
మమ్ముట్టి, జీవా
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్‌తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్‌గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్‌ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్‌ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్‌ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్‌ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్‌ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి.
2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్.
Comments
Please login to add a commentAdd a comment