Jiiva
-
హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా.. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. ఆ తర్వాత తెలుగులో యాత్ర-2 సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో జీవా మెరిశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఆయన ఉన్నారు. (ఇది చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!) #BREAKING | கார் விபத்தில் சிக்கிய நடிகர் ஜீவா!#SunNews | #Jiiva | #CarAccident | #Kallakurichi | @JiivaOfficial pic.twitter.com/yW2JWEllID— Sun News (@sunnewstamil) September 11, 2024 -
'మా దగ్గర ఆ పరిస్థితి లేదు'.. హీరో కామెంట్స్‌పై మండిపడ్డ సింగర్!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీనే కాదు.. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ విషయం తనకేం తెలియదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కోలీవుడ్ నటుడు జీవా సైతం కోలీవుడ్‌లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. నేను కూడా దాని గురించి విన్నా.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు మాత్రం లేవన్నారు. గతంలో మీటూ పార్ట్-1 చూశామని.. ఇప్పుడు పార్ట్-2 వచ్చిందని అన్నారు. వారిపేర్లను బయటికి చెప్పడం తప్పు.. కానీ సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జీవా.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.తమిళంలో ఆ పరిస్థితి లేదు..జీవా మాట్లాడుతూ..' నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చా. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ ముగించుకునివస్తున్నా. చాలా సినీ పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాం. మలయాళంలో లాగా కోలీవుడ్‌లో జరగడం లేదు. ఈ విషయం గతంలోనూ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్‌తో కాసేపు వాగ్వాదం తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రంగం సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్మయి రిప్లై.. కోలీవుడ్‌లో అలాంటి పరిస్థితులు లేవని జీవా చెప్పడంపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఇలా ఎలా మాట్లాడుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చాలాసార్లు చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతన్న వేధింపులపై మాట్లాడారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరిగినా సరే చిన్మయి సోషల్ మీడియా వేదికగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. I really do not understand how they are saying sexual harassment does not exist in Tamil Industry.HOW?! https://t.co/sm9qReErs0— Chinmayi Sripaada (@Chinmayi) September 1, 2024 -
మాహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్ పై రూపొందిన బయోపిక్
-
ప్రభంజనం సృష్టిస్తున్న యాత్ర-2 మూవీ
-
Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ
టైటిల్:యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ నిర్మాత: శివ మేక రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ:మది విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. యాత్ర 2 ఈవెంట్ బేస్డ్ బయోపిక్. వైఎస్సార్ మరణం అనంతరం, ఆయన తనయుడు, వైఎస్. జగన్మోహన్రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. వైఎస్సార్ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్ జగన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల కథ కాదు..వారి వ్యక్తిత్వానికి సంబంధించిన స్టోరీ. వైఎస్సార్ రాజకీయం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? అనేది ‘యాత్ర’లో చూపించిన మహి వి రాఘవ్.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పడిన కష్టాలేంటి? అదిష్టానం వద్దని చెప్పినా..తనను నమ్ముకున్న ప్రజల కోసం అండగా ఉండేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర.. వైఎస్సార్సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణం.. ప్రత్యర్థులంతా ఒక్కటైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లో చూపించాడు. వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించాడు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు మహి. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు. 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో ‘యాత్ర 2’కథ ప్రారంభం అవుతుంది. రెండోసారి వైఎస్సార్ సీఎం అవ్వడం.. రచ్చబండ కోసం వెళ్తూ మరణించండం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రజల కోసం జగన్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్ అంతా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరిని ఆకట్టుకుంటాయి. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా..జగన్ ధైర్యంతో పార్టీని నడిపించడం.. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేశ్‌ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగు.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. వైఎస్ జగన్ ఎలాంటి వాడో డైలాగ్స్లతోనే తెలియజేశాడు మహి వి.రాఘవ్. ‘జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో జగన్ వ్యక్తితం ఎలాంటిదో తెలియజేశాడు. ‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’ అనే మాటల్లో జగన్ విశ్వసనీయత ఎంతటిదో అర్థమవుతుంది. 'నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. జగన్‌పై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది తెలియజేస్తుంది. ‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది. 'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని'అంటూ అసెంబ్లీ వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ ధైర్యం ఎలాంటిదో అర్థమతుంది. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే మాటలు.. జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది. ‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే...పులిని బోనులో పెట్టినా అది పులే’అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్‌కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించేశాడు. ఇక వైఎస్ జగన్‌గా జీవా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ హుందాతనం, రాజకీయం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెరపై అద్భుతంగా పండించాడు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు.చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ‘ఓ రాజకీయ నాయుకుడి జీవితంలో డ్రామా ఉండవచ్చు.. యాక్షన్కూ అవకాశముంది.. బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందన్న వాళ్లను చూస్తే కామిడీకి స్కోపు ఉందని అనుకోవచ్చు. కానీ.. ఎమోషన్ కూడా ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది అనడమే కాకుండా... ఆ భావోద్వేగాలను అందంగా తెరపైకి ఎక్కించి మరీ చూపించాడు మహి వి.రాఘవ్. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘యాత్ర 2’ ట్విటర్ రివ్యూ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. (చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!) ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు(ఫిబ్రవరి 8) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? వైఎస్ జగన్‌గా జీవా ఎలా నటించాడు? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యాత్ర 2 చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్ ఎక్స్‌లో కామెంట్ చేస్తున్నారు. #Yatra2 The best biopic ever in all the industries u will feel goosebumps right from the start @MahiVraghav just remember this name. Had a little hatred towards jagan but now it’s love ❤️ @JiivaOfficial 💥 Antis ki kuda goosebumps vache moments unnay ⭐️⭐️⭐️⭐️/5 Rating :-4/5 pic.twitter.com/Tggn0vieAr — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) February 7, 2024 ‘యాత్ర 2’ బెస్ట్ బయోపిక్. సినిమా స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్. ఇంతకు ముందు జగన్‌పై కొంచెం ద్వేషం ఉండే..సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్ జగన్‌ని ద్వేషించేవారికి కూడా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయంటూ ఓ నెటిజన్ 4/5 రేటింగ్ ఇచ్చాడు. Honestly chepthuna one of the best biopics ever made in Telugu #Yatra2 🔥🔥🔥🔥 Blockbuster movie 👌🏻👌🏻👌🏻#Yatra2 Bomma Blockbuster 🔥💙#YSJaganAgain @ysjagan @JiivaOfficial @mammukka pic.twitter.com/YhYNZnV46B — Sri Surya Movie Creations (@SSMCOfficial) February 8, 2024 నిజాయితీగా చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్. బ్లాక్ బస్టర్ మూవీ. బొమ్మ అదిరింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుంది -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి #BlockbusterYatra2#Yatra2#CMYSJagan pic.twitter.com/kKzp63OOgv — YSR Congress Party (@YSRCParty) February 7, 2024 యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 @DrPradeepChinta అన్న రేటింగ్ 5 స్టార్ అంటే.... #Yatra2Movie కి తిరిగే ఉండదిక.... 👏👏👏👏 https://t.co/8J3g3dCOTd — #Siddham for 2024 🦾💪🇮🇳 (@bhojaraju99) February 8, 2024 First half completed! Edipinchesav @MahiVraghav ! pure emotions and YSJagan mass high! Trailer is jujubi.#Yatra2 #Yatra2JourneyBegins #Yatra2Movie #Yatra2OnFeb8th https://t.co/8xpua0Epg0 — Pavan_GR (@pavan_gr) February 7, 2024 Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 Last Ki @ysjagan sir cameo 🔥 Pillini teesukuni velli adavilo vadileste adi pille, kani akkada undi puli adavilo Unna bonu lo Unna gargistundi. Deii em cinema Ra Babu HYD vadini Kuda vachi meeku vote veyali ani undi Jai Jagan#Yatra2#Yatra2OnFeb8th #Yatra2Premier pic.twitter.com/RS25F9xmp9 — UK DEVARA 🌊⚓ (@MGRajKumar9999) February 7, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 #Yatra2 #Yatra2Movie వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాలు,తన తండ్రి మరణంతో నష్టపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్రను ఎలా ప్రారంభించాడో, ఆయన నిర్ణయం వల్ల ఎదుర్కొన్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు — @Team Basireddy (@BasireddyLokes1) February 7, 2024 ప్రతీ అభిమాని గుండె చప్పుడిలో పెద్దాయన ఉంటారు 🥹🥹#Yatra2#Yatra2JourneyBegins#JaitraYatrapic.twitter.com/IdzOCiCkZ1 — Vikas 🎯🎯 (@VikasRonanki) February 8, 2024 Yatra -2 movie is an inspiration 👌👌👌👌👌@MahiVraghav @mammukka @JiivaOfficial @ysjagan @YSRCParty @JaganannaCNCTS @SajjalaBhargava Please watch it 🔥🔥https://t.co/DSvqpvfiEs pic.twitter.com/1gFEvtBqTX — Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) February 8, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 Finally blockbuster kottisamu anna.. 🥹❤️🔥🙏 Tnq @MahiVraghav Anna Great inspirational movie ichavu... 🧎♂️ Jai Jagan anna.. 🇸🇱🙏 @ysjagan #Yatra2Movie #Yatra2 #YSJaganAgainIn2024 pic.twitter.com/IB16sF6fa8 — ᴀʟʟᴜ sᴀɴᴊᴜ ʀᴇᴅᴅʏ™🪓🐉 (@AlluSanjuReddy) February 8, 2024 @MahiVraghav ఎవడ్రా నువ్వు మా జగనన్నకు మాకన్నా పెద్ద ఫ్యాన్ లా ఉన్నావ్🔥 Thanks Mahi anna 🥰 pic.twitter.com/dGJY6pV6Ge — Manager (@thinkpad8gen) February 8, 2024 -
సినిమాలో చెయ్యడం నా అదృష్టం జగనన్నను కలుస్తా..!
-
ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ తీశాను: మహి వి.రాఘవ్
‘‘యాత్ర 2’లో ఎవరిని కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు చేసే ఎమోషనల్ జర్నీని మాత్రమే చూపించాను’ అని దర్శకుడు మహి వి రాఘవ్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యాత్ర 2’. యాత్ర మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాత్ర 2 టీమ్ మీడియాతో ముచ్చటించింది. మహి వి. రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో నడిపించామన్నది తెలియదు. ఈ టీజర్, ట్రైలర్లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు తెలియవు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశాను. ట్రైలర్లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ఉద్దేశం. వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చు. వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని చూపించాం. ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. ఇందులో కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు.. అన్నీ బాగా ఆడాలి.. ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయి. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే.. థియేటర్లు బాగుంటాయి కదా. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి. ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం. మమ్ముట్టి గారు చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను..కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్ మాత్రం నిజం’ అని అన్నారు. జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను. ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది. మహి గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారు. ఇక షాట్ ఓకే చెప్పడంతో నాకు పెద్ద రిలీఫ్‌లా అనిపించింది. నేను జగన్ మోహన్ రెడ్డి గారిలానే కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత నేను మానిటర్ కూడా చూడలేదు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను’ అని అన్నారు. కేతకి నారాయణ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఓ రియల్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇది నా మాతృభాష కాదు. నేను మరాఠీ, హిందీల్లో నటించాను. తెలుగులో ఇది నాకు మొదటి చిత్రం. భారతి గారికి ఓ ఇమేజ్ ఉంది. ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. ఎలాంటి మనిషి.. ఎలాంటి విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారు.. అనే విషయాలను తెలుసుకున్నాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’ అని అన్నారు. -
రియల్ లైఫ్ లో జగన్ పై జీవ అభిప్రాయం ఏంటి?
-
యాత్ర-2 తియ్యడానికి ఇదే కారణం
-
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్‌తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్‌గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్. -
కాఫీ విత్ కాదల్: కామెడీకి కొదవే ఉండదు
దర్శకుడు సుందర్ సి రూపొందించే చిత్రాల్లో కమర్షియల్ అంశాలతో పాటు కామెడీకి కొదవే ఉండదు. ఇదే తరహాలో ఫుల్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో కాఫీ విత్ కాదల్ చిత్రం వస్తోంది. జీవా, జయ్, శ్రీకాంత్, మాళవిక శర్మ, అమృత అయ్యర్, రైసా నెల్సన్, ఐశ్వర్య దత్త హరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుష్భు అవ్నీ సినీ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పెన్ మీడియా సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఈ కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు ముస్తాబవుతోంది. వేర్వేరు వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఆయా వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఎదుర్కొనే సమస్యల సమాహారమే ఈ చిత్రమని చెప్పారు. ఇందులో 8 పాటలు ఉన్నాయన్నారు. కుటుంబసమేతంగా హాయిగా చూసి ఆనందించే వినోదభరిత కథా చిత్రంగా ఇది ఉంటుందని సుందర్ వెల్లడించారు. చదవండి: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత -
Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్
సూర్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అయాన్'. తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు కేవీ ఆనంద్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ఆ వెంటనే 'కో' సినిమాను ప్రకటించాడు ఆనంద్. ఇది తెలుగులో 'రంగం' పేరుతో విడుదై సెన్సేషనల్ హిట్ సాధించింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో మొదట హీరోగా అనుకుంది జీవాను కాదు శింబును! శింబుతో 'కో' సినిమా తీస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించింది. అంతే కాదు, ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో శింబు-కార్తీక నాయర్లపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఇక సినిమా పట్టాలెక్కే సమయానికి మాత్రం శింబు ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు శింబు ప్లేస్‌లో యంగ్ హీరో జీవాను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా అఖండ విజయం సాధించిన ఈ సినిమా రిలీజై దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఈ సమయంలో తాజాగా శింబు-కార్తీక ఫొటోషూట్‌కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 'కో' సినిమా చేసేందుకు శింబు రెడీ అన్నాడు. కాకపోతే హీరోయిన్గా కార్తీకకు బదులు తమన్నా కావాలని అడిగాడట. కానీ ఆ సమయంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ పెద్దమొత్తంలో పారితోషికం అందుకుంటున్న మిల్కీ బ్యూటీని ఈ ప్రాజెక్టుకు ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు దర్శకనిర్మాతలు. తమన్నా కోరినంత రెమ్యుననరేషన్ ఇచ్చేంత భారీ బడ్జెట్ తమ వద్ద లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటంతో శింబు ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. చేసేదేం లేక దర్శకుడు కూడా మరో మంచి నటుడు కోసం వెతుకుతుండగా జీవా కంటపడ్డాడు. అలా అతడికి కో మూవీలో చాన్స్ రాగా అది జీవా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రెండు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, మూడు విజయ్, రెండు సీమా, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం. చదవండి: Anushka Shetty: వైరలవుతున్న స్వీటీ ఫొటో సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
జిప్సీకి స్టాలిన్ ప్రశంసలు
