Jai
-
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార
నీలేష్ కృష్ణ దర్శకత్వంలో నయనతార, జై, సత్యరాజ్, తదితరులు నటించిన చిత్రం 'అన్నపూరణి' డిసెంబర్ 1న తమిళంలో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని జి స్టూడియోస్, నాట్ స్టూడియోస్ నిర్మించాయి. చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక బ్రాహ్మణ యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రం. రాజా రాణి తర్వాత జై, నయనతార జంటగా ఈ చిత్రంలో నటించారు. అన్నపూరణి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నటులు జై, నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణ పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో జై, నయనతారల కెమిస్ట్రీ గురించి అడిగినప్పుడు, నయనతార మాట్లాడుతూ.. 'రాజా రాణిలో 20 నిమిషాలు మాత్రమే మేమిద్దరం నటించాము. ఆ సినిమా షూటింగ్ తర్వాత మేము మంచి స్నేహితులం అయ్యాం. వ్యక్తిగతంగా కలుస్తూనే ఉన్నాం. రాజా రాణి సినిమాలో మేము ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామో అదే విధంగా ఈ సినిమాలో కూడా నటించాం. ఈ సినిమాలో మేము నటించిన సన్నివేశాలు అన్నీ సహజంగానే ఉంటాయి. నేనెలా నటిస్తానో, కెమెరా ముందు జై ఎలా నటిస్తాడో అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు.' అని ఆమె అన్నారు. నటుడు జై మాట్లాడుతూ 'మహిళల నేపథ్యంలో సాగే చిత్రంలో నయనతారతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మనం తెరపై నేచురల్‌గా మాట్లాడుతూ నటిస్తే అభిమానులకు నచ్చుతుంది. నటించేటప్పుడు మాకు మంచి అవగాహన ఉంటుంది. మేమిద్దరం కలిసి నటించేటప్పుడు మానిటర్ వైపు కూడా చూడము. సెట్లో కెమెరా ముందు నయనతార నటనను చూసిన వారు ఎవరైనా ఆమెను లేడీ సూపర్‌స్టార్ అనాల్సిందే అని నేను అంటే.. నయనతార, ''అలా అనకండి, చెబితే తిడతారు. కొంతమంది నేను ఇంకా అక్కడి వరకు చేరుకోలేదని అంటారు. నేను అమ్మాయిని కాబట్టి నాపై విరుచుకుపడతారు.. మళ్లీ నాపై విమర్ళలు మెదలుపెడుతారంటూ ఇలా చెప్పింది. అన్నపూరణి చిత్రానికి సంబంధించినంతవరకు అన్ని విషయాలు తన ఇష్ట్రపకారం జరిగాయని చెప్పింది. ఒక్క లేడీ సూపర్‌స్టార్ అన్న టైటిల్ కార్డ్ మినహా. అది మాత్రం తన అనుమతి లేకుండా జరిగిందని పేర్కొంది. దాని గురించి దర్శకుడిని అడిగితే అది సర్ప్రైజ్ కోసం అని చెప్పారన్నారంది. నిజం చెప్పాలంటే తనను లేడీ సూపర్‌స్టార్ అంటే 10 మంది సంతోషపెడితే 50 మంది తిట్టుకుంటున్నారంది. బహుశా అలా అనిపించుకునే స్థాయికి ఎదిగానో లేదో తెలియదన్నారు. ఇదీ చదవండి: నయనతార 75వ మూవీ 'అన్నపూరణి' రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కోలీవుడ్‌లో సూపర్ స్టార్ అనే బిరుదు కేవలం రజనీకాంత్‌కు మాత్రమే ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారు. ఆ ట్యాగ్‌లైన్‌ను ఎవరికీ ఉపయోగించకూడదని వారి అభిప్రాయం. కానీ అన్నపూరణి చిత్రంలో లేడి సూపర్ స్టార్ అని టైటిల్ కార్డులో పడటంతో ఆమెపై రజనీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఈ విషయంపైనే ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. -
ఆర్య సినిమా చేజార్చుకుంది.. ఇల్లు తాకట్టు పెట్టి బిజినెస్‌లోకి..
జై సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో పనిమనిషిగా కామెడీ పండించి నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేసిన ఆమె తమిళంలోనే స్థిరపడిపోయింది. తర్వాత సిల్వర్ స్క్రీన్‌ను వదిలేసి స్మాల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సీరియల్స్ చేసింది. కొంతకాలంగా సినిమాలకు, సీరియల్స్‌కు దూరంగా ఉంటోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? సంతోషి శ్రీకర్. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో తను ఎందుకు సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిందనే విషయాన్ని బయటపెట్టింది. రీల్ జంట రియల్ జంటగా.. సంతోషి మాట్లాడుతూ.. నాన్నది విజయవాడ. పుట్టిపెరిగిందంతా చెన్నైలో. జై సినిమా చేసేటప్పుడు కూడా తెలుగు రాదు. కానీ నా భర్తది హైదరాబాద్. మేమిద్దరం కలిసి హీరోహీరోయిన్స్‌గా సీరియల్ చేశాం. రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలమయ్యాం. జై, ఆర్య.. రెండు సినిమాలకు నన్ను సెలక్ట్ చేశారు. అయితే జై చిత్రానికి నేను పర్ఫెక్ట్ అని భావించడంతో అందులోకి తీసుకున్నారు, ఆర్య చేజారిపోయింది. పూరీ జగన్నాథ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. చాలా వదులుకున్నాను. కొట్టి మరీ ఏడిపించారు జై మూవీలో ఏడ్చే సీన్ ఉంటుంది. నాకు కన్నీళ్లు రావడం లేదని కొట్టి మరీ ఏడిపించారు. ఆ సినిమాకు నేను డబ్బులు తీసుకోలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేసే సమయంలో నా వయసు పదిహేడున్నరేళ్లు. ఆ విషయం చెప్తే ఎవరూ నమ్మలేదు. సినిమాలు చేస్తే ఏడాదిలో రెండు, మూడు నెలలే పని ఉంటుంది. అదే సీరియల్స్ అయితే ప్రతి నెలా పని ఉంటుంది. పైగా అక్కడ స్కిన్ షోతో పాటు బెడ్రూమ్ సీన్లు చేయమంటారు. అది ఇష్టం లేకే సినిమా ఇండస్ట్రీ వదిలేసి బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయాను. ఇకపోతే నా ఇల్లును తాకట్టు పెట్టి మరీ బ్యూటీ అండ్ జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించాను. నాకు మంచి అవకాశాలొస్తే తిరిగి నటించడానికి సిద్ధంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది సంతోషి శ్రీకర్. చదవండి: స్టార్ కమెడియన్ మరణం.. ఆస్తి రాసినా దక్కలేదు.. అనాథలా వదిలేసిన కుటుంబం.. దిక్కు తోచని స్థితిలో.. -
అలాంటి వ్యక్తినే మనువాడతా!
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్ దర్శకత్వంలో కట్రదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్, వెబ్ సీరిస్‌లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్షిప్లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్, రిలేషన్‌షిప్‌లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు. -
పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోతో నయనతార స్క్రీన్ షేర్
హీరో జై, హీరోయిన్ నయనతార పదేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఓ సినిమా తెరకెక్కనుంది. ఇది నయనతార కెరీర్లో 75వ సినిమా కావడం విశేషం. కాగా ఈ సినిమాలో యాక్టర్ జై నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. 2013లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా రాణి’ చిత్రం తర్వాత జై, నయనతార కలిసి మళ్లీ ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఆ హీరోతో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
టీవీ యాంకర్ నుంచి వెండితెర కథానాయిక వరకు ఎదిగిన నటి వాణిభోజన్. మధ్యలో టీవీ సీరియల్లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె అధికారం 97 చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఓ మై కడవలే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత లాకప్, రామే ఆండాలుమ్ రావణనే ఆండాలుమ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. కాగా మహాన్ చిత్రంలో విక్రమ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం 10 చిత్రాలకు పైగా చేస్తూ బిజీగా ఉన్న వాణిభోజన్ ఇటీవల హీరో జయ్‌తో సహజీవనం చేస్తున్నట్లు, ఆమె నటించే చిత్రాల కథలను కూడా ఆయనే విని ఎంపిక చేస్తున్నట్లు, దర్శక నిర్మాతలు వాణిభోజన్‌ను కలిసి కథల చెప్పే అవకాశం కూడా లేకపోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కాగా ఇలాంటి ప్రచారంపై ఈమె కాస్త ఆలస్యంగా స్పందించింది. అలాంటి వార్తలు తన వరకు వచ్చాయని, అయితే అవన్నీ వదంతులేనని కొట్టి పారేసింది. వాణిభోజన్ నటుడు భరత్‌కు జంటగా నటించిన మిరల్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను డబ్బు కోసమో లేక దర్శక నిర్మాతల కోసమో చిత్రాల్లో నటించడం లేదని చెప్పింది. అలాగే కథలను తానే విని నచ్చిన వాటినే ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు తెలిపింది. మిరల్ లాంటి హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయంలో ఎలాంటి ప్లాను లేదని చెప్పింది. కథ, తన పాత్ర ఇంప్రెస్ చేసిందని అందుకే అంగీకరించినట్లు తెలిపింది. అంతేకాని తొందరపడి చిత్రాలను ఒప్పుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే హిందీ చిత్రం గంగుభాయ్ వంటి కథా చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నట్లు నటి వాణిభోజన్ పేర్కొంది. -
ఆ నటుడితో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన హీరోయిన్!
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది. నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్ శివన్ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్ పరిస్థితి ఇదేననే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది. దీంతో వాణిభోజన్ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం. -
కాఫీ విత్ కాదల్: కామెడీకి కొదవే ఉండదు
దర్శకుడు సుందర్ సి రూపొందించే చిత్రాల్లో కమర్షియల్ అంశాలతో పాటు కామెడీకి కొదవే ఉండదు. ఇదే తరహాలో ఫుల్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో కాఫీ విత్ కాదల్ చిత్రం వస్తోంది. జీవా, జయ్, శ్రీకాంత్, మాళవిక శర్మ, అమృత అయ్యర్, రైసా నెల్సన్, ఐశ్వర్య దత్త హరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుష్భు అవ్నీ సినీ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పెన్ మీడియా సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఈ కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు ముస్తాబవుతోంది. వేర్వేరు వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఆయా వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఎదుర్కొనే సమస్యల సమాహారమే ఈ చిత్రమని చెప్పారు. ఇందులో 8 పాటలు ఉన్నాయన్నారు. కుటుంబసమేతంగా హాయిగా చూసి ఆనందించే వినోదభరిత కథా చిత్రంగా ఇది ఉంటుందని సుందర్ వెల్లడించారు. చదవండి: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత -
విలన్‌గా మారిన 'రాజా రాణి' నటుడు
దర్శకుడు సుందర్ సి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పట్టాం పూచ్చి. ఇందులో ప్రతి నాయకుడిగా జయ్ నటించడం విశేషం. ఈ క్రేజీ చిత్రాన్ని అవ్నీ టెలీ మీడియా పతాకంపై నటి కుష్భు సుందర్ నిర్మిస్తున్నారు. నటి హనీరోస్, ఇమాన్ అన్నాచ్చి, బేబీ మనస్వి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బద్రి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కృష్ణస్వామి చాయాగ్రహణను, నవనీత్ సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీత రచయిత ముకుందన్ రామన్ రాసిన పట్టాం పూచ్చి అనే పల్లవితో సాగే తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేశారు. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ..1980లో జరిగే సైకో థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. తాజాగా విడుదల చేసిన పట్టాం పూచ్చి పాటకు మంచి ఆదర ణ లభిస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
తొలి సినిమా డైరెక్టర్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్‌కు ఏ డైరెక్టర్‌తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
సామాన్యుడి కథ
అల్తాఫ్, శాంతిరావు, లావణ్యా రెడ్డి, సాత్విక జై ప్రధాన తారాగణంగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ ముగిసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్ నారాయణ్ మాట్లాడుతూ–‘‘మామూలుగా పెద్ద వ్యక్తుల జీవితాలు బయోపిక్స్‌గా వెండితెరపైకి వస్తుంటాయి. కానీ మేమే ఒక సామాన్యవ్యక్తి కథనే బయోపిక్‌గా తెరకెక్కించాం. ఈ సినిమాలో టైటిల్ రోల్ ఎవరూ చేశారనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం లేదు. కానీ అతను మాత్రం ఇండస్ట్రీకి మరో రాజేంద్రప్రసాద్ అవుతారని చెప్పగలను. నిర్మాత సతీష్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. కథే హీరో అని నమ్మి చేసిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవి సందర్భంగా విడుదల చేయాలనుకుటున్నాం. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘పెళ్లైన కొత్తలో కొత్తజంటకు ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుస్తుంది.. ముందుంది ముసళ్ల పండగ అని. ఈ అంశాన్నే సినిమాలో చూపించబోతున్నాం. మా చిత్రం ఈ ఏడాదిలో సర్ప్రైజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు నటుడు భద్రం. ఈ కార్యక్రమంలో శాంతిరావు, స్వాతి, కెమెరామ¯Œ కర్ణ పాల్గొన్నారు. -
విజయం ఖాయం
‘‘కొన్నేళ్లుగా పంపిణీ రంగంలో ఉన్నాం. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. ఆ అనుభవంతోనే నిర్మాణరంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా ‘మధుర రాజా’ చిత్రాన్ని తెలుగులో ‘రాజా నరసింహా’గా అనువదించాం. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాత సాధు శేఖర్ అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేం వైశాఖ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ రేపు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ– ‘‘నిర్మాతగా తొలి సినిమా ఇది. కల్తీ సారా వ్యాపారంతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంతానికి అండగా నిలిచే రాజా ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే కథాంశం. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం కూడా ఉంది. సన్నీ లియో¯Œ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మా చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది’’ అన్నారు. -
రాజా వస్తున్నాడు
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో ‘మన్యం పులి’ ఫేమ్ వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహ’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘అదొక మారుమూల అటవీ ప్రాంతం. ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందు తాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా ఎలా తీర్చాడు? అన్నదే ఈ చిత్రకథాంశం. చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి మాస్ యాక్షన్ , జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్ పోరాటాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
రాజా నరసింహా
మమ్ముట్టి, జై, మహిమా నంబియర్ కీలక పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘మధురరాజా’. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత తెలుగులో వస్తున్న మమ్ముట్టి చిత్రమిది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో సినిమా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం ఉంది. మమ్ముట్టి, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకష్ణ. -
40 నిమిషాల గ్రాఫిక్స్‌తో...
కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘నియా’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘నియా–2’ పేరుతో తమిళంలో, ‘నాగకన్య’ పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించారు. ‘జర్నీ, రాజారాణి’ చిత్రాల ఫేమ్ జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్‌లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ అధినేత కె.ఎస్.శంకర్ రావు తెలుగులో విడుదల చేస్తున్నారు. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘పాము నేపథ్యంలో వచ్చిన ‘నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ’ వంటి చిత్రాలెన్నో ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ పాము కథాంశాన్ని ఎంచుకుని నేటి నవీన సాంకేతికతను మిళితం చేశారు. ముఖ్యంగా నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు, మనిషి పాముగా మారే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నిజమైన కోబ్రాను వాడాలనుకున్నాం. అందుకోసం బ్యాంకాక్ కూడా వెళ్లాం. కానీ ఒరిజనల్ పామును షూటింగ్లో ఉపయోగించడానికి వీలుకాలేదు. దాంతో గ్రాఫిక్స్‌లో చూపించాం’’ అన్నారు ఎల్.సురేష్. ‘‘వెండితెరపై కాలనాగును చూపించాలన్న ఉద్దేశ్యంతో ఇండోనేషియాలో పాములకు శిక్షణ ఇచ్చే నిపుణులను కలిశాం. వారి దగ్గర 20 నుంచి 28 అడుగుల పొడవున్న కోబ్రాలు ఉన్నాయి. వాటిపై చిత్రీకరణ జరిపి కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌లో ఉపయోగించాం’’ అని గ్రాఫిక్స్ నిపుణుడు వెంకటేష్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజావెల్ మోహన్, సంగీతం: షబ్బీర్. -
నాగకన్య విన్యాసాలు
దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చిన కమల్‌హాసన్ చిత్రాల్లో ‘నీయా’ ఒకటి. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ అప్పట్లో మంచి హిట్. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ రూపొందింది. తెలుగు వెర్షన్ టైటిల్ ‘నాగకన్య’. జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్. సురేష్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగు హక్కులను లైట్ హౌస్ సినీమ్యాజిక్ అధినేత కె.ఎస్. శంకర్ రావు దక్కించుకున్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి పాముగా మారే సన్నివేశాలు, పాము చేసే విన్యాసాలు హైలైట్‌గా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు గ్రాఫిక్స్‌కి భారీగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో పిల్లలు, పెద్దలకు మంచి ఎంటర్టైనర్ అవుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
వేసవిలో నాగకన్య...
వరలక్ష్మీ శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా, జై హీరోగా నటించిన చిత్రం ‘నాగకన్య’. ఎల్. సురేష్ దర్శకత్వంలో జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని వేసవి కానుకగా మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వీరి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొచ్చేలా ఉంటుంది. మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్ చేసేలా ‘నాగకన్య’ చిత్రం ఉంటుంది’’ అన్నారు. -
ప్రతి సీన్ పసందుగా..
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్, జై ముఖ్యపాత్రల్లో ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాగకన్య’. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు మంచిపేరొచ్చేలా ఉంటుంది. వీరి ముగ్గురి లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో జై క్యారెక్టర్ మరో హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. పిల్లలతో పాటు పెద్దలు మా సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అవన్నీ రూమర్స్ అంటున్న హీరోయిన్
అలా అని ఎవరు చెప్పారు? అని ప్రశ్నిస్తోంది నటి అంజలి. బహు భాషా నటిగా చాలా కాలంగా రాణిస్తున్న తెలుగమ్మాయి అంజలి. మధ్యమధ్యలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసేస్తున్న అంజలి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్య నటుడు జైతో ప్రేమ కలాపాలు అనే ప్రచారానికి అవకాశం కల్పించింది. ఇద్దరూ వంటింటి వరకూ వెళ్లి దోసెలు వేసుకుని తినిపించుకున్న ఫొటోలతో పత్రికల్లోకెక్కారు. అలా ఇక పెళ్లే తరువాయి అనుకునేంతలో అసలు తమ మధ్య ఏం లేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఆ విషయాన్ని జనం మరిచిపోయారో లేదో గానీ, నటి అంజలి పెళ్లి చేసుకోవడానికి సినిమాలకు దూరం అవనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నటి అంజలి ఖండించింది. దీని గురించి ఆమె స్పందిస్తూ తాను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాతనే నటినయ్యానని చెప్పింది. నిజానికి తన తల్లికి నటినవ్వాలన్నది ఆశ అని, అది నెరవేరకకపోవడంతో తనను నటిని చేసి తన కలను నెరవేర్చుకుందని చెప్పింది. తాను వివాహం చేసుకోవడానికి సినిమాలకు స్వస్తి చెప్పనున్నాననే ప్రచారం జరుగుతోందని అంది. అలా అని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించింది. అది పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే అసలు పెళ్లి అన్న వార్తే అబద్దం అని అంది. ఒకవేళ వివాహం చేసుకున్నా, సినిమాలకు ఎందుకు దూరం అవ్యాలి అని ప్రశ్నించింది. తాను నటిగా కొనసాగాలని ఆశిస్తున్నాను. అందుకు గ్లామరస్‌గా నటించడానికి కూడా సిద్ధమేనని అంది. అయితే కథానాయకి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాననీ చెప్పింది. కొత్తగా వచ్చే నటీమణులకు తానిచ్చే సలహా ఏమిటంటే నటనపై పూర్తిగా దృష్టి పెట్టి నటించాలని చెప్పింది. నటనపై ఆసక్తి ఉండాలని అంది. సాధించాలనే పట్టుదల ఉండాలని పేర్కొంది. ఇకపోతే తాను ఇతరులను బాధించే విధంగా మాట్లాడుతున్నానని చెప్పుకుంటున్నారని, అందులో నిజం లేదని అంది. తానింత వరకూ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, తన గురించి ప్రచారం అయ్యే వదంతులకు ప్రారంభ దశలో ఆవేదన కలిగిన విషయం నిజమే కానీ ఇప్పుడు అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదని నటి అంజలి చెప్పింది. ప్రస్తుతం ఆ అమ్మడు కోలీవుడ్‌లో రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో శశికుమార్‌తో నటించిన నాడోడిగళ్–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
ఇంట్లో కూర్చోను
ఎవరైనా హీరో, హీరోయిన్ వరుసగా సినిమాలు చేస్తే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ వార్తలు బయటికొస్తుంటాయి. తమిళ హీరో జై, నటి అంజలి కూడా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తే. అయితే ఇటీవలే ‘నేను సింగిల్’ అని జై పేర్కొన్నారు. లేటెస్ట్గా అంజలి పెళ్లి చేసుకోబోతున్నారు, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతారు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘‘పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా యాక్టింగ్‌ని కొనసాగిస్తాను. చాలామంది హీరోయిన్లు పెళ్లైనా యాక్ట్ చేస్తున్నారు కదా. నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి?’’ అని సమాధానం ఇచ్చారు అంజలి. -
ఈ ప్రేమికులరోజు అంజలితో కాదు.. ఆయనతో..
సినిమా: ప్రేమికుల రోజును ఆయనతో జరుపుకోనున్నట్లు నటుడు జై చెప్పారు. జై ప్రముఖ సంగీత దర్శకుడు దేవాకు బంధువు. ఈయనలోనూ సంగీత కళాకారుడు ఉన్నాడు. అవును జై కీబోర్డు ప్లేయర్.అలాంటిది నటుడిగా రాణించడం విశేషం. ఈ సంచలన నటుడి గురించి రకరకాల ప్రచారం జరుగుతుంటుంది. షూటింగ్‌లకు సకాలంలో రారని, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరని, నటి అంజలితో ప్రేమ వ్యవహారం లాంటి ప్రచారం దుమారం రేపుతుంటుంది. అయినా నటుడిగా జై క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇటీవల నటించిన బెలూన్,కలగలప్పు–2 చిత్రాలు సక్సెస్ అయ్యా యి. ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా మాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నటుడు జై మంగళవారం చెన్నైలో మీడియాతో మీట్ అయ్యారు. ప్ర: మీ సినీ ఎంట్రీ గురించి? జ: 2002లో నటుడు విజయ్ నటించిన భగవతి చిత్రంలో ఆయనకు తమ్ముడిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత స్టెప్ బై స్టెప్ నటుడిగా నన్ను నేను పెంచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ప్ర: హీరోగా అవకాశం గురించి.? జ: గాయకుడు, నటుడు చరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన నిర్మిస్తున్న చెన్నై 28 చిత్రానికి ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళ్లాను. అయితే అక్కడికి వెళ్లే వరకూ ఆ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకుడన్న విషయం తెలియదు. ఆయన నాకు దగ్గర బంధువే. అలా చెన్నై–28 చిత్రం ద్వారా నలుగురు హీరోల్లో ఒకరిగా పరిచయం అయ్యాను. ప్ర:ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వివరాలు? జ:వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా నీయా–2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇది పాము ఇతివృత్తంతో కూడిన కథా చిత్రమే అయినా గతంలో వచ్చిన నీయా చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను నటిస్తున్న మరో చిత్రం కరుప్పనగరం. ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఇందులో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుంది. ఒక పాత్రలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటిస్తున్నాను. ప్ర: కొత్తగా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లున్నారు? జ:అవును మలయాళంలో మమ్ముట్టికి తమ్ముడిగా మదురైరాజాఅనే చిత్రంలో నటిస్తున్నాను. చాలా మంచి పాత్ర. ఈ చిత్రంతో మలయాళంలో హీరోగా మంచి అవకాశాలు వస్తాయని మమ్ముట్టి ప్రశంసించారు. ప్ర:శింబు హీరోగా వెంకట్‌ప్రభు తెరకెక్కించబోతున్న మనాడు చిత్రంలో మీరు నటించబోతున్నట్లు ప్రచారం గురించి? జ: వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించే అన్ని చిత్రాల్లోనూ నేను ఏదో ఒక పాత్రలో నటించాను. ఒక్క చిత్రంలో మినహా. అదే విధంగా మనాడు చిత్రంలోనే ఒక కీలక పాత్రలో నటిస్తాను. ప్ర:నటుడు విజయ్ నటించిన భగవతి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. మరోసారి ఆయనతో నటించే అవకాశం ఉందా? జ: విజయ్‌తో కలిసి నటించాలన్న కోరిక నాకూ ఉంది. భగవతి చిత్రంలో మాదిరి మంచి పాత్ర లభిస్తే విజయ్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా. ప్ర: నటి అంజలితో కలిసి నటిస్తున్నారా? జ:లేదు. ప్ర: ప్రేమికుల రోజును ఎవరితో జరుపుకోనున్నారు? జ: ఈ సారి ప్రేమికుల రోజును ఒంటరిగానే జరుపుకోనున్నాను. ఇంకా చెప్పాలంటే ఆ రోజు మలయాళ చిత్రం మదురై రాజా షూటింగ్ చివరి రోజు. ఆ రోజు మమ్ముట్టితో కలిసి నటించనున్నాను. ప్ర: ఈ ఏడాది ఓ ఇంటి వాడు అయ్యే అవకాశం ఉందా? జ: చెప్పలేను. ఎందుకంటే పెళ్లి గురించి ఇంకా నిర్ణయించుకోలేదు. -
వేసవిలో నాగకన్య
జై, వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘నీయా 2’. తెలుగులో ‘నాగకన్య’ అనే టైటిల్ పెట్టారు. ఎల్. సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని వరలక్ష్మి శరత్‌కుమార్, లక్ష్మీ రాయ్ ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు క్యాథరీన్ లుక్‌ను రిలీజ్ చేస్తారు. రేపు ‘నాగకన్య’ టీజర్ విడుదల అవుతుంది. ‘‘రిలీజ్ చేసిన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమాలో హీరో జై క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఆడియన్స్‌ను అబ్బుర పరుస్తాయి. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
జంతుర్ మంతర్ సైలెన్స్... యాక్షన్!
మాట్లాడటానికి భాష కావాలి కానీ భావాలను చెప్పడానికి అక్కర్లేదు. ఆలకిస్తే మౌనం కూడా మాట్లాడుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే కళ్లు కూడా కథలు చెబుతాయి. ఇలాంటప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ప్రతిభ ఉన్న యాక్టర్స్‌తో పాటు మూగజీవాలు నటిస్తే తప్పేముంది! ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుంది. ప్రస్తుతం మూగజీవాలు కీలకపాత్రలుగా రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తోడుగా... విశ్వాసంగా...! వెండితెర దేవదాస్‌కు మందు బాటిల్‌తో తోడుగా ఉంది కుక్కే. అందుకనే కదా మూగజీవాల్లో విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. కానీ తప్పుడు శిక్షణ ఇచ్చామో.... ‘ఒక్కడు’ సినిమాలో తెలంగాణ శకుంతల ఉన్న క్లైమాక్స్ సన్నివేశాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే. మరీ.. ఇప్పుడు కుక్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం. రాత్రివేళలో గుర్కా చేతిలో టార్చిలైట్‌తో పాటు ఓ కుక్క ఉంటే దొంగల పని అరికట్టడం మరింత సులువు అవుతుంది. అలా ఓ సెక్యూరిటీ గార్డ్ తనకు ఎదురైన ఓ సమస్యను ఓ కుక్క సాయంతో ఎలా పరిష్కరించాడనే నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘గుర్కా’. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డుగా హాస్యనటుడు యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. అలాగే కన్నడ ‘కిర్రిక్‌పార్టీ’ సినిమాతో ఫేమ్ సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రస్తుతం ‘777 చార్లీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ డాగ్ రక్షిత్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుందట. ఉండి? ఏం చేస్తుంది? అంటే వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు ఈ సినిమా దర్శకుడు కిరణ్‌రాజ్. గొరిల్లా ప్లాన్! తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోకి ‘గోరిల్లా’ను చేర్చుకుని ఓ ప్లాన్ వేశారు యాక్టర్ జీవా. ఆ ప్లాన్ తాలూకు డీటైల్స్ షాలినీ పాండేకి తెలుసు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. అలాగే జీవా ప్లాన్ సక్సెస్ కావడం కోసం గొరిల్లా చేత గన్పట్టించారు జీవా. మరి.. గొరిల్లా ఎవర్ని షూట్ చేసిందనే విషయం సిల్వర్‌స్క్రీన్‌పై చూసి తెలుసుకోవాల్సిందే. పగ పట్టిందెవరు? అసలు పాములు పగపడతాయా? వాటికి శక్తులు ఉన్నాయా? అమావాస్య, పౌర్ణమి వంటి సందర్భాలతో పాములకు ఏవైనా లింక్ ఉందా? ఇటువంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్స్ సంబం«ధీకులు ‘నో’ అంటే దైవాన్ని నమ్మేవారు ‘ఎస్’ అంటున్నారు. ఇవన్నీ ఏమో కానీ ఈ కథనాలపై చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా తమిళంలో ‘నీయా 2’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో జై, వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్, రాయ్ లక్ష్మీ నటిస్తున్నారు. ఇందులో హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కీబోర్డ్ పట్టుకోవాల్సిన జై.. నాగస్వరం ఊదుతారట. ఎందుకంటే వెండితెరపై చూడండి అంటున్నారు ‘నీయా 2’ దర్శకుడు ఎల్. సురేశ్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయిందని టాక్. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘పున్నమినాగు’, సాయికుమార్ నటించిన ‘నాగదేవత’ సినిమాల్లో పాము లక్షణాలు హీరో పాత్రల్లో కనిపిస్తాయి. కానీ ‘పాంబన్’ సినిమా కోసం సగం పాముగా మారారు తమిళ నటుడు శరత్ కుమార్. ఈ సినిమాకు ఎ. వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి శరత్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. మూగజీవాలతో షూటింగ్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా లొకేషన్లో టీమ్ అందరూ చాలా ఓర్పుగా ఉండాలి. ఒక్కోసారి చిన్న షాట్ కోసం కూడా చాలా టైమ్ వెచ్చించాల్సి రావచ్చు. అలాగే సినిమా విడుదల సమయంలో సంబంధిత అధికారుల నుంచి టీమ్ అనుమతి పొందాల్సిందే. ఎలాగూ గ్రాఫిక్స్ వర్క్స్ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా.. పర్లేదు. సినిమా చూసి ఆడియన్స్ ఆనందపడాలి. కాసుల రూపంలో ఆ సంతోషం మాకు షేర్ కావాలి అని ఆయా సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారని అనుకోవచ్చు. అదుగోనండీ బంటీ సాధారణంగా పందిపిల్ల అంటే అందరూ అదోరకంగా చూస్తారు. అదే వెండితెరపై విన్యాసాలు చేస్తే ఎంజాయ్ చేయకుండా ఉండరు. ఈ థ్రిల్ కోసమే దాదాపు రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు దర్శక–నటుడు రవిబాబు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో బంటీ అనే కీలకపాత్రలో పందిపిల్లను నటింపజేశారు టీమ్. అంతేకాదు.. ఈ సినిమాకు లైవ్ యాక్షన్ 3డీ యానిమేషన్ టెక్నాలజీని కూడా యాడ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను భారతీయ అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ‘అదుగో’ పేరుతో విడుదల చేస్తారు. మిగిలిన భాషల్లో ‘బంటీ’ అనే టైటిల్ పెట్టారు. అన్నట్లు ఈ సినిమాలో బంటీపై పాటలు కూడా ఉన్నాయటండోయ్. ఈ సినిమాలో నటి పూర్ణ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేశారు. వర్మ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. త్వరలో విడుదల కానుంది. ‘అదుగో’ లో బంటి గజ రాజసం అడవి నేపథ్యంలో సినిమా వెండితెరపైకి వస్తుందంటే అందులో కచ్చితంగా ఒక్కసీన్‌లో అయినా గజరాజు కనిపిస్తాడు. ఆ మాటకొస్తే... ఎన్టీఆర్ ‘అడవిరాముడు’, చిరంజీవి ‘అడవిదొంగ’, రాజేంద్రప్రసాద్ ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాల్లో గజరాజు పాత్ర ఎంత పవర్ఫుల్లో ప్రేక్షకులకు తెలియనిది కాదంటారా. ఏనుగుతో ఈ వెండితెర మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికే టాలీవుడ్ టార్జాన్ రానా, బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ‘తమిళ బిగ్‌బాస్ 2’ ఫేమ్ అరవ్ ప్రయత్నిస్తున్నారు. అడవి జీవితం ఎలా ఉందో బందేవ్ని అదేనండీ... రానాని పలకరిస్తే... థాయ్‌లాండ్, కేరళ అడవుల్లో తాను తిరిగిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తున్నారట. ముఖ్యంగా ఏనుగులతో గడిపిన సీన్స్‌ను గుర్తుచేస్తున్నారట. ఇదంతా ఆయన తాజాగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమా ప్రభావమని ఊహించవచ్చు. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు ‘కాదన్’ అని, హిందీ వెర్షన్‌కు ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రానా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో ఏనుగుల భాషను బాగా అర్థం చేసుకుని వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్. జమాల్‌కు ఈ అవసరం ఎందుకొచ్చిందంటే ‘జంగ్లీ’ సినిమా కోసం. మనుషులకు–ఏనుగులకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆధారంగానే ఈ సినిమా రూపొందుతోంది. థాయ్‌లాండ్‌లో ఎక్కువగా షూట్ చేశారు. ఈ సినిమాకు అమెరికన్ డైరెక్టర్ చెక్ రసెల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరవ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘రాజ్ భీమా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు నరేశ్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేవలం గజరాజు మాత్రమే కాదు. మిగతా జంతువులకూ ప్రాధాన్యం ఉంటుందట. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలు విడుదలైతే చిన్నపిల్లలు ఏనుగమ్మా.. ఏనుగు.. మా ఊరి థియేటర్స్లోకొచ్చిందేనుగు అని పాడుకుంటారేమో. రానా అరవ్ జీవా, షాలినీపాండే విద్యుత్ జమాల్ యోగిబాబు రక్షిత్‌శెట్టి వరలక్ష్మి జై శరత్ కుమార్ -
మైక్ టెస్టింగ్ 123
‘అనుకున్నది చేసెయ్. మొదలు పెట్టింది పూర్తిగా ముగించెయ్....’ అంటున్నారు తమిళ నటుడు జై. ఇప్పుడెందుకీ స్ఫూర్తి గీతం అంటే ‘జరుగండి’ అనే లేటెస్ట్ తమిళ సినిమా కోసం. ‘జర్నీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ నటుడు జై. ఆ తర్వాత ‘రాజా రాణీ’ సినిమాలో కూడా మంచి పాత్ర చేశారు. యాక్టర్‌గా తమిళంలో మంచి స్పీడ్ మీద ఉన్న ఈ హీరో సింగర్‌గా కొత్త అవతారం ఎత్తారు. మైక్ పట్టుకొని మైక్ టెస్టింగ్ 123 అన్నారు. అనడమేంటి పాట కూడా పాడేశారు. ‘జరుగండి’ అనే సినిమాలో ‘సెయిరద సెంజు ముడి’ (అంటే.. చేసేది పూర్తిగా చెయ్) అనే పాట పాడారు. ఈ పాటకు బోబో శశి స్వరకర్త. -
ఇంటర్వెల్లో అర్థమవుతుంది
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అంతకు మించి’. మా చిత్రం పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె నటన గురించి మాట్లాడతారు’’ అని దర్శకుడు జానీ అన్నారు. జై హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అంతకు మించి’. రష్మీ గౌతమ్ కథానాయిక. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో–నిర్మాత జై మాట్లాడుతూ– ‘‘అంతకు మించి’ సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా భయపడతారు. ఈ సినిమాకు ‘అంతకు మించి’ టైటిల్ ఎందుకు పెట్టామో ఇంటర్వెల్లో అర్థం అవుతుంది. రష్మీగారు తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు. ‘‘కేక్‌లా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సినిమా ఉంటుంది’’ అన్నారు రష్మీ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భానుప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం. -
ఆగస్టు 24న ‘అంతకు మించి’
జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ మూవీ అంతుకు మించి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఆర్ ఎక్స్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇక ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత జై నాకు మంచి మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదలవుతోంది తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నాను’ అన్నారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. హీరో జై మాట్లాడుతూ.. ‘సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది’ అని అన్నారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ‘అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా’ అన్నారు. -
సూపర్ ఫన్
అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ స్నేక్స్ అతని జీవితంలోకి వచ్చాయి. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్ లక్ష్మీ, కేథరిన్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘నీయా 2’. సురేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1979లో వచ్చిన కమల్‌హాసన్ ‘నీయా?’ చిత్రానికి ఇది సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. ‘నీయా 2’లో హీరో జై సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. కొడైకెనాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెట్లోకి లేటెస్ట్గా జాయిన్ అయ్యారు వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మి శరత్‌కుమార్, రాయ్ లక్ష్మీ, జై లపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ‘‘టామ్ బాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సెట్లో జాయిన్ అయ్యారు (సరదాగా). సూపర్ ఫన్ను ఎంజాయ్ చేస్తున్నాం. ఆమె టాకింగ్ స్పీడ్‌ను జై, నేను అందుకోలేక పోతున్నాం. మాకు మరింత ఎంటర్టైన్మెంట్ కావాలి వరూ. అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్లకు’’ అని రాయ్‌లక్ష్మీ పేర్కొన్నారు. -
ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను
జై, రష్మి జంటగా ఎస్.జై. ఫిలింస్ పతాకంపై జానీ దర్శకత్వంలో సతీష్ గాజుల, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘అంతకుమించి’. భాను ప్రకాశ్, కన్నా సహ నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ –‘‘ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. నన్ను ఇంప్రెస్ చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. సినిమా విజయం సాధించాలి’’అన్నారు. ‘‘అడగ్గానే మా చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన సుకుమార్‌గారికి థ్యాంక్స్. సెన్సార్ అవ్వగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన సుకుమార్‌గారికి థ్యాంక్స్. జై, రష్మిలకు గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు జానీ. ‘‘మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించాను’’ అన్నారు జై. -
గాయకులుగా...
మన టాలీవుడ్‌కి మోస్ట్ ఫేవరెట్ బ్రదర్స్ సూర్య, కార్తీ. ఈ ఇద్దరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కలిసి యాక్ట్ చేస్తారు? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి టైమ్ ఉంది. కానీ త్వరలో కలిసి వినిపించనున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పార్టీ’. జై, రెజీనా, రమ్యకృష్ట ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. నటుడు ప్రేమ్‌జీ అమరన్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఈ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నారు. -
పోలీసులకు చిక్కిన హీరో జై
పెరంబూరు: యువ నటుడు జై మరోసారి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. గత 2014 ఏప్రిల్ 13న స్థానిక కేకే.నగర్ సమీపంలోని కాశి థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ వాహనాన్నే ఢీకొట్టాడు. అదే విధంగా 2017 సెప్టెంబరు 21న మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ అడయారు బ్రిడ్జ్ సమీపంలో గొడను ఢీకొట్టాడు. ఈ కేసులో పోలీసులు అతనికి జరిమానా విధించి 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. తాజాగా మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్ ప్రధానరోడ్డులో అధిక ధ్వనితో సైరన్ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు జై కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో ఉన్న జైతో పోలీసులు మాట్లాడుతూ అధిక ధ్వనితో హారన్ మోగించడం నేరమని, ఆస్పత్రి సమీపంలో శబ్దం చేసుకుంటూ వెళితే రోగులు, వృద్ధులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సూచించారు. ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై తీసుకునే చర్యల గురించిన అవగాహన వీడియోను చూపించారు. దీంతో నటుడు జై ఇకపై అలా చేయనని సారీ చెప్పడంతో పోలీసులు హెచ్చరించి వదిలేశారు. -
ఈ జంటకు ఏమైంది.?
సాక్షి. సినిమా: నటుడు జై, అంజలిల మధ్య ప్రేమాయణం చాలా కాలంగా సాగుతోందనే ప్రచారం కోడైకూస్తున్న విషయం తెలిసిందే. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట మధ్య అప్పటి నుంచే ఒకరినొకరు ఇష్ట పడ్డారని, ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నారనే ప్రచారం విసృతంగా జరిగింది. ఆ తరువాత కూడా జై, అంజలి కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం బెలూన్. ఆ మధ్య నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన మగళీర్ మట్టుం చిత్ర యూనిట్ దోసె పోటీని సవాల్‌గా తీసుకుని జై తన ఇంట్లో దోసెలు వేసి అంజలికి స్వయంగా పెట్టారు. ఆ ఫొటోలను ట్విటర్లో పొందుపరిచి ఫుల్ పబ్లిసిటీ పొందారు. అదేవిధంగా గత ఏడాది అంజలి పుట్టిన రోజు వేడుక బెలూన్ చిత్ర షూటింగ్ సెట్లో జరగ్గా, జైకి షూటింగ్ లేకపోయినా ఆయన ఆ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతోపాటు ట్విటర్లో అంజలికి కవిత రూపంలో శుభాకాంక్షలు కూడా తెలిపారు. అలాంటిది గత 17న అంజలి పుట్టిన రోజు సందర్భంగా నటుడు జై ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే ప్రచారం వైరల్ అవుతోంది. అదే విధంగా నటి అంజలి జై కు తనకు మధ్య ప్రేమ లాంటిదేమీ లేదని చెప్పడం విశేషం. ఇకపోతే కొద్ది కాలంగా జై, అంజలి నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించడం లేదు. ఇది కూడా వీరి మధ్య విబేధాలకు కారణం అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ నటించే చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నటి అంజలి తమిళం, తెలుగు అంటూ నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాల్లో మాత్రం జై, అంజలిల లవ్ బ్రేకప్ అనే ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. -
క్వాలిటీతో జరుగండి
తమిళసినిమా: జరుగండి చిత్రాన్ని మంచి క్వాలిటీతో చేశామనే నమ్మకం కలిగిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నితిన్ సత్య తెలిపారు. నటుడైన ఈయన నిర్మాతగా మారి బద్రి కస్తూరితో కలిసి నిర్మిస్తున్న చిత్రం జరుగండి. జై కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటి రెబామోనికా జాన్ కథానాయకిగా పరిచయం అవుతోంది. రోబోశంకర్, డానీ అన్నె పోప్, ఇళవరసు, బోస్‌వెంకట్, అమిత్, జయకుమార్, జీఎం.కుమార్, నందా శరవణన్, కావ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పిచ్చుమణి అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు వెంకట్‌ప్రభు వద్ద చెన్నై–28 చిత్రం నుంచి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వచ్చారట. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం పత్రికల వారికి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నితిన్‌సత్య మాట్లాడుతూ నటుడిగా అవకాశాలు వస్తున్నా, మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో గత ఏడాది పాటు నిర్మాణం గురించి స్టడీ చేశానన్నారు. చిత్ర షూటింగ్‌ను 46 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు చాలా కథలను తయారు చేసుకుని అవకాశాల కోసం పలు నిర్మాతలను కలిశారని, అలా తనకు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి జరుగండి అనే తెలుగు టైటిల్ పెట్డడం గురించి అడిగిన ప్రశ్నకు నిజం చెప్పాలంటే ఈ దర్శకుడు ముందుగా వెంకట్‌ప్రభు బ్యానర్లో చిత్రం చేశాల్సి ఉందని, ఆ కథకు పెట్టిన ఈ టైటిల్‌ను వెంకట్‌ప్రభునే తమ చిత్రానికి బాగుంటుందని చెప్పారని అన్నారు. జరుగండి టైటిల్ యూనిక్‌గా ఉండడంతో, ఆసక్తిని కలిగించేదిగానూ, చిత్ర కథకు నప్పడంతో ఈ టైటిల్‌ను పెట్టినట్లు వివరించారు. అవసరం అయినప్పుడు తప్పుల్ని కూడా సమర్థించుకునే యువకుడి ఇతి వృత్తమే జరుగండి అని చెప్పారు. ఈ చిత్రం చాలా క్వాలిటీగా వచ్చిందన్న నమ్మకం తనకు కలిగిందన్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జూలై చివరలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నితిన్ సత్య తెలిపారు. -
ఐయామ్ బ్యాక్
...అంటున్నారు హీరోయిన్ రాయ్ లక్ష్మీ. దాదాపు ఏడాది తర్వాత తమిళంలో ఆమె ‘నీయా 2’ అనే చిత్రం కమిట్ అయ్యారు. మధ్యలో హిందీ చిత్రం ‘జూలీ 2’లో నటించారు. అందుకే ‘ఐయామ్ బ్యాక్’ అన్నారు. రీసెంట్గా ‘నీయా 2’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘‘నీయా 2’ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది తమిళ, మలయాళం, తెలుగు ప్రాజెక్ట్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ షూట్లో పాల్గొనబోతున్నాను’’ అని పేర్కొన్నారు రాయ్ లక్ష్మీ. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ ‘నీయా 2’ చిత్రం గతంలో కమల్‌హాసన్ నటించిన ‘నీయా’కి సీక్వెల్ అని టాక్. దురై దర్శకత్వంలో ఆర్.ముత్తురామన్, కమల్‌హాసన్, సుప్రియ, లత ముఖ్య తారలుగా 1979లో ‘నీయా’ చిత్రం రూపొందింది. ఇది హారర్ మూవీ. స్నేక్‌కి కీలక పాత్ర ఉంది. ‘నీయా2’ కూడా స్నేక్ బేస్డ్ హారర్ మూవీ. దాంతో కమల్ ‘నీయా’కి ఇది సీక్వెల్ అనే వార్త ప్రచారంలోకొచ్చింది. అయితే చిత్రబృందం ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇందులో జై హీరోగా, రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపు నటి అంజలి, రాయ్‌లక్ష్మీల కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
'బెలూన్' మూవీ స్టిల్స్
-
స్టార్ హోదా పొందాలనుకుంటున్నా..
తమిళసినిమా: అంజలి నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. కథానాయకిగా పదేళ్లకు పైగా రాణించడం అంత సులభం కాదు. ఏడాదికి వందల సంఖ్యలో కొత్త హీరోయిన్లు కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. వారిలో ప్రతిభను చాటుకుని స్టార్ నాయకి స్థాయిని అందుకున్న వారు చాలా తక్కువేనని చెప్పక తప్పదు. అలాంటి వారిలో నటి అంజలి ఒకరు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి కథానాయకిగా గుర్తింపు పొంది బహు భాషా నటిగా రాణిస్తున్న అంజలి మొదట తెలుగులో పరిచయం అయినా, విజయాన్ని అందుకుంది మాత్రం తమిళ చిత్రపరిశ్రమలోనే. అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రాల్లో అంజలి నటనను ప్రశంసించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ నటించిన తాజాగా చిత్రం బెలూన్ ఈ నెల 29న తెరపైకి రానుంది. ఇందులో స్పెషల్ ఏమిటంటే ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న నటుడు జై తో కలిసి నటించడం. యువ దర్శకుడు సినీష్ తెరక్కెంచిన ఈ చిత్రంలో నటి జననీఅయ్యర్ మరో హీరోయిన్గా నటించింది. ఇందులో నటించడంపై అంజలి తెలుపుతూ తనకు దెయ్యం కథా చిత్రాలంటే ఇష్టం అని, అంతేగాకుండా కథ, హర్రర్ సన్నివేశాలు ఆసక్తిని కలిగించాయని తెలిపారు. హర్రర్‌తో పాటు ప్రేమ, వినోదం అంటూ అందర్ని అలరించే చిత్రంగా ఉంటుందని చెప్పారు. జై ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిపారు. తాను నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్నానని, అయితే నటిగా స్టార్ హోదా పొందాలని ఆశిస్తున్నట్టు అంజలి చెప్పారు. -
అవన్నీ వదంతులే!
చెన్నై : అంజలి కోలీవుడ్, టాలీవుడ్‌లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీని తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అంజలి తొలి చిత్రం కట్రదు తమిళ్ తోనే తన ముద్రను బలంగా వేసుకుంది. ఆ తరువాత తన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం అంగాడి లెరు అనే చెప్పాలి. అంజలి తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. తాజాగా అంజలి నటించిన తమిళ చిత్రం బెలూన్ ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు జై కథానాయకుడిగా నటించిన ఇందులో నటి జననీఅయ్యర్ మరో నాయకిగా నటించారు. నవ దర్శకుడు శినిష్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్రం యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా చిత్ర కథానాయకి విలేకులతో ముచ్చటించారు. ఆ వివరాలు చూద్దాం. ప్ర: బెలూన్ చిత్రం గురించి? జ: ఇది డిఫరెంట్ జానర్లో రూపొందిన హర్రర్‌తో కూడిన ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశాలు, థ్రిల్లింగ్ సన్నివేశాలు చాలా ఉంటాయి. నేను సుమారు ఐదేళ్ల తరువాత నటుడు జై తో కలిసి నటించిన చిత్రం ఇది. ప్ర: మీ పాత్ర గురించి? జ: ఇంతకు ముందు నటించిన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాల్లో పాత్రలకు పూర్తి భిన్నంగా బెలూన్ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. ఆ చిత్రం తెలుగులోనూ ఇదే పేరుతో అనువాదమై విడుదల కానుంది. ప్ర: ఎలాంటి కథా పాత్రలు పోషించాలనుకుంటున్నారు? జ: ఎలాంటి పాత్రలైనా చేయడానికి రెడీ .అయితే అవి కొత్తదనంతో కూడుకున్నవై ఉండాలని ఆశిస్తున్నారు. ప్ర: తెలుగులో గ్లామరస్ పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఆ తరహా పాత్రల్లో కనిపించడం లేదే? జ: నాకిక్కడ గ్లామర్‌తో కూడిన కథా చిత్రాల అవకాశాలు రావడం లేదు. అంతేగానీ గ్లామర్‌గా నటించనని నేను చెప్పడం లేదు. తెలుగులో మంచి వైవిధ్య కథా చిత్రాలు వస్తున్నా, అక్కడ కలర్‌ఫుల్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతాయి. ప్ర: మీరు బాగా నటించాననుకున్న చిత్రాలు. జ: అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రాలు నా నటనకు అద్దం పడితే, కట్రదు తమిళ్ నా కెరీర్లో స్పెషల్ చిత్రంగా నిలిచిపోతుంది. ప్ర: ఈ ఏడాది ఎలా గడిచింది? 2018లో సినీ జీవితం ఎలా సాగనుంది? జ: ఈ ఏడాది నటిగా మంచి చిత్రాలే చేశాను. అయితే 2018లో ఇంకా బాగుంటుంది. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలతో బిజీగా ఉండబోతున్నాను. ప్ర: నటుడు జై తో కలిపి మీపై వస్తున్న వదంతుల గురించి? జ: అవన్నీ వదంతులే. జై నాకున్న మంచి స్నేహితుల్లో ఒక్కరు అంతే. అంత కంటే మా మధ్య ఏమీ లేదు. ప్ర: పెళ్లెప్పుడు చేసుకుంటారు? మనసులో ఎవరైనా ఉన్నారా? జ: నిజం చెప్పాలంటే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. మరి కొన్నేళ్ల వరకూ పెళ్లి చేసుకోను. అదే విధంగా నా మనసుల్లో ఇప్పటికీ ఎవరూ లేరు. ఆ సమయం వచ్చినప్పుడు చెబుతాను. ప్ర: కాబోయే భర్త సినిమాకు చెందిన వాడై ఉంటారా? జ: ఆ విషయం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ ముందుగా మీకే చెబుతాను. -
సందడి సందడిగా
హైదరాబాద్‌లోని ఫైనల్ షెడ్యూల్‌తో సందడి కంప్లీట్ అయ్యింది. కానీ సినిమాలో యాక్టర్స్ చేసిన సందడి థియేటర్లో ప్రేక్షకులను ఏ లెవెల్లో నవ్విస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగక తప్పదు. జీవా, జై, శివ, నిక్కీ గల్రానీ, కేథరిన్ ముఖ్య తారలుగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలకలప్పు–2’. ఐదేళ్ల క్రితం సుందర్. సి దర్శకత్వంలోనే వచ్చిన ‘కలకలప్పు’ చిత్రానికి ఇది సీక్వెల్. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మొదట్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘కలకలప్పు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. థియేటర్లో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా సుందర్ తెరకెక్కించారు. లవ్లీ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు హీరో జీవా. ఇంతకీ కలకలప్పు అంటే ఏంటో తెలుసా? సందడి అని అర్థం. ఇక్కడున్న ఫొటోలో తారలు ఎలా సందడి చేశారో చూస్తున్నారుగా. షూటింగ్ చివరి రోజు స్టిల్ ఇది. సినిమాలో డబుల్ సందడి ఉంటుందట. -
బుసలు కొట్టబోతున్నది ఎవరు?
రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్షీ శరత్‌కుమార్... ఈ ముగ్గురి భామల్లో బుసలు కొట్టబోతున్నది ఎవరు? అప్సరసల్లా ఉండే వీళ్లు బుసలు కొట్టడమేంటి అనుకుంటున్నారా? దానికి కారణం లేకపోలేదు. ఈ ముగ్గురూ కలసి ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు. ఇదొక లవ్ థ్రిలర్. ఈ కథలో పాములకు ప్రాధాన్యం ఉంది. మరి.. ఈ ముగ్గురిలో ఎవరు నాగినిగా నటిస్తారు? అనేది మాత్రం చిత్రబృందం బయటపెట్టలేదు. ఆ చాన్స్ ఉందని చెన్నై టాక్. ‘జర్నీ’, ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జై ఇందులో హీరో. ఐటీ ఉద్యోగిగా కనిపించబోతున్నారాయన. జైని ముగ్గురు కథానాయికలూ ప్రేమిస్తారట. ఒకరు మాత్రం పగ తీర్చుకోవడానికి ప్రేమ నటిస్తారని సమాచారం. ‘ఏతన్’ మూవీ ఫేమ్ సురేష్ ఈ చిత్రానికి దర్శకుడు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. చెన్నై, మధురై, కేరళలో చిత్రీకరించనున్నారు. ‘‘షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ లవ్ థ్రిల్లర్ షూటింగ్ అంతా సరదాగా జరగాలని ఆశిస్తున్నా’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. ఇంత చెప్పారు కదా? స్నేక్ ఎవరూ అంటే.. ‘అది మాత్రం సస్పెన్స్’ అంటున్నారు. -
మనసును గాయపరుస్తున్నారు : నటి
మనసును గాయపరుస్తున్నారు అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తోంది నటి స్వాతి. ఈ తెలుగమ్మాయి కోలీవుడ్‌లోనూ సుబ్రమణిపురం, వడకర్రి వంటి సక్సెస్‌పుల్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక మాతృభాషలోనూ మొదట కలర్స్స్వాతిగా పేరు తెచ్చుకుని ఆ తరువాత కథానాయకిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్న స్వాతికి నటిగా తగినంత స్టార్డమ్ రాలేదు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న స్వాతి ఆ చట్రం బయట పడదామా? లేక అదే ముద్రతో ముందుకు సాగుదామా? అన్న ఆలోచనలతో సతమతం అవుతున్న తరుణంలో వదంతులు మరో పక్క వేదనకు గురిచేస్తున్నాయని కంటతడిపెడుతోంది. తనపై వస్తున్న రూమర్లపై స్పందించిన స్వాతి.. తమిళ నటులు జై, కృష్ణ వంటి యువ హీరోలతో సంబంధాలు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారనే బాధను వ్యక్తం చేసింది. టాలీవుడ్ లో కూడా ఇలాంటి వదంతులకు కొదవ లేదని చెప్పింది. హీరోయిన్లు మనలాంటి మనుషులేననీ, వారికి మనసు ఉంటుందనీ, అది అవాస్తవ ప్రచారాలతో గాయపడుతుందని ప్రజలు గుర్తించాలని అంది. సినీరంగంలో ఇలాంటి వదంతులు సాధారణం అని తాను సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, కుటుంబ సభ్యులు, మిత్రులు ఆవేదన చెందుతున్నారని స్వాతి పేర్కొంది. దయ చేసి ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేయరాదని కోరింది. -
'జరుగండి' అంటున్న జై
సాక్షి, తమిళ సినిమా: యువ నటుడు జై హీరోగా నటించడానికి రెడీ అవుతున్న తాజా చిత్రం జరుగండి. మరో నటుడు నితిన్‌సత్య స్వేద్ చిత్ర నిర్మాణ సంస్థ, బద్రి కస్తూరి శ్రద్ధ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా పిచ్చుమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జై సరసన నటి వెబాజాన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇందులో రోబోశంకర్, డేనీ, చిరుతై అమిత్, ఇళవరసు, మమ్గోపీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. బోబోశశి సంగీతాన్ని, ఆర్వీ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన నితిన్‌సత్య మాట్లాడుతూ.. దర్శకుడు పిచ్చుమణి కథను రెడీ చేసిన తరువాత దీనికి నప్పే టైటిల్ మాత్రమే కాకుండా మనసుకు హత్తుకునే విధంగా ఉండాలని ఆలోచించి 'జరుగండి' టైటిల్‌ను నిర్ణయించామని చెప్పారు. ఇది వేరే భాషా టైటిల్ మాదిరిగా ఉన్నా తమిళంలోనూ ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారని అన్నారు. కథల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వైవిధ్యకథా చిత్రాలను చేసుకుంటూపోతున్న నటుడు జైకి ఈ చిత్రం తన కేరీర్లో ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు పిచ్చుమణి అంత జనరంజకమైన కథ, కథనాలను తయారు చేశారని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని నితిన్‌సత్య తెలిపారు. -
సంఘమిత్రకు ముందు సందడి
కలకలప్పు... అంటే సందడి అని అర్థం. ఇప్పుడు డైరెక్టర్ సుందర్ .సి అండ్ టీమ్ సందడి సందడి చేస్తున్నారు. ఇంతకీ సుందర్ ఎవరో కాదు. రజనీకాంత్ హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘అరుణాచలం’కి దర్శకుడు. ఆ తర్వాత ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మణై–2’ తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 250కోట్ల బడ్జెట్‌తో దిశా పాట్నీ, జయం రవి, ఆర్య లీడ్ రోల్స్‌లో తేనాండాళ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ‘సంఘమిత్ర’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు సుందర్. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ సినిమా వచ్చే లోపు సుందర్ .సి నుంచి ‘కలకలప్పు 2’ వస్తుంది. 2012లో ఆయన తెరకెక్కించిన హిట్ మూవీ ‘కలకలప్పు’కు సీక్వెల్ ఇది. జీవ, జై, శివ, క్యాథరిన్, నిక్కీ గల్రానీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ వారణాసిలో జరుగుతోంది. ‘సంఘమిత్ర’ షూట్‌ను డిసెంబర్లో ప్రారంభించాలనుకుంటున్నారట. ఆ లోపు ‘కలకలప్పు 2’ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. -
ఆడి కొడుకొచ్చాడు!!
జై.. సింగిల్ మదర్ కిడ్. అమ్మే ప్రపంచం అతడికి. అమ్మ లత, ఉద్యోగం, తన సరదాలు.. ఇంతే.. జై లైఫ్ ఇంతకుమించి ఏమీ లేదు. నాన్న ఇలా ఉంటాడని అమ్మెప్పుడూ చెప్పలేదు. నాన్నెలా ఉంటాడని జై కూడా ఎప్పుడూ అడగలేదు. అన్నీ బాగున్నాయి. ఏదో విషయం గురించి బాధపడే అవసరం జైకి రాదు.కానీ ఒక రోజొచ్చింది. అమ్మ ఏదో బాధలో ఉంది. ఒక దగ్గర కూర్చుండిపోయి ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది. జై తన పని పక్కనబెట్టి అమ్మకు దగ్గరగా వెళ్లి.. ‘‘మామ్! ఆర్ యూ ఓకే!?’’ అనడిగాడు.‘‘తప్పు చేశాన్రా! ఇన్నేళ్లూ నీకొక నాన్న ఉన్నారని, మనకు దగ్గర్లోనే ఉన్నారని, చెప్పకుండా తప్పు చేశాను.’’ అమ్మ మొదటిసారి నాన్న గురించి చెబుతూ ఉంటే జై అలాగే ఆమెను చూస్తూండిపోయాడు.జైకి ఐదేళ్లు కూడా లేవప్పుడు. నాన్న దేవాతో గొడవపడింది అమ్మ. కొడుకు భవిష్యత్ గురించి భయం వేసిందామెకు. ‘‘నేను వెళ్లిపోతాను’’ అనేసింది. దేవా కాదనలేదు. ఇది జరిగిన ఇరవై ఏళ్లకు ఈ విషయం కొడుక్కి చెప్పింది అమ్మ.నాన్న గురించి మొత్తం విన్న జై, అమ్మతో ఓ మాటన్నాడు.‘‘నేనొకసారి ఆయన్ను చూడాలి!’’ దేవా ఇల్లు. ఎప్పుడూ మనుషులతో కళకళలాడుతుంది ఆ ఇల్లు. జై ఆ ఇంట్లోకి మొదటిసారి అడుగుపెడుతున్నాడు.కారు దిగగానే, జైకి ఎదురుపడిన దేవా తమ్ముడు.. ‘‘ఎవరు బాబూ మీరూ?’’ అనడిగాడు.‘‘దేవా గారి అబ్బాయిని!’’దేవా తమ్ముడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. జైని అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఇన్నేళ్ల తర్వాత అన్న కొడుకును చూసిన ఆనందం. భుజంపై చెయ్యేసి జైని ఇంట్లోకి తీసుకెళ్లాడు.‘‘అన్నయ్యా!’’ అంటూ అప్పుడే మెట్లు దిగుతూ వస్తోన్న దేవాను చూస్తూ, ప్రేమగా జైని చూపించాడు దేవా తమ్ముడు.‘‘ఎవరూ?’’ అనడిగాడు దేవా.‘‘నాన్నరా?’’ జైకి దేవాను పరిచయం చేశాడు దేవా తమ్ముడు.దేవా, జై ఇద్దరూ ఏం మాట్లాడుకోవట్లేదు. మౌనం. ఇరవై ఏళ్ల మౌనం అది.దేవా ఉద్వేగంతో జై ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ ఇంటికి కొత్త వెలుగొచ్చింది. జై తో పాటొచ్చిన వెలుగది. కొద్దిసేపట్లో వారిద్దరి చుట్టూ ఇంట్లో వాళ్లంతా చేరిపోయారు.‘‘అక్కా! మన జై!’’ జై ని ఇంట్లో వాళ్లకు పరిచయం చేశాడు దేవా తమ్ముడు. ‘‘ఏరా! ఇప్పటికి గుర్తొచ్చామా? అమ్మ రాలేదా?’’ ప్రశ్నలు కురిపిస్తూ పోయింది జై అత్తయ్య.‘‘ఏదో పనుండీ.. కుదర్లేదు.’’ జై నవ్వుతూ సమాధానమిచ్చాడు.ఆ రోజంతా జై గురించిన మాటలే ఇల్లంతా.రాత్రయింది. జై తన గదిలో ఏవో పెయింటింగ్స్ చూస్తూ ఉండటం గమనించిన దేవా, వస్తూనే..‘‘జై! ఇంకా పడుకోలేదా?’’ అనడిగాడు. ‘‘నిద్ర పట్టలేదు.’’ సమాధానమిచ్చాడు జై.నవ్వి, కాసేపాగి, ‘‘అమ్మెలా ఉంది?’’ అనడిగాడు దేవా.‘‘షీ ఈజ్ ఫైన్.’’నవ్వాడు దేవా. పక్కన్నే ఉన్న బాటిల్లోని కొంత వైన్‌ను గ్లాసులోకి తీసుకొని, ‘‘ఓ! డైలీ వన్ పెగ్. ఇరవై ఏళ్ల నుంచి ఇదే నా కంపెనీ రా!’’ అన్నాడు జై నిచూస్తూ. ‘నువ్వూ తీసుకుంటావా?’ అని ఆఫర్ చేశాడు.‘‘నో నో! ఐ యామ్ ఫైన్’’‘‘సో! ఏం చేస్తున్నావ్?’’‘‘ఐ యామ్ ఆన్ ఆర్కిటెక్ట్’’దేవా, జై మాటలకు అడ్డుకట్ట వేసే పరిస్థితేదీ కనిపించలేదు అక్కడ. ఒక్క రాత్రయిపోవడం అన్నది తప్ప. ఇరవై ఏళ్ల మౌనం ఆ రాత్రంతా మాటలుగా పరచుకుంది. జై రాకతో ఊరంతా సంబరాలు చేసుకుంది. ఊళ్లో గొడవలు, ఊళ్ల మధ్య పగలు కొంచెం కొంచెం తగ్గుతున్నాయి. ఒక భూమి విషయంలో పక్క ఊరి పెద్ద మనిషి అనుచరుడొకడు దేవాకు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు.‘‘ఎవరు పంపించారో తెల్సా! ఉమన్న..’’ దేవాకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి గట్టిగా అరుస్తున్నట్టు చెప్పాడు.దేవా కుటుంబమంతా కోపంతో రగిలిపోతోంది.‘‘చెప్పింది చేస్తే.. మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది.’’ వచ్చిన మనిషి మాట్లాడుతూనే ఉన్నాడు.‘‘పగలు ఆగుతాయంటే సంతోషమే! కానీ పేదోడి జీవితాన్ని పణంగా పెట్టి కాదు.’’‘‘ఇన్నేళ్లూ అన్నీ మూసుకొని కుక్కిన పేనుల్లా బతికారుగా! ఇప్పుడు కొత్తగా ఈ రోషమెందుకు? నువ్వు కాదన్న కబురుతో మేం ఈ ఊరు దాటితే, ఊరోళ్లంతా మీ ఇంటిల్లిపాదికీ తద్దినం పెట్టాల్సి వస్తుంది’’ వార్నింగ్ ఇచ్చాడు ఆ మనిషి. దేవా తమ్ముళ్లు కోపంతో పైకి లేచారు.‘‘చెప్పాల్సింది చెప్పారుగా! ఇక మీరు బయల్దేరండి’’ అంటూ దేవా సున్నితంగా చెప్పాడు. వచ్చిన వాళ్లు వచ్చిన దార్లో జీపులో ఊరు దాటుతున్నారు. జై ఇదంతా వింటూనే ఉన్నాడు.ఆ జీపు ఊరు దాటకముందే వాళ్ల మీద పడిపోయాడు. గొడవకొచ్చిన అందరికీ తానేంటో చూపించాడు. దేవాకి వార్నింగ్ ఇచ్చిన మనిషి జై చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.అతడికి దగ్గరగా వెళ్లి, కోపంగా, వార్నింగ్ ఇస్తూ, జై ఈ మాటన్నాడు.‘‘ఇరవై ఏళ్ల నుంచి ఓ లెక్క. ఇప్పట్నుంచో లెక్క. ఆడి కొడుకొచ్చాడు. ఆడి కొడుకొచ్చాడని చెప్పు..’’జై ఆ మాటంటూ, ఊరి పొలిమేరలో ఉన్న కిలో మీటరు రాయిని బలంగా తన్నాడు. -
హీరో అరెస్టుకు ఆదేశాలు
తమిళసినిమా(చెన్నై): ప్రముఖ తమిళ సినీనటుడు జైను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని చెన్నై సైదాపేట కోర్టు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. జై గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొన్నారు. దీనిపై ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో జై ఈనెల 3న కోర్టుకు హాజరై చార్జిషీట్ ప్రతిని అందుకున్నారు. ఈ కేసు గురువారం మేజిస్ట్రేట్ అబ్రహంలింకన్ సమక్షంలో విచారణకు రాగా జై కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కూడా జై కోర్టుకు హాజరు కాలేదు. జై అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. దీంతో జైని రెండు రోజుల్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టాల్సిందిగా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. జర్నీ, రాజారాణీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా జై సుపరిచితుడు. -
ఇద్దరు భామల కనువిందు
తమిళసినిమా: ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో నటిస్తే, అదీ తమ అందాలతో కుర్రకారును కనువిందు చేయడానికి ఎంతదాక అయినా వెళ్లడానికి రెడీ అనే బ్యూటీస్ అయితే ఆ చిత్రం కచ్చితంగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక సుందర్.సీ వంటి వినోదాన్ని పండించే దర్శకుడు ఆ చిత్రాన్ని మలిస్తే ఇక ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టెయిన్మెంట్కు కొదవే ఉండదు. కరెక్ట్‌గా అలాంటి చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు సుందర్.సీ దర్శకత్వం వహించిన కలగలప్పు చిత్రం కోలీవుడ్ తెరపై మంచి సందడి చేసింది. అంతే కాదు అంతకు ముందు మార్కెట్ డల్ అయిన నటులు విమల్, శివ, నటీమణులు అంజలి, ఓవియలకు విజయోత్సాహాన్నిచ్చిన చిత్రం అది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు సుందర్.సీ సిద్ధం అయ్యారు. అయితే ఈ సారి మరింత పెద్ద కాస్టింగ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. విమల్, శివలకు బదులు ఇందులో జీవా, జైలను హీరోలుగా ఎంచుకున్నారు. ఇక ఓవియ, అంజలి స్థానంలో అందాల భామలు నిక్కీగల్రాణి, క్యాథరిన్ ట్రెసాలను ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ కలగప్పు–2 చిత్రాన్ని సుందర్.సీ అక్టోబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు
సాక్షి, చెన్నై: యువ హీరో జై, ప్రేమ్‌జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జై, ప్రేమ్‌జీలకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం మందవల్లి నుంచి ప్రయాణిస్తున్న కారు అడయార్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. అయితే కారు డ్రైవ్ చేస్తున్న జై అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. అంతేకాక ఆయనకు రూ.500/- జరిమానా విధించినట్లు సమాచారం. కాగా వీరిద్దరూ దర్శకుడు వెంకట్ ప్రభు తాజా చిత్రం పార్టీలో ఆయన నటిస్తున్నారు. -
నచ్చినోడు కంట పడలేదు!
తమిళసినిమా: నచ్చినోడు నాకు ఇంకా కంటపడలేదు అంటూ నటి అంజలి షాక్ ఇచ్చింది. ఇది ఎవరికి షాక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు చాలా మందికి తెలుసు. అంజలి నట కెరీర్‌ను ప్రారంభించి చాలా ఏళ్లే అయ్యింది. అదే విధంగా చాలా చిత్రాలు చేసింది. మంచి పేరును సంపాదించుకుంది. అయితే తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణలాంటి ప్రముఖ హీరోలతో జత కట్టినా అక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ను తెచ్చుకోలేదు. ఇక కోలీవుడ్‌లో అది కూడా లేదు. ఇప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పొందలేక పోయింది. అయితే అవకాశాలను మాత్రం ఈ రెండు భాషల్లోనూ వరుసగా అందుకుంటూనే ఉంది. ఇప్పుడు అదనంగా మలయాళంలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నంలో ఉంది. నటిగా ఇలా ఉంటే అంజిలి చాలాసార్లు వదంతుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా నటుడు జైతో ప్రేమ, షికార్లు అంటూ ప్రచారం జోరుగానే జరుగుతోంది. ఆ మధ్య జై తన స్వహస్తాలతో దోసెలు వేసిపెడితే లొట్టలేసుకుని తిని ఆయనలో మంచి నలభీముడున్నాడంటూ కితాబిచ్చేసింది కూడా. అంతే కాదు జై పుట్టిన వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని సందడి చేసింది. దీంతో ఈ జంట గురించి చాలా గాసిప్స్ హల్చల్ చేశాయి. ఇక నటుడు జై కూడా తాను నటి అంజలిని పెళ్లి చేసుకోవచ్చునని అన్నట్లు ప్రచారం జరిగింది. ఇంత జరుగుతున్నా తాజాగా నటి అంజలి తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఒక భేటీలో నటి అంజలి మాట్లాడూతూ తన సినీపయనం హ్యాపీగా సాగుతోందని పేర్కొంది. కాబట్టి ప్రేమ,పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించే తీరిక తనకు లేదని అంది. అయినా తన మనసుకు నచ్చినోడు ఇంకా తారస పడలేదని అంది. పోతే తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు జై అన్నట్లు తనకు తెలియదని చెప్పింది.ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుందనే వేదాంతాన్ని వల్లించింది. కాగా తాను రాజకీయరంగప్రవేశం చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాను ఢిల్లీలో పార్లమెంట్‌ను తిలకించిన విషయం నిజమేనని, దీంతో రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం చేసేశారని, నిజానికి అలాంటి ఆలోచన లేదని అంజలి పేర్కొంది. అంజలికి, నటుడు జై కీ మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అందుకర్థాయనకి షాక్ ఇవ్వడానికి తనకు నచ్చినోడు తారస పడలేదని పేర్కొందా? అన్న విషయాలు నటుడు జై నోరు విప్పితే గానీ తెలియదు. అంజలి, జై కలిసి నటించిన బెలూన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
అంజలి ఏంటి.. అలా అనేశారు!
చెన్నై: ‘నాకు నచ్చినోడు ఇంకా కంటపడలేదు’ అంటూ నటి అంజలి షాక్ ఇచ్చారు. ఇది ఎవరికి షాకవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంజలి సినీ కేరీర్‌ను ప్రారంభించి చాలా ఏళ్లే అయింది. తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణలాంటి ప్రముఖ హీరోలతో జత కట్టినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను తెచ్చుకోలేదు. ఇక కోలీవుడ్‌లో అది కూడా లేదు. ఇప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు లేవు. ఇప్పుడు మలయాళంలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. నటిగా ఇలా ఉంటే అంజలి చాలాసార్లు వదంతుల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా నటుడు జైతో ప్రేమ, షికార్లు అంటూ ప్రచారం జోరుగానే జరిగింది. ఆ మధ్య జై తన స్వహస్తాలతో దోసెలు వేసిపెడితే లొట్టలేసుకుంటూ తిని ఆయనలో మంచి నలభీముడున్నాడంటూ కితాబిచ్చేశారు. అంతేకాదు జై పుట్టినరోజు వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని సందడి చేశారు. ఇక నటుడు జై, అంజలి పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. తాజాగా నటి అంజలి తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదనీ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అంజలి మాట్లాడూతూ.. తన సినీ పయనం హ్యాపీగా సాగుతోందని.. కాబట్టి ప్రేమ, పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు. మనసుకు నచ్చినోడు ఇంకా తారస పడలేదని, అలాంటోడు ఎదురైతే ఆ విషయాన్ని వెంటనే చెప్పేస్తా అన్నారు. తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు జై అన్నట్లు తనకు తెలియదన్నారు. ఇక తమ ఇద్దరిని కలుపుతూ చాలానే ప్రచారం జరిగిందనీ, భవిష్యత్‌లో ఎం జరుగుతుందన్నది ఊహించలేమనీ పేర్కొంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుందనే వేదాంతాన్ని వల్లించింది. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ను చూసినంత మాత్రానా వెంటనే అంజలి రాజకీయల్లోకి రానున్నట్లు ప్రచారం చేశారని, నిజానికి అలాంటి ఆలోచన తనకు లేదనీ అంజలి పేర్కొన్నారు. అంజలి, జై కలిసి నటించిన మూవీ 'బెలూన్' త్వరలో విడుదల కానుంది. (చదవండి: నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో) -
మూండ్రాంపిరైలో శ్రీదేవిలా నటించా!
తమిళసినిమా: మూండ్రాం పిరై చిత్రంలో శ్రీదేవిలా నటించానని యువ నటి జననీఅయ్యర్ పేర్కొంది. జై, అంజలి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బెలూన్. ఇందులో మరో కథానాయకిగా జననీఅయ్యర్ నటిస్తోంది. 70ఎంఎం పతాకంపై సినీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు కథానాయికల్లో ఒకరుగా నటించిన నటి జననీఅయ్యర్ తన పాత్ర గురించి తెలుపుతూ 1980లో వచ్చిన మూండ్రాంపిరై చిత్రాన్ని, అందులో నటి శ్రీదేవి గతాన్ని మరచిపోయి అమాయకపు అమ్మాయిగా నటించిన పాత్రను ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అయితే శ్రీదేవిలా నటించడం ఎవరికీ సాధ్యం కాదని, బెలూన్ చిత్రంలో తన పాత్ర ఆ తరహాలో ఉంటుందని చెప్పింది. శ్రీదేవి సాటిగా నటించడం సాధ్యం కాదని చిత్ర దర్శకుడు తాను, ఇతర చిత్ర యూనిట్ భావించామని, అయితే ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు శిరిష్ తనను నటింపజేశారని చెప్పింది. ఇందులో తన నటన తనకే ఆశ్చర్యం కలిగించిందని అంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని అంజలి వ్యక్తం చేసింది. తాను ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో ఈ తరహా పాత్రను చేయలేదని, తనకు బెలూన్ చిత్రం ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ఈ చిత్ర విడుదల హక్కుల్ని ఆరా సినిమా సంస్థ కొనుకోలు చేయడం విశేషం. -
ఎగరడానికి బెలూన్ రెడీ
తమిళసినిమా: బెలూన్ చిత్రం థియేటర్లలో ఎగరడానికి రెడీ అంటోంది. కోలీవుడ్‌లో చాలా కాలంగా వార్తల్లో ఉన్న ప్రేమ జంటల్లో నటుడు జై, నటి అంజలి ఒకరు. ఈ జంట చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారని, ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారని, ఇలా వీరి గురించి బోలెడు కాలక్షేప వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి జంట కలిసి నటిస్తున్న చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా చాలానే ఉంటుందని వేరే చెప్పాలా? అలాంటి చిత్రమే బెలూన్. 70 ఎంఎం, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సినీష్ దర్శకుడు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న బెలూన్ చిత్ర విడుదల హక్కులను ఆరా సంస్థ పొందింది. ఆ సంస్థ అధినేత మహేశ్ గోవిందన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ బెలూన్ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల నుంచి మంచి క్రేజ్‌ను సంపాందించుకుందన్నారు. చిత్ర టీజర్‌కు వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బెలూన్ చిత్రం విజయం సాధించడం తథ్యమనే నమ్మకం తమకు ఉందన్నారు. ఈ చిత్రం చూసే ప్రేక్షకులకు మంచి జాయ్‌తో కూడిన ఎంటర్టెయిన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నారు. తమ ఆరా సంస్థలో బెలూన్ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందని మహేశ్ గోవిందన్ పేర్కొన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 27న పండగ రోజుల్లో విడుదల చేయనున్నామని ఆయన వెల్లడించారు. -
హర్రర్, థ్రిల్లర్‌గా బెలూన్
తమిళసినిమా: లవ్, హర్రర్ థ్రిల్లర్‌గా తెరపైకి రావడానికి బెలూన్ చిత్రం ముస్తాబవుతోంది. యువ నటుడు జై తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం బెలూన్. ఆయనకు జంటగా అంజలి, జననీఅయ్యర్ నటిస్తున్న ఇందులో యోగిబాబు, నాగినీడు, నందకుమార్, జాయ్ మ్యాథ్యు, రామచంద్రన్, కార్తీక్యోగి, మోనిక, రిషి ముఖ్య పాత్రలు పోషించారు. 70 ఎంఎం.ఎంటర్టెయిన్మెంట్, ఫార్మర్స్ మాస్టర్ ప్రొడక్షన్స్ సంస్థల అధినేతలు దిలీప్‌సుబ్బరాయన్, అరుణ్‌బాలాజీ, నందకుమార్ నిర్మిస్తున్న చిత్రం బెలూన్. నవ దర్శకుడు శ్రీనిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీనిష్ మాట్లాడుతూ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలకు ప్రత్యేక ఆదరణ లభిస్తోందన్నారు. ఆ తరహాలో తెరకెక్కించిన విభిన్న థ్రిల్లర్‌తో కూడిన లవ్, కామెడీ కథా చిత్రం బెలూన్ అని తెలిపారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న జై తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని అన్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ప్రేమికులుగా ముద్ర పడ్డ జై, అంజలి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో బెలూన్‌పై ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు.. -
నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో
ప్రేమతో... జై లేఖ!! ప్రేమ పెదవులు దాటి పెన్ను పట్టుకునేలా చేసింది. పెన్నుతో రాసింది అక్షరాలే కావొచ్చు. కానీ, వాటిలో తనకు అంజలి అంటే ఎంత ప్రేమో చెప్పే ప్రయత్నం చేశారు జై. తమిళ హీరో జై, తెలుగమ్మాయి అంజలి ప్రేమలో ఉన్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు ఎప్పట్నుంచో కోడై కూస్తున్నాయి. వీళ్లిద్దరూ సదరు వార్తలను కన్ఫర్మ్ చేయలేదు. కానీ, వీలైన ప్రతిసారీ పుకార్లకు ఫుడ్డు పెట్టేలా ఏదొకటి చేస్తుంటారు. అంజలికి పుట్టినరోజు (శుక్రవారం) శుభాకాంక్షలు చెబుతూ... జై రాసిన లేఖ పుకార్లకు ఫుల్ మీల్స్ పెట్టింది. ‘‘నువ్వంటే నాకు ఎంత ప్రత్యేకమో... నీ పుట్టిన రోజన్నా అంతే ప్రత్యేకం! నీకెంతో ప్రత్యేకమైన ఈ రోజున నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు నీలానే ఉంటూ నా లైఫ్‌లో ప్రతి రోజును ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దావ్. దేవుడు, నేనూ ఎప్పుడూ నీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్‌డే అంజూ. ప్రేమతో... జై!’’ – జై స్వయంగా రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖ సారాంశమిది. బదులుగా అంజలి ‘‘నాతో ఉన్నందుకు థ్యాంక్స్ జై. నువ్వెప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ సంభాషణ అంతా సోషల్ మీడియాలోనే జరిగింది. అంజలికి, జైకు మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య తన ప్రేయసికి దోసెలు వేసి తినిపించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ ప్రేమజంట పెళ్లికి ముందే సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం హల్చల్ చేసింది. ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారిందని, అప్పటి నుంచి ఆ ప్రేమ బలపడుతూ వస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇక ఇటీవల బెలూన్ చిత్ర షూటింగ్ స్పాట్లో నటుడు జయ్ పుట్టిన రోజు వేడుకను జరుపుకోగా అంజలి ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపరచింది. శుక్రవారం నటి అంజలి పుట్టినరోజు. ఈ సందర్భంగా జయ్ నువ్వు నాకు ఎలా స్పెషలో అదే విధంగా నీకు అన్నిరోజులూ స్పెషల్‌గా అమరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందుకు బదులుగా అంజలి కూడా నీవు నాతో ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ ప్రత్యేక రోజున నాకు ఈ స్పెషల్ లేఖ రాసినందుకు మరో థ్యాంక్స్ అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది. మొత్తం మీద వీరి స్పెషల్ లేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఇకపై వీళ్లిద్దరూ ఎప్పుడైనా పబ్లిగ్గా లవ్వు, గివ్వు లేదని చెప్పినా జనాలు నమ్మరేమో!! Happy Birthday Anju!!! @yoursanjali pic.twitter.com/twfRn4LGcr — Jai (@Actor_Jai) 15 June 2017 -
జైకి అంజలి షాక్
సంచలన నటి అంజలి నటుడు జైకి షాక్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న ప్రచారం ఇంకాస్త ముందుకెళ్లి సహజీవనం చేస్తున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య జై తన ప్రియురాలికి స్వయంగా కమ్మని దోసెలను వేసి పెట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి ఘాటు ప్రేమను ప్రపంచానికి తెలిపారు. చాలా కాలం తరువాత ఈ జంట బెలూన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన సన్నివేశాలను పూర్తి చేసుకుని వేరే తెలుగు చిత్రానికి నటి అంజిలి వెళ్లిపోయారు. ఇటీవల బెలూన్ చిత్ర షూటింగ్ స్పాట్లో నటుడు జై తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. చిత్ర యూనిట్ జై కోసం కేక్‌ను హెలీకామ్ క్రేన్‌లో తీసుకొచ్చి షాక్ ఇవ్వగా ఆ వేడుకకు అనూహ్యంగా వచ్చి ఆయనకు తీయని షాక్ ఇచ్చారు నటి అంజలి. అంతటితో ఆగలేదు. తను జైతో సన్నిహితంగా ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి మైడియర్ జై మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ మనోభావాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. ఎప్పటిలానే ప్రేమ కలిగిన వారిగానే ఉండండి అని పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది డుండుండు..పీపీపీనే
సినీ జంటలు ప్రేమించు కోవడం, ఆ విషయం మీడియాలో వెలుగు చూడడంతో అబ్బే అలాంటిదేమీలేదు. తాము మంచి ఫ్రెండ్స్ అంతే అంటూ బుకాయించడం మామూలే. అలాంటి వారే ఆ తరువాత పెళ్లి చేసుకుని కాపురాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అలాంటి ప్రచారానికి కేంద్రబిందువుగా మారిన వారిలో నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌శివల జంట ఒకటి. వీరిద్దరి గురించి చాలా కాలంగా చాలా ప్రచారమే జరుగుతోంది. కలిసి సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.సరిగ్గా ఇలాంటి మరో జంటే నటుడు జయ్, అంజలి.వీరిద్దరూ కలిసి ఎంగేయుం ఎప్పోదుం చిత్రంలో నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందని కోలీవుడ్ చెవులు కొరిక్కుంది.అయితే షరా మామూలుగానే నటి అంజలి, నటుడు జయ్ ఇద్దరూ మత మధ్య అలాంటిదేమీలేదని ఖండించారు. అలాంటిది ఇటీవల జయ్ అంజలికి స్వయంగా దోసెలు వేసి తినిపించిన ఫొటోలు వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ప్రేమ బంధాన్ని చాటుకున్నారు. ఈ జంట ఇప్పటికే సహజీవనం చేస్తున్నారనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది.అంతే కాదు పెళ్లికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త.నటి అంజలి జయ్‌తో ప్రేమ వ్యవహారాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లికి ఒప్పించినట్లూ, జయ్ కూడా వెంటనే పెళ్లికి రెడీ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అంజిలి మాత్రం పెళ్లికు ఇప్పుడే తొందర పడవద్దని ఆయనతో చెప్పినట్లు టాక్. ప్రస్తుతం అంజలి తరమణి, కాన్బదు పొయ్, పేరంబు, బెలూన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.వీటిలో బెలూన్ చిత్రంలో జయ్‌తో కలిసి నటిస్తున్నారు.ఈ చిత్రాలను పూర్తి చేసి వచ్చే ఏడాది జయ్‌తో ఏడడుగులు వేయడానికి అంజలి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. -
వాంగో రాజ్‌తరుణ్ వాంగో !
రావోయి అతిథి అని పిలవడమే ఆలస్యం రాజ్‌తరుణ్ అభయ హస్తం ఇచ్చేస్తున్నారు. తెలుగులో ‘మజ్ను’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ సినిమాల్లో అతిథిగా కనిపించారీ యువ హీరో. ఇప్పుడు తమిళ దర్శకులు వాంగో రాజ్‌తరుణ్ వాంగో అని పిలవగానే వెళ్లారు. వాంగో అంటే రండి అని అర్థం. జై, అంజలి జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘బెలూన్’లో రాజ్‌తరుణ్ కీలక పాత్ర చేస్తున్నారు. శినిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ గోవిందరాజ్ సమర్పణలో పుష్యమి ఫిలిం మేకర్స్‌పై బెల్లం రామకృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ‘జర్నీ’ తర్వాత జై, అంజలి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. రాజ్‌తరుణ్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు!
చిన్న గ్యాప్ తరువాత నటి అంజలి మరోసారి వార్తల్లోకెక్కారు. తమిళం, తెలుగు భాషల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటి ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఆ మధ్య పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళంజంతో వివాదాలు అంటూ కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన అంజలి కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అలాంటిది తాజాగా ఈ అమ్మడి పేరు మీడియాలో చర్చనీయంశంగా మారింది. నటుడు జయ్‌తో ప్రేమ కలాపాలు అంటూ చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జయ్ స్వయంగా దోసెలు వేసి అంజలికి పెట్టడం, వాటిని ఆమె కమ్మగా ఆరగించడం వం టి దృశ్యాలు మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో మరోసారి ఈ సినీ జంట ప్రేమ వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. చిన్న గ్యాప్ తరువాత అంజిలి తమిళంలో నటిస్తున్న చిత్రం బెలూన్. ఇందులో జయ్ కథా నాయకుడు. ఈ చిత్రంలో నటి అంజలికి సంబందించిన సన్నివేశాలు పూర్తి కావడంతో తను చిత్ర యూనిట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఐ లవ్ యూ అంజలి అంటూ జయ్, సంతోషకరమైన సమయం మళ్లీ వస్తుంది అని అంజలి ఒకరికొకరు ట్వీట్ చేసుకోవడం వారి మధ్య ప్రేమకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నటి అం జలికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించా రు. తనకిప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇం కా తను చెబుతూ ఒకే సారి పలు చిత్రాల్లో నటిం చాలనే ఆశ తనకు లేదని, నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్రంలో తన పాత్ర గురించి అందరూ చెప్పుకోవా లన్నారు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయని, అందువల్ల తన దృష్టి అంతా నటనపైనే సారిస్తున్నట్లు తెలిపారు.పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని, అలాంటిదేదైనా ఉంటే కచ్చితంగా అందరికీ చెబుతా నని అన్నారు. ప్రస్తుతం తన సోదరుడికి వధువును వెతికే పనిలో ఉన్నట్లు అంజలి చెప్పారు . -
అవును... అది నిజమే!
‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’... ఎక్కడికైనా ఎప్పుడైనా అని దీనర్థం. ‘నీతో పాటు ఎక్కడికైనా వస్తా.. ఎప్పుడైనా వస్తా.. ప్రామిస్’ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు హీరో జై, హీరోయిన్ అంజలి అనుకున్నారేమో. నిజంగానే ఒకరి కోసం ఒకరు ఎంతదాకా అయినా వెళ్లేంత బలమైన బంధంలో ఉన్నారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ లవ్‌లో పడ్డారనే వార్త వచ్చింది. ‘అదేం లేదు’ అని అడిగినవాళ్లకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘అవును’ అని జై చెప్పేశాడు. జై, అంజలి జంటగా నటించిన తాజా తమిళ చిత్రం ‘బెలూన్’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో చెన్నై మీడియా అంజలి గురించి ప్రస్తావించగా.. ‘‘నేనూ, అంజలి సన్నిహితంగా ఉంటున్న విషయం నిజమే. మా మధ్య మంచి స్నేహం, అవగాహన ఉన్నాయి. నాకు అంజలి అంటే ఇష్టం. తనకు నేనంటే ఇష్టం. ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ సినిమాలో అంజలి నన్ను ఎప్పుడూ కొడుతుంటుంది. రఫ్ గాళ్లా కనిపిస్తుంది. కానీ, రియల్ లైఫ్‌లో తను అలా కాదు. చాలా సాఫ్ట్. ఆ స్వభావం నాకిష్టం. అంజలి ఎప్పుడైనా కోపంగా ఉన్నా, బాధలో ఉన్నా నేను కామెడీ చేసి, నవ్వించేస్తాను. అది తనకిష్టం’’ అన్నారు. ఈ మధ్య జై తన ఇంట్లో దోసెలు వేయడం, అంజలి కూడా అతని పక్కన ఉండటం, ఆ సమయంలో దిగిన ఫొటోలు ఇద్దరూ సోషల్ మీడియాలో పెట్టడం తెలిసిందే. ‘‘అంజలి మా ఇంటికి అప్పుడప్పుడూ వస్తుంటుంది. తనకు వంట బాగా వచ్చు. అంజలి వంట, ఆమె గుణం మా నాన్నగారికి ఇష్టం. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. వాళ్లతో అంజలి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది’’అని జై అన్నారు. ప్రేమికుల దినోత్సవం నాడు అంజలి హైదరాబాద్‌లో, తాను చెన్నైలో ఉన్నామని తెలిపారు. ఇంతకీ పెళ్లెప్పుడు అనే ప్రశ్న జై ముందుంచితే – ‘‘దాని గురించి ఇంకా ఆలోచించలేదు. అయినా నాకన్నా సీనియర్లు ఆర్య, విశాల్, శింబు ఉన్నారు. ఆ ముగ్గురి పెళ్లీ అయిన తర్వాత మా పెళ్లి ఫిక్స్ చేస్తాం’’ అని తెలివిగా సమాధానం చెప్పారు. ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తన లవర్ గురించి బయటపెట్టలేదు. మామూలుగా లేడీస్ ఫస్ట్ అంటుంటారు. కానీ, ప్రేమను వ్యక్తం చేయడంలోనూ, అది నలుగురికీ చెప్పడంలోనూ దాదాపు అబ్బాయిలే ముందుంటారు. అంజలి కూడా జై నోటి నుంచే తమ లవ్‌స్టోరీ బయటకు రావాలని అనుకుని ఉంటారు. -
అంజలి గురించి మళ్లీ...
నటి అంజలి గురించి చిత్ర పరిశ్రమలో మళ్లీ వదంతులు హల్చల్ చేస్తున్నాయి. కట్రదు తమిళ్ ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి అంజలి. తొలి చిత్రంలోనే మంచి బరువైన పాత్రను సమర్థవంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అంగాడి తెరు చిత్రం ఆమెలోని నటనకు అద్దం పట్టిందనే చెప్పాలి. ఆ చిత్రం తరువాత ఈ పదహారణాల తెలుగమ్మాయి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కాగా ఎంగేయుం ఎప్పోదుం చిత్రం అంజలిని కమర్షియల్ హీరోయిన్ గా నిలబెట్టింది. అంతే కాదు ఆ చిత్రం హీరో జై తో ప్రేమాయణం అంటూ వదంతులకు దారితీసింది. అంజలి, జై ల ప్రేమ పెళ్లికి దారి తీయనుందనే ప్రచారం జోరుగానే సాగింది. ఆ తరువాత అంజలి తన పిన్నితో మనస్పర్థల కారణంగా హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో ఆ వదంతులకు బ్రేక్ పడింది. కాగా ఐదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ అంజలి తమిళ చిత్రాల్లో నటించడం మొదలెట్టడంతో నటుడు జై, అంజలి ఒకటయ్యారనీ, వారి మధ్య సన్నిహిత సంబంధాలంటూ మళ్లీ వదంతుల పర్వం మొదలైంది. తాజాగా రామ్ దర్శకత్వంలో ఆండ్రియాతో కలిసి తరమణి చిత్రంలో నటిస్తున్న ఈ బహుభాషా నటి ప్రస్తుతం యూకేలో ఉన్నట్లు సమాచారం. ఆమె చెన్నైకి తిరిగొచ్చాక ఈ రూమర్స్‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
ఆ పులి కోసం.. సీబీఐ వెతకాల్సిందే!
ఎవరైనా తప్పిపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎన్నాళ్లయినా దొరక్కపోతే, అంతకంటే పెద్ద వాళ్లు ఎవరున్నారా అని చూస్తాం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఏప్రిల్ నుంచి కనపడకుండా పోయిన పెద్దపులి 'జై'ని వెతికి తమకు అప్పగించడానికి సీబీఐని రంగంలోకి దించాలని కోరుతోంది. 250 కిలోల బరువున్న జై కోసం అటవీ శాఖాధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు ఎంతగా గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో దాన్ని వెతకడానికి సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రధానమంత్రికి త్వరలోనే లేఖ రాస్తానని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర పేరు మీద ఈ పులికి 'జై' అని పేరు పెట్టారు. గత మూడేళ్లుగా ఇది దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది. ఏడేళ్ల వయసున్న ఈ పెద్దపులి చివరిసారిగా ఉమ్రేద్ కర్హాండ్లా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏప్రిల్ 18న కనిపించిందని, ఆ తర్వాతి నుంచి దీని జాడ లేకుండా పోయిందని అంటున్నారు. అది క్షేమంగా ఉండాలంటూ స్థానికులు పూజలు కూడా చేయిస్తున్నారు. జైని వెతికించడంలో సాయం చేయాల్సిందిగా ప్రధానమంత్రిని తాను కూడా కోరుతానని బీజేపీకి చెందిన ఎంపీ నానా పాటోల్ తెలిపారు. జైతో పాటు దాని తాత రాష్ట్రపతి, తండ్రి దెండు, సోదరుడు వీరు కూడా తప్పిపోయారని ఆయన చెప్పారు. మూడు నెలల క్రితం నుంచి జై మెడలో ఉన్న ఎలక్ట్రానిక్ కాలర్ నుంచి సిగ్నళ్లు రావడం ఆగిపోయింది. దాంతో దాని క్షేమంపై ఫారెస్టు రేంజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జై ఎక్కడుందన్న సమాచారం ఎవరైనా చెబితే రూ. 50వేల బహుమతి ఇస్తామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు జై 20 పిల్లలకు తండ్రి అయ్యిందని, వన్యప్రాణి ప్రేమికులను ఆకర్షిస్తూ స్థానికంగా పర్యాటక ఆదాయాన్ని పెంచిందని పర్యావరణవేత్త రోహిత్ కరూ చెప్పారు. దేశంలో మొత్తం 2,200 పులులున్నాయి. ప్రపంచంలోని పులుల జనాభాలో 70 శాతం ఇక్కడే ఉంది. -
జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!
నాగ్ పూర్ః తప్పిపోయిన పులి ఆచూకీ తెలియాలంటూ ఇప్పటికే జనం పూజలు చేస్తుండగా.. మహరాష్ట్ర ప్రభుత్వం జై.. ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఉమ్ రెడ్-కర్హండా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి జై.. ఆచూకీ కోసం ఇప్పటికే ప్రభుత్వం.. అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రివార్డు ప్రకటించింది. నాగ్ పూర్ అభయారణ్యం నుంచి ఈ యేడాది ఏప్రిల్ 18న ఏడేళ్ళ వయసున్న భారీకాయం గల పెద్దపులి జై.. తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుతుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరించే ప్రదేశం వంటి వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని, తెలిపినవారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల బహుమానాన్ని ప్రకటించింది. అటవీశాఖ శుక్రవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ టైగర్స్ డే' సందర్భంగా అడవి నుంచీ తప్పిపోయిన పులి ఎప్పటికైనా తిరిగివస్తుందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని సమాచారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. పెద్దపులి ఆచూకీకోసం ప్రజలు పడుతున్న తాపత్రయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జై.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని అమితంగా చూరగొంది. రాచరికాన్ని ప్రదర్శించే జీవన విధానం, భారీ శరీరాకృతి కలిగిన జై... పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జై.. సుమారు 250 కేజీల బరువుంటుంది. ఇప్పటికే స్థానికులు జై.. ఆచూకీకోసం ప్రార్థనలు, పూజలు చేస్తుండగా... 100 మంది వరకూ జనం, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛందంగా గాలిస్తున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జై.. ఆచూకీకోసం ప్రయత్నించాలని అటవీ అధికారులు సైతం కోరారు. శాంక్చరీ టోపోగ్రఫీ తెలిసిన బృందం ద్వారా కూడా పులి ఆచూకీ తెలుసుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
పులికోసం పూజలు!
నాగ్ పూర్ః తప్పిపోయిన మనుషులు, పెంపుడు జంతువులకోసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడం చూస్తాం. ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టడం వింటాం. అయితే అభయారణ్యాల్లో నివసించే జంతుజాలం కనిపిస్తే వేటాడటమే తప్పించి... కబురు చెప్పమంటూ ప్రకటనలు ఇవ్వడం, నగదు బహుమతులు ప్రకటించడం ఎక్కడైనా చూశారా? నాగ్‌పూర్‌లోని ఉమ్రెడ్-కర్హండ్లా అభయారణ్యం ప్రాంతంలో అదే జరిగింది. తప్పిపోయిన ప్రముఖ పులి జాయ్ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించడమే కాదు.. అది ఎలాగైనా తిరిగి రావాలంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్ రెడ్-కర్హండ్లా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి 'జాయ్' కోసం నాగపూర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 18 నుంచీ కనిపించకుడా పోయిన జాయ్ ( పులి) ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని ఇస్తామంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంతకు ముందే ప్రకటించగా.. జాయ్ తిరిగి రావాలని కోరుకుంటూ కొందరు అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18న జాయ్ తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారంకోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరిస్తున్న ప్రదేశం వంటి వివరాలు ఏవి తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జాయ్.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని చూరగొంది. భారీ శరీరాకృతి, రాచరికాన్ని ప్రదర్శించే తీరులో జీవన విధానం కలిగి ఉండే జాయ్... చూపరులను కళ్ళు తిప్పుకోకుండా చేసేది. అభయారణ్యానికి వచ్చిన దగ్గరనుంచీ విదేశీయులతో సహా అనేక మంది పర్యటకులను ఆకట్టుకుంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జాయ్... సుమారు 250 కేజీల దాకా బరువుంటుంది. అటువంటి ప్రముఖ పులి ఆ ప్రాంతంలో కనిపించకుండా పోవడంతో దాని ఆచూకీకోసం అనేక రకాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ ఖర్గే ఆదేశాల మేరకు.. అధికారులు జాయ్ కోసం ప్రత్యేక సెర్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాయ్ పాదముద్రలు ట్రేస్ చేసేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అటవీ సిబ్బందికి అధికారులు సూచించారు. ఇప్పటికే 100 మందివరకూ వ్యక్తులు, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా జాయ్ కోసం శోధిస్తుండగా... వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జాయ్ ను వెతికేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. -
ఐదేళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు
ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన జర్నీ సినిమాతో ఆకట్టుకున్న జై, అంజలిల జోడి ఇంత కాలం తరువాత మరోసారి తెర మీద కనిపించనుంది. జర్నీ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఈ జంట తరువాత ఎవరికి వారు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని బిజీ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అయితే తాజాగా దర్శకుడు సినీష్ ఈ సక్సెస్ ఫుల్ జోడిని మరోసారి వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రొమాంటిక్ హర్రర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఎలాంటి అంచనాల్లే కుండా తెరమీదకు వచ్చిన జర్నీ సినిమాతోనే మంచి వసూళ్లను సాధించిన జై, అంజలిల జంట.. కొత్త సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
జర్నీ జోడి మరో సినిమాలో
ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన జర్నీ సినిమాతో ఆకట్టుకున్న జై, అంజలిల జోడి ఇంత కాలం తరువాత మరో సారి తెరమీద కనిపించనుంది. జర్నీ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఈ జంట తరువాత ఎవరికి వారు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని బిజీ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అయితే తాజాగా దర్శకుడు సినీష్ ఈ సక్సెస్ ఫుల్ జోడిని మరోసారి వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రొమాంటిక్ హర్రర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఎలాంటి అంచనాల్లే కుండా తెరమీదకు వచ్చిన జర్నీ సినిమాతోనే మంచి వసూళ్లను సాధించిన జై, అంజలిల జంట.. కొత్త సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి. My next untitled Tamil film shooting starts frm today with J @Actor_Jai #After5yrs #romantichorror #NewBeginnings — Anjali (@yoursanjali) 6 July 2016 -
జైతో మరోసారి ..
యువ నటుడు జై, నటి అంజిలిలది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన ఎంగేయమ్ ఎప్పోదుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో జై, అంజిలి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందనే ప్రశంశలు అందుకున్నారు. అంతే కాదు అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం 2011లో తెర పైకి వచ్చింది. ఐదేళ్ల తరువాత జై, అంజిలి కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రముఖ నటిగా రాణిస్తున్న అంజలి ఇటీవల నటించిన ఇరైవి చిత్రంలో నటనకు మంచి పేరే సంపాదించుకున్నారన్నది గమనార్హం. ఈ క్రేజ్ చాలా కాలం తరువాత జైతో నటించనున్న తాజా చిత్రానికి లాభిస్తుందని చెప్పవచ్చు. ఈ చిత్రం ద్వారా సినీష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ జై, అంజలి జంట గా ఒక రొమాంటిక్ లవ్, హారర్ థ్రిల్లర్ కథను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలితో నటించి మెప్పించగల సత్తా ఉన్న అంజిలి తమ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందన్నారు. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో అంజలి అయితేనే బాగుంటుందని తమ యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని, ఈ విషయాన్ని తన పుట్టిన రోజు గురువారం వెల్లడించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ఆర్.శరవణన్ చాయాగ్రహణం, ఫైట్స్‌ను దిలీప్ సుబ్బరాయన్ అందిస్తున్నారని తెలిపారు. -
పోనీ భారత్ అమ్మీ అంటారా?
న్యూ ఢిల్లీః భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని నిరాకరిస్తున్న మజ్లిస్-ఇ-ఇతెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీపై ప్రముఖ నటి షబానా అజ్మి సూటి ప్రశ్నలు సంధించారు. భారత్ మాతా కీ జై అన్న నినాదాన్ని పలకడంలో అభ్యంతరం ఉంటే.... పోనీ భారత్ అమ్మీ అంటారా అంటూ ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. భర్త జావెద్ అఖ్తర్ అడుగుజాడల్లో నడిచే షబానా.. దేశ రాజధానిలో జరిగిన ఓ సమావేశం సందర్భంలో భారత్ మాతాజీ జై అన్న నినాదాన్ని నిరాకరిస్తున్న ఒవైసీని గురించి ప్రస్తావించారు. ఒవైసీ సాహెబ్ ను నేను ఒక్కటే అడగదల్చుకున్నానని, ఒకవేళ ఆయనకు 'మాతా' అని పలకడంలో అభ్యంతరం ఉంటే 'భారత్ మాతాకీ జై' బదులుగా 'భారత్ అమ్మీకి జై' అంటారా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఓ సందర్భంలో రచయిత, షబానా అజ్మీ భర్త జావేద్ అఖ్తర్... ఒవైసీ నామాన్ని ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టారు. హైదరాబాద్ ఎంపీ అని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ ఎంపీ భారత్ మాతాకీ జై అని పలకనంటున్నాడని, పైగా రాజ్యాంగంలో లేదంటున్నాడని... అయితే రాజ్యాంగంలో ఆయన్ను టోపీ, షార్వానీ ధరించమని కూడ లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనడం మన విధా, కాదా అన్నది ముఖ్యం కాదని అది మన హక్కు అని మరచిపోకూడదని ఆయన సూచించారు. -
ఛాలెంజ్ మూవీ స్టిల్స్
-
జయ్ హీరోగా వరుణ్‌మణియన్ చిత్రం
త్రిష, వరుణ్‌మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో పెళ్లి తంతు కూడా జరగనుంది. కాబట్టి వారు వధూవరుల కిందే లెక్క. ఇకపోతే వరుణ్‌మణియన్ ఇంతకుముందు వాయై మూడి పేసవుం, కావ్యతలైవన్ మొదలగు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా నటుడు జయ్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తన రేడియన్ మీడియా సంస్థ సుశాంత్ ప్రసాద్, గోవిందరాజ్‌ల ఫిలిం డిపార్టుమెంట్ సంస్థ కలిసి నిర్మించనున్నాయి. నాన్‌సిగప్పు మనిదన్ చిత్రం ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తొలుత త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమె వివాహానికి సిద్ధమవడంతో చిత్రం నుంచి వైదొలిగినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఏదైమైనా చిత్ర హీరోయిన్ ఎంపిక జరుగుతోందని చెబుతున్న చిత్ర దర్శకుడు ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి రానుందని తెలిపారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణాన్ని అందించనున్న ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై, కుంభకోణం నేపథ్యం ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జయ్, సంగీత దర్శకుడు తమన్ల కలయికలో రూపొందించనున్న ఈ చిత్రం తన కెరీర్‌కు చాలా ముఖ్యమైందని దర్శకుడు తిరు అన్నారు. -
విద్యార్థుల జీవన ప్రయాణం
హరీశ్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, స్వప్న, కావేరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం - ‘టెన్త్‌లో లక్.. ఇంటర్లో కిక్.. బి.టెక్‌లో...’. మంచి వెంకట్ దర్శకుడు. సురేందర్ యాదవ్ సమర్పకుడు. జె.ఎస్. రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. టెన్త్ నుంచి బీటెక్ వరకూ విద్యార్థుల పయనం ఎలా ఉంటోంది? వారి నిర్ణయాలు భవిష్యత్తుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అనీ, సందేశం, వినోదం మిళితమైన సినిమా ఇదనీ దర్శకుడు చెప్పారు. -
త్రిష అవుట్ - సురభి ఇన్
జయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో త్రిష హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ఆ చిత్రం నుంచి హీరోయిన్గా త్రిషను తొలగించి ఇవన్వేరే మాదిరి చిత్రం ఫేమ్ సురభిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కారణం త్రిష వివాహ నిశ్చితార్థమేనన్నట్లు సమాచారం. వివరాల్లో కెళితే ఉదయం ఎన్ హెచ్-4 చిత్రం తరువాత దర్శకుడు మణిమారన్ తదుపరి చిత్రాన్ని జయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మొదట నటి త్రిషను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఆమె నిశ్చితార్థం విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మణిమారన్ తన చిత్రాన్ని వేగంగా పూర్తి చేయదలచారట. దీంతో త్రిష వ ల్ల చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంగా ఆమెను చిత్రం నుంచి తొలగించి ఇప్పుడు సురభిని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి దర్శకుడు మణిమారన్ వద్ద ప్రస్తావించగా తాను చిత్రంలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ను ఎంపిక చేయలేదని అయితే నటి సురభితో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. చెన్నైలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లో సురభి ఈ వారంలో పాల్గొంటుందని కోలీవుడ్ తాజా వార్త. -
'టెన్త్ లో లక్ ,ఇంటర్ లో కిక్ , బిటెక్ లో ..?' స్టిల్స్
-
టాలీవుడ్లో అడుగుపెట్టి.. అప్పుడే పదేళ్లు!
కొన్ని అద్భుతమైన పాత్రలు.. మరికొన్ని ఫర్వాలేదనిపించేవి.. మరికొన్ని నిరాశ పరిచినవి.. వెరసి మొత్తమ్మీద నవదీప్ టాలీవుడ్లో అడుగుపెట్టి అప్పుడే పదేళ్లు అయిపోయింది. పరిశ్రమలో ఎలాగోలా నిలదొక్కుకున్నా.. అతడికి మాత్రం ఇంకా సంతృప్తి మాత్రం లేదు. వాస్తవానికి తాను ఇంకా మంచి స్థానంలో ఉండాల్సిందని, మరికొన్ని మంచి హిట్లు సాధించాల్సిందని అన్నాడు. అయితే.. మరికొందరు ఇతర నటులతో పోల్చుకుంటే మాత్రం.. విజయవంతంగా ఇన్నాళ్ల పాటు పరిశ్రమలో నిలదొక్కుకుని, ఇప్పటికీ ఆఫర్లు పొందుతున్నందుకు మాత్రం కొంత సంతోషంగానే ఉందన్నాడు. చందమామ, ఆర్య2 లాంటి సినిమాలతో మంచి హిట్లు సాధించిన నవదీప్ ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీసు వద్ద మరీ అంత పెద్ద విజయాలు సాధించలేదు. అయినా కూడా.. తన ప్రవర్తనా తీరు కారణంగానే తాను ఇప్పటికీ బిజీగా ఉన్నానని, చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం తెలుగులో నటుడు, అంత సీన్ లేదు, అంతా నీ మాయలోనే లాంటి మూడు చిత్రాల్లో నవదీప్ చేస్తున్నాడు. బాగా విజయవంతమైన కొన్ని తమిళ సినిమాల్లో కూడా అతడు నటించాడు. కానీ అక్కడికంటే ఇక్కడే ఎక్కువగా చేస్తున్నాడు. నవదీప్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడు నటించిన తమిళ చిత్రం 'అరింతుమ్ అరియమూలం' విడుదలై భారీ విజయం సాధించింది. తనకు 25 ఏళ్ల వయసులో అలాంటి విజయం వచ్చి ఉంటే అక్కడ కూడా నిలబడేవాడిననని నవదీప్ అన్నాడు. 2004లో 'జై' చిత్రంతో తెలుగులో అడుగుపెట్టాడు. -
ముందు వాళ్లు.. తరువాత నేను
కోలీవుడ్‌లో పెళ్లికాని ఏజ్‌బార్ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది ఆర్య, శింబు, జయ్ల పేర్లను పేర్కొనవచ్చు. వీరి ముగ్గురిపై హీరోయిన్లతో కలుపుతూ పుకార్లు జోరుగానే సాగుతున్నాయి. ఆర్య తన సరసన నటించిన హీరోయిన్లందరితోను రొమాన్స్ చేస్తాడనే టాక్ బహిరంగంగానే వినిపిస్తుంది. ఇక శింబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నయనతార, హన్సికల గురించి కథలు కథలుగా ప్రచారం అయ్యాయి. యువ నటుడు జయ్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. అలాంటి జయ్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నిస్తే, ముందు ఆర్య, శింబులను పెళ్లి చేసుకోమని చెప్పండి ఆ తరువాత ఈ ప్రశ్న తనను అడగండి అంటున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తాను నటనే చాలనుకోవడం లేదని, అందువలనే కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా తన ఆసక్తిని కాదనలేక కారు రేసింగుకు అంగీకరించారని చెప్పారు. నటి నజ్రియాతో కలసి నటించిన తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం తెరపైకి వచ్చిందన్నారు. ఈ చిత్ర విడుదలలో జాప్యానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పారు. కొన్ని సంప్రదాయ వేడుకలను నిజంగానే చిత్రీకరించాలని భావించామని చెప్పారు. ఆ సమయం కోసం వాటి అనుమతి కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని వివరించారు. ఇక తన పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారని ఈ ప్రశ్నను మొదట శింబు, ఆర్య, విశాల్ ను అడగండి అని అన్నా రు. వాళ్లు పెళ్లి చేసుకున్న తరువాత తా ను చేసుకుంటానని అన్నారు. తన వయసు చాలా తక్కువని ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని జయ్ అన్నారు. -
కుల్ఫీ మూవీ ఆడియో లాంచ్
-
కుల్ఫీ మూవీ స్టిల్స్
-
జై తో ఆండ్రియా రొమాన్స్
యువ నటుడు జై సంచలన నటి ఆండ్రియల రొమాన్స్‌ను త్వరలో తెరపై చూడవచ్చు. ఇంతకుముందు యువ కథానాయికలతో జతకట్టడానికి ఆసక్తి చూపిన జయ్ తాజాగా సీనియర్ హీరోయిన్లతో నటించడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. రాజారాణి చిత్రంలో నయనతారకు జంటగా నటించి చాలా కాలం తరువాత సక్సెస్‌ను రుచి చూసిన ఈ యువ నటుడు తాజాగా ఆండ్రియాతో రొమాన్స్ చేస్తున్నారు. ఎంగేయుం ఎప్పోదుమ్ చిత్ర దర్శకుడు శరవణన్, జైల కాంబినేషన్‌తో రూపొందుతున్న చిత్రంలో ఆండ్రియా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇవన్ వేరే మాదిరి చిత్రం తరువాత శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం నగర నేపథ్యంలో సాగుతుందంటున్నారు దర్శకుడు. చిత్రంలో జై చాలా స్టరుులిష్ లుక్‌తో కనిపిస్తారని, ఆండ్రియాతో ప్రేమ సన్నివేశాలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయని అంటున్నారు. సెలైంట్‌గా మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందట. ఆండ్రియా ప్రస్తుతం కమలహాసన్ సరసన నటించిన విశ్వరూపం-2 చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. -
జయ్‌తో శృతి హాసన్?
యువ నటుడు జాయ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న క్రేజీ నటి శృతి హాసన్. ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే, చెన్నై - 28 కుర్రాడి దశ మారిందని. తొలుత ఈయన సినీ కెరీర్ కాస్త తడబడినా ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో మంచి హిట్ కొట్టారు. ఆ తరువాత చిత్రాల ఎంపిక విషయంలో కాస్త ఆచితూచి అడుగేస్తున్న జయ్ కొంచెం గ్యాప్ తరువాత నటించిన రాజారాణి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో సంచలన తార నయనతారతో జత కట్టిన జయ్‌కి తాజాగా యమా క్రేజీ నటి శృతి హాసన్‌తో రొమాన్స్ చేసే లక్కీ అవకాశం చాలా దగ్గర్లో ఉన్నట్లు తాజా సమాచారం. ఈ సరికొత్త కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి జగజాలన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజాకు దగ్గర బంధువైన పార్తి భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత స్వరాలు అందించనున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టెయినర్ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జయ్ సరసన శృతి హాసన్‌ను నటింప జేయడానికి కారణం కథ డిమాండ్ మేరకేనని యూనిట్ వర్గాలంటున్నారుు. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ప్రకాశిస్తున్న శృతి హాసన్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ బ్యూటీ హరి దర్శకత్వం వహిస్తున్న పూజై చిత్రంలో విశాల్‌తో డ్యూయెట్లు పాడేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు, హిందీ భాషలలో విజయాలను రుచి చూసిన శృతిహాసన్ తమిళంలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. -
జీవితాంతం నాతో ఉంటాడనుకున్నా..!
‘‘నా మనసు నిండా జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అవి ఎప్పటికీ ప్రశ్నలగానే మిగిలిపోతాయని నాకు తెలుసు. ఒక్కోసారి జీవితం అంటే భయమేస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం. అది కాసేపే. నా భర్త, పిల్లలను చూడగానే ఆ భయం పోతుంది’’ అంటున్నారు జుహీ చావ్లా. ఆమె అంత ఉద్వేగంగా మాట్లాడటానికి కారణం ఉంది. దాదాపు నాలుగేళ్లుగా కోమాలో ఉన్న జుహీ అన్నయ్య బాబీ చావ్లా గత ఆదివారం తుది శ్వాస విడిచారు. సోదరుడి మరణాన్ని అంత తేలికగా తీసుకోలేకపోతున్నారు జుహీ. ఈ సందర్భంగా తన మనోభావాలను వ్యక్తపరుస్తూ -‘‘నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు కొండంత అండగా నిలిచేది మా అమ్మ. నా పెళ్లయిన ఏడాదికి తను చనిపోయింది. అప్పుడు ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు నాన్నగారు అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా అన్నయ్య బాబీ చావ్లా నాకన్నా ఎనిమిదేళ్లు పెద్ద. చిన్నప్పుడు మేమిద్దరం బాగా గొడవపడేవాళ్లం. నన్ను తోసేవాడు. అమాంతం కిందపడిపోయేదాన్ని. అప్పుడు బాబీ మీద నాకు బాగా కోపం వచ్చేది. పెద్దయిన తర్వాత మా ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అమ్మ చనిపోయిన తర్వాత బాబీ నా అండ అయ్యాడు. జీవితాంతం తను నాకు అండగా ఉంటాడనుకున్నా. కానీ, మధ్యలోనే వదిలేశాడు. నా జీవిత భాగస్వామి జై ఇప్పుడు నాకు పెద్ద అండ. తను, నేను, మా ఇద్దరి పిల్లలు... ఇప్పుడు నా జీవితం ఇదే. అమ్మ, నాన్న పోయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు అన్నయ్య కూడా దూరం కావడంతో ఆ ఆలోచనలను ఎక్కువయ్యాయి. అలాగని, నా భర్త, పిల్లల పట్ల నా బాధ్యతను విస్మరించను. వాళ్లు లేని జీవితాన్ని ఊహించలేను’’ అంటూ జుహీ చావ్లా కన్నీటి పర్యంతమయ్యారు. -
రాజా రాణి మూవీ స్టిల్స్
-
ఒక రోజు (ఏం జరిగింది) ఆడియో ఆవిష్కరణ
-
రాజకీయ నేపథ్యంలో జయ్ చిత్రం
రాజకీయ నేపథ్య చిత్రం అనగానే వద్దు బాబోయ్ అని హీరోలు పారిపోతున్నారు. అలాంటిది సుబ్రమణ్యపురం, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, రాజారాణి వంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించిన యువ నటుడు జయ్ తాజాగా రాజకీయ కథా చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇంతకు ముందు ఉదయం ఎన్‌హెచ్ 4 చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు మణిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ నటుడు జయ్‌తో తాను చేస్తున్న తొలి చిత్రం ఇదేనన్నారు. దీనికి పొడియన్ అనే టైటిల్‌ను నిర్ణయించామన్నారు. షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుందన్నారు. తమిళంలో చిన్న పిల్లల్ని పొడియన్ అని పిలుస్తారని తెలిపారు. ఇకపై పిల్లల్ని పొడియన్ అని ఎవరూ పిలవరని, స్నేహం, రాజకీయ నేపథ్యమున్న చిత్రం పొడియన్ అని దర్శకుడు తెలిపారు.