ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ నటుడు సుమన్ స్పందించారు. పాన్ ఇండియా హీరో అయిన బన్నీకి అంత క్రేజ్ ఉన్నప్పుడు భద్రత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉందన్నారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం చాలా తప్పు అని సుమన్ అన్నారు. కొత్త సినిమా రిలీజైనప్పుడు థియేటర్ యాజమాన్యం హీరోలను పిలుస్తారని వెల్లడించారు. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ప్రైవేట్ బౌన్సర్లతో కంట్రోల్ చేయాలని సూచించారు.
సుమన్ మాట్లాడుతూ..' అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా తప్పు. కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్ వాళ్లే హీరోను పిలుస్తారు. నన్ను కూడా గతంలో చాలాసార్లు థియేటర్ వాళ్లు పిలిచారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడం తప్పుకాదు. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పోలీసులు, థియేటర్ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోవాలి. అభిమానుల రద్దీని, ఆ క్రౌడ్‌ని థియేటర్ వాళ్లు మేనేజ్ చేయాల్సింది. ' అని అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన సుమన్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment