దర్శకుడు సుందర్ సి రూపొందించే చిత్రాల్లో కమర్షియల్ అంశాలతో పాటు కామెడీకి కొదవే ఉండదు. ఇదే తరహాలో ఫుల్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో కాఫీ విత్ కాదల్ చిత్రం వస్తోంది. జీవా, జయ్, శ్రీకాంత్, మాళవిక శర్మ, అమృత అయ్యర్, రైసా నెల్సన్, ఐశ్వర్య దత్త హరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుష్భు అవ్నీ సినీ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పెన్ మీడియా సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి.
యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఈ కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు ముస్తాబవుతోంది. వేర్వేరు వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఆయా వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఎదుర్కొనే సమస్యల సమాహారమే ఈ చిత్రమని చెప్పారు. ఇందులో 8 పాటలు ఉన్నాయన్నారు. కుటుంబసమేతంగా హాయిగా చూసి ఆనందించే వినోదభరిత కథా చిత్రంగా ఇది ఉంటుందని సుందర్ వెల్లడించారు.
చదవండి: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత
Comments
Please login to add a commentAdd a comment