![RK Roja Gives Clarity On Her Daughter Anshu Malika Cine Entry - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/17/anshu-malika.gif.webp?itok=qCMzFcju)
ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖామంత్రి, సీనియర్ నటి రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! త్వరలో ఆమె ఓ హీరో తనయుడి సరసన నటించనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ రూమర్స్‌పై రోజా నోరు విప్పారు.
గురువారం నాడు రోజా బర్త్‌డే కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'యాక్టింగ్ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్‌గా ఆశీర్వదిస్తాను. తనకు అండగా నిలబడతాను' అని చెప్పుకొచ్చారు.
చదవండి: నా పేరు సూర్య.. ఫస్ట్ చాయిస్ ఎవరో తెలుసా?
రాజ్ తరుణ్‌కు అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్‌తో అయినా హిట్ దక్కేనా?
Comments
Please login to add a commentAdd a comment