
గతకొన్నిరోజుల నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) వివాదం ఎంతలా రచ్చ రచ్చ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు మూడు రోజుల్లో అయితే పీక్‌కి చేరిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏకంగా అసెంబ్లీలో బన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఇది జరిగిన కాసేపటికే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి వాటిని ఖండించడం హాట్ టాపిక్ అయిపోయింది.
ఇదలా ఉంచితే బన్నీకి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. రీసెంట్‌గా లైంగిక ఆరోపణల కేసులో జైలుకెళ్లొచ్చిన జానీ మాస్టర్‌ని (Jani Master) తాజాగా మీడియా ప్రతినిధులు కలిశారు. అల్లు అర్జున్ అరెస్ట్ (Arrest) గురించి ప్రశ్నించారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)
'ఈ విషయంలో నేనేం మాట్లాడుదలుచుకోలేదు. నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానంపై నాకు నమ్మకముంది. అందరికీ మంచి జరగాలి' అని జానీ మాస్టర్ చెప్పాడు.
'జైలుకు వెళ్లకముందు.. వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా.. ఒకేలా ఉందని జానీ మాస్టర్ సమాధానమిచ్చాడు. గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా బాగానే ఉంది అని అన్నాడు' అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?)