privilege committee
-
‘కూన’పై స్పీకర్‌కు నివేదిక ఇస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ప్రివిలేజ్ (సభాహక్కుల) కమిటీ విచారించింది. ఈ అంశంపై శాసనసభ ప్రస్తుత సమావేశాలు ముగిసేలోపుగానీ, తర్వాతగానీ స్పీకర్‌కు నివేదిక ఇస్తామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ గతంలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని అప్పట్లో కూన రవికుమార్ కమిటీకి తెలిపారు. శాసనసభ వాయిదాపడ్డాక గురువారం చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమాశమైంది. కమిటీ సూచన మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన కూన రవికుమార్ తాను స్పీకర్ తమ్మినేనిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఆధారంగా కూన రవికుమార్‌ను ప్రివిలేజ్ కమిటీ విచారించింది. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌పై కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రివిలేజ్ కమిటీకి వచ్చిన ఇతర పిటిషన్లపైన కూడా విచారించి స్పీకర్‌కు నివేదిక ఇస్తామని తెలిపారు. -
రవి కుమార్ నుంచి వివరణ తీసుకున్నాం: కాకాణి
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్‌పై విచారణ జరిపినట్లు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని కూన రవి కూమార్‌కు సూచించామని తెలిపారు. అయితే ఆయన అప్పుడు రాలేదని చెప్పారు. కున రవికుమార్ ఈరోజు(గురువారం) వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారని తెలిపారు. కునరవికుమార్ చేసిన ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకున్నామని కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. దానిపై ఆయన నుంచి వివరణ కూడా తీసుకున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నామని, రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఉన్న పిటిషన్లు పరిష్కరిస్తున్నామని తెలిపారు. -
ముదిరిన ఎంపీ.. సీపీల వివాదం.. ఢిల్లీకి గల్లీ లొల్లి!
సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మధ్య వివాదం ముదిరింది. నగరంలోని ఎంపీ కార్యాలయం ఉన్న చైతన్యపురి గల్లీలో మొదలైన వివాదం.. ఢిల్లీలోని ప్రివిలేజ్ కమిటీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంలో శుక్రవారం సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. 317 జీవో సవరణకు సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు అతడిని అరెస్టు చేసిన వి షయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు బీజేపీ కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి, తన గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని సంజయ్ ఆరోపించారు. సంబంధిత వార్త: సీపీ నా గల్లా పట్టుకున్నారు: బండి సంజయ్ ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ హోంశాఖ కార్యదర్శిని రిపోర్టు అడిగిందని స మాచారం. హోంశాఖ కార్యదర్శి తెలంగాణ డీ జీపీ, సీఎస్‌ను నివేదిక కోరారని తెలిసింది. ని వేదికలు ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి చేరాయని సమాచారం. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు దాడి చేశారని, అరెస్టు సందర్భంగా హద్దుదాటి వ్యవహరించారని సంజయ్ ఆరోపిస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో ఎంపీ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రివిలేజ్ కమిటీకి ఇ చ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై పోలీసులు అకారణంగా లాఠీచార్జీ చేశారని వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే పలు ఫొటోలు, వీడియోలు, న్యూస్ క్లిప్పింగులతో కూడిన ఫైల్‌ను కమిటీకి సంజయ్ సమర్పించనున్నారని సమాచారం. చదవండి: జాగ‘రణం’.. బండి సంజయ్ దీక్ష భగ్నం సీపీతోపాటు ముగ్గురికి నోటీసులు!? ఎంపీ సంజయ్ ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీతోపాటు ముగ్గురు పోలీసుల అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. కరీంనగర్ పోలీసులపై సంజయ్ పార్లమెంటు కు ఫిర్యాదు చేయ డం రెండోసారి కావడం గమనార్హం. అది కూడా ప్రస్తుత సీపీ సత్యనారాయణపైనే. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఓ ఆర్టీసీ కార్మికుడి శవయాత్రలో పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని బండి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్పటి సీపీ కమలాసన్‌రెడ్డి సెలవులో ఉ న్నారు. ఆ సమయంలో రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణ కరీంనగర్‌కు ఇన్చార్జి సీపీగా వ్యవహరించారు. అప్పుడూ ఎంపీ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య వృత్తిగతంగా విభేదాలు రావడం ఇది రెండోసారి కావడం విశేషం. సీనియర్లకు వివరణతో సరి..! మరోవైపు ఇటీవల సంజయ్‌కి వ్యతిరేకంగా అ సమ్మతి రాగాలు పలికిన సీనియర్ల విషయంలో అధిష్టానం స్పష్టమైన వైఖరితోనే ఉంది. ఈ వ్య వహారంపై సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసే నారెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిపై అసమ్మతి గళం విషయంలో తొలుత సీనియర్లను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం. వారి వివరణలు వినాలని, వాటితో సంతృప్తి చెందకపోతే అపుడు నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ నేతలు సుగుణాకర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు సమావేశం నిర్వహించడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం వెంటనే అసమ్మతి నిప్పును ఆర్పేందుకు చర్యలు చేపట్టింది. బీసీ కమిషన్ ఎదుట సీపీ వివరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈనెల 2న నిర్వహించిన జాగరణ దీక్షను భగ్నం చేసిన ఘటనలో సీపీ సత్యనారాయణ జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజ్ ఆచారీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎంపీ సంజయ్ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ జనసమీకరణతో దీక్ష తలపెట్టిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీక్షకు అనుమతి లేదని, కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో దీక్షను రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రోజు ఉదయం బీజేపీ నాయకులకు నోటీసులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. అయినా దీక్ష కొనసాగించడంతో అరెస్టు చేయాల్సి వచ్చిందని సీపీ సత్యనారాయణ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
శాసన సభ్యుల హక్కులు కాపాడటం మా విధి: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో 9 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ పై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. శాసన సభ సభ్యుల పేర్లు శిలాఫలకంలో లేకపోవడం, అధికారులు సరిగ్గా స్పందించకపోవడం, శాసన సభ్యులని చపరచడం,ప్రొటోకాల్ పాటించని వాటిపై మాట్లాడినట్లు వివరించారు. 174 మందికి ప్రాతినిద్యం వహిస్తున్న స్పీకర్ పై కూడా విమర్సలు చేయడం దురదృష్టకరం అన్నారు. సీడీ వంటి ఆధారాలతో సహా పంపినా కొంతమంది సభ్యులు వివరణ సరిగ్గా ఇవ్వలేదన్నారు. సరైన సమాధానం చెప్పని సభ్యులని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రివిలేజ్ కమిటీ పారదర్శకంగా వ్యవహరిస్తుంది. శాసన సభ్యుల హక్కులు కాపాడటం మా విధి. అచ్చెన్నాయుడు మొదటిసారి ఇచ్చిన వివరణ సరిగ్గా లేనందున రెండవ సారి వివరణ కోరితే ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయనని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో హాజరుకాలేనని మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణనిచ్చారు. నిమ్మగడ్డపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఎవరు ఎవరిపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా పరిగణనలోకి తీసుకుంటాం. సభ్యులందరి హక్కులు కాపాడటం కోసం ప్రివిలేజ్ కమిటీ పనిచేస్తుంది. త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తాం. ఆగస్ట్ పదవ తేదీన ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం ఉంటుంది.’’ అని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ సమావేశానికి ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మల్లాది విష్ణు,యూ.వి రమణ మూర్తి రాజు, ఎస్.వి చిన అప్పలనాయుడు, వి.వర ప్రసాద రావు,శిల్పా చక్రపాణి రెడ్డి , అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ మా చార్యులు తదితరులు హాజరయ్యారు. -
టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి బుగ్గన ఫిర్యాదు
-
టీడీపీ నేతలకు బుగ్గన సవాల్
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తన హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్లపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదును ఈ- మెయిల్ ద్వారా ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని బీజేపీ నాయకులకు చేరవేస్తున్నారని తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. పీఏసీ చైర్మన్ అయిన తనపై నిరాధార ఆరోపణలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. వైఎస్సార్ సీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ భవన్లో లాగ్ బుక్ ట్యాపరింగ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తమపై బురద జల్లుతూ బీజేపీతో అంటకాగుతోంది టీడీపీనే అని విమర్శించారు. టీడీపీ అభియోగాలపై తేల్చుకునేందుకు తన పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. మరి టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటే సవాల్ స్వీకరించాలన్నారు. -
దిగజారిన ప్రివిలేజ్ కమిటీ గౌరవం
⇒ రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌కు కమిటీ సిఫార్సు ⇒ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, పుష్పా శ్రీవాణి ధ్వజం సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ గౌరవాన్ని దిగజారుస్తుందన్నారు. కక్షసాధింపు, రాజ కీయ వ్యతిరేకతతో చేసిన సిఫార్సులుగా ప్రజ లు భావిస్తున్నారన్నారు. సంవత్సరం నాలుగు నెలలపాటు ఆమె సస్పెన్షన్ పూర్తయ్యాక మరోసారి ఏడాదిపాటు పొడిగించాలనే సిఫార్సులు ఇంత ఆలస్యంగా రావడం దురుద్దేశ పూరితమైనవన్నారు. విజయవాడ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాల్‌మనీ సెక్స్ రాకెట్ విషయంలో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ కేసులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లున్నాయి. ఇవన్నీ గతంలో సభలో చర్చకు రాబోతున్న సమయంలో ఎమ్మెల్యే రోజా గొంతునొక్కాలనే ఉద్దేశంతో ఏడాదిపాటు సస్పెన్షన్ వేటేశారు. ఆమెను ఎదుర్కొనే ధైర్యంలేక పిరికి పందల్లాగా మరో ఏడాది సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని తక్షణమే విరమించు కోవాలి’’ అని సూచించారు. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారం వ్యక్తం చేసినా మనస్ఫూర్తి గా విచారం వ్యక్తం చేయలేదని కమిటీ చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్యే రోజా చేసిన తప్పేంటి? ఎమ్మెల్యే రోజా చేయని తప్పునకు 14 నెలలపాటు శిక్ష అనుభవించారని, అసలామె చేసిన తప్పేంటని కురుపాం ఎమ్మెల్యే పుష్పా శ్రీవాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘టీడీపీ ప్రభుత్వంలో తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఖండించినందుకా? ర్యాగిం గ్‌కు బలైపోయిన రిషితేశ్వరి కుటుంబానికి అండగా ఉన్నందుకా? ‘కాల్‌మనీ సెక్స్‌రాకెట్’ విషయంలో మహిళలపై చేసిన దారుణాల గురించి ప్రశ్నించినందుకా? వైజాగ్‌లో బీచ్ ఫెస్టివల్లో బికినీషోలు అడ్డుకున్నందుకా? ఎందుకు? మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూస్తున్నారు?’’ అని ప్రభుత్వాన్ని నిలదీ శారు. మహిళా ఎమ్మెల్యేను చూసి బాబు ఇంతగా భయపడతారని అనుకోలేదన్నారు. -
రోజాపై మరో ఏడాది సస్పెన్షన్‌కు సిఫార్సు
శాసనసభకు ప్రివిలేజ్ కమిటీ నివేదిక సమర్పణ సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను మరో ఏడాది పాటు ఏపీ శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందిం చిన నివేదికను గురువారం శాసనసభకు సమర్పించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను ఇప్పటికే ఒక ఏడాది సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినపుడు.. ఆమె ప్రవర్తనను తప్పు పడుతూ 2015, డిసెంబర్ 18న శాసనసభ నుంచి ప్రివిలేజ్ కమిటీకి పంపకుండానే నేరుగా సస్పెండ్ చేశారు. ఏడాది సస్పెన్షన్ ముగిసినందున ఆమె ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభకు హాజరవుతున్నారు. ఈతరుణంలో మళ్లీ మరో ఏడాది ఆమెను సభలో నుంచి సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. ఎమ్మెల్యే రోజా గతేడాది ఏప్రిల్ 6న కమిటీ ముందు హాజరయ్యారని, తన ప్రవర్తనకు రోజా మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేయలేదని, బేషరతుగా క్షమాపణ చెప్పలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే ఏడాది సస్పెన్షన్‌ను ఏ తేదీ నుంచి అమలు చేయాలనే అంశాన్ని శాసనసభకే వదలి వేస్తున్నట్లు తెలిపింది. -
'చంద్రబాబు తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నారు'
హైదరాబాద్: అసెంబ్లీ సవ్యంగా జరగాలంటే స్పీకర్, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సభను నడుపుకోలేక ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో చెప్పినట్లు వెల్లడించారు. సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వారు ప్రవిలేజ్ కమిటీ ముందు వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. సమావేశంలో గతంలో టీడీపీ సభ్యులు ఎలా వ్యవహరించారో తెలియజేశామని, చంద్రబాబు తీరుతో గతంలో కుతూహలమ్మ, ఆలపాటి ధర్మారావు కన్నీళ్లు పెట్టుకున్నారని, కొంతమంది టీడీపీ సభ్యులైతే గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో పట్టుబట్టినందుకు ప్రవిలేజ్ కమిటీ 12 మందికి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. -
'చంద్రబాబు తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నారు'
-
సభలో నేను ఉండకూడదని బాబు కుట్ర
-
తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు
-
'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర'
హైదరాబాద్: ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాకౌట్ చేశారు. విచారణ జరగకుండానే తాను తప్పు చేసినట్లు ఎలా చెబుతారంటూ అంతకు ముందు ఆయన ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో వాదించారు. కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రవణ్‌ను చెవిరెడ్డి నిలదీశారు. వీడియో క్లిప్పుంగుల్లో తాను తప్పు చేసినట్లు ఎక్కడా లేదని ఆయన ఈ సందర్భంగా వారితో అన్నారు. సభ నుంచి తనను సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీనే కావాలని సభ్యుల హక్కులను కాలరాస్తోంది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తాను ఉండనే కూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని చెవిరెడ్డి చెప్పారు. -
తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు
తాను ఏ తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోడానికి వీల్లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. తమకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, వీడియో ఫుటేజిలో ఎక్కడా తాను అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు లేదని నాని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారిపై ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని చెప్పారు. -
హోదా కోసం పోరాడటమే నేరమా?
- ప్రివిలేజ్ కమిటీ ఎదుట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాదన - అసెంబ్లీలో సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ సాక్షి, అమరావతి/హైదరాబాద్: భావితరాల భవిష్యత్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే క్రమంలో సభలో చర్చ జరపాలని కోరుతూ తాము సభా కార్యక్రమాలను స్తంభింపచేశాం తప్ప మరో ఆలోచన లేదని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్సీపీ) చెప్పారు. హోదా కోసం పోరాడటమే నేరమా అని ప్రశ్నించారు. తాను సమగ్రంగా వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని అసెంబ్లీ హాల్లో జరిగింది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్, కె.రామకృష్ణ (టీడీపీ) హాజరయ్యారు. సొంత ఎజెండా లేదు..: అనంతరం అసెంబ్లీ ఆవరణలో రామకృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడుతూ శాసనసభలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పిలిచిన ప్రివిలేజ్ కమిటీ ప్రోసీడింగ్ ఇవ్వకుండా హాజరు కావాలనడం బాధాకరమన్నారు. తనకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ జరిగిన శాసనసభ సమావేశాల వీడియో టేప్‌లను అందిస్తే వాటిని పరిశీలించి సభలో తమను మాట్లాడనివ్వకుండా అధికారపక్షం ఎలా అడ్డుకుందో.. వచ్చే సమావేశంలో వివరిస్తారని చెప్పారు. నాని, చెవిరెడ్డి లేఖలు..: కమిటీ ముందు హాజరు కావాల్సిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) జ్వరం వల్ల రాలేకపోతున్నానని, స్థానికంగా అమ్మవారి ఆలయంలో వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నందున రాలేనని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేఖ పంపారు. దీంతో మరోసారి వారు హాజరై వివరణ ఇచ్చేందుకు కమిటీ అనుమతిచ్చింది. కాగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తినప్పుడు తమను ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడి, అసభ్యంగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలకు సభాహక్కుల ఉల్లంఘణ నోటీసులు ఇవ్వాలంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోడెల శివప్రసాద్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తాజాగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. -
'రోజాపై స్పీకర్‌కు నివేదిక ఇస్తాం'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్నామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఆమె ఇచ్చిన వివరణపై మరోసారి సమావేశం అయ్యి సభ్యులమంతా చర్చించి నివేదిక రూపంలో స్పీకర్‌కు అందజేస్తామని చెప్పారన్నారు. ప్రివిలేజ్ కమిటీ చట్టబద్ధతతో కూడుకున్న కమిటీ అయినందున ఇంతకుమించి ఎక్కువ విషయాలు చెప్పలేమని అన్నారు. తొలుత స్పీకర్ ద్వారా సభకు తెలియజేయడం తన బాధ్యత అని ఆ తర్వాత సభగానీ, సభ నిర్ణయం మేరకు తాను గానీ తీసుకునే నిర్ణయంపై పూర్తి వివరాలు అందజేస్తామని తెలిపారు. -
6న సభాహక్కుల సంఘం ముందు హాజరుకండి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకు అసెంబ్లీ కార్యదర్శి లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాహక్కుల సంఘం(ప్రివిలేజెస్ కమిటీ) ముందు హాజరై వాదనలు వినిపించేందుకు ఈ నెల 6న హాజరు కావాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ శనివారం లేఖ రాశారు. కమిటీ భేటీ 6న ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరుగుతుందని తెలిపారు. ‘మీపై పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును సభాహక్కుల సంఘం పరిశీలిస్తుంది. ఆ నోటీసుపై మీ వాదనలు వినిపించేందుకుగాను కమిటీ ముందు హాజరు కాగలరు’ అని లేఖలో ఆయన కోరారు. రోజాను గతేడాది డిసెంబర్లో జరిగిన శీతాకాల సమావేశాల్లో ఏడాదిపాటు సస్పెండ్ చేయడం విదితమే. ఆ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించేందుకు నియమించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ రోజాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ఆధారంగా సభాహక్కుల సంఘం కూడా రోజాపై సస్పెన్షన్ కొనసాగించాల్సిందేనని నివేదిక ఇచ్చింది. కాగా మార్చి 21న విపక్షం లేకుండా ఏక్షపక్షంగా సాగిన శాసనసభ.. ఆ నివేదిక ఆధారంగా రోజా సస్పెన్షన్‌ను కొనసాగించాలని తీర్మానించింది. సభాహక్కుల సంఘానికి రోజా క్షమాపణలు చెబితే సస్పెన్షన్‌ను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 6న కమిటీ భేటీ కానుంది. -
నిరూపిస్తే రాజీనామా
అధికార పార్టీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సవాలు సాక్షి, హైదరాబాద్: తాను అనని మాటల్ని అన్నట్టుగా డబ్బింగ్‌లు చెప్పించి, టీడీపీ కార్యాలయంలో ఎడిటింగ్ చేసిన వీడియోలతో ఇప్పటికీ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నాలు జరుగుతుండడం బాధ కలిగిస్తోందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను చాలెంజ్ చేస్తున్నా. ఇప్పటివరకు ఈ అసెంబ్లీకి సంబంధించి ఏడు విడతల సమావేశాలు జరిగాయి. వాటిల్లో నావి, టీడీపీ ఎమ్మెల్యేలందరి రికార్డులను బయటకు తీయండి. ఎవరు ప్రజాసమస్యలపై మాట్లాడారు.. ఎవరు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు.. ఎవరు పక్కవారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారో చూస్తే... దోషులుగా ఎవరు నిలుచుంటారో తేలుతుంది. ఎమ్మెల్యే అనితను నేను అనని మాటలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో రాసి.. సోషల్ మీడియాకు రిలీజ్ చేసి.. ఎవరో సెల్ఫోన్లో తీశారని వారు ప్రచారం చేస్తున్నారో.. అది నేనన్న మాటలు కాదు. ఈ విషయం టీడీపీలో అందరికీ తెలుసు. అందుకే డిసెంబర్ 18వ తేదీన సంఘటన జరిగితే 22వ తేదీ వరకు మాట్లాడలేదు. ప్రచారం చేస్తున్న మాటలు నేనే అన్నట్టు వాళ్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా’’ అని రోజా చెప్పారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు సహకరించిన ముఠా, వంగవీటి మోహన్‌రంగా హత్యకు సహకరించిన ముఠాల్ని ఉపయోగించుకుని.. ప్రజాసమస్యలు, ప్రత్యేకించి మహిళా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న తనను రాజకీయంగా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ తొలి సమావేశాలనుంచీ ఒక పథకం ప్రకారం తన వ్యక్తిత్వాన్ని హత్యచేయించి, రాజకీయంగా, ఆర్థికంగా, అన్నిరకాలుగా తనను దిగజార్చే ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు. చివరకు కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంలో టార్గెట్ చేసి ఏడాదిపాటు సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. 98నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడైనా నోరు జారానా? మాట్లాడని వాటిని మాట్లాడినట్టు డబ్బింగ్‌లు చెప్పించి. ఎడిటింగ్లు చేసి టీడీపీ నేతలు మీడియాకిస్తే.. మీడియా కూడా ప్రజల్ని నమ్మించేలా వాటిని ఇప్పటికీ పదేపదే ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తున్నదని రోజా అన్నారు. టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేసిన వీడియోలో తాను ఎన్ని చీరెల్లో కనిపిస్తానో గమనించాలని కోరారు. ‘‘నన్ను తిడితే పబ్లిసిటీ వస్తుందనో, చంద్రబాబు మంత్రి పదవులిస్తారని కొందరు అనుకుంటే వారి సంతోషానికి నేను అడ్డుపడను. కానీ మీడియా కూడా ఆ ప్రచారానికి సహకరించడం సరికాదు’’ అని అన్నారు. ‘‘1998 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడైనా నోరు జారిన పరిస్థితుందా? మీరే మననం చేసుకోండి. అంతేగానీ ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి ప్రకటనలు వస్తాయనో, లేదంటే ఒత్తిడి ఉందనో టీడీపీ ఆఫీసువారిచ్చిన సీడీల్ని పట్టుకుని ఏకపక్షంగా నాకు వ్యతిరేకంగా వీడియోలు చూపించడం చాలా బాధ కలిగిస్తోంది’’ అని రోజా మీడియానుద్దేశించి అన్నారు. మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే అనితను అవమానించాల్సిన అవసరం తనకెందుకుంటుందని ప్రశ్నించారు. అలాంటి ప్రచారాల్ని మీడియా ఇప్పటికైనా మానుకుంటే సంతోషిస్తానన్నారు. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో ఇంకా గట్టిగా ప్రజాసమస్యలపై పోరాడగలన న్నారు. అంతేగానీ తప్పు చేసేవారిని ప్రశ్నించకుండా చేసే పరిస్థితులు కల్పిస్తే భవిష్యత్‌లో చాలా అన్యాయం జరుగుతుందన్నారు. జరుగుతున్నది అధికారపార్టీకి, అధికారపార్టీలో పురుషహంకారానికి, ఒక మహిళకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆమె అభివర్ణించారు. సస్పెన్షన్‌తో సెక్స్‌రాకెట్ అంశం పక్కదారికి... కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంలో గట్టిగా ప్రశ్నించినందుకే తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయించి ఈ అంశం మొత్తాన్ని చంద్రబాబు పక్కదారి పట్టించారని రోజా విమర్శించారు. ‘‘ఆ అంశంపై అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా దుర్మార్గుల మదమణచి వారిని పట్టిస్తే.. ఇంకా బయటికి రాని మహిళలు సైతం ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే వీలుంటుందని భావించా. అయితే దానిపై మాట్లాడేందుకు ప్రయత్నించిన నన్ను సస్పెండ్ చేయడంద్వారా రాష్ట్రంలోని మహిళలందరూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే భయపడే పరిస్థితి కల్పించారు’’ అని చెప్పారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవ హారం లో డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ జరిగిన పరిణామాలను వీడియో క్లిప్పింగ్‌లు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్లతోసహా ప్రదర్శిస్తూ రోజా సోదాహరణంగా వివరించారు. సస్పెన్షన్ వ్యవహారం వేరు.. ప్రివిలేజ్ కమిటీ వేరు తనను సస్పెండ్ చేసింది చంద్రబాబును కామ సీఎం అన్నానని, ప్రివిలేజ్ కమిటీ ముందున్న అంశం అనిత వ్యవహారమని.. రెండు వేర్వేరు అంశాల్ని కలగాపులగం చేసి ప్రజల్ని పక్కదారి పట్టించారని రోజా మండిపడ్డారు. టీడీపీలో పదకొండేళ్లు పనిచేశానని.. అప్పట్లో ఏనాడైనా తన పేరు వెనుక ‘రెడ్డి’ తగిలించి మాట్లాడారా? అని ఆపార్టీ నేతల్ని ప్రశ్నించారు. ఎక్కడ విలేకరుల సమావేశం పెట్టినా రోజారెడ్డి అంటున్నారు.. ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఎమ్మెల్యే అనితను పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘‘నేను టీడీపీలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డిగారిపై రెచ్చగొట్టి ఎలా మాట్లాడించారో ప్రజలకు తెలుసు. అప్పుడు ప్రోత్సహించినవారు, ఈరోజు వారు తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తే ఎందుకింతగా గిలగిల్లాడుతున్నారు? చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టమని ఉసిగొల్పినప్పుడు లేనిబాధ.. ఈరోజు తప్పు చేసినప్పుడు దాన్ని ఎత్తిచూపితే ఎందుకు బాధ?’’ అని ప్రశ్నించారు. ప్రివిలేజి కమిటీ ముందు హాజరవుతా ప్రివిలేజ్ కమిటీకి మూడుసార్లు పిలిచినా రాలేదని ప్రచారం చేయడాన్ని రోజా తప్పుపట్టారు. తానడిగిన సమాచారం అసెంబ్లీ నుంచి అందనందున, ఆ సమయాల్లో ఈ అంశంపైనే కోర్టులో ఉన్నందువల్లే హాజరు కాలేదని తెలిపారు. 19వ తేదీన సైతం అసెంబ్లీకి వెళ్లినప్పుడు మెడపెట్టి గెంటడం.. తర్వాత తాను ఆసుపత్రి పాలవడం ప్రజలంతా చూశారన్నారు. మెజార్టీ సభ్యులు టీడీపీవారే ఉన్నా, ప్రివిలేజ్ కమిటీవల్ల తనకు న్యాయం జరగదని తెలిసినా, ఎప్పుడు పిలిచినా ఆ కమిటీ ముందు హాజరవుతానని తెలిపారు. ఎమ్మెల్యేగా తాను కమిటీని గౌరవించకపోతే మరెవరూ గౌరవిస్తారన్నారు. ‘‘2014లో జరిగిన ఘటనలపై మేమిచ్చిన ఏ ప్రివిలేజ్ నోటీసూ చర్చకు రాలేదు. 2015లో మేం ఇచ్చినవీ రాలేదు. కానీ డిసెంబర్18 నాటి అంశం మాత్రం చర్చకు చేపట్టడమేంటీ?’’ అని ప్రశ్నిం చారు. ‘ఇది అనితపై ఉన్న ప్రత్యేకతతోనా? లేకపోతే నన్ను తొక్కేయడంపైన ఆసక్తా’ అని నిలదీశారు. అనిత జనవరిలో తనపై పరువు నష్టం దావా వేసినప్పుడే లాయర్ద్వారా జవాబిచ్చానని.. అదే జవాబును ప్రివిలేజ్ కమిటీ ముందు చెబుతానన్నారు. ప్రివిలేజ్ కమిటీలో టీడీపీకి మెజార్టీ ఉంది కాబట్టి.. వాళ్లు ఏదనుకుంటే అది చేయవచ్చన్న ఆలోచన వారికుండొచ్చని, కానీ ఏ తప్పు చేయని తాను భయపడే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. అధికారపార్టీకి నచ్చని వారిని నిబంధనలను తోసిరాజని ఏడాదిపాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెరలేపారని రోజా విమర్శించారు. ఇలా అధికారపార్టీకి ఇష్టంలేని వారిని సస్పెండ్ చేసుకుంటూపోతే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. -
సభ సాక్షిగా తప్పుచేసి..
♦ సరిదిద్దుకునేందుకు ప్రివిలేజ్ కమిటీని వాడుకున్న ప్రభుత్వం ♦ ఆ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికారపక్షం వారే ♦ అధికారపక్షం దూషణలు పట్టించుకోని కమిటీ ♦ ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోట్‌ను పట్టించుకోని వైనం ♦ గతంలో ఎన్నడూ ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చించని సభ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రివిలే జ్ కమిటీని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. ప్రతిపక్ష నేతతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై శాసనసభలో ఇష్టం వచ్చినట్లు పలు సందర్భాల్లో నోరు పారేసుకున్న చరిత్ర కలిగిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఇచ్చిన నివేదికకు ఉన్న చట్టబద్ధతపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచి గత డిసెంబర్ 18న ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఆక్షేపించగా, నిబంధనలు విరుద్ధంగా ఈ సస్పెన్షన్ ఉందంటూ హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో తాము చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. డిసెంబర్లో జరిగిన సమావేశాల్లో రోజా అనుచితంగా ప్రవర్తించారని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సస్పెన్షన్ సమయంలో ప్రకటించారు. రోజా అసెంబ్లీలో కామ చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారని, అందుకే సస్పెండ్ చేశామని అధికారపక్షం ప్రచారం చేసింది. ఆమె, ఇతర ప్రతిపక్ష సభ్యులు చేశారని చెప్తున్న వ్యాఖ్యలను ఎంపిక చేసి మీడియాకు లీక్ చేసింది. తమ సభ్యులు చేసిన వ్యాఖ్యల జోలికి మాత్రం అధికార పక్షం వెళ్లలేదు. వాస్తవానికి రోజా కాల్‌మనీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని కామ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ‘ఈనాడు’ లాంటి దినపత్రికలు కూడా కాల్‌మనీని ‘కామ’ అని రాసిన సందర్భాలున్నాయి. శీర్షికల్లో కూడా ‘కామాంతకులు’ అని పొందుపరిచారు. అనితను అస్త్రంగా చేసుకుని.. సభ నుంచి రోజా సస్పెన్షన్‌పై అప్పట్లోనే నిరసన వ్యక్తమైంది. దీంతో ఆమె డిసెంబర్ 18న చేశారని చెప్తున్న వ్యాఖ్యలపై అదే నెల 22న ప్రతిపక్షం సభలో లేకుండా చూసి అయిదు, పది నిమిషాల్లో పూర్తయ్యే జీరో అవర్‌ను గంటల తరబడి కొనసాగించి అధికార పార్టీ సభ్యులు వంగలపూడి అనితతో ఫిర్యాదు చేయించారు. ఆమెను ఒక అస్త్రంగా వాడుకున్నారు. దీంతో స్పీకర్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికారపక్షం