తెలుగులో తొలి సినిమా.. 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా? | Actress Sayyeshaa Saigal Movies And Family Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: తొలి సినిమా తెలుగులోనే.. తమిళ హీరోతో ప్రేమ పెళ్లి

Published Sun, Nov 10 2024 1:27 PM | Last Updated on Sun, Nov 10 2024 2:20 PM

Actress Sayyeshaa Saigal Movies And Family Details

ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది ఇంకా పెళ్లే చేసుకోవట్లేదు. అలాంటిది ఈమె తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దోడు అయిన హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో ఈమె తొలి సినిమా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోయిన్ ఫ్యామిలీ కూడా తరతరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాయేషా సైగల్. పాప ఈమె కూతురే. పక్కన నిలబడ్డ పెద్దావిడ పేరు సహిన్ భాను. ఈమె సాయేషా తల్లి. రీసెంట్‌గా కలిసినప్పుడు ఈ ఫొటోని తీసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన దిలీప్ కుమార్, సైరా భానుల మనవరాలే సాయేషా. సినీ కుటుంబం కావడంతో సులభంగానే హీరోయిన్ అయిపోయింది. అక్కినేని అఖిల్ తొలి సినిమా 'అఖిల్'తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. కానీ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో మూవీ చేయలేదు.

అదే టైంలో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దాదాపు అరడజనుకి పైగా చిత్రాల్లో నటించింది. అలా చేస్తున్న టైంలో హీరో ఆర్యతో పరిచయం, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారింది. వయసు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం సాయేషా సినిమాలేం చేయట్లేదు. కుటుంబానికే పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్‌గా అలా తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలే ఇవి.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement