తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. వారం క్రితం తాను ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి)
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వివాహ జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.
థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రల కంటే న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం విశేషం. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.
(ఇదీ చదవండి: తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి)
Comments
Please login to add a commentAdd a comment