YSRCP Minister Roja Challenge To TDP Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్..

Published Sat, Apr 15 2023 12:47 PM | Last Updated on Sat, Apr 15 2023 1:36 PM

YSRCP Minister Roja Challenge To TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామని సెటైర్ వేశారు. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వ్యాఖ్యానించారు. 

'మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ. 

జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఒక పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్. మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు.

ఈ రాష్ట్రాని పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు. ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. రైతులకు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఇలా ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా మేము జనంలోకి వెళ్తున్నాం.' అని రోజా వ్యాఖ్యానించారు.
చవదండి: జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement