తెలుగులో ఆ స్టార్‌ హీరోతో సినిమా ఛాన్స్‌ వస్తే చేస్తా: ఆర్కే రోజా | RK Roja Wanted To Play A Role In Mahesh Babu Movie - Sakshi
Sakshi News home page

ఆ హీరోతో సినిమా ఛాన్స్‌ వస్తే చేస్తా.. కానీ ఈ రోల్‌లో మాత్రమే: ఆర్కే రోజా

Published Tue, Oct 17 2023 8:16 AM | Last Updated on Tue, Oct 17 2023 10:23 AM

RK Roja Wanted Role Play Mahesh Babu Movies - Sakshi

బుల్లితెర నటి శ్రీవాణి ఎన్నో సీరియల్స్‌లలో నటించిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఆమె నటించిన సీరియల్స్‌ చాలా పాపులర్‌ అయ్యాయి. కానీ ఆమె సీరియల్స్‌కు కొంత బ్రేక్‌ ఇచ్చినా తన అభిమానుల కోసం యూట్యూబ్‌ ఛానల్‌తో టచ్‌లో ఉంటుంది. ఆమె ఇప్పుడు నటన నుంచి తన భర్త నటుడు విక్రమాదిత్యతో  కొత్త అడుగులు వేస్తుంది. ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే హోటల్‌ను విక్రమాదిత్య, సందీప్ మిరియాలతో కలిసి మణికొండలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి శ్రీమతి రోజా గారు ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

అనంతరం ఈ వ్యాపార రంగంలో శ్రీవాణి రాణించాలని రోజా శుభాకాంక్షలు తెలిపారు.  అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా గారు తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు,సంగటి ఇవన్నీ తనకు ఇష్టం అని చెప్పడమే కాకుండా తాను వంట కూడా బాగా చేస్తానని తెలిపారు.  ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే హోటల్‌లో వెజ్, నాన్ వెజ్ వంటకాలు అన్నీ కూడా ఆంధ్రా స్టైల్‌ల్లో అందుబాటులో ఉంటాయని,  అచ్చమైన తెలుగు వంటకాల రుచి చూడాలంటే ఇక్కడొకసారి ఎంట్రీ ఇవ్వల్సిందేనని రోజా చెప్పారు.

సినిమాల విషయానికి వస్తే... సుమారు పదేళ్లకు పైగానే రోజా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఆమె కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె సినిమాలతో పాటు పలు రియాల్టీ షోలకు దూరంగా ఉన్నారు. కానీ టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబుతో సినిమా ఛాన్స్‌ వస్తే తప్పకుండా చేస్తానని రోజా తెలిపారు. కానీ తల్లి పాత్ర మాత్రం చేయనని, వదినా లేదా అక్క పాత్రలలో ఏదైనా పర్వాలేదు సంతోషంగా చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. కాంతారా సినిమా చాలా బాగుందని చెబుతూనే బేబీ సినిమా ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉందని ఆర్కే రోజా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement