roja
-
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
NRI డాక్టర్ రోజా మృతి కేసులో బిగ్ ట్విస్ట్
-
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ పాలన
-
‘బావ కళ్లలో ఆనందం కోసం కాదు’..పురందేశ్వరిపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి,అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లమీద మాట్లాడే బాబు,లోకేష్, పవన్ సుప్రీం కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడిన మీరు అత్యున్నత న్యాయం స్థానం అడిగిన ప్రశ్నలు బదులు ఇవ్వచ్చు కదా? అని రోజా అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏమన్నారంటే?తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబును తూర్పారబట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ‘‘సీఎం(చంద్రబాబును ఉద్దేశిస్తూ)రాజ్యంగం పరంగా రాష్ట్రాదినేత. సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉందంటూ’’ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నమిలిన సిదార్థ్ లూథ్రాగత సోమవారం (సెప్టెంబర్ 30న)సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. గురువారం (అక్టోబర్ 3న) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. -
25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్
రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్.. ఇప్పటికి టాలీవుడ్లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమిళంలో లీడ్ రోల్స్‌లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్‌గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్ కెరియరల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు ఉత్తమ ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది. రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. -
రుషికొండ భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన ఆ భవనాలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో కలిసి మంత్రులు అమర్నాథ్, రోజా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అమర్నాథ్, రోజా మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండపై 9.88 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్టుల స్థానంలో ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. అత్యంత సుందరమైన విశాఖ నగరానికి తగ్గట్లుగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాలు సాగాయని తెలిపారు. పర్యాటకంగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ భవనాలు నగరానికే తలమానికమన్నారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ అనేక కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్టును పూర్తిస్థాయి అనుమతులతో పూర్తిచేశామని వారు వివరించారు. విశాఖపట్నం రాజధానిగా చేయాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే మంచిదని ఆ కమిటీ సూచించిందని మంత్రి రోజా అన్నారు. అయితే, ఈ భవనాల్ని పూర్తిగా పర్యాటకం కోసం వినియోగించాలా? లేదా ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉపయోగించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ డా.ఎ. వరప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్మన్ సుభద్ర, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కె.రవిబాబు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా.రజత్‌భార్గవ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు, జేసీ కె.మయూర్ అశోక్, పర్యాటక శాఖ ఆర్.డి. శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వివరాలివీ.. ♦ నూతన రిసార్ట్స్ని 9.88 ఎకరాల విస్తీర్ణంలో 1,48,413 చ.అడుగుల విస్తీర్ణంలో ఏడు బ్లాకులుగా నిర్మించారు. ♦ అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ పనులతో వీటిని అభివృద్ధి చేశారు. రహదారులు, డ్రైనేజీ, నీటిసరఫరా, వీధిదీపాలు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ♦ 2021లో సీఆర్‌జెడ్ ఆమోదం, 2022లో స్థానిక సంస్థల ఆమోదం, 2023లో అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కూడా తీసుకోవడంతో పాటు సంబంధిత చట్టబద్ధమైన ఆమోదాలు తీసుకున్నారు. ♦ వేంగి–ఏ, బీ, కళింగ, గజపతి, విజయనగర ఏ, బీ, సీ బ్లాకులుగా మొత్తం ఏడు బ్లాక్‌లు నిర్మించారు. వీటిల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్, గెస్ట్‌రూమ్‌లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్‌ఆఫీస్, సర్వీస్ ఏరియాలు అభివృద్ధి చేశారు. ♦ నీటి సరఫరా సౌకర్యం కోసం 150 కేఎల్, ఫైర్ సంప్, పైప్ నెట్‌వర్క్‌తో పాటు 100 కేఎల్ డొమెస్టిక్ సంప్ ఏర్పాటుచేశారు. ♦ వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం కోసం 100 కేఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా నిర్మించారు. ♦ 1,000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 2, 1010 కేవీఏ జనరేటర్లు 3, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ పనులు, వీధిదీపాలు ఏర్పాటుచేశారు. ♦ రిసార్ట్ అభివృద్ధికి స్థలం చదును చేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాలు.. ఇలా మొత్తం ప్రాజెక్టుకు రూ.365.24 కోట్లు ఖర్చుచేశారు. ♦ వేంగి–ఏ బ్లాక్‌లో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, సూట్ రూమ్‌లు, రెస్టారెంట్స్ ఉన్నాయి. ♦ వేంగి–బీ బ్లాక్‌లో అతిథి గదులు, సమావేశ మందిరాలు, రెస్టారెంట్‌తో కూడిన బిజినెస్ హోటల్ ఉంది. ♦ కళింగ బ్లాక్‌లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, లగ్జరీ సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. ♦ గజపతి బ్లాక్‌లో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, వ్యాపార కేంద్రాలున్నాయి. ♦ విజయనగరం–ఏ, బీ, సీ బ్లాక్‌లలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లా సూట్స్, స్పా, ఫిట్నెస్ సెంటర్, బ్యాంక్వెట్ హాల్స్ ఏర్పాటుచేశారు. -
అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖ వేదికగా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, అధికారులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి రాష్ట్ర పర్యాటక, యువజన స ర్విసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర, కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున ఇతర అధికార, రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, శాప్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. క్రీడాకారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శాప్ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రకటనను చదవటం ద్వారా ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీలు క్రీడాకారుల కేరింతలు మధ్య విశాఖ రైల్వే మైదానంలో మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. యువతలో క్రీడానైపుణ్యాలను పెంపొందించడానికే ఆడుదాం ఆంధ్రా పోటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనేది అందరి ఆట.. యువతకు భవిష్యత్తుకు బంగారు బాట అని కొనియాడారు. యువ ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీసే వేట అన్నారు. 15,400 సచివాలయాల పరిధిలోని ఎంతో మందిని ఈ క్రతువులో భాగస్వామ్యం చేశామన్నారు. ఈనెల 13న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజేతలకు వైఎస్సార్ స్టేడియంలో రాష్ట్ర టైటిల్స్ అందిస్తారన్నారు. విజేతలకు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్ ఈ క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున చెప్పారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు ఏసీఏ, ప్రొ కబడ్డీ, బ్లాక్ హాక్స్, శ్రీకాంత్, సింధు బ్యాడ్మింటన్, ఖోఖో అసోసియేషన్ల తరఫున ప్రత్యేక శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డీసీసీబీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేసీ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్, జాతీయ క్రికెటర్ శ్రీకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: బైరెడ్డి ‘ఆడుదాం–ఆంధ్ర’ వేదికగా క్రీడాకారులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆకాంక్షించారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని.. కష్టం విలువ తెలుసుకున్న రోజు విజయాలు వాటంతట అవే వస్తాయని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడల కోసం రూ.130 కోట్లు ఖర్చుపెట్టి గ్రామస్థాయి నుంచే పత్రిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం.. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ‘ఆడుదాం ఆంధ్రా’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర చెప్పారు. ఇక ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో విజేతలకు రూ.12 కోట్లతో బహుమతులు అందజేశామని, రాష్ట్రస్థాయి విజేతలకు రూ.87 లక్షలతో బహుమతులు అందజేయనున్నామన్నారు. ఆ బకాయిలు, ఆస్తులను రాబట్టండి.. షర్మిలకు మంత్రి రోజా సూచన అనంతరం.. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావల్సిన రూ.ఆరువేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఏపీకి రావల్సిన రూ.లక్షా 80వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల రాబట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి అక్కడ నేతలను ఆమె నిండా ముంచారని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో ఎందుకు పోరాటం చేస్తున్నారో షర్మిల చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు అమిత్ షా కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా చంద్రబాబు రోజురోజుకి దిగజారిపోతున్నాడని రోజా ధ్వజమెత్తారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ కిట్లపై స్పందిస్తూ.. వాటిపై సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటో వేస్తే తప్పేంటని.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో వేయాలా అంటూ ప్రశ్నించారు. -
'వ్యూహం' సినిమాని.. 2024లో జగనన్న విజయాన్ని ఆపలేరు: మంత్రి రోజా
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమా పార్ట్-1.. డిసెంబరు 29న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్లో వైసీపీ మంత్రి రోజాతో పాటు మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్) 'వ్యూహం' చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి, బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది. ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ 'వ్యూహం'. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్‌గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే 'వ్యూహం' చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు' అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వ్యూహం చిత్రానికి కర్తకర్మ క్రియలైన వర్మ, కిరణ్‌కు అంభినందనలు. రాజకీయాల్లో భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సినిమాల్లో భయపడని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. 'వ్యూహం' విషయంలో చంద్రబాబు,లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. ముంబై మాఫియాకే ఆర్జీవి భయపడలేదు...మీకు భయపడతారనుకుంటున్నారా?చంద్రబాబు కుట్రలు... పవన్ కమెడియన్ వేషాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం రూపొందించారనుకుంటున్నాను. సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది' అని అన్నారు. ఇక పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఫైబర్ నెట్‌కు సినిమాను ఇస్తే పదిలక్షల మంది ఒకేసారి సినిమా చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా 'మంగళవారం'.. డేట్ ఫిక్స్) -
సీటు ఇవ్వకున్నా.. జగనన్న వెంటే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, యెల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని అన్నారామె. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా’’ అని అన్నారామె. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యని చెప్పారామె. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక.. రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు. -
Minister RK Roja: గుంటూరు నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా (ఫొటోలు)
-
యువతకు మంచి అవకాశం..‘ఆడుదాం ఆంధ్రా’ : మంత్రి రోజా
సాక్షి,విజయవాడ : దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండటం లేదు. ఆడుదాం ఆంధ్రా యువతకు మంచి అవకాశం. టోర్ణమెంట్‌లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నాం’ అని రోజా తెలిపారు. ’100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్‌లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి’ అని రోజా కోరారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ... ‘రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఒక ట్రెండ్‌ను సృష్టించారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా చూశారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు. ఇదీచదవండి..రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ -
Minister RK Roja Photos: తాను చదువుకున్న కాలేజీకి చీఫ్‌గెస్ట్‌గా రోజా.. భావోద్వేగంతో కన్నీళ్లు (ఫొటోలు)
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి, ఎంపీ నవనీత్ కౌర్, నటీమణులు రమ్యకృష్ణ, కవిత వంటి వారు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజా గురించి ఆ మాటలనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన నటి, ఎంపీ (మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ నియోజకవర్గం) నవనీత్ కౌర్ బండారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజాకు మద్దతుగా ఆమె తెలుగులో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. రోజాకు దేశంలోని మహిళా లోకమంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ‘మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? నీకు ఇంటిలో భార్య, కూతురు, సోదరి వంటి వాళ్లు ఎవ్వరూ లేరా? ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? తెలుగు అమ్మాయిలాగా తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు సినిమాల్లో పని చేసింది అంటూ ఏపీ, తెలంగాణ ఎంపీలు నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎంతో మంది అగ్ర హీరోలతో పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన రోజాపై ఇంత దిగజారి మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం కావాలి’ అంటూ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమా లేక తెలుగు మహిళల గౌరవం ముఖ్యమా అన్నది తేల్చుకోవాలని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి: కవిత తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత కవిత ధ్వజమెత్తారు. మహిళా మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ అత్యంత హేయంగా మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారనుకోలేదన్నారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలోఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ సినీ నటి రమ్యకృష్ణ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఓ మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలి అల్లూరి జిల్లాలో మహిళల నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పర్యాటకశాఖ మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యాన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. బండారు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి రోజాతోపాటు మహిళా సమాజానికి బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న బండారు సత్యనారాయణకు టీడీపీ నేతలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. బండారుపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో మహిళా మున్సిపల్ కమిషనర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం, చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం వంటి దారుణమైన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పలువురు నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంత్రి రోజాను బండారు సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ పాడేరులో కొవ్వొత్తులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలువురు నేతలు ర్యాలీ నిర్వహించారు. -
సీఎం జగన్, మంత్రి రోజాలను దూషించిన కేసులో బండారుకు బెయిల్
గుంటూరు లీగల్/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, మంత్రి రోజా పైన అనుచిత వ్యాఖ్యలు చేసి, దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మంగళవారం గుంటూరు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విశాఖపట్నం సమీపంలోని వెన్నలపాలెంలో సోమవారం రాత్రి అరెస్టు చేసిన బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు మంగళవారం ఉదయం గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణమూర్తిని కలిసేందుకు విశాఖపట్నానికి చెందిన న్యాయవాదులు పి.ఎస్.నాయుడు, బి.వి.రమణ, గుంటూరు న్యాయవాది ముప్పాళ్ల రవిశంకర్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒక ఎస్ఐ తన తండ్రిపై ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సత్యనారాయణమూర్తిని పోలీసులు బందోబస్తు మధ్య మధ్యాహ్నం జీజీహెచ్‌కు తరలించారు. ఆయనకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఆస్పత్రిలోనే ఉంచాలని సత్యనారాయణమూర్తి కోరారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ నిర్ధారించారు. తరువాత సత్యనారాయణమూర్తిని పోలీసులు కోర్టుకు తరలించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. సెక్షన్లు బెయిల్ ఇవ్వదగినవి అయినప్పటికీ నేర తీవ్రతను, వ్యక్తి చరిత్రను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి జి.స్రవంతి.. బండారు సత్యనారాయణమూర్తిని రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. చట్టప్రకారమే వ్యవహరించాం.. సీఎం జగన్, మంత్రి రోజాలపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసే విషయంలో చట్టప్రకారమే వ్యవహరించామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. తన సోదరుడు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ బండారు సింహాద్రిరావు హైకోర్టులో సోమవారం హౌస్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. సత్యనారాయణమూర్తిపై గుంటూరు అరండల్‌పేట, నగరంపాలెం స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. నరగంపాలెం స్టేషన్లో నమోదైన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సత్యనారాయణమూర్తికి నోటీసులు ఇవ్వలేదన్నారు. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నోటీసు జారీచేస్తే.. దాన్ని తీసుకోవడానికి సత్యనారాయణమూర్తి నిరాకరించారని, దీంతో చట్ట నిబంధనల మేరకు ఆయన్ని అరెస్ట్ చేశామని వివరించారు. ఒకవైపు నోటీసు తీసుకోవడానికి నిరాకరించి, మరోవైపు హైకోర్టులో నోటీసు తీసుకున్నట్లు చెబుతున్నారని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. 41ఏ నోటీసును తీసుకున్నట్లు పెట్టిన సంతకం సత్యనారాయణమూర్తిది కాదన్నారు. అరెస్ట్ తరువాత సత్యనారాయణమూర్తిని గుంటూరు కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. పిటిషనర్ న్యాయవాది వి.వి.సతీష్ వాదనలు వినిపిస్తూ.. 41ఏ నోటీసు ఇచ్చి దానిపై పోలీసులు సంతకం కూడా తీసుకున్నారని తెలిపారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి, ఆ వెంటనే అరెస్ట్ చేశారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సత్యనారాయణమూర్తి అరెస్ట్ విషయంలో చట్టనిబంధనలను పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ ఈ నెల 5కి వాయిదా వేసింది. -
పవన్ నువ్వెంత.. నీ బతుకెంత?
సాక్షి, అమరావతి: ప్యాకేజీ కోసం కన్న తల్లిని దుర్భాషలాడిన వ్యక్తుల దగ్గర పవన్‌కళ్యాణ్ బానిసలా బతుకుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అవినీతి కేసులో జైలులో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని.. సొంత కార్యకర్తలు, సొంత సామాజికవర్గాన్ని అమ్మేసిన పవన్‌ను ‘నువ్వెంత? నీ బతుకెంత?’.. అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో పవన్‌లాంటి సిగ్గులేని రాజకీయ నాయకుడిని ఎవరూ చూసి ఉండరన్నారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీకొట్టి.. ప్రతిపక్ష నేతగా.. ముఖ్యమంత్రిగా జగన్ తనను తాను నిరూపించుకుంటే.. పవన్ మాత్రం పార్టీ పెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ అందరి జెండాలు మోసే కూలీగానే మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ఆరోగ్యశ్రీలో నీ పిచ్చి కుదురుస్తాం.. జనసేన పోటీచేసిన 136 స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి పవన్. అసలు నువ్వు ఒక్క దానిలోనైనా సక్సెస్ అయ్యావా? చదువులో, ఫ్యామిలీలో, కొడుకుగా, భర్తగా, రాజకీయ నాయకుడిగా అన్నింట్లోనూ ఫెల్యూర్. నీ తల్లిని తిట్టిన వాళ్లతో అంటకాగుతున్నావు.. త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదురుస్తాం. ఇక అమిత్ షా దగ్గరకెళ్లి ఏమని ఫిర్యాదు చేస్తావు? నీ మీద చెప్పులు, రాళ్లు వేయించిన చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నా.. మీరూ రండి.. అని చెప్తావా? మోడీని, ఆయన భార్యను, తల్లిని తిట్టించిన టీడీపీతో కలుద్దామని పిలుస్తావా? ఎన్నికల్లో సొంతంగా పది మంది అభ్యర్థులను నిలపలేని వ్యక్తి యుద్ధానికి సిద్ధమనడం హాస్యాస్పదంగా ఉంది. బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమంది.. చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో పచ్చ బ్యాచ్‌కు పిచ్చెక్కిపోతోంది. లోకేశ్, భువనేశ్వరి, బాలకృష్ణ, పవన్ విఫలమవడంతో బ్రహ్మాస్త్రంగా బ్రాహ్మణిని తీసుకొచ్చారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. చంద్రబాబును డైరెక్టుగా ఎలా అరెస్టు చేశారని బ్రాహ్మణి అంటోంది. సాక్ష్యాధారాలతో దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ.. జైలర్ సినిమాకు పంపుతారా? అలాగే, దేవాన్షుకి దయచేసి బాబు రిమాండ్ రిపోర్ట్ చూపించొద్దు. వాళ్ల తాత ఎంతపెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. మీ మామ(చంద్రబాబు) గురించి మీ తాత ఎన్టీఆర్ చివరి క్షణాల్లో విడుదల చేసిన వీడియో చూడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం అని స్వయంగా ఎన్టీఆర్ విలపించారు. మీ మామ నిరపరాధని మీ దగ్గర ఆధారాలుంటే మీడియాలో కాదు కోర్టుల్లో చూపించాలి. ఇక స్కిల్ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు పాత్రధారులందరూ జైలుకెళ్లకతప్పదు. -
చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఉంది: మంత్రి రోజా
-
'దొంగ' దొరికాడు..చంద్రబాబు నోరుతెరవడం లేదంటే..!
-
‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జైలుకెళ్లితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. ‘‘రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా..?. విచారణ ఎదుర్కొంటాడా లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటాడా..?’’ అంటూ రోజా మండిపడ్డారు. ‘‘విజయ్ మల్యాలా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు. బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం అలవాటు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదు. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది.’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘2019లో ఎన్నికల ముందు మోదీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి డ్రామా ఆడింది చంద్రబాబు కాదా?. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలి. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాలి’’ అని మంత్రి రోజా డిమాండ్ చేశారు. చదవండి: ఎక్కడి దొంగలు.. అక్కడే! -
ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు
రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా గాజులమండ్యం ఎస్వీ సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించింది. 368 మంది కార్మికులకు 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.21.36 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి మంత్రి రోజా.. కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో మూసివేశారు. కానీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్మికులు పని కోల్పోయి.. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 368 మంది కార్మికులకు అందాల్సిన బకాయిలు మొత్తం రూ.21.36 కోట్లను విడుదల చేశారు. వాటిని బుధవారం మంత్రి రోజా అందజేయగా.. కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య తెలియగానే నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
పవన్‌వి అర్థం లేని మాటలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్‌కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్‌కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే. రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్‌కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్‌సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా? బాబు అజెండాను మోస్తున్న పవన్ చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్లేదు. మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు. పవన్ ఓ ఫ్లవర్‌స్టార్: వరుదు కళ్యాణి విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్‌ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు. తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్‌స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్‌స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు. -
'పవన్.. ముందు ఎమ్మెల్యేగా గెలువు..'
అమరావతి: జనసేన నేత పవన్ కల్యాన్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. సీఎం జగన్‌ను ఓడించాలన్న అతని కల నెరవేరదని అన్నారు. బీపీ వచ్చినట్లు ఊరికే ఊగిపోతూ కేకలు వేస్తే ప్రయోజనం ఉండదని చెప్పారు. బై బై బీపీ అంటూ పవన్‌కు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక, ప్రజలపై ప్రేమ ఉండాలని హితువు పలికారు. లోకేశ్, పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడిస్తానంటూ పవన్ మాట్లాడి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన అప్డేట్స్..కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ -
రోజా మేడం సార్ రోజా మేడం అంతే
-
వైభవంగా ‘గంగమ్మ’ భక్తి చైతన్య యాత్ర
సాక్షి, తిరుపతి/తిరుపతి కల్చరల్: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరలో ఐదో రోజైన ఆదివారం భక్తి చైతన్య యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. డప్పు దరువుల నడుమ గంధం, కుంకుమ బొట్లు ధరించి, వేపాకు చేతపట్టిన జనం భక్తి పారవశ్యంతో చిందులేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ చేశారు. అమ్మవారు, దేవతామూర్తులతో పాటు వివిధ వేషధారణల్లో తమ భక్తిని చాటుకున్నారు. తొలుత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యుటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు తదితరులు అనంతవీధికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి చైతన్య యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అనంతవీధి, పరసాలవీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, గాందీరోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ తల్లి గుడికి చేరుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 విగ్రహాలతో.. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పలువురికి గంధం పూసి, కుంకుమ బొట్లు పెట్టారు. మాతంగి వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు దరువులు, కోలాటాలు, జానపద నృత్యాలతో నగరమంతా సందడిగా మారింది. సారె సమర్పించిన మంత్రి రోజా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మంత్రి ఆర్కే రోజా ఆదివారం సారె సమర్పించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజా మాట్లాడుతూ.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. గంగమ్మతల్లి ఆలయానికి సీఎం జగన్‌ను తీసుకువచ్చి, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, ఈఓ మునికృష్ణయ్య పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ పై రజినీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్
-
చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామని సెటైర్ వేశారు. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వ్యాఖ్యానించారు. 'మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ. జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఒక పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్. మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు. ఈ రాష్ట్రాని పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు. ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. రైతులకు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఇలా ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా మేము జనంలోకి వెళ్తున్నాం.' అని రోజా వ్యాఖ్యానించారు. చవదండి: జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు -
శిల్పారామాలు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శిల్పారామాలు పర్యాటకులతో నిత్యం కళకళలాడుతున్నాయి. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే 125 శాతం మేర సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న శిల్పారామం సొసైటీ ఏడాది కాలంలోనే అనూహ్యంగా వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మెరుగైన రాబడి లభించింది. గతంలో ఎప్పుడూ నష్టాల్లోనే నడిచిన శిల్పారామాలు 2022–23లో ఏకంగా రూ.2 కోట్ల వరకు లాభం గడించడం రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది శిల్పారామాలు ఉండగా సగటున ప్రతినెల 1.25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, కడప శిల్పారామాల్లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా శిల్పారామాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా బోటింగ్ (జలవిహారం) కార్యకలాపాల పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్–జిమ్, సందర్శకులను ఆకట్టుకునేలా పెయింటింగ్ డిస్ప్లేలను ఏర్పాటు చేసింది. మిగిలిన శిల్పారామాల్లోను ఈ తరహా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గుంటూరు శిల్పారామం పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పులివెందుల శిల్పారామంలో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కొత్త శిల్పారామాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, రాయచోటిల్లో అర్బన్ హట్స్ (శిల్పారామాల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లతో కర్నూలులో, రూ.9.20 కోట్లతో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బండపల్లిలో శిల్పారామాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీ, భూ సేకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు విశాఖ, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరుల్లో ఒక్కోచోట రూ.1.50 కోట్లతో హస్తకళల మ్యూజియాల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. జిల్లాకో శిల్పారామం ప్రతి జిల్లాలో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా స్కీమ్‌లను సది్వనియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శిల్పారామాల్లో పచ్చదనాన్ని కాపాడుతూనే ఆధునికీకరణ చేపడుతున్నాం. అందుకే రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన వృద్ధిని సాధించాయి. నెలకు 1.25 లక్షల మంది సందర్శకులు రావడం ఇందుకు నిదర్శనం. – ఆర్.కె.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి చక్కని ఆటవిడుపు కేంద్రాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. చక్కని ఆటవిడుపు కేంద్రాలుగా పిల్లలు, పెద్దలు కూడా సంతోషంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాలపై దృష్టిసారించాం. హస్తకళలు, కళాకారుల కోసం శిల్పారామాల్లో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్, స్టేజ్‌లను అందిస్తున్నాం. – శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సీఈవో, శిల్పారామం సొసైటీ -
చంద్రబాబు మహిళలను మభ్యపెట్టి మోసగించారు
-
ఆ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
నగరి (చిత్తూరు జిల్లా)/సాక్షి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం రూరల్/కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్నారు. ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందన్నారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం వేర్వేరుచోట్ల మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అది: తానేటి వనిత శ్రీదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరంలో అన్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శ్రీదేవికి వైఎస్సార్సీపీ చాలా గౌరవం, గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసిన వారి పక్షానే శ్రీదేవి చేరిందని ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ప్రయత్నిస్తానని శ్రీదేవి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆమె తెలంగాణ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. శ్రీదేవి వ్యాఖ్యలు విడ్డూరం: ఆదిమూలపు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా శ్రీదేవి వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం దళితులను అవమానిస్తోందని శ్రీదేవి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులను అక్కున చేర్చుకున్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని, దళితులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని సురేష్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. వారికి పట్టిన గతే వీరికి: నారాయణస్వామి సీఎం జగన్ అండతో గెలిచి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకూ పడుతుందన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు జైలు కూడు తప్పదన్నారు. వారికి రాజకీయంగా పుట్టగతులుండవు: రోజా సీఎం జగనన్న అండతో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కదారి పట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని రోజా అన్నారు. నీచ రాజకీయాలతో నాలుగు సీట్లు గెలిచి ఏదో సాధించినట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే తాటాకు చప్పుళ్లకు భయపడ్డానికి జగనన్న కుందేలు కాదు సింహమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఏనాడు న్యాయంగా రాజకీయం చేయలేదన్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనగలడేమోగానీ.. కోట్లాదిమంది ప్రజల గుండెల్లో జగనన్నకు ఉన్న అభిమానాన్ని కొనలేడన్నారు. 2019 మాదిరిగానే 2024లో కూడా జగనన్న అదే రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు. ఉండవల్లి శ్రీదేవి కాదు.. ఊసరవెల్లి శ్రీదేవి: అమర్నాథ్ ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగిస్తూనే ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో అన్నారు. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురుతో వచ్చి సీఎం జగన్‌తో ఫొటో కూడా తీయించుకుని సినీనటి శ్రీదేవిని మైమరిపించేలా నటించారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటువేసి.. ఇప్పుడు దళిత కులం కార్డు అడ్డుపెట్టుకుని అందరి మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ముడుపులు తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తురాలేదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనేకన్నా.. ఊసరవెల్లి శ్రీదేవి అనడం బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. -
బీసీ వ్యక్తి స్పీకర్ గా ఉంటె చూడలేక దాడి చేయించాడు చంద్రబాబు
-
ఆర్ఆర్ఆర్ టీమ్ కి మంత్రి రోజా అభినందనలు
-
కె విశ్వనాథ్ సేవలు వెలకట్టలేనివి: మంత్రి రోజా
దివంగత టాలీవుడ్ కళాతపస్వి కె విశ్వనాథ్ కుటుంబాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కె విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..' విశ్వనాథ్ లేరంటే ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఇంకెవరూ చేయలేరు. ఆయన సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాలు ఓ మెసేజ్ అందిస్తాయి. ఒక దర్శకుడిగా, నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. అందరూ ఆదర్శవంతంగా ఆయనను చూసి నేర్చుకునేలా జీవించారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' ఆయనని చూసిన వెంటనే గురువును చూసినట్టే భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణం. ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలి. తెలుగు నెల ఉన్నంత వరకు తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. -
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్‌గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్
-
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి రోజా ట్వీట్
-
కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి : మంత్రి రోజా
-
ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి : మంత్రి రోజా
-
ప్రతిభ వెలికితీసేందుకు జగనన్న సాంస్కృతిక సంబరాలు
-
నగరి నియోజకవర్గంలో నెరవేరిన పేదల సొంతింటి కల
-
పవన్ వాహనం వారాహి కాదు..అది నారాహి : మంత్రి రోజా
-
రాయలసీమ ద్రోహి..చంద్రబాబు
-
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా : మంత్రి రోజా
-
‘'శాసనసభ’' విజయం సాధించాలి – మంత్రి రోజా
‘‘శాసనసభ’ టైటిల్ ఆసక్తిగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, నటి రోజా అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యారాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసనసభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 16న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్‌కుమార్, మలయాళ ట్రైలర్‌ను దర్శక– నటుడు చిన్నికృష, తమిళ ట్రైలర్‌ను నిర్మాత సతీష్ వర్మ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ– ‘‘నా బ్రదర్‌లాంటి షణ్ముంగంపై అభిమానం, సంగీత దర్శకుడు రవిబస్రర్ వల్లే నేను ఈ వేడుకకు వచ్చాను. ఈ సినివ హిట్ సాధించి నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు. ‘‘ఈ సినివ యూనివర్సల్ సబ్జెక్ట్’’ అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్. ‘‘శాసనసభ’ చాలా స్ట్రాంగ్ టైటిల్’’ అన్నారు ఇంద్రసేన. ‘‘ సురేష్ వర్మ, చిన్నికృష్ణగార్ల ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు వేణు మడికంటి. ‘‘మంచి సబ్జెక్ట్, మంచి కమిట్మెంట్తో ఈ సినిమా తీశాం’’ అన్నారు తులసీరామ్. ‘‘నిర్మాతగా నా లాంంగ్కు ఇంతమం ప్రాజెక్ట్ ఇచ్చిన ఇంద్రసేన, జగదీశ్వర్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలకు రుణపడి ఉంటాను’’ అన్నారు షణ్ముగం సాప్పని. సంగీత దర్శకుడు రవి బస్రర్, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రైటర్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్, నిర్మాత సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా
ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖామంత్రి, సీనియర్ నటి రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! త్వరలో ఆమె ఓ హీరో తనయుడి సరసన నటించనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ రూమర్స్‌పై రోజా నోరు విప్పారు. గురువారం నాడు రోజా బర్త్‌డే కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'యాక్టింగ్ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్గా ఆశీర్వదిస్తాను. తనకు అండగా నిలబడతాను' అని చెప్పుకొచ్చారు. చదవండి: నా పేరు సూర్య.. ఫస్ట్ చాయిస్ ఎవరో తెలుసా? రాజ్ తరుణ్‌కు అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్‌తో అయినా హిట్ దక్కేనా? -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
-
మహేశ్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు దురదృష్టకరం : మంత్రి రోజా
-
పవన్ రోజుకొక స్టేట్మెంట్ తో తెగిన గాలిపటంలా వ్యవహరిస్తున్నాడు : మంత్రి రోజా
-
మేము కన్నెర్ర చేస్తే జనసైనికులు రోడ్లపై తిరగలేరు : మంత్రి రోజా
-
విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై దాడులకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన కార్యకర్తల తీరుతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తలు తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో తమవారికి గాయాలయ్యాయని జోగి రమేశ్ పేర్కొన్నారు. తన కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో తమపై దాడులు చేయించారని ధ్వజమెత్తారు. మాతో పెట్టుకుంటే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు. చదవండి: జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’ -
పవన్ కుప్పిగంతులు ,పిచ్చి కూతలు ఎవరూ పట్టించుకోరు : మంత్రి రోజా
-
ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు : మంత్రి రోజా
-
బైక్ నడుపుతూ సందడి చేసిన మంత్రి రోజా
-
2024 జగనన్న వన్స్‌మోర్ : మంత్రి రోజా
-
కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోంది
-
భర్త దగ్గరకు వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి..
చిత్తూరు రూరల్: చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్ పేట చెరువులో గుర్తు తెలియని మహిళ శవం ఐదు రోజుల క్రితం లభ్యమైంది. ఆ శవం వీఎన్ఆర్ పురం గ్రామానికి చెందిన మోహన అలియాస్ రోజా(23)గా మంగళవారం తేలింది. దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రోజా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్త ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం ఆ మహిళ తల్లిదండ్రులకు అప్పగించారు. సాయంత్రానికి జీడీ నెల్లూరు మండలం నల్లరాళ్ల పల్లెలో కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు. వద్దన్నా వెళ్లింది రోజా ఇంటినుంచి వెళ్లిన తరువాత జరిగిన సంఘటనలను ఆమె తండ్రి చిన్నబ్బ మందడి మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, భర్త దగ్గరకు వెళ్లొద్దని తండ్రి చెప్పినా, గత శుక్రవారం ఇంటి నుంచి వీఎన్‌పురానికి రోజా వెళ్లింది. శుక్రవారం సాయంత్రం నుంచి రోజా కోసం ఆమె భర్తకు ఫోన్ చేస్తే తీయలేదు. మళ్లీ శనివారం ఉదయం ఫోన్ చేస్తే, పనిమీద బయట ఉన్నానని, ఇంటికెళ్లి ఫోన్ చేస్తానని బదులిచ్చాడు. చదవండి: (కులాంతర వివాహంతోనే హత్య) సాయంత్రానికి కూడా ఫోన్ చేయకపోవడంతో ప్రకాష్ తండ్రికి ఫోన్ చేయడంతో అక్కడికి రాలేదని చెప్పాడు. దీంతో బంధువుల ఊర్లలో వెతికినా రోజా ఆచూకీ తెలియలేదు. ఇంటికి తిరిగి వచ్చాక, పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని గ్రామస్తులు తెలపడంతో, బీఎన్ఆర్ పేట స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ వారు చూపించిన టవల్, ఎరుపు రంగు చున్నీ, తాళి బొట్టు, చేతికి ధరించిన దేవుడి దారం, మెడలోని నల్ల పూసల దారంతో రోజాగా గుర్తించారు. ఆమె భర్త చంపేశాడని ఫిర్యాదు చేసినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణను కొనసాగిస్తున్న పోలీసులు మరణానికి గల కారణాలను గురువారం వెల్లడించనున్నట్లు తెలిసింది. -
గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి బోరున ఏడ్చేసిన ఎమ్మెల్యే రోజా
-
కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబుకు మైండ్ పోయింది
-
ప్లేయర్లతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడిన రోజా
-
డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
-
ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
-
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా
-
బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం
-
అడవికి సింహం రారాజు ఆంధ్రాకి జగనన్న మహారాజు
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి
-
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు
-
ఘనంగా రోజా భర్త సెల్వమణి బర్త్‌డే వేడుకలు
Roja Husband Rk Selvamani Birthday Celebrations: నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ప్రొఫెషనల్ లైప్‌లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ సభ్యుల బర్త్‌డే వేడుకలకు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా రోజా భర్త, డైరెక్టర్ ఆర్. కె. సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే మై లవ్ అంటూ రోజా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. చదవండి: 'రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో సెల్వమణి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. చదవండి: నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) -
లోకేష్,చంద్రబాబులపై పంచ్ డైలాగ్స్ తో ఫైర్ అయిన రోజా
-
కార్యకర్తలతో కలిసి బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
-
ప్రజలు టీడీపీ జెండాను పీకిపడేశారు
-
అయ్యన్నపై ఆగ్రహం
-
నేతన్న ల కోసం కొత్త టెక్నాలజీని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
-
రోజా ఇంట్లో వినాయకచవితి ఉత్సవాలు
-
మట్టి విగ్రహాలను పూజించండి
-
టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా
-
పిల్లలకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన ఎమ్మెల్యే రోజా
-
రాఖీ స్పెషల్ : సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
-
కార్పొరేట్ విద్యను కామన్ మ్యాన్ దగ్గరకి తెచ్చిన చరిత్ర కారుడు జగన్
-
అమరరాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య
-
‘అమరరాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య’
సాక్షి, చిత్తూరు: అమర రాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అమరరాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారన్నారు. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని.. ప్రాణాలతో ఆడుకుంటున్న అమర్‌రాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. -
కళాకారులతో కలిసి డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా
-
రైతులను దగా చేసిన పార్టీ టీడీపీనే
-
లోకేష్ బాబు సింహం కాదు చింతకాయ్ : రోజా
-
ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
‘దళపతి’ (1991), ‘రోజా’ (1992), బొంబాయి (1995), ‘యువ’ (2004).. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు దర్శకుడు మణిరత్నం. ఇప్పటివరకూ ఆయన 26 సినిమాలు తీశారు. వాటిలో ‘క్లాసిక్’ అనదగ్గవి చాలా ఉన్నాయి. ఆ క్లాసిక్స్‌ని భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయిన శివేంద్ర సింగ్ మాట్లాడుతూ– ‘‘క్లాసిక్ సినిమాలను ఇప్పటి సాంకేతికతో భద్రపరచడం, మెరుగులు దిద్దడం వంటి అంశాలపై 2017లో చెన్నైలో వర్క్‌షాప్ చేశాం. అప్పుడు మణిరత్నంతో మాట్లాడాను. ఆయన సినిమాల్లో కొన్ని ప్రింట్స్, నెగటివ్స్ మెరుగైన స్థితిలో లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి ఆణిముత్యాలను ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ (ఎఫ్‌హెచ్‌ఎఫ్)లో ఎలా భద్రపరుస్తామో వివరించాం. మణిరత్నం సానుకూలంగా స్పందించారు. సినిమాలను 8కె రిజల్యూషన్‌లో భద్రపరుస్తాం. ఇప్పుడు అందరూ 4కె రిజల్యూషన్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. పాత ప్రింట్స్, నెగటివ్‌లను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్‌లో ప్రసాద్ కార్పొరేషన్ సహకారం ఉంది. అలాగే మేం ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం ఇలా చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని పేర్కొన్నారు. -
కోలుకుని ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్యం కోసం పూజలు నగరి : ఎమ్మెల్యే ఆర్కేరోజా పూర్ణారోగ్యంతో ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం నేత్రప్రదాత శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్ పాల్గొన్నారు. నేసనూరులో.. పుత్తూరు: ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం నేసనూరులో గ్రామ దేవత శ్రీకలుగు లక్ష్మమ్మ ఆలయంలో సర్పంచి గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం, తిరుమలరెడ్డి, కుమార్, ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొన్నారు. చదవండి: రోజాకు ప్రముఖుల పరామర్శ చదవండి: ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం -
చిత్తూర్: నగరిలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన రోజా
-
కాంట్రాక్ట్ ఉద్యోగిని పై దాడి
-
కాంట్రాక్ట్ ఉద్యోగిని రోజాపై దాడి
సాక్షి, కామారెడ్డి : మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు నిర్వహించే కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని రోజాపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ దాడికి ఒడిగట్టాడు. గతంలో రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పని చేశాడు. ఆ సమయంలో రోజా జూనియర్ అసిస్టెంట్ అయిన రామకృష్ణ కింద పని చేసేవారు. గత ఏడాది రామకృష్ణ పదోన్నతిపై బోధన్ మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్ళాడు. బదిలీపై వెళ్లిన నుంచి తరచుగా రామకృష్ణ రోజాకు ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలిసింది. గత నెల రోజులుగా రామకృష్ణ ఫోన్ చేసిన రోజా స్పందించకపోవడంతో ఆవేశానికి గురైన రామకృష్ణ సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రోజాపై దాడి చేశాడు. (బయటపడుతున్న రెవెన్యూ లీలలు!) అంతేకాకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశాడు. ఈ దాడిలో రోజా ముక్కుకు తీవ్ర గాయం అయింది. వెంటనే రోజాను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో రోజా ఫిర్యాదు చేయగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను దాడి చేసే దృశ్యాలు స్థానికులు ఫోన్లో రికార్డు చేశారు. అతని తీరుపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్’: గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ‘వైఎస్సార్ ఏపీ వన్’ పేరిట సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేశామని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. నూతన పారిశ్రామిక పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా సోమవారం ఆవిష్కరించారు. (పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు. గత ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోనే సాధ్యం కాదు. అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామన్నారు. కోవిడ్ పరిస్థితి ల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని వివరించారు. వైఎస్ జగన్ విజన్‌కు నిదర్శనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌కు ఇండస్ట్రియల్ పాలసీ నిదర్శనమని ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా అన్నారు. కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త పాలసీ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. ‘‘పలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పాలసీ. కొత్త పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని’ ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను కల్పిస్తామని, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని రోజా తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రతి ఇంటిలో అన్నగా మహిళల అభివృద్ధికి..
సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరి ఎమ్మెల్యే రోజా ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఇంటిలో అన్నగా ఉంటూ మహిళల ఆభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కేవలం అమరావతిలో భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలి
-
జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే..
సాక్షి, తిరుపతి: అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతి చేసి అడ్డంగా దొరికి పోయారని.. వీళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేశ్‌ల బండారం వెలుగు చూస్తుందని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జేసీ, అచ్చెన్నాయుడు నోరు విప్పితే వారి బండారం అంతా బయట పడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేశ్ భయపడుతున్నారన్నారు. అందుకే వారు కుడితిలో పడ్డ ఎలుకల్లా గిల గిల కొట్టు కుంటున్నారని.. విజయవాడ, అనంతపురానికి పరుగులు తీసున్నారని ఎద్దేవా చేశారు. ( అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం ) అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము నిప్పు అని చెప్పుకునే టీడీపీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే చంద్రబాబు ఒక్కరోజు కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ నుంచి రావడానికి తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పుకున్న ఆయన మరి ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా నిస్తుంటే నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎలా వచ్చారని నిలదీశారు. ఇది చంద్రబాబు నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని రోజా విమర్శించారు. (ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ) -
పక్కదోవ పట్టించడం చంద్రబాబుకు అలవాటే
-
పరిశ్రమాంధ్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్: గత సర్కారు మాదిరిగా అవాస్తవాలు, లేనివి ప్రచారం చేయడం, గ్రాఫిక్స్ చూపించి అన్యాయం చేయడం మాకు సాధ్యం కాదు. రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోయిందని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మీడియా దుష్ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్ వస్తోందని, బుల్లెట్ రైలు వస్తోందని, రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ గత ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ అంటూ గ్రాఫిక్స్ చూపించింది. అలాంటి అవాస్తవాలను మా ప్రభుత్వం ప్రచారం చేయదు. సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు నాలుగు పోర్టులు, ఆరు విమానాశ్రయాలున్నాయని మంచి రహదారులు, రైల్వే లైన్లు మన బలమని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యం పెంచేలా ఈ కేంద్రాలు పని చేస్తాయన్నారు. టెక్స్టైల్స్ రంగానికి గత సర్కారు రూ.1,100 కోట్లు బకాయిలు పెట్టిందని, వాటిపై కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. గత సర్కారు కేంద్రంతో కలసి కాపురం చేసినా ప్రత్యేక హోదా తేలేదని, ఎప్పటికైనా హోదా సాధిస్తాననే నమ్మకం తమకు ఉందని సీఎం అన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే సత్తా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకే ఉందన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక రంగం–మౌలిక సదుపాయాలపై మేధోమ«థన సదస్సు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. విభజనతో చాలా నష్టపోయాం మన ఆర్థిక రథం నడవాలంటే వ్యవసాయం ఒక చక్రం అయితే, రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగం. వాటిలో అభివృద్ధి కనిపిస్తేనే ఆర్థిక రథం పరుగెత్తుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పారిశ్రామికంగా పలు రాయితీలు ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ లాంటి రాయితీలు వచ్చేవి. వాటివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. హోదాను ఎప్పటికైనా సాధిస్తాం 2014–19 వరకు కేంద్రంతో కలసి కాపురం చేసినా గత ప్రభుత్వం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీ సాధించింది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకవేళ కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకుండా ఉండి ఉంటే వాళ్లతో బేరం పెట్టే అవకాశం ఉండేది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో వారు మా మద్దతు కోరే అవకాశమే లేకుండా పోయింది. గత సర్కారులా అసత్యాలు చెప్పం మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగానే మేం కూడా రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని మాట్లాడితే అర్ధం లేదు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి, 40 లక్షల ఉద్యోగాలు అని ఒకరోజు. నెలకో విదేశీ కంపెనీ అంటూ హడావుడి, రూ.50 వేల కోట్లతో సెమీ కండక్టర్ పార్కు, బుల్లెట్ రైలు వస్తుందని ఒకరోజు, ఎయిర్‌బస్ వచ్చేస్తుందని ఇంకోరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తోందని మరొక రోజు, హైపర్ లూప్ వస్తుందని ఇంకొక రోజు ప్రచారం.. ఇవన్నీ సరిపోవని ఈ మధ్యనే దివాలా తీసిన బీఆర్ «శెట్టి ఈ పక్కనే 1,500 పడకలతో రూ.6 వేల కోట్లతో దిగుతున్నాడని చెప్పారు. ఇవన్నీ నేను కూడా చెబితే అర్ధం ఉండదు. అదేనా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’? గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేది. 2014 – 2019 వరకు పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. వాటిలో దాదాపు రూ.968 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఇవ్వాల్సినవి. పరిశ్రమలు పెట్టించిన తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి? ఇక్కడ అంతా బాగుందని ఎలా చెబుతాం? గతంలో పారిశ్రామిక రాయితీలు కూడా అమ్ముకున్నారు. ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టచెబితే తప్ప రాయితీలు ఇచ్చేవారు కాదు. అలా నేను చెప్పలేను.. డిస్కమ్‌లకు కూడా గత ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టింది. ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఏటా క్రమం తప్పకుండా దావోస్ వెళ్లారు. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలు, చెప్పిందే చెప్పారు కానీ ఏమీ సాధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్పారు. మీడియా వారికి అనుకూలంగా ఉండడం వల్ల అలా అబద్ధాలు చెబుతూ పోయారు. అవన్నీ నేను చెప్పలేను. పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే. చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. నిజాయితీ, నిబద్ధత మాలో ఉన్నాయి. మాది 4వ అతి పెద్ద పార్టీ 175 సీట్లకు గానూ 151 సీట్లు, 86 శాతం స్థానాలను గెల్చుకుని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. ప్రో యాక్టివ్‌గా ఉన్నాం. 22 ఎంపీ స్థానాలను గెల్చి దేశంలోనే 4వ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ నిలిచింది. అవినీతికి తావే లేదు ఇక్కడ ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడా అవినీతికి తావు లేదు. వ్యవస్థలో మార్పు తెస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. సంస్కరణలు చేపట్టి రివర్స్ టెండరింగ్ విధానం. తెచ్చారు. టెండర్లలో ఎల్–1 వచ్చినా అంతకంటే ఎవరైనా తక్కువకు వస్తే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నాం. దేశంలో అత్యున్నత పోలీసు వ్యవస్థ ఏపీలో ఉంది. గ్రామ స్థాయిలో సచివాలయాల్లో మహిళా పోలీసులున్నారు. ఆ స్థాయిలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. శాంతి భద్రతలకు ఢోకా లేదు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల విలువైన చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీతోపాటు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశాం. మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ నెట్వర్క్ ఉంది. అవసరాలకు తగినట్లుగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్స్, కాలువల నుంచి ఢోకా లేకుండా నీరు ఇచ్చేవిధంగా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. పదేళ్లలో అద్భుతమైన మానవ వనరులు.. ► ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తెలుగు తప్పనిసరి సబ్జెక్‌గా ఉంటుంది. దీనివల్ల వచ్చే 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరులు అందించే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ► గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో కూడా మన స్థానం మారుతుంది. ఇంటర్ తర్వాత కాలేజీలో చేరుతున్న వారి నిష్పత్తి చూస్తే.. రష్యాలో 82 శాతం, చైనాలో దాదాపు 51 శాతం, బ్రెజిల్లో కూడా దాదాపు 51 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం అది కేవలం 26 నుంచి 28 శాతం వరకు మాత్రమే ఉంది. ► ఈ పరిస్థితి మారాలని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. 34 దేశాల రాయబారులను పిలిచాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు కూడా గడవకముందే డిప్లొమాటిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించి దాదాపు 34 దేశాల రాయబారులను కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఆహ్వానించాం. ఇక్కడ పెట్టుబడి అవకాశాలను వివరించాం. ఇవన్నీ చేస్తుంటే, గత సర్కారు పెద్దమనుషులు, వారి అనుకూల మీడియా దుష్ప్రచారం చేసింది. కియా మోటర్స్ వెళ్లిపోతోందని ప్రచారం చేశారు. అప్పుడు కియా మోటర్స్ ఎండీ స్పందించి ఇక్కడ ఇంత సానుకూలంగా ఉంటే ఎందుకు వెళ్లిపోతామని లేఖ ఇచ్చారు. పరిశ్రమలు–పెట్టుబడులు–ఉద్యోగాలు ► పరిశ్రమల పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఉంది కాబట్టే గత ఏడాది 34,322 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. ► 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.2503 కోట్లు పెట్టుబడి రాగా, 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కోవిడ్ వల్ల కాస్త మందగించినా పుంజుకుంటున్నాయి. ► ఇంకా రూ.11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. వాటికి ఏపీఐఐసీ 1,600 ఎకరాల భూమి కేటాయించింది. మరో 20 ప్రముఖ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయూత ► సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో దాదాపు 98 వేల యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వాటిని కాపాడుకుంటేనే వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకే వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా 81 వేల ఎంఎస్ఎంఈలకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగేలా బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు రెడీ చేసి అండగా నిలిచాం. ► కోవిడ్‌తో చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు మూతబడే స్థితికి చేరుకున్నాయి. వాటికి గత ప్రభుత్వం రూ.968 కోట్ల ప్రోత్సాహక రాయితీలు బకాయి పెడితే మేం ఇస్తామని చెప్పాం. ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తం కూడా జూన్ 29న ఇవ్వబోతున్నాం. ఇది నిజమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ► ఇవే కాకుండా ఏప్రిల్ నుంచి జూన్ వరకు పవర్‌పై ఫిక్స్డ్ ఛార్జీలు రూ.188 కోట్లు రద్దు చేశాం. కేంద్రం ఇచ్చేవి కూడా పంపిణీ చేసి తోడుగా ఉంటాం.ప్రభుత్వం ఇంకా వాటికి రూ.1200 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటోంది. పెద్ద కంపెనీలకు చాలా చేయాలి.. పెద్ద కంపెనీలకు ఇంకా ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందుకోసమే సూచనలు, సలహాలు తీసుకుందామని మిమ్మల్ని ఆహ్వానించాం. ఏంచేస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలలో విశ్వాసం కలుగుతుందో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడేళ్లలో చేయాల్సిన ప్రాజెక్టులు.. ► రాష్ట్రానికి మూడేళ్లలో కొన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా చేయాల్సినవి ఉన్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు నిర్మాణం, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావాలి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. అక్కడ మెట్రో రైలు రావాలి. ► ఇంకా 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లతో పాటు 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నాం. ప్లాంట్‌కు ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం కోసం డీఆర్డీవోతో ఒప్పందం చేసుకున్నాం. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ విశాఖలో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. టైర్–1 సిటీ కాబట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో విశాఖ పోటీ పడగలుగుతుంది. అక్కడ నిపుణులైనసాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందుబాటులోకి వస్తారు. రాబోయే రోజుల్లో అది కార్యరూపం దాల్చనుంది. సదస్సులో మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, నిపుణులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు -
‘అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా’
సాక్షి, విజయవాడ: మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ పదవి కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆయన ఫొటోకు దండేసి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొని, అందులో నలుగురిని మంత్రులను చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని బాబూ మర్చిపోయారా అంటూ రోజా ధ్వజమెత్తారు. (నీకు జగన్ మామయ్య ఉన్నాడని అమ్మ చెప్పింది) ఆ ఘనత ఆయనదే.. రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలు ఎవరూ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మద్యం దశలవారీ నిషేధం, మహిళలకు సున్నా వడ్డీ, 27 లక్షల ఇళ్ల పట్టాలు, 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. 33 పథకాలు చంద్రబాబు పెడితే పథకానికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జనం ఎందుకు ఛీ కొడతారని ప్రశ్నించారు. ప్రజలు మూలన కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోను చంద్రబాబు టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించారని రోజా గుర్తు చేశారు. సీఎం జగన్ పాలనను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు.(ప్రజాస్వామ్యానికి ప్రమాదం చంద్రబాబే) -
విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు అమోఘం
-
ఆశావర్కర్లు,108,104 సిబ్బందికి సరుకుల పంపిణీ
-
రెడ్‌జోన్ ఏరియాలో పర్యటించిన ఎమ్మెల్యే రోజా
-
పోలీస్,రెవెన్యూ సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపిన రోజా
-
రోజా ఫిష్ ఫ్రై చేస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ దెబ్బతో భారత్ సహా ప్రపంచ దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా కట్టడికి భారత్ లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, క్రీడాకారులు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీ, బిజీగా ఉండే రాజకీయ నేతలు ఇంట్లోనే టైంపాస్ చేస్తున్నారు. పుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వంటింట్లో గరిటె తిప్పుతూ తన కుకింగ్ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. రోజుకో స్పెషల్ వంటకం చేస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన పిల్లలకు ఇష్టమైన ఫిష్ ఫ్రై, టమాట, క్యారెట్ కూరలను తయారు చేశారు. కరోనా వచ్చిందన్న బాధ ఉన్నప్పటికీ సరదాగా కుటుంబ సభ్యులతో గడపడం సంతోషంగా ఉందంటున్నారు రోజా. ప్రస్తుతం రోజా చేసిన వంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఒక వైపు కుటుంబం కోసం సమయం కేటాయిస్తూనే.. లాక్డౌన్ వేళ రోజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు, వైద్య సిబ్బందికి రోజూ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండానే రాష్ట్రాన్ని మూడున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేశారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇంటింటికి రూ.1000 పంపిణీ చేసి సీఎం జగన్ మనసున్న నాయకుడని మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇంటింటింకి రేషన్ పంపిణీ జరిగిందన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా కష్టాల పాలు చేశారని విమర్శించారు. కరోనా కట్టడికి ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
వంటింట్లో గరిటె తిప్పుతూ
-
ఆకట్టుకున్న నవ జనార్దన పారిజాతం
-
నేను .. మీ రోజా
సాక్షి, హైదరాబాద్ : ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అద్భుతమైన నాట్యంతో ఆహుతులను అలరించారు. శనివారం రవీంద్రభారతిలో ఆమె ప్రదర్శించిన ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నారు. లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు కళాకృష్ణ నేతృత్వంలో ఆర్కే రోజా, సీఎస్ సుభారాజేశ్వరిలచే ప్రదర్శించిన నవ జనాదర్దన పారిజాతం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆంధ్రా నాట్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో దైవం ఉంటుందని అన్నారు. ఏపీ సాహిత్య అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ శివకుమార్, సినీ దర్శకుడు సెల్వమణి, ఫౌండేషన్ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరి, సంయుక్త కార్యదర్శి టికె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రోజా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సినిమా, కళ ఇలా అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. శనివారం రవీంద్రబారతిలో లైఫ్ "ఎన్" లా ఫౌండేషన్ నవజనార్ధన పారిజాతం ఆంధ్రనాట్య ప్రదర్శన జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై ఈ ప్రదర్శనకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ‘‘ సినిమాలంటే తనకు పెద్దగా ఆసక్తి లేదని కానీ రోజా భర్త సెల్వమని గొప్ప డైరెక్టర్ అన్న సంగతి అందరికి తెలుసు. ఆంధ్ర నాట్య ప్రదర్శన కోసం సెల్వమని రోజాను ప్రోత్సహిస్తున్నారు. మువ్వ నాట్య ప్రదర్శన చాలా గొప్పది. ఫౌండేషన్ నిర్వహిస్తున్న రోజా సెల్వమనికి అభినందనలు. ఆంధ్రనాట్య ప్రదర్శన చాలా గొప్పది.. 1000 సంవత్సరాలుగా వస్తున్న గొప్ప సంస్కృతి. ఆంధ్రనాట్య ప్రదర్శనను 11వ శతాబ్దంలో నటరాజ రామకృష్ణన్ కనుగొన్నారు. దీనిని దేవాలయాలలో ప్రదర్శిస్తారు. ఆంధ్ర నాట్య సంస్కృతిని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఫౌండేషన్ చైర్మన్ రోజా డ్యాన్స్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’నన్నారు. -
కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారు
-
ఆలోచింపజేసే లైఫ్ స్టైల్
నెహ్రు విజయ్, రోజా, నిఖిల్, సంతోషి ముఖ్య తారలుగా సి.ఎల్. సతీష్ మార్క్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైఫ్ స్టైల్’. కలకొండ నర్సింహ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నాయకుడు మందాడి జగన్నాథం ట్రైలర్‌ను విడుల చేశారు. రచయిత గోరెటి వెంకన్న పాటలు విడుదల చేయగా, సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఆడియోను విడుదల చేశారు. కలకొండ నర్సింహ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరుకు 4జి నెట్వర్క్కి అలవాటుపడి చదువులు, ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాలను మా చిత్రంలో సందేశాత్మకంగా చూపించాం’’ అన్నారు. సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ– ‘‘అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది. ప్రస్తుత సమస్యలు, నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉన్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్ .జె -
మహిళలను అవమానిస్తారా..?
సాక్షి, అమరావతి: మహిళల జోలికి వచ్చే మానవ మృగాళ్ల భరతం పట్టడానికి తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తేవడానికి నడుం కడితే ఉల్లి సాకుతో సభను అడ్డుకుంటారా? అని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. స్త్రీ మూర్తిని గౌరవించాల్సింది పోయి అవమానిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఆడపిల్లకు కష్టంవస్తే.. గన్ వచ్చేలోగా జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆమె మాట్లాడారు. స్పీకర్ పోడియం ఎదుట నిలబడి ఉల్లిపై ముందు చర్చ జరగాలంటూ పట్టుబట్టి గందరగోళం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక దశలో ఆమె ‘మీరసలు మనుషులేనా? మాతృమూర్తులను గౌరవించకపోగా ఉల్లితో పోటీపెట్టి అవమానిస్తారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?’.. అంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాక..లోకేష్‌కు పప్పులో ఉల్లిలేదని చంద్రబాబు బాధపడుతున్నారా? అని ఆమె ఎద్దేవా చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్, లోకేశ్ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారోనన్న భయమా? అని ఆమె ప్రశ్నించారు. బాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలియదన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా? అని ఒకసారి.. ఆడవారి పుట్టుకపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఈరోజు మహిళల భద్రతపై మాట్లాడేందుకు అవకాశం లేకుండా కూడా అడ్డుపడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ దశలో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వెళ్లి తమకు న్యాయం చేయాలని, తమ భద్రతపై చర్చ జరుగుతుంటే ఇదేం అల్లరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలి అని రోజా అన్నారు. ఇదే సందర్భంలో మానవ హక్కుల సంఘం తీరునూ ఆమె దుయ్యబట్టారు. గుట్టురట్టవుతుందనే ఉల్లి నాటకం? రజని మహిళా భద్రతపై అసెంబ్లీలో చర్చ జరిగితే గత ఐదేళ్లలో మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేసిన అకృత్యాలు బయటపడతాయని ఉల్లి నాటకం ఆడుతున్నారా? అని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని విపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. మహిళల భద్రతపై వారికి చిత్తశుద్ధి లేకపోవడంవల్లే ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. తొలినుంచీ చంద్రబాబు ఇంతే.. : ఉషశ్రీ చర్చలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. నేరాల తగ్గింపునకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తున్న తమ ముఖ్యమంత్రి మహిళల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. చంద్రబాబు తీరు తొలి నుంచీ ఇలాగే ఉందని, మహిళలకు రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ఎలా గందరగోళం సృష్టించారో ఇప్పుడు మహిళా భద్రతపై జరుగుతున్న చర్చలోనూ అదే తీరును ప్రదర్శింస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ రియల్ హీరో : ధనలక్ష్మీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా చర్చలో పాల్గొంటూ.. మహిళలకు భద్రత కల్పిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజమైన హీరో అని అభివర్ణించారు. పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆడపిల్లలకు స్వీయరక్షణపై తర్ఫీదునివ్వాలని ఆమె కోరారు. -
అంత సీన్ లేదు: ఎమ్మెల్యే రోజా
ప్రజలతో మెలగాలి. వారి కష్టసుఖాలను తెలుసుకోగలగాలి. కేవలం సినిమా ఆకర్షణతో సీఎం సీటు ఎక్కేంత సీన్ లేదు..అని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. కష్టనష్టాలకు ఎదురీది, అగ్ర రాజకీయకీయ నేతలకు ఎదురొడ్డి ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్మోహన్రెడ్డే నేటి తరం రాజకీయాలకు ఆదర్శప్రాయుడని ఆమె చెప్పారు. సాక్షి, చెన్నై: రైల్వే సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప, రోజా చెన్నైలోని దక్షిణరైల్వే ప్రధాన కార్యాలయానికి వచ్చారు. నగరి సమస్యల పరిష్కారం కోసం జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రజనీ, కమల్ గురించి మీడియా ప్రశ్నించగా, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.. ప్రజలు ఎవరిని నమ్మి ఓట్లు వేస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాననే భరోసా ఇవ్వగలగాలి. అలా కాకుండా ఊరికే ఏసీ గదుల్లో ఉంటే సీఎం ఎప్పటికీ కాలేరు. జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయడానికి ఎన్నెన్ని చేస్తున్నారో చూస్తున్నాం. ఇన్ని జరిగినా ప్రతిపక్ష నేతగా తొమ్మిదేళ్లు ప్రజల్లోనే ఉన్నారు. ఢిల్లీలో మోదీ, సోనియాగాం«దీ, ఏపీలో చంద్రబాబు ఎవరైనా సరే‡ ప్రజల కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. అందువల్లే ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. అలా కాకుండా నేను నటుడిని, నాకు పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.. అనేది ఇప్పుడు లేదు. ఆ రోజులు పోయాయి. సోషల్ మీడియాలో ఎవరు, ఏమిటి.. ఎలా అనేది అంతా చూస్తున్నారు. ప్రజలు బాగా తెలివిమంతులు, వారికి తెలుసు ఎవరిని అందలం ఎక్కించాలనేది. జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంæ ఉండదని అనుకున్నారు. గతంలో ఎవ్వరికీ అంతగా తెలియని ఎడపాడి పళనిస్వామి మంచి రాజకీయవేత్తగా, లీడర్‌గా గుర్తింపు పొందారు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేస్థాయికి అన్నాడీఎంకే ఎదిగిందని చెప్పారు. నగరి నియోజకవర్గంలో రూ.200 కోట్ల రైల్వే అభివృద్ధి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నాలుగోసారి దక్షిణరైల్వే జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నాను. గతంలో మూడు సార్లు వచ్చినపుడు అప్పటి జనరల్ మేనేజర్లు కూడా తాము చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి రూ.100 కోట్ల విలువైన 75 శాతం పనులు పూర్తిచేశారు. అప్పుడు పెట్టిన ఉత్తరంలో సుమారు మరో రూ.100 కోట్ల పనులు మంజూరై టెండర్ల దశలో ఉన్నాయి. మూడు నెలల్లో టెండర్లు ఖరారై పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నగరికి, చెన్నైకి అవినావభావ సంబంధం ఉంది. అక్కడ ఎక్కువగా చేనేత కార్మికులు ఉండడం వల్ల వారి వృత్తి రీత్యా చెన్నైకి రావడం జరుగుతోంది. వైద్యసేవల కోసం చెన్నై ఆసుపత్రులకు వస్తుంటారు. ఎముకలు విరిగిపోయిన స్థితిలో రోగులు తమిళనాడు నుంచి ఈసలాపురానికి వస్తూ ఉంటారు. రైళ్లు కూడా ఈ మార్గంలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వీరి వల్ల రైల్వేకు ఎంతో ఆదాయం. అందువల్లే మేము అడిగినవన్నీ జీఎం అంగీకరించడం ఆనందంగా ఉంది. తిరుపతి – చెన్నై ఫోల్లైన్ రోడ్డు వేయకుండానే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ రాయపాటి మనుషులు ఇబ్బంది పెట్టడంపై సంబంధితశాఖకు ఫిర్యాదు చేశాం. కేంద్రమంత్రులకు సైతం ఫిర్యాదు చే శాం. నగరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న జీఎం, ఇతర అధికారులకు ధన్యవాదాలు. అలాంటి సీఎం కావాలని కోరుతున్నారు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్యేగా పని చేయడం గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి సీఎం మాకు లేరే అని మాట్లాడుకుంటున్నారు. ఐదు నెలల్లోనే అన్ని చేస్తున్నారంటే, 5 ఏళ్లలో ఎవరూ ఆయన్ను బీట్ చేయలేరు. మరో 20 ఏళ్లు జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. అబద్ధాల కోరు చంద్రబాబు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతారు, అన్యాయం చేస్తారు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, అమరావతిలో సంవత్సరానికి నాలుగు పంటలు పండే భూమిని రైతుల వద్ద నుంచి గుంజేసుకున్నాడు కాబట్టే వారి శాపాలు తగిలాయి అన్నారు. ఇక చంద్రబాబు కోలుకునే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని, ఆయన మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టి పథకాలన్నింటినీ ప్రతి ఇంటికీ అందేవిధంగా చేస్తున్నాడు.. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర గుణపాఠాలు నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం ఇప్పటికైనా ఆయన మానుకోవాలన్నారు. -
హైదరాబాద్‌లో ప్రియాంక.. కాంచీపురంలో రోజా..
సాక్షి, చైన్నై : దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చట్టాలంటే భయంలేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడి.. కిరాతకంగా అంతమొందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి తరహాలోనే.. తమిళనాడు కాంచీపురంలో రోజా అనే యువతి హత్యకు గురైంది. గత శనివారం కనిపించకుండా పోయిన రోజా.. కాలిన గాయాలతో ముళ్ల పొదల్లో శవమై గురువారం కనిపించారు. అయితే రోజా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆండిసిరువలూర్ గ్రామానికి చెందిన భూపతి కుమార్తె రోజా (20) చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూరులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గత శనివారం విధులకు వెళ్లిన రోజా తిరిగి ఇంటికి రాలేదు. రోజా కోసం గాలించిన కుటుంబ సభ్యులకు ఆమె లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పెరంబదూరు సిరువాక్కంలో రోజా మృతదేహాం కొయ్యకు వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోజా మృతదేహాన్ని శవపరీక్ష కోసం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోజా ఒంటి కాలిన గాయాలు ఉండటంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజాపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అంతమెందించినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కాంచీపురం–బెంగళూరు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కాగా, యువతి మృతదేహాం లభించిన ప్రాంతం ఓ రాజకీయ నాయకుడిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. రోజా చివరిసారిగా ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రాజేశ్‌తో(30) మాట్లాడుతూ కనిపించిందని.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్.. రోజా మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాగ్‌తో రోజాపై దాడికి పాల్పడి.. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్లో జస్టిస్ ఫర్ ప్రియాంక, జస్టిస్ ఫర్ ప్రియాంక హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. -
మళ్లీ శాకాహారం
వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత, దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. -
చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అంటూ తెలుగును చంపేశారు..
సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదని చెప్పటం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా వడమాలపేట జిల్లా పరిషత్ పాఠశాలలోని బాలల దినోత్సవ కార్యక్రమానికి గురువారం రోజా హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇందుకే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తోందని, ఈ రోజే నిజమైన బాలల దినోత్సవమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు విమర్శిస్తూ మాట్లాడటం సిగ్గు చేటు అని ఆమె మండిపడ్డారు. అలాగే ఓ ఆడియో టేప్‌లో చంద్రబాబు ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ తెలుగును చంపేశారని రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల వసతులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. -
తండ్రి ఆరోగ్యశ్రీ.. తనయుడు కంటి వెలుగు
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం ఉన్న నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ కంటివెలుగు’ కార్యక్రమాన్ని ఆమె గురువారం చిత్తూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కంటివెలుగు’ కార్యక్రమం పేద ప్రజలకు మరో సంజీవని వంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారు.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ రెండు అడుగులు ముందుకువేసి ‘వైఎస్సార్ కంటివెలగు’ను ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కంటి సంబంధిత జబ్బులు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని.. ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రోజా పేర్కొన్నారు. -
ఫోన్‌కి అతుక్కుపోతున్నారు
కలకొండ ఫిలిమ్స్ పతాకంపై సి.ఎల్. సతీశ్ మార్క్ దర్శకునిగా కలకొండ నర్సింహా నిర్మాతగా ‘లైఫ్‌స్టైల్’ చిత్రం రూపొందింది. నూతన నటీనటులు నెహ్రూ విజయ్, రోజా, నిఖిల్‌లతో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా. వకుళాభరణం మోహనకృష్టారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా చక్కని సందేశంతో తీసిన చిత్రం ఇది. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నర్సింహా మాట్లాడుతూ– ‘‘కొన్నేళ్ల క్రితం 2జి నెట్వర్క్ ఉండేది. అప్పుడు ప్రజలు పద్ధతిగా ఉండేవారు. 4జి నెట్వర్క్ వచ్చాక మనుషులు మొబైల్‌కి అతుక్కుపోతున్నారు. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చదువులను, ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అన్నారు. ‘‘మొబైల్‌కు అలవాటుపడి యువత చెడు అలవాట్ల బారిన పడుతున్నారు. మొబైల్‌కు నెట్వర్క్ ఎంత అవసరమో మన ఫ్యామిలీకి మనమూ అంతే అవసరం అని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు సతీశ్. -
బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చైర్మన్‌గా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళ పక్షపాతి. బడ్జెట్ చూసి, నవరత్నాలు చూసిన ఆ విషయం అర్థమవుతుంది. పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. పారిశ్రామికీకరణకు బడ్జెట్లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తాం. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. పారదర్వకంగా ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయింపు జరుగుతుంది.’ అని రోజా తెలిపారు. -
ఆనంద వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా
-
సీఎం జగన్‌ను కలిసిన రోజా, నారాయణస్వామి
సాక్షి,అమరావతి: తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు ప్రముఖులు ఆయనను కలిశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దంపతులు, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, జి.శ్రీకాంత్ రెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వాసు బాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు సీఎంని కలిసినవారిలో ఉన్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తొమ్మిదేళ్లుగా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని.. రాష్ట్రానికి రాజన్న పాలన తీసుకురావాలన్న ఆలోచనతో తామంతా పని చేశామన్నారు. అంతేకానీ పదవుల కోసం కాదని రోజా స్పష్టం చేశారు. తమ నియోజవర్గ ప్రజలకు నవరత్నాలు అందించడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. బుజ్జగింపులు, అలకలు అనేవే లేవని, మీడియా అనవసరంగా దూరం పెంచొద్దంటూ ఆమె హితవు పలికారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తామంతా అయినట్లేనని రోజా అన్నారు. సమాచారశాఖ కమిషనర్‌గా విజయకుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా తుమ్మా విజయకుమార్‌రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 1990 బ్యాచ్‌కు చెందిన విజయకుమార్‌రెడ్డి.. డెప్యుటేషన్‌పై రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా విజయకుమార్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విజయకుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. -
మణికొండలో ఎమ్మెల్యే రోజా పూజలు
మణికొండ: ఏపీలని చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజామంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ఆమె తరచూ ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి, గోమాతకు ఆహారంఅందజేశారు. -
వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం
-
బలహీన వర్గాలకే ప్రాధాన్యం
‘ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధికారత సాధించినపుడే వారి నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. అట్టడుగున ఉన్న వర్గాల మహిళలను ఈ రంగాల్లో ప్రోత్సహించినపుడు సమాజానికి మేలు జరుగుతుంది. ‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాలు కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టీకరించారు. ఈ కేవలోనే మహిళా అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. సాక్షి, అమరావతి: మహిళా దినోత్సవ సందేశాన్ని నిజం చేస్తూ ఆయన ప్రకటించిన వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలో బలహీన, బీసీ వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ఈ జాబితాలో నలుగురు లోక్‌సభ, 15 మంది శాసనసభ అభ్యర్థులున్నారు. మహిళాభివృద్ధికి పాటు పడుతున్నామని చెప్పుకొనే టీడీపీ ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లే అయినా... దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకునే టీడీపీకి దీటుగా వైఎస్ జగన్ మహిళా అభ్యర్థులను.. అందులోనూ బీసీ, బలహీన వర్గాలకు చెందినవారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. తాను భవిష్యత్తులో వారి పట్ల ఎలా ఉండబోతున్నారో సంకేతాలిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యం కల్పించడానికి వెనుకాడబోనని ఆయన ఈ ఎంపిక ద్వారా స్పష్టం చేశారు. అసెంబ్లీ బరిలోని నారీమణులు అసెంబ్లీకి వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థుల్లో ముగ్గురు బీసీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు కాపులు, ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గంవారు. కురుబ వర్గానికి చెందిన కళ్యాణదుర్గం అభ్యర్థి ఉషాచరణ్ సాధారణ మహిళ. దళిత కుటుంబానికి చెందిన పద్మావతి విద్యావంతురాలు. తాడికొండ (ఎస్సీ) అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి మంచి డాక్టర్. జనరల్ సీటైన చిలకలూరి పేట నుంచి బరిలో ఉన్న విడదల రజని బీసీ మహిళ. ప్రత్తిపాడు (ఎస్సీ) అభ్యర్థి మేకతోటి సుచరిత రెండుసార్లు ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ) అభ్యర్థి తానేటి వనితకు రాజకీయ నేపథ్యం ఉంది. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ సాధ్యమైనంత మేర మహిళలకే సీట్లు కేటాయించారు. పాడేరు (ఎస్టీ) అభ్యర్థి గొట్టుకుళ్ల భాగ్యలక్ష్మిది సాదాసీదా నేపథ్యమే. కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో విశ్వాసరాయి కళావతి రెండోసారి పోటీ చేస్తున్నారు. పాతపట్నం అభ్యర్థి రెడ్డి శాంతి తూర్పు కాపు. రంప చోడవరం అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గృహిణి. ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పెద్దాపురం అభ్యర్థి తోట వాణి కాపు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత తోట నరసింహం సతీమణి. పరిచయం అక్కర లేని రోజా ఇక మహిళలకు జరిగే అన్యాయాలు, అణచివేతపై నిప్పులు చెరుగుతూ పోరాడే ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆర్.కె.రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, రిషితేశ్వరి మరణం, ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దౌర్జన్యాలతో సహా పలు మహిళా సమస్యలపై ఆమె గత ఐదేళ్లుగా పోరాడిన తీరు ప్రజలకు విదితమే. టీడీపీలో అధినేతల అత్మీయులకే సీట్లు టీడీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న వారంతా సీనియర్ నేతల ఆత్మీయులే. రాజమండ్రి అభ్యర్థి మాగంటి రూప ప్రస్తుత ఎంపీ మురళీమోహన్ కోడలు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. రాజంపేట అభ్యర్థి డి.కె.సత్యప్రభ దివంగత పారిశ్రామికవేత్త డి.కె.ఆదికేశవులు సతీమణి, ఆమె ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యే. ఇక తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా, పలుమార్లు నెల్లూరు, బాపట్ల ఎంపీగా ఉన్నారు. ఏనాడూ టీడీపీలో లేని ఈమెకు... ఢిల్లీలో ఉన్నత స్థాయిలో జరిగిన రాజకీయ ఒప్పందాల కారణంగా టిక్కెట్ వచ్చిందన్న ప్రచారం ఉంది. అభ్యర్థులంతా..ఆర్థిక వనరులు ఉన్నవారే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులంతా గట్టి రాజకీయ నేపథ్యంతో పాటు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారే. వీరిలో నలుగురు రెడ్డి సామాజికవర్గం, ఒకరు క్షత్రియ, నలుగురు ఎస్సీలు. ఇద్దరు ఎస్టీ అభ్యర్థులున్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అలూరులో కోట్ల సుజాతమ్మ, పుంగనూరులో అనూషారెడ్డి, పాణ్యంలో గౌరు చరిత వీరంతా రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులు కావడం విశేషం. గౌతు శిరీష (పలాస), గుండా లక్ష్మీదేవి (శ్రీకాకుళం), కోళ్ల లలితకుమారి(ఎస్.కోట), పిల్లి అనంతలక్ష్మి (కాకినాడ రూరల్) వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. -
‘లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు’
సాక్షి, చోడవరం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. గురువారం చోడవరంలో జరిగిన వైఎస్సార్ సీపీ మహిళ గర్జనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. వీధికో బార్, గ్రామల్లో విచ్చలవిడిగా వైన్ షాపులకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని, మహిళలను కించపరిచే టీడీపీ పాలనలో చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు. మహిళలకు మాంగల్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాత్రమే అన్నా అని పిలవగలమన్నారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకొని వైఎస్ జగన్ నవరత్నాలను రూపొందించారని అన్నారు. అమరావతిలో శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అని, ఇంతకాలం ఎన్టీఆర్ భవన్ కూడా అమరావతిలో ఏర్పాటు చేయని చంద్రబాబు ...ఎన్నికల తర్వాత ఏపీని వదిలి వెళ్లాల్సిందేనని అన్నారు. జగన్ అమరావతిలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందన్న ఆమె... చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొడితే ఏపీకి హోదా వస్తుందన్నారు. ఇక చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు అని ఎద్దేవా చేశారు. తండ్రి గుడిని మింగితే కొడుకు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని వ్యాఖ్యానించారు. చీరలు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్న చంద్రబాబుని మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఇవ్వకపోగా తన కోడలు బ్రహ్మణీకి మాత్రం హెరిటేజ్ కంపెనీ ఇచ్చారని ఆమె విమర్శించారు. పోస్ట్ డేటెడ్ చెక్‌లు ఇవ్వాలన్న ఆలోచన అవుట్ డేటెడ్ చంద్రబాబుది అని, డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు కూడా లేవా అని ప్రశ్నలు సంధించారు. ఈ చెక్కులు ద్వారా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ చెక్కులు చెల్లవని చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. వైఎస్సార్ సీపీ మహిళ గర్జనలో అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, పీలా వెంకటలక్ష్మి, వరలక్ష్మి, కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఏపీని వదిలి వెళ్లాల్సిందే
-
చంద్రబాబు గృహప్రవేశానికి ఒక్కరినైనా పిలిచారా?
-
వెన్నుపోటు పొడిచిన చర్రిత చంద్రబాబుది
-
అత్తింటి ఎదుట యువతి ఆందోళన
చైతన్యపురి: ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని నెలలకే మొఖం చాటేసిన తన భర్తను తనకు అప్పగించాలని కోరుతూ ఓ యువతి అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. భరత్ అనే యువకుడు, బాధితురాలు రోజ సమీప బంధువులు. ప్రేమించుకున్న వారు 2016 లో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే భరత్ రోజాను వేధించటం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా ఇం టికి రాకపోవడంతో బాధితురాలు గత నెల 19న సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే భరత్ కొత్తపేట లక్ష్మీనగర్‌లో నివసించే భరత్ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు రోజాకు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఆమె తన కుటుంబ సభ్యులు, మహి ళా సంఘాల నాయకులతో కలిసి లక్ష్మీనగర్‌లోని అత్తింటి వద్ద ఆందోళనకు దిగింది. కోర్టులో కేసు ఉండగా న్యూసెన్స్ చేస్తున్నారని భరత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రోజా ఆమె కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించారు. -
నియంతను తలపిస్తున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తనను ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తోందన్నారు. కాకినాడలో సమస్యలపై నిలదీసిన ఒక మహిళను ‘ఫినిష్ చేస్తానంటూ..’ గూండాలా బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇదే రీతిలో అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించిన విషయం గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని చేయాలో అన్నీ చేశారని దుయ్యబట్టారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించనంటున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని అంతమొందిస్తే ఆ నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారని రోజా చెప్పారు. కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు ఇస్తే నిందితుడు శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబుకు, లోకేశ్‌కు ఎందుకని నిలదీశారు. ‘ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును మీరు ఎన్ఐఏకి అప్పగిస్తే అది సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? కిడారి కేసును బదిలీ చేసినట్టే జగన్ హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి ఎందుకు ఇవ్వలేదు?’ అని రోజా నిలదీశారు. సినిమాలు లేని శివాజీ అనే నటుడితో ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు చెప్పించింది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం నూటికి నూరు శాతం చంద్రబాబే చేయించారన్నట్టుగా ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయన్నారు. హర్షవర్ధన్ మీ బినామీ కాదా? ‘ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ అధినేత హర్షవర్ధన్ చౌదరి మీకు బినామీ కాదా?, ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించింది మీరు కాదా? శ్రీనివాస్ ఉపయోగించిన కత్తి హర్షవర్థన్ రెస్టారెంట్లో ఎంతో కాలంగా ఉన్నది నిజం కాదా? మీకు సంబంధం లేనప్పుడు కేసును ఎన్ఐఏకి అప్పగించాలి కదా. ఎన్ఐఏకి కేసు అప్పగించాలని అధికారులు కోరితే రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించడం లేదు..’ అని రోజా నిలదీశారు. తిరిగి తాను అధికారంలోకి రాను అని భావించిన చంద్రబాబు.. జగన్‌ను భౌతికంగా లేకుండా చేసేందుకు ప్లాన్ చేసినా భగవంతుడి దయవల్ల ఆయన బయటపడ్డారన్నారు. బీజేపీతో లాలూచీ పడింది, మోదీకి ఊడిగం చేస్తోంది కూడా చంద్రబాబేనన్నారు. ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ‘కేంద్రంపై యుధ్దం అని పైకి చెబుతూ నీతి ఆయోగ్ మీటింగుకి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది మీరు కాదా? కర్ణాటక ఎన్నికలయ్యాక తనను అరెస్ట్ చేయబోతున్నారని, తనను రక్షించుకోవాలని బహిరంగంగా ప్రజలను కోరలేదా? అయినా ఈరోజు వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదంటే అర్ధం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివి అంటున్న చంద్రబాబు తన చుట్టూ కేంద్రం కల్పించిన జడ్ కేటగిరీ భద్రతను పంపేయాలన్నారు. -
సేవా కార్యక్రమాలతో పెద్ద మనసు చాటుకున్న నేతలు
సాక్షి, వైఎస్సార్/నెల్లూరు/చిత్తూరు: నూతన సంవత్సరం సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సేవా కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు వద్ద రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో ఎంతో మంది పేద ప్రజల ఆకలి బాధలు తీరతాయని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల్లో ఒకటైన రాజన్న క్యాంటీన్‌ను రైల్వేకోడూరులో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. పల్లపు సుధాకర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీధర్‌రెడ్డి పిలుపునివ్వగా.. 4 లక్షల 70 వేల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఈ డబ్బును శ్రీధర్‌రెడ్డి ఆపరేషన్ నిమిత్తం బాధితుడికి అందజేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజా నూతన సంవత్సరం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అప్పలాయ గుంటలో ఆమె వైఎస్సార్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ప్రతి మంగళవారం నాలుగు రూపాయలకే భోజనం అందించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగిరిలో కేక్ కట్ చేసిన రోజా కొత్త పేటలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మంచి నీరు అందించాలని నిర్ణయించారు. -
‘ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్’
సాక్షి, చిత్తూరు: అలుపెరగని నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రోజాతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్వేటినగర్ కూడలిలో వైఎస్సార్ క్యాంటీన్‌ను వారు ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రకు ఊహించని మద్దతు లభిస్తోందని, పాదయాత్ర అనంతరం ఢిల్లీలో జగన్‌తో సభ నిర్వహిస్తామని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ ఆశాజ్యోతి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుంట్ను గుంటనక్కలు ఉన్నారని, వారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను దోచుకుంటున్న వారి పాలన త్వరలోనే అంతమవుతుందని, వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
‘పప్పు’ చాలా హ్యాపీగా ఉంటారు: రోజా
సాక్షి, అమరావతి : నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు సమాధి చేయాలనుకున్నారని, ఆయన కుట్రలను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు గమనించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫలితాలను చూసి ఏపీ ప్రజలు ఆనందించారని, మనీ, మ్యానిపులేషన్, మీడియా చంద్రబాబును కాపాడలేకపోయాయని ఎద్దేవా చేశారు. కోట్టు ఖర్చు పెట్టి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ నేరగాడు.. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదన్నారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ లేని కాంగ్రెస్ తల లేని మొండెం లాంటిదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడటానికి ‘చంద్ర’ గ్రహణమే కారణమన్నారు. చంద్రబాబును పట్టుకుని నడవటం.. కుక్క తోక పట్టుకుని నడవటమే అంటూ విరుచుకపడ్డారు. కుట్రలు చేసి కట్టలతో చంద్రబాబు గెలవాలనుకున్నారని కానీ, తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే శకుని వేసిన పాచికలాంటిదని విమర్శించారు. లగడపాటి మరో మాల్యా అని.. అప్పులు ఎగ్గొట్టడానికి పథకం రచించారని ఆరోపించారు. రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. సర్వే సన్యాసం చేస్తే మంచిదంటూ సూచించారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఎప్పుడో చెప్పారంటూ గుర్తు చేశారు. తాను ఒక్క సీటైనా గెలిపించానని.. తన నాన్న (చంద్రబాబు) ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడని పప్పు చాలా హ్యాపీగా ఉంటారని మంత్రి లోకేష్‌కు చురకలంటించారు. చంద్రబాబు ఇక పప్పును ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మాల్సిందేనని, పప్పుకు కిరీటం పెట్టాలనుకున్న పథకాలు తారుమారయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు విజ్ఞతగా వ్యవహరించాలని కోరారు. వైఎస్ జగన్‌ను ఆదరిస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌గా ఏమిస్తారోనని తాము కూడా ఆసక్తిగా గమనిస్తున్నామన్నారు. -
జగన్‌ను సీఎం చేయడమే వైఎస్‌కు నిజమైన నివాళి : రోజా
సాక్షి, నరసరావుపేట రూరల్: జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే వై.ఎస్. రాజశేఖరరెడ్డికి ఆయన అభిమానులు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే ఆర్.కె. రోజా అన్నారు. కోటప్పకొండలోని యోగి వేమన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్ల సత్రంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన, గురవాయపాలెంలో వై.ఎస్. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో చిన్నచిన్న విబేధాలను పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలపుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తెలుగుదేశం పార్టీ కోనుగులు చేసిందని, వారిపై స్పీకర్ కోడెల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అరాచకాలకు పాల్పడుతున్న ఆయన్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుడూ టీడీపీ దోపిడి పాలన అంతమొందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, యెగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, అధ్యక్షుడు గాయం కృష్ణారెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, మోదుగుల పాపిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, కాపులపల్లి ఆదిరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి, డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎన్. యజ్ణనారాయణరెడ్డి, మాగులూరి రమణారెడ్డి, గానుగపంట ఉత్తమరెడ్డి, మూరే రవీంద్రారెడ్డి, సి.వి. రెడ్డి, మద్దిరెడ్డి నర్సింహరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన వన భోజనాల్లో 18వేల మంది పాల్గొన్నారు. -
మొదటి ఐదు సంతకాలు ఏమయ్యాయి?
-
చంద్రబాబు అసమర్ధ సీఎం:రోజా
-
గుర్తుకొస్తున్నాయి..
సనత్‌నగర్: రోజా..ఓ ఎమ్మెల్యే, సినీ నటి, మాలినీ కృష్ణమూర్తి..ఓ ఐపీఎస్ అధికారి, మృదుల..ఓ సామాజిక చైతన్య రథసారథి, మల్లిక...ఓ జాయింట్ డైరెక్టర్ (డీజీపీ కార్యాలయం తెలంగాణ), నాగమణి..ఓ సైంటిస్ట్, స్వర్ణలత...ఓ పారిశ్రామికవేత్త, మాధవి..ఓ గృహిణి...ఇలా ఆకాశంలో సగం...అవనిలో సగం అన్న మాటను అక్షరాల నిజం చేసిన శ్రీపద్మావతి ఉమెన్స్ కాలేజ్ (తిరుపతి) పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. బేగంపేటలోని తాజ్‌వివంతా హోటల్ ఇందుకు వేదికైంది. 1964 బ్యాచ్ నుంచి మొదలుకొని 2,000 బ్యాచ్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో ఆనందంగా సాగింది.ఒకరికొకరు చూసి పోల్చుపోలేకపోయినా శ్రీపద్మావతి ఉమెన్స్ కళాశాల (ఎస్పీడబ్ల్యూసీ) కళాశాల అందించిన జ్ఞాపకాల పూదోటలో విహరించి తరించారు. ఆనాటి మధు ర స్మృతులను నెమరువేసుకున్నారు. ఒక్కసారి చిన్న పిల్లలుగా మారి తాము చేసిన అల్లరి, చిలిపిచేష్టలను గుర్తుచేసుకుని ఆనందంలో ముగినిపో యారు. దాదాపు 40, 50 ఏళ్ళ తరువాత కలుసుకున్న ఎస్పీడబ్ల్యూ కాలేజీ మేట్స్, క్లాస్ మేట్స్, బెంచ్‌మేట్స్ ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వే గానికి లోనయ్యారు. ఆనాటి అధ్యాపకులు తమ పట్ల చూపిన అభిమానానికి ఆ పూర్వ విద్యార్థలు సలాం కొట్టి ఘనంగా సత్కరించుకున్నారు. ఆ ఇద్దరి చొరవతో... ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కమలామీనన్, జువాలజీ లెక్చర్‌గా పనిచేసిన హేమావతిలు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్వ విద్యార్ధులను కలిపారు. దాదాపు నెల రోజుల పాటు ఇందుకు కసరత్తు చేశారు. కొంతమంది పూర్వ విద్యార్ధుల సహాయంతో ఫేజ్‌బుక్, ఫోన్ నెంబర్ల ఆధారంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులను సంప్రదించి ఒక్క చోట కలవడంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది జులై 29న తిరుపతిలో మొట్టమొదటి అలుమ్నీ మీట్‌గా జరగగా ఇది రెండోది. తమ పూర్వ విద్యార్ధులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ వారి నుంచి ఏమాత్రం ఆశించకుండా సొంత ఖర్చుతో తామే అన్నీ అయ్యి ఈ అపూర్వ కలయిక జరపడం గమనార్హం. జ్ఞాపకాల దొంతరలతో పులకింత... ఎస్పీడబ్ల్యూ కళాళాల పూర్వ విద్యార్ధుల కలయితో తాజ్‌వివంతా హోటల్ జ్ఞాపకాల దొంతరలతో పులకించిపోయింది. బురుజులతో అంతఃపురాన్ని తలపించే శ్రీదేవి, భూదేవి హాస్టల్స్ భవనాలు...శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ ఆ కొండలపై నుంచి మా కాలేజీ కనిపిస్తోందా? అని తరిచి చూసిన క్షణాలు..అప్పుడే పదో తరగతి పూర్తి చేసుకుని పాఠశాలను దాటి కళాశాలకు వచ్చిన తమకు జీవితమంటే ఏమిటో తెలియజేసిన అధ్యాపకులు కమలా మీనన్ మేడమ్, హేమావతి మేడమ్, శాంతి మేడమ్, కామేశ్వరి మేడమ్, కృష్ణవేణి మేడమ్, విజయలక్ష్మి మేడమ్...ఇలా ఎందరో తమలో స్ఫూర్తి నింపారంటూ ఆ పూర్వ విద్యార్ధులు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఒక్క ఫొటో ఛాన్స్ కోసం తపన.. ఆమె సెలబ్రీటీ కాదు..ప్రజాప్రతినిధి కాదు..పారిశ్రామిక దిగ్గజం కాదు..కానీ అలాంటి వారిని తయారు చేసేందుకు పునాది వేసిన ఎస్పీడబ్ల్యూ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కమలా మీనన్‌తో ఫోటో దిగేందుకు ఆ విద్యార్ధులు తపించారు. తమ జీవితాలపై ప్రభావం చూపిన గురువుతో ఫోటో ఛాన్స్ కోసం ఆరాటపడ్డారు. క్రమశిక్షణ, జీవిత పాఠాలు, ఆడది సాధించలేనిదంటూ ఉండదని అణువణువూ పట్టుదల, కసిని నింపిన అభిమాన గురువుకు వందనం పలికారు. స్వగతాలతో ప్రత్యేక పుస్తకం... శ్రీపద్మావతి ఉమెన్స్ కళాశాల పూర్వ విద్యార్ధుల అనుభవాలు, అధ్యాపకుల స్వగతాల మేళవింపుతో ప్రత్యేక పుస్తకం రూపకల్పన చేయనున్నారు. చిన్నపిల్లలుగా మారిపోయాం మాది 1989–92 బ్యాచ్. స్నేహితులతో కలిసి ఎంతగా అల్లరి చేసినా కళాశాలలో మేము సైలెంట్. ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థినులకు రక్షణగా మా కళాశాల ముందు ఏకంగా పోలీస్‌స్టేషన్‌నే ఏర్పాటుచేశారు. కమలా మేడమ్ ఎంతో ఇన్సిపిరేషన్. ఆమే మాకు రోల్ మోడల్. ఆమె లాగా గ్లామర్‌గా ఉండాలని, ఆమె లాగా నడుచుకోవాలని తపించేవాళ్లం. ఎక్కడెక్కడో ఉన్న కళాశాల పాత విద్యార్ధులందరినీ ఇలా కలుసుకోవడం నిజంగా గోల్డెన్ మెమరీ.. పెళ్ళయ్యి, పిల్లలు ఉన్న విషయాన్నే మరిచిపోయి ఒక్కసారిగా చిన్న పిల్లలుగా మారిపోయాం. ఇంతమంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే ఆ కళాశాల అధ్యాపకులే కారణం. మా బ్యాచ్ మాత్రం ఎప్పటికీ కళాశాలలో గుర్తుండిపోయే బ్యాచ్. కళాశాల ఆల్బమ్‌ను చూసే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ చదివిన తాళూరి రమేశ్వరి, మహేశ్వరి సినిమాల్లో ప్రవేశించడం ఆనందంగా ఉంది. వివాహ వ్యవస్థ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో లైఫ్ అండ్ లా ఫౌండేషన్‌ను నెలకొల్పాను. – రోజా, ఎమ్మెల్యే ఏటా ఇలా కలుసుకోవాలన్నదే మా కాంక్ష గతంలో తిరుపతిలో అలుమ్నీ మీట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో చేశాం. ఇలా తరుచూ కలుసుకోవడం ద్వారా ఒకరి భావాలు మరొకరు పంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఎస్పీడబ్ల్యూ కళాశాలలోకి ప్రవేశించిన ప్రతిఒక్క విద్యార్థిని కూడా సమాజంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను దీటుగా తట్టుకునేలా శక్తి సామర్థ్యాలను ఇచ్చాం. అందుకే నేడు ఇంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. గురువుగా అంతకంటే సంతోషం ఏముంటుంది. అయితే ప్రస్తుతం ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ బాధ్యతలు ఒక పురుషునికి ఇవ్వడం సరికాదు. మహిళల సమస్యలు ఒక్క మహిళకే తెలుస్తుంది. మహిళా ప్రిన్సిపల్‌ను నియమిస్తే బాగుంటుంది. – కమలా మీనన్, పూర్వ ప్రిన్సిపాల్ -
నగరిలో ముగిసిన క్రీడాసంబరం
నగరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వైఎస్సార్ చాంపియన్ క్రికెట్ టోర్నమెంటు శుక్రవారం ముగిసింది. ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో నిర్వహిం చిన ఈ పోటీల్లో 220 టీములు పాల్గొన్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన పోటీల్లో 2400 మంది క్రీడాకారులు సందడి చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన అగ్రనేతలు రోజూ ఇందులో పాల్గొని క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. విజయపురం(నగరి): నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో 8రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్ చాంపియన్ క్రికెట్ టోర్నీ శుక్రవారం ముగిసింది. 8 రోజులపాటు 220 జట్లు,2400 మంది క్రీడాకారులతో నగరి ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో సంబరంలా సాగిన టోర్నమెంట్ చివరి రోజు ఫైనల్స్‌లో నగరి డేంజర్ ఎలెవన్ ఏ జట్టు విజేతగా నిలిచింది. పుత్తూరు ఎంజీ ఫైర్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. విజేతలకు ము ఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రోజా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధన కోసం, జగనన్న ఆశయాల కోసం పోరాడుతూ మహానేత పేరుతో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన ఎమ్మెల్యే రోజా అభినందనీయురాలని కొనియాడారు. టోర్నీ నిర్వహించడం ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన పని అని అన్నారు. ఎమ్మెల్యే రోజా విజన్ ఉన్న నాయకురాలు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మా ట్లాడుతూ గ్రామీణ యువతకోసం ఎమ్మెల్యే రోజా ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి అవకా శాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. గ్రామీ ణ క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇది ఒక వేదికగా నిలిచిందని తెలిపారు. అందరి ఆశీస్సులతోనే తనకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రొత్సహిస్తున్న పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నగరి ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసంతోనే ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించగలిగానని తెలిపా రు. మొదట్లో 100 జట్లు అనుకుంటే 220 జట్లు వచ్చాయని పేర్కొన్నారు. టోర్నీ నిర్వహణకు సహాయ, సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగరి డిగ్రీ, జూని యర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం
విజయపురం : నగరి మండపం వద్ద శుక్రవారం బైక్‌ను టిప్పర్ లారీ ఢీకొనడంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకుని పోలీసు అధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు.. నిండ్ర మండలానికి చెందిన శేఖర్, సుమతి (40) దంపతులు నగరి కోర్టుకు వచ్చారు. తిరిగి స్వగ్రామం వెళుతుండగా నగరి మండపం వద్ద అడవికొత్తూరు నుంచి పుత్తూరు వైపు కంకర తీసుకెళుతున్న టిప్పర్ లారీ ఢీకొంది. కింద పడిన సుమతి తలపై లారీ చక్రాలు ఎక్కాయి. దీంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందింది. ఆమె భర్త శేఖర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకున్నారు. బాధితుల ఆర్తనాదాలు చూసి కంటతడి పెట్టారు. ఆమె మాట్లాడుతూ అడవికొత్తూరు వద్ద ఉన్న వేల్మురుగన్ క్రషర్ నుంచి టిప్పర్ లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రధాన రహదారిపై తిరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. క్వారీల నిర్వాహుకులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కలెక్టర్‌కు విన్నవించా మని తెలిపారు. పరిశీలనకు వచ్చిన ఆర్డీవో స్థాయి అధికారి క్వారీ నిర్వాహకులతో కుమ్మక్కై నిందితులను రక్షిస్తున్నారని ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే రోజా మూడు గంటల సేపు జాతీయ రహదారిపై ఎండలో ధర్నాకు దిగడంతో నీరసించి పోయారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం స్మగ్లర్ మైకేల్ రాజ్, అక్రమ క్వారీ నిర్వహిస్తున్న వేల్‌మురగన్‌కు నగరి సీఐ మల్లికార్జునగుప్తా కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టిప్పర్లు, లారీలు పట్టణం వెలు పలి నుంచి వెళ్లేలా చూడాలని విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. నిరుపేద మహిళ ప్రమాదంలో మృతిచెందినా సీఐ నిర్లక్ష్యంగా శవాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు. మున్సిపాలిటీ అనుమతి లేకపో యినా మైకేల్‌రాజ్ రోడ్డు పక్కన బార్ ఏర్పాటు చేశారని, పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. మూడు గంటల పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పుత్తూరు డీఎస్పీ భవాని శ్రీహర్ష, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సూర్యనారాయణ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. సీఐని తక్షణం సస్పెండ్ చేయాలని ఎమ్యెల్యే తేల్చి చెప్పడం తో డీఎస్పీ ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ ఎమ్మె ల్యేకు ఫోన్లో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
‘15 రోజుల్లోగా బెల్టు షాపులు తొలగించాలి’
సాక్షి, విజయవాడ : 15 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. బెల్టు షాపులను తొలగించాలని కోరుతూ బుధవారం ఆమె ప్రసాదం పాడు ఎక్సైజ్ కార్యాలయంకు వెళ్లి కమిషనర్‌కు వినతిపత్రం అందిచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరిగుతున్నాయని ఆరోపించారు. మహిళల సాధికారత దిశగా చంద్రబాబు సర్కార్ ఆలోచించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అన్ని నేరాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం తరపున ఒక్క సంతకం పెడితే ఆ నిమిషం నుంచే ఏదైనా అమల్లోకి రావాలని, అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందన్నారు. కోర్టులను కూడా ఎక్సైజ్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
రక్తదానం కోసం.. రంజాన్ దీక్షను పక్కనబెట్టాడు
సాక్షి, పట్నా: మతం కంటే మానవత్వం గొప్పదని మరోసారి రుజువైంది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తాను చేస్తోన్న ఉపవాస దీక్షను పక్కనబెట్టాడు ఓ మహమ్మదీయుడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా సదార్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు రాజేశ్‌కుమార్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడిని తీసుకువచ్చాడు అతని తండ్రి. తలసేమియా వ్యాధి కారణంగా బాలుడికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పడంతో ఆ తండ్రి ప్రతీ బ్లండ్ బ్యాంకును సంప్రదించాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రాణాలతో పోరాడుతున్న రాజేశ్ దీనగాథ విని జావెద్ ఆలం అనే వ్యక్తి రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అప్పటికే జావెద్ రంజాన్ దీక్షలో ఉన్నాడు. సాధారణంగా రంజాన్ ఉపవాసంలో ఉన్నవారు ఆ రోజు దీక్ష ముగిసేదాకా మంచినీళ్లయినా ముట్టరు. కానీ, రక్తదానం తరువాత జావెద్ పళ్లరసాలు, కొన్ని పండ్లను తీసుకున్నాడు. బాబు ప్రాణాలు కాపాడేందుకు దీక్ష భగ్నం చేశాడని తెలిసి.. స్నేహితులు జావెద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తలసేమియా వ్యాధి ఉన్న వారికి మూడు, నాలుగు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. -
‘కేసీఆర్ మీటింగ్.. చంద్రబాబుకు షేకింగ్’
సాక్షి, విజయవాడ: ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ మీటింగ్ పెడితే ఇక్కడ చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు నోట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘బ్రీఫ్డ్’ అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్థారించిందని, ఈ ఆధారాలు బట్టి బాబును అరెస్ట్ చేయాలని కోరారు. ‘పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చంద్రబాబు కులదోసేస్తాం అంటే ఉరుకుంటారా? ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉంది. బీజేపీతో లాలుచి పడింది చంద్రబాబే. బ్రీఫ్డ్ మీ అంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు ఉండరని కేటీఆర్ అప్పుడే చెప్పార’ని ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. నేరాలను అరికట్టాల్సిన చంద్రబాబు తన ఎమ్మెల్సీల చేత మహిళ ఎమ్మెల్యేనని చూడకుండా తనపై దిగజారుడు మాటలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మహిళ వ్యతిరేకి అని ఆరోపించారు. ‘దాచేపల్లి ఘటనలో నేను వెళ్లిన తర్వాత చంద్రబాబు స్పందించి బాధితురాలికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతిపక్షంగా మేము స్పందిస్తేగానీ మీరు పట్టించుకోరా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికారాన్ని, డబ్బును పెట్టి దొంగ రాజకీయాలు చేస్తూ తిరిగి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత ఉందా?
-
‘తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా మోసిగించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారని చెప్పారు. పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. ఏదో పొడిచేస్తానని ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని మండిపడ్డారు. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చినా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయారా? అని నిలదీశారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇది అంతం కాదు.. ఆరంభం
పిన్నెల్లి (మాచవరం): దుర్మార్గపు టీడీపీ పాలన పతనం పిన్నెల్లి నుంచే ప్రారంభం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేబాట పాదయాత్ర ముగింపు సభ మాచవరం మండంలోని పిన్నెల్లి గ్రామంలో శని వారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైయినా.. ఆటంకాలు వచ్చినా.. చివరకు అక్రమంగా జైలులో పెట్టినా.. మన అధినేత జగన్మోహన్రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఇది అంతంకాదని.. ఆరంభం మాత్రమేనని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించిన నాయకులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారం మారితే సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే అటువంటి అధికారులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ చేస్తున్న ప్రతి అక్రమాలు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటున్నామని, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు వడ్డీతో బదులు తీర్చుకుంటున్నామని స్పష్టంచేశారు. మద్దతు ధర ఏది? రైతులు పండించే పంటలకు టీడీపీ పాలనలో కనీస మద్దతు ధర లభించటంలేదని కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింల సంక్షేమానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేశారు. చంద్రబాబు క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారని, ముస్లింలకు మాత్రం చోటు కల్పించలేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి అయిన ఆరునెలల్లో గురజాల నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.600 కోట్లు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే ఊరుకునేదిలేదని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న అధికారులను వదిలిపెట్ట బోమన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిపాలనా కావా లంటే జగన్‌ను సీఎంగా చేసుకోవాలని సూచించారు. నియోజకర్గంలో ఎమ్మెల్యే యరపతినేని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇవ్వని యరపతి నేని ఇప్పుడు అక్రమంగా దోచుకున్న సంపాదనతో షష్టిపూర్తి, సీమంతాలు చేస్తూ ముక్కుపుడకలు, చీరలు, పంచెలు పంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో గనులు దోచుకోవడమే కాకుండా అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జగన్‌కు ఓట్లు వేసి సీఎం చేయాలని కోరారు. ఇటీవల పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ముస్లింలపై టీడీపీ అగ్రకుల నేతలు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురజాల ఎమ్మెల్యేగా మహేష్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలను హింసించే స్థానిక ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి మంచికల్లుకు పంపించాలని పిలుపునిచ్చారు. కాసు కుటుంబం నుంచి వచ్చిన నేటితరం యువనాయకుడు మహేష్‌రెడ్డిని అఖండమెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత నగరి ఎమ్మెల్యే రోజ ప్రసంగించారు. ఈ సభలో యువనాయకుడు జంగా కోటయ్య, మాజీ సర్పంచ్ చింతపల్లి నన్నే, మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వీరభద్రుని రామి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వట్టె రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చింతపల్లి సైదా, ఎంపీటీసీ సభ్యులు పార్లగొర్ల కోటేశ్వరరావు, యడవల్లి మరియదాసు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివయాదవ్, వెంకటరెడ్డి, రమేష్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్‌కుమార్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, సేవాదళ్ మండల కన్వీనర్ షేక్ మహ్మద్‌జానీ, సొసైటీ డైరెక్టర్ గుర్రం వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీదేవి మృతి సినీ లోకానికి తీరని లోటు
-
శ్రీదేవి మృతి సినీ లోకానికి తీరని లోటు: రోజా
సాక్షి, తిరుమల : నటి శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని లోటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజా తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... శ్రీదేవిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సినిమాల్లో నటించటానికి వచ్చారని, అందులో తానూ ఒకరినని చెప్పారు. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు యూటర్న్ ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం పాకులాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాకుంటే రాష్ర్ట నష్టం పోతుందని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడేది వైఎస్ జగన్మోహన్రెడ్డి కాదని.. తనపై బురద చల్లినా నిర్దోషిగా నిరూపించుకోవటానికి కోర్టులకు తిరుగుతున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కైనా స్టేలు తెచ్చుకుని కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్ ప్రతి అడుగు నారా వారి...
వడమాల పేట, నగరి నియోజకవర్గం(చిత్తూరు) : ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు నారా వారి నరాల్లో వణుకు పుట్టిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘అడుగడుగునా పేద ప్రజల కన్నీళ్లు తుడుస్తూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వస్తున్న మన అన్న.. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్నకి నగరి నియోజకవర్గంలోకి స్వాగతం.. సుస్వాగతం. ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజాసంకల్పయాత్రలో జగనన్న వేసే ప్రతి అడుగు టీడీపీ గుండెల్లో గునపమై దిగుతోంది. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. రాబోయే ఎన్నికల్లో జగనన్న గెలవడం అంతే నిజం. పాదయాత్రలో జగనన్నతో కలసి అడుగులు వేయడం మనం చేసుకున్న అదృష్టం. అప్పట్లో వైఎస్ పాదయాత్ర ఓ చరిత్ర. నేడు జగనన్న పాదయాత్ర ఆధునిక చరిత్ర. జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడే మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంతో పాటు నగరి నియోజకవర్గం కూడా అభివృద్ది చెందుతుంది. వైఎస్ రైతు బాంధవుడిగా పేరొందారు. ప్రతిపక్షం అధికారంలో ఉన్న జిల్లా అయిన కూడా పెద్ద మనసుతో గాలేరు నగరి ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ రోజు చిత్తూరు జిల్లా ప్రజలు అందరూ సంతోషించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో ఖర్చు చేశారు. మధ్యలోనే మనల్ని వదలి వైఎస్ వెళ్లి పోయారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రాజెక్టుకు ఏదో అలా విదిలించారు. 65 శాతం పూర్తైన ప్రాజెక్టులో మిగిలిన 35 శాతాన్ని నాలుగేళ్లో పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు నాయుడు గాలేరు నగరి ప్రాజెక్టును సమాధి రాయిగా మార్చారు. మొన్ననే గాలేరు నగరి ప్రాజెక్టు సాధన కోసం నాలుగు రోజుల పాటు 88 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టు జగనన్న చేతుల మీదుగానే ప్రారంభం కావాలి. సీఎం కాగానే చంద్రబాబు చిత్తూరు ప్రజల నోట్లోని తీపిని చేదుగా(చక్కెర పరిశ్రమల మూతను ఉద్దేశించి) మార్చారు. రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీల వద్ద ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే రెండు సార్లు బకాయిలు ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డుమీదకు తెచ్చాడు చంద్రబాబు. ‘జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వస్తేనే జాబు వస్తుంది’ అంటూ యువతను మోసగించారు బాబు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. లక్షా నలభై వేల ఉద్యోగాలు ఉంటే కనీసం ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. వార్డు మెంబర్‌గా గెలవలేని నారా లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవిలో కూర్చొబెట్టాడు బాబు. ఆయనకు ప్రజల మీద కంటే లోకేష్‌పై ఎక్కువ ప్రేమ ఉంది. నా 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇద్దరికి రుణపడి ఉన్నాను. ఒకటి పార్టీ తరఫున నాకు సీటు ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. రెండు నన్ను ఎమ్మెల్యేగా నిలిపిన మీ అందరికీ. నా ఆత్మ సాక్షిగా చెబుతున్నా. రాజన్న రాజ్యం వచ్చే వరకూ నీ వెంటే ఉంటాను జగనన్నా. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ప్రజల కోసం పోరాడే నాయకుడు జగన్ అన్న ఒక్కడే. వైఎస్ కాలంలో జరిగిన అభివృద్ధి మళ్లీ జగన్ అన్న ముఖ్యమంత్రి కావడంతోనే మొదలవుతుంది.’ -
రాక్షస పాలనకు చరమ గీతం పాడాలి
-
ఆటా వేడుకలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అనంతపురం : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలకు హాజరు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసోసియేషన్ నాయకులు ఆహ్వానం అందజేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ జగన్‌ను మధ్యాహ్న భోజన విరామ సమయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి కలుసుకున్నారు. ఆయన వెంట బుజాల భువనేశ్, వేణు రెడ్డి, లింగాల హరి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తున్న వైఎస్ జగన్‌ను ఆటా సభ్యులు ప్రశంసించారు. 2016లో ఆటా వేడుకలకు వైఎస్ జగన్ తరఫున వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడి సందేశాన్ని కార్యక్రమంలో వినిపించారు. -
జనసేన కాదు.. భజన సేన
-
జనసేన కాదు.. భజన సేన
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సినీ నటుడు పవన్ కల్యాణ్‌ది జనసేన కాదు, భజన సేన అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. గురువారం పోలవరం ప్రాజెక్టు యాత్రకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడారు. తల్లి తెలుగుదేశం పార్టీ అయితే జనసేన పిల్ల టీడీపీ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు తప్పు చేసినా పవన్ కల్యాణ్ కాపాడటానికే వచ్చి వెళ్తున్నారే తప్పా, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెబుతున్న ఆయన ఎక్కడా ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడటానికి పవన్ కల్యాణ్‌కు ఏ అర్హత ఉందని నిలదీశారు. రోజా ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘అనుభవం లేని నారా లోకేశ్ ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఆయన చావుకి కారణమైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి వారికి పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారు. భుజాన మోస్తున్నారు. పార్టీ పెట్టకముందే వైఎస్ జగన్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనుభవం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని పవన్ అంటున్నారు. ఏ అనుభవం ఉందని చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ అనుభవం ఉందని జనసేన పార్టీ పెట్టారు. పవన్ కల్యాణ్ ప్రశ్నించడానికి కాదు, ప్యాకేజీల కోసమే జనసేన పార్టీ పెట్టారు.. చంద్రబాబుకు భజన చేయడానికే పార్టీ పెట్టారని అర్థమవుతోంది. ’’ అని రోజా మండిపడ్డారు.