కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా సరే హీరో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం 6:45 గంటలకు చంచల్‌గూడ జైలు వెనక గేటు నుంచి బన్నీని బయటకు పంపించారు. ఇంటికి వెళ్లకుండా నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి బన్నీ వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే బన్నీ లాయర్ ఆశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు.. వీడియో వైరల్)
అల్లు అర్జున్‌ని తక్షణమే విడుదల చేయాలని కోర్ట్ ఆదేశించిందని, అయినా సరే రాత్రంతా ఉద్దేశపూర్వకంగానే జైలులో ఉంచారని బన్నీ తరఫు లాయర్ చెప్పుకొచ్చారు. ఈ విషయమై చట్టపరంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఇలా బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం చేయడంపై పోలీసులుపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని లాయర్ అశోక్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. బట్టలు మార్చుకునే టైమ్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే జైలుకి తీసుకెళ్లేలోపే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ పోలీసులు మాత్రం బెయిల్ పేపర్స్ సరిగా లేవనే కారణంతో రాత్రంతా జైలులోనే ఉంచారు. అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నంబర్ కూడా కేటాయించారు.
(ఇదీ చదవండి: అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ)
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun's lawyer Ashok Reddy says, " They received an order copy from High Court but despite that, they didn't release the accused (Allu Arjun)...they will have to answer...this is illegal detention, we will take legal action...as of now he… pic.twitter.com/1RgdvA4BK4
— ANI (@ANI) December 14, 2024
Comments
Please login to add a commentAdd a comment