Punch Prasad Special Thanks To AP CM YS Jagan Mohan Reddy, Released Video Goes Viral - Sakshi
Sakshi News home page

Punch Prasad: సీఎం జగన్‌, మంత్రి రోజా గార్లకు థ్యాంక్స్‌ చెప్తూ వీడియో రిలీజ్‌ చేసిన జబర్దస్త్‌ కమెడియన్‌

Published Mon, Jun 12 2023 5:32 PM | Last Updated on Mon, Jun 12 2023 8:45 PM

Punch Prasad Special Thanks to AP CM YS Jagan Mohan Reddy - Sakshi

మీ అందరికీ స్పెషల్‌ థ్యాంక్స్‌.. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి రోజా గారు ఇంతకుముందు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈసారి నా ఆరోగ్య సమస్యను

అందరినీ నవ్వించే కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు పాడవడంతో నిత్యం ఏదో ఒక జబ్బు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంది. అతడికి వీలైనంత త్వరగా ఆపరేషన్‌ చేయకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. 

ఈ విషయాన్ని మంత్రి ఆర్‌కే రోజా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు స్పందించిన సీఎం జగన్‌ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పంచ్‌ ప్రసాద్‌కు వైద్య సాయం అందించాలని ఆదేశించారు. దీంతో ఆయన ఆపరేషన్‌ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది.

దీనిపై పంచ్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. 'మీ అందరికీ స్పెషల్‌ థ్యాంక్స్‌.. మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి రోజా గారు ఇంతకుముందు కూడా నాకు చాలా సాయం చేశారు. ఈసారి నా ఆరోగ్య సమస్యను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి.. చికిత్సకు కావాల్సిన డబ్బును CMRF ద్వారా మంజూరు చేయించారు. సీఎం జగన్‌కు, మంత్రి రోజాకు చాలా థ్యాంక్స్‌' అంటూ పంచ్‌ ప్రసాద్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

చదవండి: బాలీవుడ్‌లో కన్నా సౌత్‌లో నెపోటిజం ఎక్కువ: అవికా గోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement