కొండల్లో థ్రిల్‌ | Gajendrudu Telugu Movie updates | Sakshi
Sakshi News home page

కొండల్లో థ్రిల్‌

Published Fri, Jun 14 2019 12:44 AM | Last Updated on Fri, Jun 14 2019 12:44 AM

Gajendrudu Telugu Movie updates - Sakshi

ఆర్య, కేథరిన్‌

ఆర్య, కేథరిన్‌ థెరిస్సా జంటగా రాఘవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కదంబన్‌’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించి, ఆర్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్‌ పతాకంపై ఉదయ్‌ హర్ష వడ్డెల్ల ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.

ఉదయ్‌ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ– ‘‘ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో, హీరోయిన్‌ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆర్య బాగా బరువు పెరిగారు. కేథరిన్, ఆర్య జంట తెరపై కనువిందు చేస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భారతి  వరప్రసాద్‌  వడ్డెల్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement