సాక్షి, ఢిల్లీ: అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. కోమాలో నుంచి ఆ బాబు బయటకు వస్తే వాళ్ల అమ్మ కనిపించదు. సినిమా హీరోది వ్యాపారం. డబ్బులు పెట్టాడు.. వసూలు చేసుకున్నాడు. ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంది?. నేను తీసుకునేది ఏముంది?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావుడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.. కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పోలీసులు చేర్చారు.
..అక్కడ మహిళ ప్రాణం పోయింది? ఎవరు బాధ్యులు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత. అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నేత.. నాకు బంధువు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు.
..హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు తెలుసు. చనిపోయిన మహిళ కుమారుడు ఇంకా కోమాలో ఉన్నాడు. సినిమా కోసం డబ్బులు పెట్టారు.. పైసలు సంపాదించారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు.’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Allu Arjun Case: ఆ సెక్షన్లు అంత తీవ్రమైనవా?
Comments
Please login to add a commentAdd a comment