డీఎంకే నేత స్టాలిన్ ‘జిప్సీ’ చిత్రాన్ని చూసి ప్రశంసించారు. నటుడు జీవా కథానాయకుడిగా నటించిన చిత్రం జిప్సీ. ఇంతకుముందు కుక్కూ, జోకర్ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన రాజు మురుగున్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఇది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చాలా కాలంగా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుని ఎట్టకేలకు వాటిని అధిగమించి ఈ శుక్రవారం తెరపైకి రానుంది. కాగా ఇది ఒక గ్రామీణ సంగీత కళాకారుడి ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం. ఇందులో సమకాలీన రాజకీయాలు చోటు చేసుకోవడంతోనే సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. కాగా జిప్సీ చిత్రాన్ని డీఎంకే నేత స్టాలిన్ చూసి ప్రశంసించారని చిత్ర దర్శకుడు రాజుమురుగన్ తెలిపారు. గత రెండవ తేదీన జిప్సీ చిత్రాన్ని స్టాలిన్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు, చిత్రాన్ని చూసిన ఆయన చిత్రం చాలా బాగుందని, సరైన సమయంలో వస్తున్న సరైన చిత్రం అని ప్రశంసించినట్లు దర్శకుడు తెలిపారు. ప్రేమ, అభిమానం వంటి అంశాలతో పాటు సమకాలీన రాజకీయ సమస్యలను చర్చించే చిత్రంగా జిప్పీ ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇది ఒక జిప్సీ అనే సంచారి ఇతివృత్తంగా తెరకెక్కించిన కలి్పత కథా చిత్రం అని చెప్పారు. కాగా ఒక సామాజిక వర్గం హక్కులను ప్రశ్నించే చిత్రంగా జిప్పీ ఉంటుందని, పలు వివాదాప్పద సన్నివేశాలను సెన్సార్ కత్తెరకు బలైనట్లు తెలిసింది. మొత్తం మీద జిప్సీ చిత్రంపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. ఇందులో నటాషాసింగ్ నాయకిగా నటించిన ఇందులో లాల్జోష్, సన్నీ వైనీ, సుశీలారామన్, విక్రాంత్సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సెల్వకుమార్, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు. -
యంగ్ హీరోకి బంపర్ ఆఫర్
కోలీవుడ్ యువ నటుడు జీవాకు బాలీవుడ్ బంపర్ ఆఫర్ వచ్చింది. కో వంటి మంచి కథా చిత్రం పడితే రెచ్చిపోయే నటుడు జీవా. ఇటీవల ఈయన నటించిన కలగలప్పు 2 మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం జిప్సీ, గొరిల్లా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ 90వ చిత్రంలో జీవా హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ యువ నటుడికి బాలీవుడ్ కాలింగ్ బెల్ కొట్టింది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రంలో జీవా నటించబోతున్నారు. ముందుగా ఈ పాత్రలో సంచలన నటుడు విజయ్ దేవరకొండ కనిపించనున్నారన్న టాక్ వినిపించింది. అయితే విజయ్ నో చెప్పటంతో ఆఫర్ జీవా తలుపు తట్టింది. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ‘1983 వరల్డ్ కప్ అనే చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి నటించబోతున్నాను. బాహుబలి చిత్రం ఎలాగైతే సిల్వర్‌స్క్రీన్‌పై బ్రహ్మాండాన్ని ఆవిష్కరించిందో అదే తరహాలో ఈ చిత్రం ఉంటుంది. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ క్రీడ నేపథ్యంలో తొలిసారిగా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు కెమెరా ముందు నిలబడదామా అన్నంత ఉత్సాహంతో ఉన్నాను. 1983లో వరల్డ్‌కప్ గెలిచి ఇండియాకు ఘనతను తెచ్చి పెట్టిన సంఘటనే ఈ చిత్ర ఇతివృత్తం. చిత్ర షూటింగ్ మే మాసంలో లండన్‌లో ప్రారంభమై 100 రోజుల పాటు చిత్రీకరణను జరుపుకోనుంది. అందుకు నేను ఇప్పటి నుంచే తయారవుతున్నాను. అప్పట్లో ఆ క్రికెట్ టీమ్‌లో ప్రముఖ క్రీడాకారుడిగా రాణించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నేను నటించనున్నాను. ఆయన పాత్రలో నటించడం గర్వంగా ఉంది. ప్రముఖ బౌలర్ చందు ఇంటికి వచ్చి నాకు శిక్షణ ఇస్తున్నార’ని తెలిపారు. ఎంఎస్.ధోని, లగాన్ చిత్రాల వరుసలో ఈ 1983 వరల్డ్ కప్ చిత్రం చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
సంఘమిత్రకు ముందు సందడి
కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్ సుందర్ .సి అండ్ టీమ్ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్ ఎవరో కాదు. రజనీకాంత్ హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250కోట్ల బడ్జెట్‌తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్ రోల్స్‌లో తేనాండాళ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్‌ను డిసెంబర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. -
కవలైవేండామ్ గీతాలకు మంచి స్పందన
కవలైవేండామ్ చిత్ర గీతాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోందని ఆ చిత్ర యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన చిత్రం కవలైవేండామ్. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే, కో-2 వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ ఎల్రెడ్.కుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. అదే విధంగా యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వం వహిస్తున్న చిత్రం క వలైవేండామ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన రెండు టీజర్లకు ప్రేక్షకుల మధ్య విశేష స్పందన లభించిందని, దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. కో-2 చిత్రంతోనే సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ మంచి పేరు తెచుకున్నారని, కవలైవేండామ్ చిత్రం ఆయనకు మరింత ప్రాచుర్యం చేస్తుందని అన్నారు. ఇందులోని ఉన్ కాదల్ ఇరుందాల్ పోదుం, నా తొలందాయో అనే పాటలు సంగీత ప్రియుల మధ్య విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.ఈ తరానికి కావలసిన అన్ని అంశాలతో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టెయినర్గా తెరకెక్కించిన కవలైవేండామ్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని చిత్ర నిర్మాత వ్యక్తం చేశారు. -
అభిమానులతో హన్సికకు చిక్కులు
అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకూ ముద్దుగానే ఉంటుంది. అది దాటితేనే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నటి హన్సికకు అలాంటి సమస్యనే ఎదురైంది. ఆమెను అందులోంచి నటుడు జీవా, సిబిరాజ్ కాపాడారు. వివరాల్లోకెళితే జీవా,హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం పోకిరిరాజా. సిబిరాజ్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. నవ నటి మానస, మనోబాలా, చిత్రా లక్ష్మణన్,యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు ఇళయదళపతితో పులి వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన పీటీఎస్.ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. చిత్ర షూటింగ్ గత కొన్ని వారాలుగా పాండిచ్చేరిలో జరుపుకుంటోంది. అక్కడ ఎడతెరిపి లేని వానలో కూడా పోకిరిరాజా చిత్రం షూటింగ్ జరుపుకుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. అదే విధంగా చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత ప్రజలు హన్సికను చూడడానికి ఎగబడడంతో ఆమె వారి మధ్య ఇరుక్కుపోయారు. వెంటనే నటుడు జీవా, సిబిరాజ్ హన్సికను జనాల మధ్య నుంచి అతి కష్టంగా బయటకు తీసుకొచ్చారని వివరించారు. తదుపరి షెడ్యూల్‌ను చెన్నైలో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
నేను సైతం స్వచ్ఛభారత్‌లో
స్వచ్ఛభారత్‌కు నేను సైతం అంటూ సిద్ధం అవుతున్నారు నటి హన్సిక. ప్రధాని ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ పథకం చాలా మట్టుకు ప్రచారానికే పరిమితం అయ్యిందనే ఆరోపణలు ఎదురవ్వుతున్న నేపథ్యంలో నటి హన్సిక గొడవేంటంటారా? అయితే ఆమె స్వచ్ఛభారత్‌కు నేను సైతం అంటోంది రియల్ లైఫ్‌లో కాదు లెండి. రీల్‌లైఫ్‌లోనే. విషయం ఏమిటంటే ఈ క్రేజీ బ్యూటీ తాజాగా నటుడు జీవాతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇటీవల విజయాల్లో వెనుకబడ్డ జీవా ఇప్పుడు చిత్రాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నయనతారతో తిరనాళ్ చిత్రంతో పాటు కవలైవేండామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తీసురేష్ ఆయనతో డ్యూయెట్లు పాడుతున్నారు. ఇప్పుడు జీవా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. దర్శకుడు రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో హన్సిక నాయికగా ఎంపికైంది. దీని గురించి ఆమె తెలుపుతూ దర్శకుడు చెప్పిన కథ వైవిధ్యంగా ఉందని తెలిపారు. ఇందులో తన పాత్ర చాలా హ్యుమరస్‌గా ఉండడంతో అంగీకరించినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ వలెంట్రీ యువతిగా నటించనున్నట్లు చెప్పారు. ఈమె ప్రస్తుతం అరణ్మణై-2లో నటిస్తున్నారు.తదుపరి నటించే చిత్రం జీవాతోనేనని తెలిపారు. -
చిరునవ్వుల చిరుజల్లు మూవీ ఆడియో ఆవిష్కరణ