సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సందర్బంగా సెక్యూరిటీ కారణాల రీత్యా.. అల్లు అర్జున్ వెనుక జైలు వేనుక గేటు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి కాసేపట్లో తన ఇంటికి బయలుదేరనున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్ ఇంటి వద్దకు సినీ ప్రముఖ్యులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
విడుదల సమయంలో లాయర్లతో పాటుగా అల్లు అరవింద్ కూడా జైలుకు వెళ్లారు. దగ్గరుండి అల్లు అర్జున్‌ను తన వెంట తీసుకొచ్చారు. ఇక, శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్‌తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం సభ్యులు కూడా విడుదలయ్యారు. A1, A2తో పాటు A11.. ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు.
Vachestunnadu 🥺🙏pic.twitter.com/GbSVWaXVT6
— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) December 14, 2024
అంతకుముందు జరిగింది ఇదీ..
పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అల్లు అర్జున్‌ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది.
రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో..
అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు.
రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్‌ను జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్–1 రూమ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్‌గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు.
ఎప్పుడేం జరిగిందీ..
ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు
మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు
12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు
12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు
1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్‌తో చేరుకున్న పోలీసులు
1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్
1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి
2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు
2.19: అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు
2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ
2.45: అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు
5.00: అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు
5.28: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు
5.40: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
7.15: బెయిల్ పేపర్లతో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న లాయర్లు
7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని
10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్‌కు అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment