Nagakanya
-
పాము ప్రేమిస్తే?
‘‘ఇప్పటి వరకు వచ్చిన పాము కథా చిత్రాలన్నీ పగ నేపథ్యంలో రూపొందాయి. కానీ, మా ‘నాగకన్య’ చిత్రం పాము నేపథ్య కథావస్తువు అయినప్పటికీ విభిన్నంగా ఉంటుంది. పగతో కాకుండా ప్రేమ నేపథ్యంలో సాగుతుంది’’ అంటున్నారు నిర్మాత కె.ఎస్.శంకర్ రావు. కమల్‌హాసన్ నటించిన తమిళ ‘నీయా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘నీయా–2’. జై హీరోగా, రాయ్‌లక్ష్మి, వరలక్ష్మీశరత్ కుమార్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’ పేరుతో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘నోము, దేవతలారా దీవించండి, దేవి, అమ్మానాగమ్మ’ వంటి పాము నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. మా సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాము కథాచిత్రాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాలేదు. మా సినిమానే తొలిసారి విడుదలవుతోంది’’ అన్నారు. ఎల్.సురేష్ మాట్లాడుతూ– ‘‘నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. కథ డిమాండ్ మేరకే గ్రాఫిక్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అన్నారు. -
40 నిమిషాల గ్రాఫిక్స్‌తో...
కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘నియా’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘నియా–2’ పేరుతో తమిళంలో, ‘నాగకన్య’ పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించారు. ‘జర్నీ, రాజారాణి’ చిత్రాల ఫేమ్ జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్‌లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ అధినేత కె.ఎస్.శంకర్ రావు తెలుగులో విడుదల చేస్తున్నారు. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘పాము నేపథ్యంలో వచ్చిన ‘నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ’ వంటి చిత్రాలెన్నో ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ పాము కథాంశాన్ని ఎంచుకుని నేటి నవీన సాంకేతికతను మిళితం చేశారు. ముఖ్యంగా నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు, మనిషి పాముగా మారే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నిజమైన కోబ్రాను వాడాలనుకున్నాం. అందుకోసం బ్యాంకాక్ కూడా వెళ్లాం. కానీ ఒరిజనల్ పామును షూటింగ్లో ఉపయోగించడానికి వీలుకాలేదు. దాంతో గ్రాఫిక్స్‌లో చూపించాం’’ అన్నారు ఎల్.సురేష్. ‘‘వెండితెరపై కాలనాగును చూపించాలన్న ఉద్దేశ్యంతో ఇండోనేషియాలో పాములకు శిక్షణ ఇచ్చే నిపుణులను కలిశాం. వారి దగ్గర 20 నుంచి 28 అడుగుల పొడవున్న కోబ్రాలు ఉన్నాయి. వాటిపై చిత్రీకరణ జరిపి కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌లో ఉపయోగించాం’’ అని గ్రాఫిక్స్ నిపుణుడు వెంకటేష్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజావెల్ మోహన్, సంగీతం: షబ్బీర్. -
నాగకన్య విన్యాసాలు
దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చిన కమల్‌హాసన్ చిత్రాల్లో ‘నీయా’ ఒకటి. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ అప్పట్లో మంచి హిట్. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ రూపొందింది. తెలుగు వెర్షన్ టైటిల్ ‘నాగకన్య’. జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్. సురేష్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగు హక్కులను లైట్ హౌస్ సినీమ్యాజిక్ అధినేత కె.ఎస్. శంకర్ రావు దక్కించుకున్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి పాముగా మారే సన్నివేశాలు, పాము చేసే విన్యాసాలు హైలైట్‌గా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు గ్రాఫిక్స్‌కి భారీగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో పిల్లలు, పెద్దలకు మంచి ఎంటర్టైనర్ అవుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
వేసవిలో నాగకన్య...
వరలక్ష్మీ శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా, జై హీరోగా నటించిన చిత్రం ‘నాగకన్య’. ఎల్. సురేష్ దర్శకత్వంలో జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని వేసవి కానుకగా మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వీరి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొచ్చేలా ఉంటుంది. మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్ చేసేలా ‘నాగకన్య’ చిత్రం ఉంటుంది’’ అన్నారు. -
ప్రతి సీన్ పసందుగా..
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్, జై ముఖ్యపాత్రల్లో ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాగకన్య’. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు మంచిపేరొచ్చేలా ఉంటుంది. వీరి ముగ్గురి లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో జై క్యారెక్టర్ మరో హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. పిల్లలతో పాటు పెద్దలు మా సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
వేసవిలో నాగకన్య
జై, వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘నీయా 2’. తెలుగులో ‘నాగకన్య’ అనే టైటిల్ పెట్టారు. ఎల్. సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ. శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని వరలక్ష్మి శరత్‌కుమార్, లక్ష్మీ రాయ్ ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు క్యాథరీన్ లుక్‌ను రిలీజ్ చేస్తారు. రేపు ‘నాగకన్య’ టీజర్ విడుదల అవుతుంది. ‘‘రిలీజ్ చేసిన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమాలో హీరో జై క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఆడియన్స్‌ను అబ్బుర పరుస్తాయి. వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
నాగకన్య పోరాటం
గతజన్మ స్మృతుల అన్వేషణలో ఓ నాగకన్యకు ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రతికూల శక్తులపై ఆమె ఎటువంటి పోరాటం చేశారు? నాగకన్య నేపథ్యం ఏంటి? అనే కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగభరణం’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రధారులు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ‘‘క్లైమాక్స్‌లో స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను గ్రాఫిక్స్ రూపంలో పునఃసృష్టించిన సన్నివేశాలు అలరిస్తాయి. మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి బలం. కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు కోడి రామకృష్ణ. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభించిందని శివకుమార్ తెలిపారు. ముకుల్‌దేవ్, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: వేణు, సంగీతం: గురుకిరణ్.