నుంచే ఉండటం గమనార్హం. ఆ కమిటీ ప్రతిపక్షం నుంచి సభ్యుడిగా ఉన్న గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలు ఏ ఒక్కటీ ఆమోదించకపోగా, అసమ్మతి నోట్‌ను కూడా పట్టించుకోకుండా తాము ఇవ్వాలనుకున్న నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ.. అనిత జీరో అవర్‌లో ప్రస్తావించిన అంశం, ప్రివిలేజ్ నోటీస్ ఆధారంగా రోజాపై విచారణ చేపట్టింది. అయితే తన సస్పెన్షన్‌కు సంబంధించి కోర్టు కేసుల విషయంలో తీరిక లేకుండా ఉండటం, ఆనారోగ్యం వల్ల కమిటీకి హాజరు కాలేనని రోజా కమిటీకి రాతపూర్వకంగా తెలిపారు. అయినా కమిటీ వాటిని పట్టించుకోలేదు. ఈ ప్రివిలేజ్ కమిటీలో ఏడుగురు సభ్యులుంటే ఐదుగురు అధికారపక్షం నుంచే ఉన్నారు. కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన గొల్లపల్లి సూర్యారావు.. 14వ శాసనసభ ఆరంభం నుంచి తనకు ఏమాత్రం ప్రసంగించే అవకాశం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఆయన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పదే పదే విమర్శించటమే అలవాటుగా పెట్టుకున్నారు. ఆయనే చైర్మన్‌గా ఉన్న కమిటీ సహజంగానే వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు కూడా నివేదికపై తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. అయినా కమిటీ పట్టించుకోలేదు. మరో అవకాశం ఎందుకివ్వలేదు? ప్రివిలేజ్ కమిటీకి అధికారపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు పలు పిటిషన్లు అందచేశారు. అధికారపక్షం అందచేసిన పిటిషన్లు బుల్లెట్ స్పీడ్‌తో కమిటీ ముందు విచారణకు వస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అందజేసిన పిటిషన్లు కనీసం నత్తనడకతో సమానంగానైనా కమిటీ ముందు విచారణకు రాలేదు. ఇదే విషయాన్ని కమిటీలోని విపక్ష సభ్యులు చైర్మన్‌ను గట్టిగా ప్రశ్నించినా ఫలితం శూన్యం. రోజాపై చర్యను తప్పుపడుతూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం తాము నిబంధనలకు విరుద్ధంగా ఆమెను సస్పెండ్ చే శామని ఒక నిర్ధారణకు వచ్చి, సస్పెన్షన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రివిలేజ్ కమిటీని ఉపయోగించుకుంది. డిసెంబర్ 18వ తేదీన రోజాను సస్పెండ్ చేశారు. అప్పట్లో రోజా విషయంలో అంతగా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే అనిత అధికారపక్ష ప్రేరేపణతో 22న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీయే ఆమెకు మరో అవకాశం ఇస్తే సరిపోయేది. కానీ కమిటీ వాస్తవాలు పట్టించుకోకుండా కమిటీలోని విపక్ష సభ్యుల అసమ్మతిని ఖాతరు చేయకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అధికార పక్షం నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. వాస్తవానికి గతంలో ఎన్నడూ ప్రివిలేజ్ కమిటీ నివేదికపై సభలో చర్చించలేదు. రోజా విషయంలో మాత్రం వెంటనే సభలో చర్చకు చేపట్టి ఎప్పటిలాగే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అధికారపక్షం ఆరోపణలు, విమర్శల దాడి కొనసాగించింది. చివరకు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ అవకాశం ప్రివిలేజ్ కమిటీయే ఇస్తే సరిపోయేదని, అలా కాకుండా సుదీర్ఘంగా చర్చించి, పనిలో పనిగా విపక్షంపై ఆరోపణలు గుప్పించిన తర్వాత రోజాకు మరో అవకాశం అనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు ఆక్షేపించినా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రోజాను అసెంబ్లీ లోనికి ఎందుకు అనుమతించలేదని అంటున్నారు. సభ సాక్షిగా తప్పుచేసి మసిపూసి మారేడుకాయ చేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
14న మళ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
♦ హాజరవ్వాలంటూ రోజా, కొడాలి, జ్యోతుల, కోటంరెడ్డి, చెవిరెడ్డిలకు నోటీసులు ♦ టీడీపీ ఎమ్మెల్యే అనితకు కూడా.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 14వ తేదీన మళ్లీ సమావేశం కానుంది. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అందజేసిన నివేదికలో ప్రస్తావించిన ఎమ్మెల్యేల వాదనలను ఆ రోజున విననుంది. ఆ మేరకు తమ వాదనలు వినిపించాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలతోపాటు ప్రివిలేజ్ కమిటీలో సభ్యునిగా ఉన్న జ్యోతుల నెహ్రూకు కూడా మంగళవారం నోటీసులు జారీ చేసింది. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కూడా అదేరోజున కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించాలంటూ నోటీసులిచ్చింది. ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ఇందులో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ(వైఎస్సార్సీపీ), కె.రామకృష్ణ(టీడీపీ) పాల్గొన్నారు. కమిటీ ముందు రోజా మంగళవారం హాజరై వాదనలు వినిపించాల్సి ఉంది. తాను నగరంలో ఉండట్లేదు కాబట్టి హాజరు కాలేనని, మరో రోజు హాజరవుతానని ఆమె లేఖ రాశారు. లేఖను కమిటీ ఆమోదించి.. 14న కమిటీ తిరిగి సమావేశమవుతుంది కాబట్టి ఆరోజున హాజరు కావాలని ఆమెను కోరింది. గత డిసెంబర్లో శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై విచారించిన బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ.. కొడాలి నానితోపాటు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను ెహ చ్చరించాలని సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందర్నీ 14న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవ్వాలని నోటీసులిచ్చింది. అందరి వాదనలు విన్న తరువాత కమిటీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా తన నివేదికను అసెంబ్లీకి సమర్పించనుంది. -
రోజాపై చర్యల విషయంలో అంత తొందరెందుకు
♦ ప్రివిలేజ్ కమిటీలో ప్రశ్నించిన జ్యోతుల ♦ రోజా అభిప్రాయం తెలుసుకోవాలని కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై చర్య తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆక్షేపించారు. శుక్రవారం ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. శీతాకాల సమావేశాల్లో పరిణామాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక ఈ సమావేశం ముందుకు వచ్చింది. ఎజెండాలో చేర్చేందుకు అసెంబ్లీ అధికారులు ప్రయత్నించగా జ్యోతుల అభ్యంతరం వ్యక్తం చేశారు.హడావిడిగా రోజా అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఈ నెల 8న మరోసారి సమావేశమై చర్చించాలని, రోజాను సమావేశానికి పిలిచి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెలపై గతంలో రోజా చేసిన వ్యాఖ్యల మీద నోటీస్ ఇచ్చిన చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారం తన వాదన వినిపించారు. -
మా నోటీసులపై చర్యలేవీ?
పివిలేజ్ కమిటీ మీటింగ్‌లో ప్రశ్నించిన వైఎస్సార్సీసీ సభ్యులు ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని కమిటీ పనిచేస్తున్నట్లుగా ఉంది హైదరాబాద్: తాము అందించిన నోటీసులు ఇంత వరకూ కమిటీ ముందుకు రాకపోవటంపై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ పనితీరు చూస్తే ఏకపక్షంగా, ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని వారు కోరారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావే శంలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, బీసీ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. తమ హక్కులను హరిస్తున్నారని వైఎస్సార్సీసీ సభ్యులు గత ఏడాది మార్చిలో ఏడు నోటీసులను అందించారు. అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ కమిటీ ముందుకు రాలేదు. ఇదే అంశాన్ని పెద్దిరెడ్డి, జ్యోతుల సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క నోటీసు కూడా కమిటీ ముందుకు రాకపోవటం తమకు అనుమానాలు కలిగిస్తోందని, ఎందువల్ల ఇలా జరుగుతుందో వెంటనే తెలుసుకోవాల్సిందిగా ఛైర్మన్‌ను కోరారు. తాము గతంలో అందచేసిన ప్రివిలేజ్ నోటీసుల కాపీలను ఛైర్మన్‌కు ఇచ్చారు. కమిటీ ముందుకు అవి రాకపోవటానికి దారి తీసిన కారణాలను తెలుసుకోవాల్సిందిగా కోరారు. కమిటీ పార్టీరహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. దీనిపై ఛైర్మన్ స్పందిస్తూ తాను సభ్యులు అందచేసిన కాపీలను అసెంబ్లీ సచివాలయానికి పంపి సమాచారం తెప్పించుకుంటానని చెప్పారు. ఇదే సమావేశంలో గత డిసెంబర్ 22న శీతాకాల సమావేశాల జీరో అవర్‌లో జరిగిన చర్చ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ప్రివిలేజ్ కమిటీలో చర్చకు చేపట్టాల్సిందిగా అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ అప్పటికపుడు ఎజెండాలో పెట్టేందుకు ప్రయత్నించగా వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నివేదిక ప్రతులు ఇవ్వకుండా చర్చించమంటే సాధ్యం కాదని, తమకు తొలుల నివేదిక అందిస్తే అధ్యయనం చేసి ఆ త రువాత చర్చిస్తామని చెప్పటంతో చివరకు ఛైర్మన్, ఇన్‌ఛార్జి కార్యదర్శి సరేనన్నారు. ఇదిలా ఉంటే కమిటీ మీటింగ్‌లో ఏడు నోటీసులపై చర్చ జరిగింది. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన సభ్యులు వచ్చే నెల నాలుగో తేదీన హాజరై తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరారు. -
'4న ఏపీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, ఇతర అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశమైన ఈ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు, వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన నివేదిక.. ప్రివిలేజ్ కమిటీకి అందిందనీ, నివేదిక కాపీలను మాకివ్వలేదని జ్యోతుల నెహ్రు అన్నారు. గతంలో ఇతర ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటిసులనే పరిశీలించామన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి రావడం లేదని చైర్మన్‌ను అడిగామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాట్లాడి అన్నిపార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి వచ్చేలా చేయాలని కోరామన్నారు. వచ్చే నెల 4న ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని జ్యోతుల నెహ్రు వెల్లడించారు.