డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి అద్భుతమైన సినిమాలే గుర్తొస్తాయి. రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు రానా టాక్ షోలో పాల్గొని.. తన ఇంటర్మీడియట్ ప్రేమకథని బయటపెట్టాడు.
'ద రానా దగ్గుబాటి షో' పేరుతో నటుడు రానా ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రతి వీకెండ్ ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే నాని, సిద్ధు జొన్నలగడ్డ-శ్రీలీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తాజాగా రాజమౌళి-రాంగోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే రాజమౌళి తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)
'ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి ఉండేది. ఆమె అంటే ఇష్టముండేది. కానీ మాట్లాడాలంటే భయం. మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని. నన్ను ఈ విషయమై ఏడిపించేవారు. మొత్తం ఏడాదిలో ఒకేఒక్కసారి ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను' అని రాజమౌళి చెప్పాడు. దీంతో రానా పగలబడి నవ్వాడు. ఈ సంభాషణ అంతా చూసి చాలామంది 90స్ కుర్రాళ్లు తమని తాము రాజమౌళి మాటల్లో చూసుకుంటున్నారు.
చివరగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి.. మహేశ్ బాబుతో కొత్త సినిమా చేయబోతున్నారు. చాన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు టైమ్ ఉండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు.
(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)
Comments
Please login to add a commentAdd a comment