ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 12న ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చి, అభిమానులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చిందనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ తీసిన సినిమా 'యాత్ర'. మలయాళ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ చేశారు. 2019లో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన సక్సెస్ అందుకుంది. దీనికి కొనసాగింపుగా ఇదే డైరెక్టర్ తీసిన మూవీ 'యాత్ర 2'. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్.. ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోదు. ఈ క్రమంలోనే
రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక కన్నుమూసిన కార్యర్తల కుటుంబాలను పరామర్శించేందుకు.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తారు. దీన్ని ప్రొగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంతో ప్రొగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటుచేసి ఎలా ప్రజల అభిమానాన్ని పొందాడు? అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఏ విధంగా సీఏం అయ్యారనేది 'యాత్ర 2'లో చూపించాడు. ఇదివరకే అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా, ఇప్పుడు ఆహా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‍ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)
మేం ఉన్నాం, మేం విన్నాం..♟️
యాత్ర 2 మీకోసం తీసుకొస్తున్నాం!🎥👉 ▶️https://t.co/4VTAeZeSe6@JiivaOfficial @mammukka #Yatra2 pic.twitter.com/c7D4BuOb6L— ahavideoin (@ahavideoIN) June 3, 2024
Comments
Please login to add a commentAdd a comment