హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, ఇతర అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశమైన ఈ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు, వైఎస్సార్‌సీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై మండలి బుద్ధప్రసాద్కు ఇచ్చిన నివేదిక.. ప్రివిలేజ్ కమిటీకి అందిందనీ, నివేదిక కాపీలను మాకివ్వలేదని జ్యోతుల నెహ్రు అన్నారు.
గతంలో ఇతర ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటిసులనే పరిశీలించామన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి రావడం లేదని చైర్మన్ను అడిగామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాట్లాడి అన్నిపార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి వచ్చేలా చేయాలని కోరామన్నారు. వచ్చే నెల 4న ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని జ్యోతుల నెహ్రు వెల్లడించారు.
'4న ఏపీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం'
Published Tue, Feb 23 2016 1:52 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement