
జై, వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘నీయా 2’. తెలుగులో ‘నాగకన్య’ అనే టైటిల్ పెట్టారు. ఎల్. సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని వరలక్ష్మి శరత్‌కుమార్, లక్ష్మీ రాయ్ ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు క్యాథరీన్ లుక్‌ను రిలీజ్ చేస్తారు. రేపు ‘నాగకన్య’ టీజర్ విడుదల అవుతుంది. ‘‘రిలీజ్ చేసిన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమాలో హీరో జై క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఆడియన్స్‌ను అబ్బుర పరుస్తాయి. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment