రామ్‌ చరణ్ 'పెద్ది' రన్‌టైమ్‌.. 4 గంటలపైనే? | Ram Charan Peddi Movie Team Gives Clarity On Its Runtime, Check Out Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్ 'పెద్ది' రన్‌టైమ్‌.. 4 గంటలపైనే?

Mar 3 2026 11:31 PM | Updated on Mar 4 2026 11:57 AM

Ram Charan Movie: Clarity on the runtime of Peddi movie

పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్‌టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్‌టైమ్‌తో వస్తోందనే ప్రచారం మొదలైంది.  

సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది.  

ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్‌ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం 'రయ్‌ రయ్‌ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది.  పెద్ది సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement