‘'శాసనసభ’' విజయం సాధించాలి – మంత్రి రోజా | Roja Selvamani Grand Entry at Shasana Sabha Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

‘'శాసనసభ’' విజయం సాధించాలి – మంత్రి రోజా

Published Mon, Nov 28 2022 9:31 AM | Last Updated on Mon, Nov 28 2022 9:59 AM

Roja Selvamani Grand Entry at Shasana Sabha Movie Trailer Launch - Sakshi

‘‘శాసనసభ’ టైటిల్‌ ఆసక్తిగా ఉంది. ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, నటి రోజా అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యారాజ్‌ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసనసభ’. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 16న రిలీజ్‌ కానుంది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్‌కుమార్, మలయాళ ట్రైలర్‌ను దర్శక– నటుడు చిన్నికృష, తమిళ ట్రైలర్‌ను నిర్మాత సతీష్‌ వర్మ విడుదల చేశారు.

ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను వైజాగ్‌ ఎమ్మెల్సీ వంశీకృష యాదవ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ– ‘‘నా బ్రదర్‌లాంటి షణ్ముంగంపై అభిమానం, సంగీత దర్శకుడు రవిబస్రర్‌ వల్లే నేను ఈ వేడుకకు వచ్చాను. ఈ సినివ హిట్‌ సాధించి నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు. ‘‘ఈ సినివ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌’’ అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్‌ కుమార్‌. ‘‘శాసనసభ’ చాలా స్ట్రాంగ్‌ టైటిల్‌’’ అన్నారు ఇంద్రసేన. ‘‘

సురేష్‌ వర్మ, చిన్నికృష్ణగార్ల ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు వేణు మడికంటి. ‘‘మంచి సబ్జెక్ట్, మంచి కమిట్‌మెంట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు తులసీరామ్‌. ‘‘నిర్మాతగా నా లాంంగ్‌కు ఇంతమం ప్రాజెక్ట్‌ ఇచ్చిన ఇంద్రసేన, జగదీశ్వర్‌ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలకు రుణపడి ఉంటాను’’ అన్నారు షణ్ముగం సాప్పని. సంగీత దర్శకుడు రవి బస్రర్, కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ రైటర్‌ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ హరీష్, నిర్మాత సురేష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement