'రోజాపై స్పీకర్కు నివేదిక ఇస్తాం'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్నామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఆమె ఇచ్చిన వివరణపై మరోసారి సమావేశం అయ్యి సభ్యులమంతా చర్చించి నివేదిక రూపంలో స్పీకర్కు అందజేస్తామని చెప్పారన్నారు.
ప్రివిలేజ్ కమిటీ చట్టబద్ధతతో కూడుకున్న కమిటీ అయినందున ఇంతకుమించి ఎక్కువ విషయాలు చెప్పలేమని అన్నారు. తొలుత స్పీకర్ ద్వారా సభకు తెలియజేయడం తన బాధ్యత అని ఆ తర్వాత సభగానీ, సభ నిర్ణయం మేరకు తాను గానీ తీసుకునే నిర్ణయంపై పూర్తి వివరాలు అందజేస్తామని తెలిపారు.