ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన 'యాత్ర 2' సడన్ గా ఓటీటీలో వచ్చేసిందని అన్నారు. కానీ ఈ విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. తొలుత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిపోయిందనేసరికి సినీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఈ వీకెండ్ మూవీని చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ అనుకోని విధంగా ప్రేక్షకులకు సినిమా కనిపించలేదు.
(ఇదీ చదవండి:ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన 'యాత్ర' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా 'యాత్ర 2' తీశారు. ఈ ఏడాది ఫిబ్రవరి తొలివారంలో రిలీజ్ చేశారు. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. కానీ ఎందుకో సదరు ఓటీటీలో సెర్చ్ చేస్తుంటే కనిపించట్లేదు. బహుశా దీన్ని సరిచేస్తే ఈ రోజే స్ట్రీమింగ్ లోకి వచ్చేయొచ్చు. లేదంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి.
వైఎస్ఆర్ మరణం దగ్గర మొదలయ్యే 'యాత్ర 2' కథ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవరకు ఉంటుంది. ఈ మధ్య ఏమేం జరిగింది? అనే విషయాల్ని సినిమాలో చూపించారు. ఇకపోతే వైఎస్ఆర్ తనయుడు జగన్ పాత్రలో నటించిన జీవా.. అద్భుతమైన ఆహార్యంతో ఆకట్టుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment