్నారు. ఇప్పుడదే కొంప ముంచింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కంటగింపుగా మారింది. ఎంపీ వెంట తిరుగుతున్నారని సర్పంచిపై కక్షగట్టారు. టీడీపీలోకి వచ్చిన దగ్గరి నుంచి అణగదొక్కుతున్నారు. ప్రతి పనికీ ఆటంకం కలిగిస్తున్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మంజూరైన అభివృద్ధి పథకాలు అమలు కాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర సంక్షేమ పథకాలు ఎంపీ అనుచరులకు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న వివక్షను భరించలేక బూరుగుపూడి సర్పంచి పాఠంశెట్టి సూర్యచంద్ర ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జ్యోతుల నెహ్రూ తీరుకు నిరసనగా ఆరు రోజులపాటు దీక్ష చేశారు. చివరికి పోలీసులు భగ్నం చేశారే తప్ప ఎమ్మెల్యే కనీసం స్పందించలేదు. ♦ జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకుడు బండారు రాజా పరిస్థితి కూడా ఇంతే. ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉన్న పాపానికి అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా వీరికి ఎమ్మెల్యే ఒక్క పని కూడా చేయలేదు. సరికదా పార్టీ వ్యవహారాల్లో కూడా దూరంగా ఉంచుతున్నారు. ♦ టీడీపీకి చెందిన మరో నేత తోట అయ్యన్న దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంపీ అనుచరునిగా నియోజకవర్గంలో కొనసాగుతుండటంతో సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ప్రాధాన్యం ఇవ్వకపోగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా పెడుతున్నారు. వీరికెటువంటి సమాచారం ఇవ్వలేదు. రాజకీయంగా అణగదొక్కుతూనే ఉన్నారు. ♦ ఇలా చెప్పుకుని పోతే ఎంపీ తోట నరసింహం అనుచరులు అనేక మంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధితులుగా మిగిలిపోయారు. ఆయన పార్టీ ఫిరాయించిన దగ్గర నుంచి ఎంపీ అనుచరులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చివరికీ, ఎమ్మెల్యే తీరుతో నిలబడలేక కొందరు వర్గాన్ని మార్చేశారు. మరికొందరు చెల్లాచెదురై మౌనంగా ఉన్నారు. సమయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ♦ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఎంపీ తోట నరసింహం నిలిచారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున జ్యోతుల నెహ్రూ ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ జంపయ్యారు. ఒప్పందాలు, ప్రలోభాల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి వచ్చాక అప్పటికే టీడీపీలో ఉన్న అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. తనతోపాటు టీడీపీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేసి, టీడీపీ పాత నేతలను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికే అనేక మంది టీడీపీకి దూరమై వైఎస్సార్సీపీలోకి చేరారు. మరికొందరు ఎంపీ తోట నరసింహం అనుచరులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆ పంథా ఎమ్మెల్యేకు నచ్చలేదు. ఉంటే తనతో ఉండాలి...లేదంటే చుక్కలే అన్నట్టుగా రాజకీయాలు నెరిపారు. ఇంకేముంది తోట నర్సింహం అనుచరులంతా టార్గెటయ్యారు. రెండున్నరేళ్లుగా పాత నేతలకే ఇక్కట్లు గడిచిన ఎన్నికల్లో టీడీపీకి కష్టపడి పనిచేసిన వారందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీలోకి వచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయి. తన అనుకూల వ్యక్తులకు తప్ప పార్టీ కోసం పనిచేసినవారికి మేలు చేయడం లేదన్న వాదనలున్నాయి. రానున్న ఎన్నికల నాటికి తాను మాత్రమే ఉండాలని, మరొకరికి నియోజకవర్గంలో పట్టు ఉండకూడదని, తనకు ఎదురు నిలిచే నాయకుడు లేకుండా చూసుకోవాలన్న ధోరణితో పక్షపాత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇంకేముంది టీడీపీలో ఉన్న పాత వారందరికీ ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. తనకు భవిష్యత్‌లో ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉందన్న దూరదృష్టితో ఎంపీ తోట నరసింహం అనుచరుల్ని టార్గెట్ చేసినట్టు ఆ పార్టీలో చర్చ నడిచింది. అనుకున్నట్టుగా ఎంపీ కేడర్‌ను చెల్లాచెదురు చేయడంలో విజయం సాధించారన్న వాదనలున్నాయి. ఇక, కరుడుగట్టిన ఎంపీ అనుచరులు మాత్రం జ్యోతులకు సరెండర్ కాకుండా కొనసాగుతున్నారు. అలాంటి వారందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందకుండా కట్ చేశారన్న విమర్శలున్నాయి. ఏ ఒక్కరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా మొండి చేయి చూపుతూ వస్తున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర వాటిలో వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎంపీకి విలువ లేకుండా చేశారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో ఎంపీ తోట నరసింహం ఎక్కడా బయట పడకుండా మౌనంగా ఉంటున్నారు. తన వర్గీయులకు జరుగుతున్న అన్యాయంపై బాధపడుతూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప జ్యోతులతో పోరాడేందుకు సాహసించడం లేదు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేట నియోజకవర్గంలో క్యాడర్ చెల్లాచెదురు అవుతున్నా మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నారు. మరీ, మున్ముందు బయటపడతారో...రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారో ఏమో గాని ప్రస్తుతానికి మాత్రం ఎంపీ అనుచరులంతా తీవ్ర ఆవేదనతో, అవమానంతో పార్టీలో కొనసాగుతున్నారు. -
జ్యోతుల ఫ్యామిలీ జులుం
టోల్‌రుసుం కోసం అల్లుడి కారు ఆపినందుకు సిబ్బందిపై దాడి నిజాయతీగా టోల్ ఫీజు అడిగితే ఏకంగా జులుం ప్రదర్శించారు. మంగళవారం రాత్రి దాడులకు దిగారు. ఎమ్మెల్యే స్థాయిలో, అదీ సీనియారిటీ వెలగబెడుతున్న జ్యోతుల నెహ్రూ అయినా కొడుకును మందలించి ఉంటే హుందాగా ఉండేది. మహరాజా అని అభ్యర్థించుకుంటే మరి రెండు తన్నమన్నట్టుగా ప్లాజా సిబ్బందిపై బుధవారం మరింత రెచ్చిపోయి దాడులకు దిగడమే కాకుండా ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయించారు. రక్షక భటులు కూడా పెద్దలకే కొమ్ముకాస్తూ చిన్నలపై చిర్రుబుర్రులాడారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజా ప్రతినిధులైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ బాధ్యత విస్మరించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద నెహ్రూ అల్లుడి కారును ఆపారని టోల్గేట్ సిబ్బందిపై అనుచరులతో దాడి చేయించారు. అంతటితో ఆగకుండా క్షమాపణ చెప్పేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందిపై మరోసారి దాడి చేయించారు. టోల్గేట్ యాజమాన్యంతో ఇద్దరు సిబ్బందిపై వేటు వేయించారు. అధికార బలంతో చిరు ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డ జ్యోతుల కుటుంబంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రాత్రి బావమరిది సమక్షంలో దాడి జ్యోతుల నెహ్రూ అల్లుడు తోట బబ్బీ వాహనాన్ని మంగళవారం రాత్రి కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుంకోసం ఆపారు. తన కారునే ఆపుతారా? అంటూ ఆయన టోల్ ప్లాజా సిబ్బందిపై చిందులు తొక్కారు. క్షణాల్లో బావమరిది, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్‌ను రప్పించారు. కారును ఆపిన సిబ్బందిని అప్పగించాలంటూ నవీన్ ఉసిగొల్పడంతో అనుచరులు దౌర్జన్యకాండకు దిగారు. -
తూగో జడ్పీ ఛైర్మన్‌గా జ్యోతుల నవీన్
-
తూగో జడ్పీ ఛైర్మన్‌గా జ్యోతుల నవీన్
అమరావతి: అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులా పక్కన పడేసే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నైజం మరోసారి బయటపడింది. స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన నాయకుడి కోసం ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న నేతలు బలవక తప్పలేదు. వైఎస్ఆర్ సీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ కుమార్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు వేళ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నవీన్‌ను జిల్లా షరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ... అందులో భాగంగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును బలవంతంగా ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం ఆయనను జెడ్పీ పీఠం నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాంబాబు నిన్న (ఆదివారం) రాజీనామా చేశారు. అయితే ఫిరాయింపు సమయంలో జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి ఆశ చూపి చివరకు ఆయన కుమారుడికి తాత్కాలిక జెడ్పీ చైర్మన్ పదవితో చంద్రబాబు సరిపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో నెంబరు 473ను జారీ చేసింది. కాగా తూర్పుగోదావరి తాత్కాలిక జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ గా జ్యోతుల నవీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈనెల 15వ తేదీన జడ్పీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని వెల్లడించారు. అదేవిధంగా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా నళినీకాంత్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని చెప్పారు. ఆయన కూడా 15వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. అయితే జ్యోతుల నెహ్రు కుమారుడు నవీన్‌కు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడంపై మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెజార్టీ జెడ్పీటీసీల్లో అసంతృప్తి నెలకొంది.