టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? | Tollywood Actress Ruhani Sharma Sister Marriage Photo Trending On Social Media Amid Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

Ruhani Sharma: పెళ్లి ఫొటో.. సడన్‌గా చూస్తే అదే అనుకుంటారు!

Published Mon, Nov 25 2024 11:14 AM | Last Updated on Mon, Nov 25 2024 12:31 PM

Tollywood Actress Ruhani Sharma Sister Marriage News

'చి.ల.సౌ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన రుహానీ శర్మ.. ఆ తర్వాత కూడా టాలీవుడ్‌లో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. గ్లామరస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాంటిది ఈమె ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే పెళ్లి దుస్తుల్లో ఈమె కనిపించడం ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)

ఇంతకీ ఏమైంది?
రుహానీ శర్మ.. తన ఇన్ స్టాలో పెళ్లి దుస్తులతో ఉన్న పిక్ పోస్ట్ చేసి 'కల నిజమైన వేళ' అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఇందులో ఉన్న రుహానీ శర్మ కాదు ఆమె సోదరి శుభి శర్మ. చూడటానికి వీళ్లిద్దరూ ఒకేలాంటి పోలికలతో ఉండటం వల్ల ఈమె ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుసుకుందా అని అనుకున్నారు.

ఈ ఏడాది రుహానీ శర్మ.. తెలుగులో 'సైంధవ్', ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ అవుట్ తదితర సినిమాల్లో నటించింది. కానీ ఇవన్నీ కూడా దేనికదే అన్నట్లు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతానికైతే 'మాస్క్' అనే తమిళ మూవీ చేస్తోంది. మరి సోదరి పెళ్లి అయిపోయింది. మరి ఈమె ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో?

(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement