వేసవిలో నాగకన్య... | Naga Kanya Movie Releasing On May 10th | Sakshi

వేసవిలో నాగకన్య...

Apr 20 2019 3:02 AM | Updated on Apr 23 2019 10:48 AM

Naga Kanya Movie Releasing On May 10th - Sakshi

లక్ష్మీరాయ్, జై, కేథరీన్‌

వరలక్ష్మీ శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్‌ ముఖ్య తారలుగా, జై హీరోగా నటించిన చిత్రం ‘నాగకన్య’. ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో జంబో సినిమాస్‌ బ్యానర్‌పై ఎ.శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాని వేసవి కానుకగా మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ. శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి సీన్‌ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్‌ లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వీరి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొచ్చేలా ఉంటుంది. మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్‌ బాగా పెరిగింది. జై క్యారెక్టర్‌ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్‌ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్‌ చేసేలా ‘నాగకన్య’ చిత్రం ఉంటుంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement