Catherine Teresa
-
భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న ‘జార్జిరెడ్డి’ హీరో
దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్ తేజ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు. కేథరిన్ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై ప్రొడక్షన్ నంబర్‌వన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దావులూరి జగదీష్, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్ రివీల్ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్ తేజ యాక్షన్ థ్రిల్లర్‌ను అంతకుమించి అద్భుతంగా రూపొందిస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. -
ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్
‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్) ఒక ఐడియాగా చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్‌మెంట్ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్. మా తాతగారు(ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
20 ఏళ్ల ప్రయాణం.. ఇది మామూలు విషయం కాదు: దిల్ రాజు
‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్, కృతీశెట్టి, కేథరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’ పాట లిరికల్ వీడియోను ‘దిల్’ రాజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాట రిలీజ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘నా అభిమానుల కోసం ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నంబర్స్ పెట్టాం. ‘రా రా రెడ్డి..’ పాటలో నా ‘జయం’ చిత్రంలోని ‘రాను రాను అంటూనే..’ పాటను రిపీట్ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంజలి కాలికి గాయమైనప్పటిMీ ఫ్లోర్ మూమెంట్స్‌ని హార్డ్‌వర్క్‌తో కంప్లీట్ చేశారు’’ అన్నారు. ‘‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. -
కొండల్లో థ్రిల్
ఆర్య, కేథరిన్ థెరిస్సా జంటగా రాఘవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కదంబన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించి, ఆర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల్ల ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ– ‘‘ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో, హీరోయిన్ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆర్య బాగా బరువు పెరిగారు. కేథరిన్, ఆర్య జంట తెరపై కనువిందు చేస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భారతి వరప్రసాద్ వడ్డెల్ల. -
వేసవిలో నాగకన్య...
వరలక్ష్మీ శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా, జై హీరోగా నటించిన చిత్రం ‘నాగకన్య’. ఎల్. సురేష్ దర్శకత్వంలో జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని వేసవి కానుకగా మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వీరి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొచ్చేలా ఉంటుంది. మా చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్ చేసేలా ‘నాగకన్య’ చిత్రం ఉంటుంది’’ అన్నారు. -
పాంచ్ పటాకా
గతేడాది సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కసారే కనిపించారు క్యాథరీన్. అదీ తమిళ చిత్రం ‘కలకలప్పు 2’లో. 2018లో తనను స్క్రీన్ మీద బాగా మిస్ అయిన ఫ్యాన్స్‌కు ఈ ఏడాది పాంచ్ పటాకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది క్యాథరీన్‌కు 5 రిలీజులున్నాయి. ‘అత్తారింటì కి దారేది’ తమిళ రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’లో హీరోయిన్గా చేస్తున్నారు. ‘నీయా’ సీక్వెల్ ‘నీయా 2’, ‘అరువమ్’, ఏడేళ్ల తర్వాత మలయాళంలోకి కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన ‘అన్నెకిల్లమ్ అల్లెన్కిల్లమ్’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇంకా తెలుగులో సంతోష్ శివన్, రవితేజ కాంబినేషన్లో చేయనున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ సినిమాలోనూ చాన్స్ కొట్టేశారని టాక్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశీఖన్నా, తమిళ భామ ఐశ్వర్యా రాజేశ్, బ్రెజిల్ మోడల్ ఇసబెల్లా హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోయిన్గా క్యాథరీన్ కూడా ఎంపికైనట్టు సమాచారం. మొత్తానికి గతేడాది వచ్చిన గ్యాప్‌ని ఈ ఏడాది గ్యాప్ లేకుండా సినిమాలతో నింపేసినట్టున్నారు క్యాథరీన్. -
మరోసారి భయపెడతారట
ట్రైలింగువల్ హారర్ థ్రిల్లర్ ‘గృహం’తో సక్సెస్ ట్రాక్‌లో పడ్డ సిద్ధార్థ్ తమిళంలో ఓ కొత్త చిత్రం మొద్దలెట్టారు. సాయి శేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కేథరిన్ తెరీసా జంటగా యాక్ట్ చేయనున్నారు. ట్రిడెంట్ ఆర్ట్ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమా కూడా హారర్ జానర్లోనే ఉండబోతోందట. ఫస్ట్ టైమ్ సిద్దార్థ్, కేథరిన్ జోడీ కడుతున్నారు. యస్.యస్ థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ఏకాంబరం కెమెరా అందించనున్నారు. అన్నట్లు.. నాలుగైదేళ్లుగా సిద్ధార్థ్ ఫుల్ బిజీగా సినిమాలు చేయడంలేదు. సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు. మరి.. ఇక స్పీడ్ పెంచుతారా? స్లో అండ్ స్టడీ అన్నట్లుగానే ఉంటారా? -
విష్ణు విశాల్‌తో క్యాథరిన్
మెడ్రాస్ హీరోయిన్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. టాలీవుడ్లో ఇద్దరమ్మాయిలు, ఎర్రబస్సు చిత్రాలు చేసిన క్యాథరిన్ ట్రైసా ఆ తరువాత కనిపించలేదు. అయితే మెడ్రాస్ చిత్ర విజయం ఆమెకు కోలీవుడ్‌లో మరో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. యువ నటుడు విష్ణు విశాల్‌తో జత కట్టడానికి క్యాథరిన్ రెడీ అవుతున్నారన్నది తాజా న్యూస్. జీవా వంటి విజయవంతమైన చిత్రం తరువాత విష్ణు విశాల్ నటిస్తున్న చిత్రం (ఇంకా పేరు నిర్ణయించలేదు) నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో విష్ణు విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి వీరధీర సూరన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే శకుని చిత్రం ఫేమ్ శంకర్‌దయాళ్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో విష్ణు విశాల్ సరసన క్యాథరిన్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. చిత్ర షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. క్యాథరిన్‌కు ఎందుకనో కోలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. మరి ఈ వీర ధీర శూరన్ చిత్రం ఈ అమ్మడి కెరీర్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.