
స్టార్ హీరో అల్లు అర్జున్.. చంచల్‌గూడ జైలు నుంచి ఉదయం 6:45 గంటలకు విడుదలయ్యాడు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జైలుకి తీసుకెళ్లేలోపు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది.
(ఇదీ చదవండి: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల.. అసలేం జరిగింది?)
బెయిల్ వచ్చినా సరే తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగా లేదని.. చంచల్‌గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. అండర్ ట్రైల్ ఖైదీగా.. ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్-1 రూంలో రాత్రంతా ఉంచారు. అయితే భోజనం చేయకుండా రాత్రంతా నేలపైన బన్నీ పడుకున్నట్లు తెలుస్తోంది.
ఉదయం జైలు గేటు ముందు ఫ్యాన్స్, మీడియా ఉండగా.. వెనక గేటు నుంచి బన్నీని పోలీసులు బయటకు పంపించారు. అయితే నేరుగా ఇంటికెళ్లకుండా గీతా ఆర్ట్స్ కార్యాలయాలనికి వెళ్లాడు. మరోవైపు ఇంటి దగ్గర తండ్రి కోసం అర్హ ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు)
#alluarha waiting for her Dad #AlluArjun #alluaarjunarrest pic.twitter.com/pkWDdYQGjA
— SRK (@SRKofficial67) December 13, 2024